← Back to అ · Booklets 1–10 (digitized file 1)

a

Original — తెలుగు
  1. “అ ఇతి బ్రహ్మా” - (‘అ’ అనగా బ్రహ్మ - పరమాత్మ, పరబ్రహ్మ)

“అకారో విష్ణు రుధ్ధిష్టః, ఉకారస్తు మహేశ్వరః |

మకారస్తు స్మృతో బ్రహ్మ ప్రణ వస్తుత్రయాత్మకః ||“.

(‘అ’ కారము అనగా విష్ణువు ఉద్దేశింప బడుచున్నాడు, ‘ఉ’ కారము అనగా మహేశ్వరుడు ఉధ్ధేశింప బడుచున్నాడు, ‘మ’ కారము అనగా బ్రహ్మ ఉద్ధేశింప బడుచున్నాడు. అ - ఉ - మ అను నీ మూడక్షరములు కలిసి ‘ఓం’ అను ప్రణవము స్మరింపబడుచున్నది.)

  1. “అకారేణోచ్యతే విష్ణుః సర్వ లోకేశ్వరోహరిః;” అకారో విష్ణు వాచకః ఇతి శ్రుతి స్మ్యతిఖ్యాం. అకారవాచ్యో విష్ణుః (శ్రీరంగరామానుజః)

(సర్వలోకములకు ఈశ్వరుడైన హరియే ‘అ’ కారము చేత చెప్పబడుచున్నాడు –‘అ’ కారమనగా ‘హరి’ యని అర్ధము. అకారము అనగా ‘అ’ అను అక్షరము, విష్ణు వాచకము - అనగా విష్ణువును చెప్పునది. పైన చెప్పిన రెండు విధములుగాను శ్రుతి, స్మృతులు చెప్పుచున్నవి గనుక ‘అ’ కారమనగా విష్ణువు.)

  1. ‘అ’ ఇతిభగవన్నారాయణస్య ప్రధమాభిధానం, భగవతో వాచకః

(‘అ’ అనునది భగవంతుడైన నారాయణుని యొక్క మొదటి పేరు)

  1. అకారోవై సర్వవాక్, సైషాస్పరోగ్మష్మాభిః వ్యజ్యమానా బహ్వీ నానారూపా భావతి, “ఇతిశ్రుతితః సర్వేవర్ణాః అకార వికారాః ఇత్యుక్తా భవంతి”. (ఐతరేయ బ్రాహ్మణము - 3 - 6)

(‘అ’ కారమే సర్వవాక్ - అనగా అకారమే అన్ని వాచకములు, అన్ని మాటలు, అదియే స్పర్శములు, ఉష్మములతో కలిసినదై అనేక అక్షరములగా, అనేకముగా అగుచున్నది - అని శ్రుతి చెప్పుటవల్ల అన్ని అక్షరములు ‘అ’ కారము తాలుకు వికారములే, అనగా మార్పులే అని చెప్పబడుచున్నది.)

  1. “అక్షరాణామకారో (అ) స్మి” – (శ్రీమద్భగవద్గీత - అ - 10 - 33)

ఇతి స్మృతి తశ్చ విష్ణోః సర్వవ్యాపకత్యే అకారాది క్షకారాంత బీజ విశిష్టమంత్రార్ధత్వముక్తం భవతి.

(‘అ’ కారము మొదలు, ‘క్ష’ కారము ఆఖరుదిగా గల అన్ని అక్షరములలోను ‘అ’ కారము నేనే అని శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణభగవానుడు చెప్పుట వలన విష్ణువు సమస్తమైన వాటియందు వ్యాపించి ఉండుటవల్ల ‘అ’ కారము మొదలు ‘క్ష’ కారము ఆఖరుగాగల అన్ని అక్షరములలోను మంత్రముల తాలూకు బీజ విశిష్ట మంత్రార్ధము చెప్పబడుచున్నది. అనగా, అన్ని అక్షరములలోనూ ‘అ’ కారము చేరియుండుటచేత ఏ అక్షరమూ మంత్రమునకు బీజమైనా దానిలో పరబ్రహ్మ ఉన్నటులే గ్రహించవలెను. అన్ని వస్తువులలోను భగవదాంశ ఉన్నటులే. అన్ని అక్షరములలోను అకారము యొక్క అంశ ఉన్నది.)

  1. “అకారం ప్రయుం జానేన కిం నామమంగళం నకృతం” -

(అకారము కూడియుండుట వలన ఏ నామము శుభావహము అవదు? అనగా, అకారము కలిసియుండుట వలన అన్ని నామములు శుభావహములే, మంగళకరములే.)

  1. “సో (అ) యమాత్మా (ఆ) ద్యాక్షరమోంకారో (అ) ధిమాత్రం, పాదాః మాత్రాః మాత్రాశ్చపాదాః, అకార, ఉకార, మకార ఇతి. జాగరిత స్థానో వైశ్యానరో (అ) కారః ప్రదమః మాత్రా - ఆప్తేరాది మత్వాద్వా, ఆప్నోతీహవై నర్వాన్ కామాన్ ఆదిశ్చభావతి య ఏవం వేద”

(మండూక్యోపనిషత్ - 9)

(ఈ ఆత్మయే ఓంకారము-దీనికి మాత్రలు మూడు-అకార, ఉకార, మకారములు. మాత్రలే పాదములు, పాదములే మాత్రలు -)

విశ్వుడు లేక వైశ్యానరుడు ఓంకారము యొక్కమొదటి మాత్ర –‘అ’ కారము శబ్దములన్నిటికీ ‘అ’ అను శబ్దము మొదటిది. అక్షరములన్ని టిలోను ‘అ’ మొదటి అక్షరము - అన్నింటని వ్యాపించియున్నది. (చూడుము :- ‘అక్షరములు’)

Transliteration
  1. “a iti brahmā” - (‘a’ anagā brahma - paramātma, parabrahma)

“akārō viṣṇu rudhdhiṣṭaḥ, ukārastu mahēśvaraḥ |

makārastu smṛtō brahma praṇa vastutrayātmakaḥ ||“.

