చేసినదే మరల మరల చేయుట
అభ్యాసము.
ఒక
కార్యమును బాగుగా చేయుటకు మరలమరల చేయు యత్నము అభ్యాసము, ఏ పనినైనను-మరలమరల చేయుట
అభ్యాసము-.
ఒకే
అర్థమును వేర్వేరుగా, అనేక ప్రకారములుగా అనేక పర్యాయములు చెప్పుటగాని, వినుటగాని అభ్యాసము -
“నిత్త నైమిత్తికా విరుద్ధేషు
సర్వేషు కాలేషు మనసా ఉపాస్య సంశీలనం. (శ్రీరామానుజః)
(ఎల్లపుడు నిమిత్తములేకుండా
అన్నివేళలయందు మనసుతో ఉపాసించుశీలము కలిగియుండుట.)
“ఆలంబనే పునః పునః స్థాపన
స్థాపనం అభాసః”
(చింతించు విషయమందు మనస్సును తిరిగి
స్థాపించుట, ఉంచుట అభ్యాసము.)
“చిత్తస్య ఏకస్మిన్
ఆలంబనే సర్వతః సమాహృత్య పునః పునః స్థాపనం అభ్యాసః” (శ్రీశంకరః)
(చిత్తమును
విషయములన్నింటినుండి లాగి, మరలించి తాను ఆశ్రయించుకొనియుండు ఒకే వస్తువునందు - ఒకే కార్యమునందు
- మరల, మరల ఉంచుట.)
మ
యిచిత్త సమర్పణ విషయభూతే ఏకస్మిన్ తుల్య ప్రత్యయా వృత్తి లక్షణః విలక్షణ ప్రత్యయానంతరితః అభ్యాసః”
(శ్రీశంకరః)
(నేను
చిత్తముతో ధ్యానించుటకు విషయమైనవాడను. అట్టి నాయందు ఇతరవిషయములందుకాకమనసును నిలుపుట
అభ్యాసము.)
విషయములన్నింటినుండి
మనసును మరలించి దేవుని మూర్తియందు మనస్సును నిల్పి ఎడ తెగకుండ చేయు ప్రయత్నము అభ్యాసము
-.
“అభ్యాసో నామ కస్యాం చిత్
చిత్తభూమౌ నిరంతరం |
సమాన ప్రత్యయావృత్తి
శ్చిత్తస్యాధి వియోగినః ||“. (గీతాభావప్రకాశము - 6 - 175, 176)
(చిత్తమును
తన స్వాధీనములో నుంచుకొనుటకు చేయు ప్రయత్నములో ఒకస్థాయిలో అదే విషయమందు ఆధ్యాత్మికాది బాధలులేని
చిత్తమును నిలుపుట.)
“తత్ర స్థితౌ యత్నో
అభ్యాసః” (పతంజలి - యోగసూత్రములు.)
(చిత్తవృత్తులను నిరోధించుటకు, చిరస్థా
యిగానుంచుటకు చేయు ప్రయత్నము.)
చెడ్డ
వాసనలు, చేడ్డ ఆలోచనలు అభ్యాసముచే - మరల మరల వాటినే చేయుటచేత ధృఢపడును. ఆ ప్రకారముగానే
మంచివాసనలు మంచి ఆలోచనలు దైవచింతన అభ్యాసముచే స్థిరపడును.
ఛాందోగ్యోపనిషత్తులో
శ్వేతకేతువను కొడుకునకు తండ్రి అయిన ఉద్దాలకుడు భగవంతినిగుఱించి అనేకసార్లు భోధించుచు “తత్వమసి”
అను మహావాక్యమును తొమ్మిదిసార్లు చెప్పెను - ఇట్లు చెప్పినదే మరల మరల చెప్పుట అభ్యాసము కొఱకు
అభ్యాసము.అభ్యాసము రూఢి అయి, దానితాత్పర్యముమనసులో నాటుకొనియుండుటకు.
“తచ్చింతనం తత్కథనమన్యోన్యం
తద్బోధనం |
ఏతదేక పరత్వంచ తదభ్యాసం
విదుర్బుధాః ||. (యోగవాసిష్టము - 22 - 24)
(పరమాత్మగుఱించి
చింతించుట, ప్రసంగించుట, ఒకరికొకరు బోధించుకొనుట - ఈ పనులలో స్థిరముగానుండుట అభ్యాసము అని
పండితుల అభిప్రాయము.)
ప్రకరణ
ప్రతిపాద్యస్య వస్తునః తన్మధ్యే పౌనః పున్యేన ప్రతిపాదనం అభ్యాసః - యథా, తత్రైవా ద్వితీయ వస్తునః మధ్యే
తత్వ ‘మసీతి’ నవ కృతః ప్రతిపాదనం.
