← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అభయం abhayaṃ

Original — తెలుగు

“అభీరుతా”(శ్రీశంకరః.) (భయము లేకుండుట.)

నిర్భయతా(నిర్భయముగానుండుట, భయము లేకుండుట.)

భయనివారణం; భయనివారకం; భయనివర్తనం. (భయమును పోగొట్టుట, భయము నివారించుట.)

భయశూన్యం; సంసారస్యపారం.

(భయములేకుండుట; భయములేనిది;సంసారమునకు అవతలగట్టు;సంసారమును దాటుట.)

భయరహితం, నిత్యముక్తత్వాత్.(నిత్యముక్తుడగుటవలన భయము లేకుండుట.)

అనిష్ట నివృత్తిః (ఇష్టము లేనిదానినుండి నివృత్తి, తప్పించుట.)

న విద్య తే భయం యస్య తద భయం(భయము తెలియనిది.)

నవిద్యతే భయం యస్మాత్ తద భయం, భయనివారణ మిత్యర్థః.

(దేనివలన భయము ఉండదో అది అభయము - భయమును నివారించెడివారు.)

భయహేతుత్వా భావాత్ అభయం, నిర్భయం, నిరాతంకత్వాత్ నిరపాయం.

(భయమునకు కారణములేకపోవుటవలన అభయం, నిర్భయము; ఆటంకము లేకపోవుటచేత అపాయములేనిది, నిరపాయకరమైనది.)

“భయం త్రాసో, అభయం తస్మాత్ విపరీతముదాహృతం” (గీతాభావప్రకాశము - 10 - 20)

(భయమునకు విపరీతమైనది అభయం.)

నవిద్యతే భయం సంసారో యస్మాత్ తం. (దేనివలన సంసారభయము కలుగుదో అది అభయము.)

ఆశ్రితానాం సాంసారిక భయ నివారకం; స్వతః భయాది దోష రహితః.

(తనను ఆశ్రయించిన భక్తులకు సంసార సంబంధభయము నివారించువాడు; తాను స్వయముగ భయము మొదలగు దోషములు లేనివాడు.)

భయహేతు ద్వైతమ భావాత్.

(భయమునకు కారణమైన ద్వైత బుద్ధి - భగవంతుడుకాక రెండవది ఉన్నది అను బుద్ధి - లేకపోవుటవలన అభయం.)

(“ద్వితీయాత్ వై భయం” భగవంతుడు కాక ఇంకొకటి ఉన్నది అని అనుకొనుటవల్ల భయము కలుగును. అంతా భగవంతుడే అను అభిప్రాయమున్నపుడు భయముండదు - అందుచేత అభయం -.)

అంతయూ బ్రహ్మమే, బ్రహ్మ రూపమే - దానిని మించినది ఏదీ లేదు - అని అనుకొనుట వలన అభయం.

భయం నామ అవిద్యా కార్యం, అవిద్యయా హి భయం మన్యతే, అవిద్యా తీతం స్వరూపం.

(భయము అవిద్యా కార్యము, అనగా అవిద్యవలన - మాయవలనకలిగినది. అవిద్యవలననే భయము కలుగుచున్నది. అందుచేత అవిద్యకు అతీతమైనది, అవిద్యకుమించినది, అవిద్యకన్న ఉత్కృష్టమైన ఆత్మయొక్క - స్వస్వరూపము.)

“ఇష్టా నిష్ట వియోగ సం యోగ రూపస్య దుఃఖస్య హేతు దర్శినజం దుఃఖం భయం తన్నివృత్తిః అభయం” (శ్రీరామానుజః.)

(ఇష్టానిష్టములు కలుగుచూ లేకుండుచూ ఉండుటవలన కలిగిన దుఃఖము భయము, దాని నివృత్తియు, అది లేకుండుటయే అభయము.)

“అగామినో దుఃఖస్య హేతు దర్శనజం దుఃఖం భయం, తన్నివృత్తిః అభయం” (శ్రీరామానుజః)

(రాబోయే, ముందుకలుగబోయే దుఃఖమునకు కారణమువలన కలుగు దుఃఖము భయము, దాని నివృత్తి. అది లేకుండునట్లు చేయుట అభయం.)

ఏ ప్రకారముగాను భయము లేకుండుట అభయము -

మోక్షము -

“సర్వేషు దానేషు అభయం ప్రథానం”

(అన్నిదానములలోను అభయదానము - అభయమిచ్చుట, శరణు ఇచ్చుట గొప్పది.)

శ్రీరామచంద్రమూర్తి తన శత్రువైన విభీషణునకు శరణు అనినంత మాత్రమున అభయమిచ్చెను. ఆ ప్రకారము రావణుడు వచ్చిననుసరే అభయమిచ్చెదనని చెప్పెదను.

“సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయా చతే |

అభయం సర్వ భూతేభ్యో దదామ్యేతత్ వ్రతం మమ |”

(ఒక్కసారి నేను నీవాడను అని శరణుజొచ్చినవానికి అభయము నిచ్చెదను. ఇది నా వ్రతము.)