(‘a’ kāramu anagā viṣṇuvu uddēśiṃpa baḍucunnāḍu, ‘u’ kāramu anagā mahēśvaruḍu udhdhēśiṃpa baḍucunnāḍu, ‘ma’ kāramu anagā brahma uddhēśiṃpa baḍucunnāḍu. a - u - ma anu nī mūḍakṣaramulu kalisi ‘ōṃ’ anu praṇavamu smariṃpabaḍucunnadi.)

  1. “akārēṇōcyatē viṣṇuḥ sarva lōkēśvarōhariḥ;” akārō viṣṇu vācakaḥ iti śruti smyatikhyāṃ. akāravācyō viṣṇuḥ (śrīraṃgarāmānujaḥ)

(sarvalōkamulaku īśvaruḍaina hariyē ‘a’ kāramu cēta ceppabaḍucunnāḍu –‘a’ kāramanagā ‘hari’ yani ardhamu. akāramu anagā ‘a’ anu akṣaramu, viṣṇu vācakamu - anagā viṣṇuvunu ceppunadi. paina ceppina reṃḍu vidhamulugānu śruti, smṛtulu ceppucunnavi ganuka ‘a’ kāramanagā viṣṇuvu.)

  1. ‘a’ itibhagavannārāyaṇasya pradhamābhidhānaṃ, bhagavatō vācakaḥ

(‘a’ anunadi bhagavaṃtuḍaina nārāyaṇuni yokka modaṭi pēru)

  1. akārōvai sarvavāk, saiṣāsparōgmaṣmābhiḥ vyajyamānā bahvī nānārūpā bhāvati, “itiśrutitaḥ sarvēvarṇāḥ akāra vikārāḥ ityuktā bhavaṃti”. (aitarēya brāhmaṇamu - 3 - 6)

(‘a’ kāramē sarvavāk - anagā akāramē anni vācakamulu, anni māṭalu, adiyē sparśamulu, uṣmamulatō kalisinadai anēka akṣaramulagā, anēkamugā agucunnadi - ani śruti ceppuṭavalla anni akṣaramulu ‘a’ kāramu tāluku vikāramulē, anagā mārpulē ani ceppabaḍucunnadi.)

  1. “akṣarāṇāmakārō (a) smi” – (śrīmadbhagavadgīta - a - 10 - 33)

iti smṛti taśca viṣṇōḥ sarvavyāpakatyē akārādi kṣakārāṃta bīja viśiṣṭamaṃtrārdhatvamuktaṃ bhavati.

(‘a’ kāramu modalu, ‘kṣa’ kāramu ākharudigā gala anni akṣaramulalōnu ‘a’ kāramu nēnē ani śrīmadbhagavadgītalō śrīkṛṣṇabhagavānuḍu ceppuṭa valana viṣṇuvu samastamaina vāṭiyaṃdu vyāpiṃci uṃḍuṭavalla ‘a’ kāramu modalu ‘kṣa’ kāramu ākharugāgala anni akṣaramulalōnu maṃtramula tālūku bīja viśiṣṭa maṃtrārdhamu ceppabaḍucunnadi. anagā, anni akṣaramulalōnū ‘a’ kāramu cēriyuṃḍuṭacēta ē akṣaramū maṃtramunaku bījamainā dānilō parabrahma unnaṭulē grahiṃcavalenu. anni vastuvulalōnu bhagavadāṃśa unnaṭulē. anni akṣaramulalōnu akāramu yokka aṃśa unnadi.)

  1. “akāraṃ prayuṃ jānēna kiṃ nāmamaṃgaḷaṃ nakṛtaṃ” -

(akāramu kūḍiyuṃḍuṭa valana ē nāmamu śubhāvahamu avadu? anagā, akāramu kalisiyuṃḍuṭa valana anni nāmamulu śubhāvahamulē, maṃgaḷakaramulē.)

  1. “sō (a) yamātmā (ā) dyākṣaramōṃkārō (a) dhimātraṃ, pādāḥ mātrāḥ mātrāścapādāḥ, akāra, ukāra, makāra iti. jāgarita sthānō vaiśyānarō (a) kāraḥ pradamaḥ mātrā - āptērādi matvādvā, āpnōtīhavai narvān kāmān ādiścabhāvati ya ēvaṃ vēda”

(maṃḍūkyōpaniṣat - 9)

(ī ātmayē ōṃkāramu-dīniki mātralu mūḍu-akāra, ukāra, makāramulu. mātralē pādamulu, pādamulē mātralu -)

viśvuḍu lēka vaiśyānaruḍu ōṃkāramu yokkamodaṭi mātra –‘a’ kāramu śabdamulanniṭikī ‘a’ anu śabdamu modaṭidi. akṣaramulanni ṭilōnu ‘a’ modaṭi akṣaramu - anniṃṭani vyāpiṃciyunnadi. (cūḍumu :- ‘akṣaramulu’)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.