← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అభినివేశః abhinivēśaḥ

Original — తెలుగు

అభిమానః(అభిమానము)

అసత్య భూతే వస్తుని అభినివేశః.

(సత్యములుకాని వస్తువులందు - అసద్వస్తువులందు - కలుగు అభిమానము అభినివేశము.)

వ్యర్ధేషు కర్మసు కర్తవ్యా గ్రహః. (వ్యర్థమైన కర్మలయందు ఇది చేయవలసినది అను గ్రహము.)

“మరణభయాత్ శరీర సం రక్షణాయాః ఆగ్రహో అభినివేశః” (విచారసాగరము.)

(చనిపోవుదునేమో అను భయమువలన శరీరరక్షణ యొక్క ఆగ్రహము.)

ఇదివఱకు జరిగినవన్నియు అయుక్తములని తెలిసినప్పటికీ వాటిని విడిచిపెట్టక వాటియందు అభిమానము కలిగియుండుట.

“కర్మఫలే యేన తత్ప్రాప్తి పర్యంతం మనసః విక్షేపః సో అభినివేశః -” (పతంజలి - యోగసూత్రములు)

(కర్మఫలమందు, అది అందువరకు దానిని గుఱించి మనసులో ఆందోళన.)

“స్వ రసవాహీ విదుషోపి తథారూఢో (అ)భినివేశః” (పతంజలి - యోగసూత్రములు)

(క్రిమికీటకములనుండి విద్వాంసులవఱకు అందఱికీ జీవించియుండవలెనను ఆశకలిగియుండుట - బ్రతుకుమీద ఆశ.)

Transliteration

abhimānaḥ(abhimānamu)

asatya bhūtē vastuni abhinivēśaḥ.

(satyamulukāni vastuvulaṃdu - asadvastuvulaṃdu - kalugu abhimānamu abhinivēśamu.)

vyardhēṣu karmasu kartavyā grahaḥ. (vyarthamaina karmalayaṃdu idi cēyavalasinadi anu grahamu.)

“maraṇabhayāt śarīra saṃ rakṣaṇāyāḥ āgrahō abhinivēśaḥ” (vicārasāgaramu.)

(canipōvudunēmō anu bhayamuvalana śarīrarakṣaṇa yokka āgrahamu.)

idivaṟaku jariginavanniyu ayuktamulani telisinappaṭikī vāṭini viḍicipeṭṭaka vāṭiyaṃdu abhimānamu kaligiyuṃḍuṭa.

“karmaphalē yēna tatprāpti paryaṃtaṃ manasaḥ vikṣēpaḥ sō abhinivēśaḥ -” (pataṃjali - yōgasūtramulu)

(karmaphalamaṃdu, adi aṃduvaraku dānini guṟiṃci manasulō āṃdōḷana.)

“sva rasavāhī viduṣōpi tathārūḍhō (a)bhinivēśaḥ” (pataṃjali - yōgasūtramulu)

(krimikīṭakamulanuṃḍi vidvāṃsulavaṟaku aṃdaṟikī jīviṃciyuṃḍavalenanu āśakaligiyuṃḍuṭa - bratukumīda āśa.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.