“ఆన యైవం హరిశ్రేష్ట దత్తమస్యా భయం మయా |

విభీషణోవా సుగ్రీవ యదివా రావణః స్వయం ||” (వాల్మీకిరామాయణం - యుద్ధకాండ.)

(ఇతనిని తీసుకొని రమ్ము. నేను ఇతనికి అభయమిచ్చితిని, అతను విభీషణుడేకాని స్వయముగా రావణు డేకాని.)

ఈ ప్రపంచములో అన్నివస్తువులూ భయావహములే, అన్నియు భయమును కలుగించునవియే. ఈ సర్వవస్తువులందు కోరికలు వదలుకొనినయడల, వైరాగ్యముననే అభయము - దేనివలనను భయము లేకుండ ఉండును. ఈ విషయము భర్తృహరి ఈ క్రింద శ్లోకములో వివరించి యున్నాడు : -

“భోగే రోగభయం, కులే చ్యుతిభయం విత్తే నృపాలాద్భయం |

మానే దైన్య భయం, బలే రిపుభయం. రూపా జరాయాద్భయం |

శాస్తే వాది భయం, గుణే ఖల భయం, కాయే కృతాంతాద్భయం |

సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం వైరాగ్యమేవా భయం ||“. (సుభాషితం)

(భోగులకు రోగభయము, మంచి కులములో పుట్టినవారికి కులహీనతకలుగునేమో యను భయము, ఐశ్వర్యవంతునికి రాజు ధనము తీసుకొనునేమో యను భయము, గౌరవముగా బ్రతుకువారికి నిందకలుగునేమో యను భయము, బలముకలవానికి వానికన్న బలవంతులగు శత్రువులవలన భయము, సౌందర్యవంతులకు ముసలితనమువచ్చి సౌందర్యము పోవునేమో యనుభయము; పండితులకు ఇతర పండితులవలన వాదోపవాదములు కలుగునేమోయను భయము, గుణవంతునకు దుర్మార్గులవలన భయము. శరీరమునకు మృత్యువు కలుగునను భయము.ఈ భూమిమీద సమస్త వస్తువులు భయమును కలుగచేయునవియే. వైరాగ్యమొక్కటే భయములేనిది - అభయము నిచ్చునది.)

Transliteration

“abhīrutā”(śrīśaṃkaraḥ.) (bhayamu lēkuṃḍuṭa.)

nirbhayatā(nirbhayamugānuṃḍuṭa, bhayamu lēkuṃḍuṭa.)

bhayanivāraṇaṃ; bhayanivārakaṃ; bhayanivartanaṃ. (bhayamunu pōgoṭṭuṭa, bhayamu nivāriṃcuṭa.)

bhayaśūnyaṃ; saṃsārasyapāraṃ.

(bhayamulēkuṃḍuṭa; bhayamulēnidi;saṃsāramunaku avatalagaṭṭu;saṃsāramunu dāṭuṭa.)

bhayarahitaṃ, nityamuktatvāt.(nityamuktuḍaguṭavalana bhayamu lēkuṃḍuṭa.)

aniṣṭa nivṛttiḥ (iṣṭamu lēnidāninuṃḍi nivṛtti, tappiṃcuṭa.)

na vidya tē bhayaṃ yasya tada bhayaṃ(bhayamu teliyanidi.)

(dēnivalana bhayamu uṃḍadō adi abhayamu - bhayamunu nivāriṃceḍivāru.)

bhayahētutvā bhāvāt abhayaṃ, nirbhayaṃ, nirātaṃkatvāt nirapāyaṃ.

(bhayamunaku kāraṇamulēkapōvuṭavalana abhayaṃ, nirbhayamu; āṭaṃkamu lēkapōvuṭacēta apāyamulēnidi, nirapāyakaramainadi.)

“bhayaṃ trāsō, abhayaṃ tasmāt viparītamudāhṛtaṃ” (gītābhāvaprakāśamu - 10 - 20)

(bhayamunaku viparītamainadi abhayaṃ.)

āśritānāṃ sāṃsārika bhaya nivārakaṃ; svataḥ bhayādi dōṣa rahitaḥ.

(tananu āśrayiṃcina bhaktulaku saṃsāra saṃbaṃdhabhayamu nivāriṃcuvāḍu; tānu svayamuga bhayamu modalagu dōṣamulu lēnivāḍu.)

bhayahētu dvaitama bhāvāt.

(bhayamunaku kāraṇamaina dvaita buddhi - bhagavaṃtuḍukāka reṃḍavadi unnadi anu buddhi - lēkapōvuṭavalana abhayaṃ.)

