← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అభావము abhāvamu

Original — తెలుగు

లేకుండుట; ఏమియు లేకుండుట; శూన్యము;మిధ్య; అసత్యము; చావు.

“అభావము నాలుగువిధములు : - ఒక వస్తువు పుట్టకముందు లేదు, అది నశించిన తర్వాతను లేదు - అను రెండు విధములు. ఒక వస్తువు మఱియొక వస్తువు కాదు; ఒక వస్తువు లేనే లేదు అనుట రెండు విధములు. మొత్తముమీద అభావము నాలుగు విధములు. వేదాంతము ప్రకారము సర్వకాల, సర్వదేశ సర్వ వస్తువులందును ఉండుట భావము - అనగా, త్రివిధ పరిచ్ఛేదరహితముగా నుండుట భావము. పరబ్రహ్మ త్రివిధ పరిచ్ఛేదరహితుడు; అందుచేత భావము - ఉన్నాడు, శాశ్వతుడు - ఆప్రకారముగా త్రివిధపరిచ్ఛిన్నముగా నుండుట అభావము. పరబ్రహ్మ బుద్ధికి సాక్షి అయినవాడు కావున బుద్ధికి గోచరుడుకాడు; కాని బుద్ధి వృత్తిని అంతర్ముఖముగా చేసిన గోచరుడగును. అందుచేత గోచరుడుకాడు, గోచరుడు కాకపోడు”.

“వినష్టా ద్ధి కిల బీజాంకుర ఉత్పద్యతే; తథా వినష్టాత్ క్షీరాద్దధి, మృత్పిండా చ ఘటః. కూటస్థా చ్చేత్కారణాత్ కార్యముత్పద్యేత - అవిశేషాత్ సర్వం సర్వతః ఉత్పథ్యతే. తస్మాతభావగ్రస్థేభ్యో బీజాదిభ్యో అంకురా దీనాం ఉత్పధ్యమానత్వాత్ అభావాద్భావోత్పత్తిరితి మన్యంతే. తత్ర ఇదం ఉచ్యతే..”నాసతో అదృష్టత్వాత్” ఇతి అభావాత్ భావః ఉత్పద్యతే. యద్య భావాత్ భావః ఉత్పద్యేత, అభావాద్వావిశేషాత్ కరణవిశేషాభ్యుపగమో అనర్థ కస్స్యాత్ -” (శ్రీశంకరః)

“యది చా భావాత్ బావోత్పత్తి రభ్యుపగమ్యేత ఏవం సత్యు దాసీనానాం అనీహమానా నామపి జనానాం అభిమత సిద్ధిస్స్యాత్. అభావస్య సులభత్వాత్.కృషీవలస్య క్షేత్ర కర్మణి అప్రయతమా నస్యాపి సస్య నిష్పత్తిస్స్యాత్; కులాలస్య చ మత్సంస్కియా మప్రయ మానస్యాపి అమత్రోత్పత్తిః; తంతు వాయస్యాపి తంతూ న తన్వాన స్స్యాపి తన్వానస్యేవ వస్త్ర లాభః. సర్గా పవర్గ యోశ్చ నశ్చిత్ కథచిత్ సమీహేత; న చైత ద్యుజ్యతే, అభ్యుపగమ్యతే వాకేన చిత్. తస్మాదను పపన్నో అయం అభావాత్ భావోత్పత్యుప గమః”

(శ్రీ శంకరః - బ్రహ్మ సూత్ర భాష్యే)

(విత్తనమునుండి మొలక పుట్టుచున్నది; మొలకపుట్టి పెద్దది అవుతూ ఉండగా విత్తనము మఱి కనబడదు. ఆ ప్రకారముగానే పాలనుండి పెరుగు పుట్టుచున్నది. పెరుగు పుట్టిన తర్వాత పాలు మఱి కనబడవు. మట్టిముద్దనుండి కుండ తయారగుచున్నది. కుండ తయారైన తర్వాత మట్టి మఱికనబడదు. కారణమైన కూటస్థునినుండి కార్యము పుట్టుచున్నది. ఈ ప్రకారము నిర్విశేషమైనవస్తువునుండియే అన్నియు, అంతట పుట్టుచున్నవి. అందువలన అభావమును పొందినవాటివలన - కనబడకుండా నశించిపోవు విత్తనములు మొదలగువాటివల్ల అంకురము (మొక్క) మొదలగునవి పుట్టుచున్నందున కొందఱు అభావము నుండి - శూన్యమునుండి - భావము పుట్టుచున్నది అని అభిప్రాయపడుచున్నారు - అనగా, అసత్ నుండి సత్ పుట్టుచున్నదని వారి అభిప్రాయము.)

“అసద్వా ఇదమగ్ర ఆసీత్” (తైత్తిరీయోపనిషత్ - 2 - 7)

(ఇప్పుడు కనబడు ఈ ప్రపంచమంతయు అది పుట్టకముందు అసత్తుగానే ఉండెను. వీరి అభిప్రాయము తప్పు - ఎట్లనగా - “నాసతో అదృష్టత్వాత్”.)

(అసత్తువలన సత్తు పుట్టినట్లు ఎక్కడా కనబడలేదు - అందునుండి అభావమునుండి భావము పుట్టలేదు - కార్యమైన ఘటము - కుండ - దానికారణమైన మట్టిలో ఇమిడియున్నది, మట్టితోనే మట్టికుండ తయారగును; కాని, ఇంకొక దానితో మట్టికుండ తయారుకాదు.ఆ ప్రకారముగానే విత్తనములో సూక్ష్మరూపములో మొలకయున్నది. అందుచేత కారణములో దాని కార్యమిమిడియున్నది. కారణములేని కార్యముండదు - అందుచేత అభావమునుండి - శూన్యమునుండి ఏదియు పుట్టదు - ఒకవస్తువు లేనిదే ఇంకొకవస్తువు పుట్టదు. పుటుటకు కారణమైన వస్తువు లేనిదే ఏ వస్తువు పుట్టదు.)

(అభావమునుండి భావము పుట్టినట్లయిన, కోరికలు లేనివారికి, ఊరకనే కూర్చునియున్నవారికి వాళ్లకికావాలసినవన్నియు సిద్ధించవలసియుండును; వ్యవసాయదారుడు భూమిని దున్నుట మొదలగు ప్రయత్నములు చేయకనే పంటలు పండవలసియుండును. కుమ్మరి మట్టితో ప్రయత్నము చేయకనే కుండ తయారయి ఉండవలయును. పట్టు పురుగు దారము చేయకనే పట్టు బట్ట తయారై ఉండవలెను - స్వర్గాపవర్గములు ఎవరునూ కోరనక్కరనక్కరలేకయే లభ్యమగుచుండవలయును - ఈ ప్రకారముగా ఎక్కడా జరుగుట లేదు కనుక అభావమునుండి - శూన్యమునుండి - భావము పుట్టుట కుదరదు - అసంభవము. “అసద్వా ఇదమగ్ర ఆసీత్” అనుచోట అసత్ అనగా అవ్యాకృతము, తర్వాత “తత్స దాసీత్” అని చెప్పుటవలన సత్పదార్థమే ముందు ఉండెను. అని నిర్ధారణ చేయ బడెను.)

భవాభిన్నో అభావః. (ఉన్నది లేనిచో అభావము.)

అభావే విరక్తిః. (కావలసినది కాక పోయినపుడు దాని యడల కలుగు విరక్తి.)

Transliteration

lēkuṃḍuṭa; ēmiyu lēkuṃḍuṭa; śūnyamu;midhya; asatyamu; cāvu.

“abhāvamu nāluguvidhamulu : - oka vastuvu puṭṭakamuṃdu lēdu, adi naśiṃcina tarvātanu lēdu - anu reṃḍu vidhamulu. oka vastuvu maṟiyoka vastuvu kādu; oka vastuvu lēnē lēdu anuṭa reṃḍu vidhamulu. mottamumīda abhāvamu nālugu vidhamulu. vēdāṃtamu prakāramu sarvakāla, sarvadēśa sarva vastuvulaṃdunu uṃḍuṭa bhāvamu - anagā, trividha paricchēdarahitamugā nuṃḍuṭa bhāvamu. parabrahma trividha paricchēdarahituḍu; aṃducēta bhāvamu - unnāḍu, śāśvatuḍu - āprakāramugā trividhaparicchinnamugā nuṃḍuṭa abhāvamu. parabrahma buddhiki sākṣi ayinavāḍu kāvuna buddhiki gōcaruḍukāḍu; kāni buddhi vṛttini aṃtarmukhamugā cēsina gōcaruḍagunu. aṃducēta gōcaruḍukāḍu, gōcaruḍu kākapōḍu”.

“vinaṣṭā ddhi kila bījāṃkura utpadyatē; tathā vinaṣṭāt kṣīrāddadhi, mṛtpiṃḍā ca ghaṭaḥ. kūṭasthā ccētkāraṇāt kāryamutpadyēta - aviśēṣāt sarvaṃ sarvataḥ utpathyatē. tasmātabhāvagrasthēbhyō bījādibhyō aṃkurā dīnāṃ utpadhyamānatvāt abhāvādbhāvōtpattiriti manyaṃtē. tatra idaṃ ucyatē..”nāsatō adṛṣṭatvāt” iti abhāvāt bhāvaḥ utpadyatē. yadya bhāvāt bhāvaḥ utpadyēta, abhāvādvāviśēṣāt karaṇaviśēṣābhyupagamō anartha kassyāt -” (śrīśaṃkaraḥ)