(“dvitīyāt vai bhayaṃ” bhagavaṃtuḍu kāka iṃkokaṭi unnadi ani anukonuṭavalla bhayamu kalugunu. aṃtā bhagavaṃtuḍē anu abhiprāyamunnapuḍu bhayamuṃḍadu - aṃducēta abhayaṃ -.)

aṃtayū brahmamē, brahma rūpamē - dānini miṃcinadi ēdī lēdu - ani anukonuṭa valana abhayaṃ.

bhayaṃ nāma avidyā kāryaṃ, avidyayā hi bhayaṃ manyatē, avidyā tītaṃ svarūpaṃ.

(bhayamu avidyā kāryamu, anagā avidyavalana - māyavalanakaliginadi. avidyavalananē bhayamu kalugucunnadi. aṃducēta avidyaku atītamainadi, avidyakumiṃcinadi, avidyakanna utkṛṣṭamaina ātmayokka - svasvarūpamu.)

“iṣṭā niṣṭa viyōga saṃ yōga rūpasya duḥkhasya hētu darśinajaṃ duḥkhaṃ bhayaṃ tannivṛttiḥ abhayaṃ” (śrīrāmānujaḥ.)

(iṣṭāniṣṭamulu kalugucū lēkuṃḍucū uṃḍuṭavalana kaligina duḥkhamu bhayamu, dāni nivṛttiyu, adi lēkuṃḍuṭayē abhayamu.)

“agāminō duḥkhasya hētu darśanajaṃ duḥkhaṃ bhayaṃ, tannivṛttiḥ abhayaṃ” (śrīrāmānujaḥ)

(rābōyē, muṃdukalugabōyē duḥkhamunaku kāraṇamuvalana kalugu duḥkhamu bhayamu, dāni nivṛtti. adi lēkuṃḍunaṭlu cēyuṭa abhayaṃ.)

ē prakāramugānu bhayamu lēkuṃḍuṭa abhayamu -

mōkṣamu -

“sarvēṣu dānēṣu abhayaṃ prathānaṃ”

(annidānamulalōnu abhayadānamu - abhayamiccuṭa, śaraṇu iccuṭa goppadi.)

śrīrāmacaṃdramūrti tana śatruvaina vibhīṣaṇunaku śaraṇu aninaṃta mātramuna abhayamiccenu. ā prakāramu rāvaṇuḍu vaccinanusarē abhayamiccedanani ceppedanu.

“sakṛdēva prapannāya tavāsmīti cayā catē |

abhayaṃ sarva bhūtēbhyō dadāmyētat vrataṃ mama |”

(okkasāri nēnu nīvāḍanu ani śaraṇujoccinavāniki abhayamu niccedanu. idi nā vratamu.)

“āna yaivaṃ hariśrēṣṭa dattamasyā bhayaṃ mayā |

vibhīṣaṇōvā sugrīva yadivā rāvaṇaḥ svayaṃ ||” (vālmīkirāmāyaṇaṃ - yuddhakāṃḍa.)

(itanini tīsukoni rammu. nēnu itaniki abhayamiccitini, atanu vibhīṣaṇuḍēkāni svayamugā rāvaṇu ḍēkāni.)

ī prapaṃcamulō annivastuvulū bhayāvahamulē, anniyu bhayamunu kalugiṃcunaviyē. ī sarvavastuvulaṃdu kōrikalu vadalukoninayaḍala, vairāgyamunanē abhayamu - dēnivalananu bhayamu lēkuṃḍa uṃḍunu. ī viṣayamu bhartṛhari ī kriṃda ślōkamulō vivariṃci yunnāḍu : -

“bhōgē rōgabhayaṃ, kulē cyutibhayaṃ vittē nṛpālādbhayaṃ |

mānē dainya bhayaṃ, balē ripubhayaṃ. rūpā jarāyādbhayaṃ |

śāstē vādi bhayaṃ, guṇē khala bhayaṃ, kāyē kṛtāṃtādbhayaṃ |

sarvaṃ vastu bhayānvitaṃ bhuvi nṛṇāṃ vairāgyamēvā bhayaṃ ||“. (subhāṣitaṃ)

(bhōgulaku rōgabhayamu, maṃci kulamulō puṭṭinavāriki kulahīnatakalugunēmō yanu bhayamu, aiśvaryavaṃtuniki rāju dhanamu tīsukonunēmō yanu bhayamu, gauravamugā bratukuvāriki niṃdakalugunēmō yanu bhayamu, balamukalavāniki vānikanna balavaṃtulagu śatruvulavalana bhayamu, sauṃdaryavaṃtulaku musalitanamuvacci sauṃdaryamu pōvunēmō yanubhayamu; paṃḍitulaku itara paṃḍitulavalana vādōpavādamulu kalugunēmōyanu bhayamu, guṇavaṃtunaku durmārgulavalana bhayamu. śarīramunaku mṛtyuvu kalugunanu bhayamu.ī bhūmimīda samasta vastuvulu bhayamunu kalugacēyunaviyē. vairāgyamokkaṭē bhayamulēnidi - abhayamu niccunadi.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.