“yadi cā bhāvāt bāvōtpatti rabhyupagamyēta ēvaṃ satyu dāsīnānāṃ anīhamānā nāmapi janānāṃ abhimata siddhissyāt. abhāvasya sulabhatvāt.kṛṣīvalasya kṣētra karmaṇi aprayatamā nasyāpi sasya niṣpattissyāt; kulālasya ca matsaṃskiyā mapraya mānasyāpi amatrōtpattiḥ; taṃtu vāyasyāpi taṃtū na tanvāna ssyāpi tanvānasyēva vastra lābhaḥ. sargā pavarga yōśca naścit kathacit samīhēta; na caita dyujyatē, abhyupagamyatē vākēna cit. tasmādanu papannō ayaṃ abhāvāt bhāvōtpatyupa gamaḥ”

(śrī śaṃkaraḥ - brahma sūtra bhāṣyē)

(vittanamunuṃḍi molaka puṭṭucunnadi; molakapuṭṭi peddadi avutū uṃḍagā vittanamu maṟi kanabaḍadu. ā prakāramugānē pālanuṃḍi perugu puṭṭucunnadi. perugu puṭṭina tarvāta pālu maṟi kanabaḍavu. maṭṭimuddanuṃḍi kuṃḍa tayāragucunnadi. kuṃḍa tayāraina tarvāta maṭṭi maṟikanabaḍadu. kāraṇamaina kūṭasthuninuṃḍi kāryamu puṭṭucunnadi. ī prakāramu nirviśēṣamainavastuvunuṃḍiyē anniyu, aṃtaṭa puṭṭucunnavi. aṃduvalana abhāvamunu poṃdinavāṭivalana - kanabaḍakuṃḍā naśiṃcipōvu vittanamulu modalaguvāṭivalla aṃkuramu (mokka) modalagunavi puṭṭucunnaṃduna koṃdaṟu abhāvamu nuṃḍi - śūnyamunuṃḍi - bhāvamu puṭṭucunnadi ani abhiprāyapaḍucunnāru - anagā, asat nuṃḍi sat puṭṭucunnadani vāri abhiprāyamu.)

“asadvā idamagra āsīt” (taittirīyōpaniṣat - 2 - 7)

(ippuḍu kanabaḍu ī prapaṃcamaṃtayu adi puṭṭakamuṃdu asattugānē uṃḍenu. vīri abhiprāyamu tappu - eṭlanagā - “nāsatō adṛṣṭatvāt”.)

(asattuvalana sattu puṭṭinaṭlu ekkaḍā kanabaḍalēdu - aṃdunuṃḍi abhāvamunuṃḍi bhāvamu puṭṭalēdu - kāryamaina ghaṭamu - kuṃḍa - dānikāraṇamaina maṭṭilō imiḍiyunnadi, maṭṭitōnē maṭṭikuṃḍa tayāragunu; kāni, iṃkoka dānitō maṭṭikuṃḍa tayārukādu.ā prakāramugānē vittanamulō sūkṣmarūpamulō molakayunnadi. aṃducēta kāraṇamulō dāni kāryamimiḍiyunnadi. kāraṇamulēni kāryamuṃḍadu - aṃducēta abhāvamunuṃḍi - śūnyamunuṃḍi ēdiyu puṭṭadu - okavastuvu lēnidē iṃkokavastuvu puṭṭadu. puṭuṭaku kāraṇamaina vastuvu lēnidē ē vastuvu puṭṭadu.)

(abhāvamunuṃḍi bhāvamu puṭṭinaṭlayina, kōrikalu lēnivāriki, ūrakanē kūrcuniyunnavāriki vāḷlakikāvālasinavanniyu siddhiṃcavalasiyuṃḍunu; vyavasāyadāruḍu bhūmini dunnuṭa modalagu prayatnamulu cēyakanē paṃṭalu paṃḍavalasiyuṃḍunu. kummari maṭṭitō prayatnamu cēyakanē kuṃḍa tayārayi uṃḍavalayunu. paṭṭu purugu dāramu cēyakanē paṭṭu baṭṭa tayārai uṃḍavalenu - svargāpavargamulu evarunū kōranakkaranakkaralēkayē labhyamagucuṃḍavalayunu - ī prakāramugā ekkaḍā jaruguṭa lēdu kanuka abhāvamunuṃḍi - śūnyamunuṃḍi - bhāvamu puṭṭuṭa kudaradu - asaṃbhavamu. “asadvā idamagra āsīt” anucōṭa asat anagā avyākṛtamu, tarvāta “tatsa dāsīt” ani ceppuṭavalana satpadārthamē muṃdu uṃḍenu. ani nirdhāraṇa cēya baḍenu.)

bhavābhinnō abhāvaḥ. (unnadi lēnicō abhāvamu.)

abhāvē viraktiḥ. (kāvalasinadi kāka pōyinapuḍu dāni yaḍala kalugu virakti.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.