(ఒక
ప్రకరణలో ఒక విషయముగుఱించి చెప్పినపుడు మధ్యమధ్య మాటిమాటికి దానిని (దాని సారాంశమును)చెప్పుట అభ్యాసము
- చాందోగ్యోపనిషత్తులోని షష్టాధ్యాయమునందు పరమాత్మ అద్వితీయుడు, అతను ఒకడే యున్నాడు, అతను తప్ప
మఱేదియునులేదు అను విషయమును బోధించుచు దాని సారాంశమైన మహావాక్యమైన “తత్వమసి” (నీవే ఆ పరమాత్మవు)
- (ఆ పరమాత్మ, నీవు ఓకటే - ఈ ప్రకారము ప్రపంచములో వస్తువులన్నీ ఆ పరమాత్మయే) - అని తొమ్మిది
పర్యాయములు ఆ బోధ మనసులో బాగా నాటుటకు చెప్పబడినది. ఇది అభ్యాసము కొఱకు - ఈ అభ్యాసమువలన
ఈజ్ఞానము రూఢియగునని ఇన్నిసార్లు నొక్కి వక్కాణించినట్లు చెప్పడమైనది.)
Transliteration
cēsinadē marala marala
cēyuṭa abhyāsamu.
oka
kāryamunu bāgugā cēyuṭaku maralamarala cēyu yatnamu abhyāsamu, ē
paninainanu-maralamarala cēyuṭa abhyāsamu-.
okē
arthamunu vērvērugā, anēka prakāramulugā anēka paryāyamulu ceppuṭagāni,
vinuṭagāni abhyāsamu -
“nitta
naimittikā viruddhēṣu sarvēṣu kālēṣu manasā upāsya saṃśīlanaṃ.
(śrīrāmānujaḥ)
(ellapuḍu
nimittamulēkuṃḍā annivēḷalayaṃdu manasutō upāsiṃcuśīlamu
kaligiyuṃḍuṭa.)
“ālaṃbanē punaḥ punaḥ
sthāpana sthāpanaṃ abhāsaḥ”
(ciṃtiṃcu
viṣayamaṃdu manassunu tirigi sthāpiṃcuṭa, uṃcuṭa abhyāsamu.)
“cittasya
ēkasmin ālaṃbanē sarvataḥ samāhṛtya punaḥ punaḥ sthāpanaṃ abhyāsaḥ”
(śrīśaṃkaraḥ)
(cittamunu
viṣayamulanniṃṭinuṃḍi lāgi, maraliṃci tānu āśrayiṃcukoniyuṃḍu okē
vastuvunaṃdu - okē kāryamunaṃdu - marala, marala uṃcuṭa.)
ma
yicitta samarpaṇa viṣayabhūtē ēkasmin tulya pratyayā vṛtti lakṣaṇaḥ
vilakṣaṇa pratyayānaṃtaritaḥ abhyāsaḥ” (śrīśaṃkaraḥ)
(nēnu
cittamutō dhyāniṃcuṭaku viṣayamainavāḍanu. aṭṭi nāyaṃdu
itaraviṣayamulaṃdukākamanasunu nilupuṭa abhyāsamu.)
viṣayamulanniṃṭinuṃḍi
manasunu maraliṃci dēvuni mūrtiyaṃdu manassunu nilpi eḍa tegakuṃḍa cēyu
prayatnamu abhyāsamu -.
“abhyāsō nāma kasyāṃ
cit cittabhūmau niraṃtaraṃ |
samāna
pratyayāvṛtti ścittasyādhi viyōginaḥ ||“. (gītābhāvaprakāśamu - 6 - 175,
176)
(cittamunu
tana svādhīnamulō nuṃcukonuṭaku cēyu prayatnamulō okasthāyilō adē
viṣayamaṃdu ādhyātmikādi bādhalulēni cittamunu nilupuṭa.)
“tatra
sthitau yatnō abhyāsaḥ” (pataṃjali - yōgasūtramulu.)
(cittavṛttulanu
nirōdhiṃcuṭaku, cirasthā yigānuṃcuṭaku cēyu prayatnamu.)
ceḍḍa
vāsanalu, cēḍḍa ālōcanalu abhyāsamucē - marala marala vāṭinē cēyuṭacēta
dhṛḍhapaḍunu. ā prakāramugānē maṃcivāsanalu maṃci ālōcanalu daivaciṃtana
abhyāsamucē sthirapaḍunu.
chāṃdōgyōpaniṣattulō
śvētakētuvanu koḍukunaku taṃḍri ayina uddālakuḍu bhagavaṃtiniguṟiṃci
anēkasārlu bhōdhiṃcucu “tatvamasi” anu mahāvākyamunu tommidisārlu
ceppenu - iṭlu ceppinadē marala marala ceppuṭa abhyāsamu koṟaku
abhyāsamu.abhyāsamu rūḍhi ayi, dānitātparyamumanasulō
nāṭukoniyuṃḍuṭaku.
“tacciṃtanaṃ
tatkathanamanyōnyaṃ tadbōdhanaṃ |
ētadēka
paratvaṃca tadabhyāsaṃ vidurbudhāḥ ||. (yōgavāsiṣṭamu - 22 - 24)
(paramātmaguṟiṃci
ciṃtiṃcuṭa, prasaṃgiṃcuṭa, okarikokaru bōdhiṃcukonuṭa - ī panulalō
sthiramugānuṃḍuṭa abhyāsamu ani paṃḍitula abhiprāyamu.)
prakaraṇa
pratipādyasya vastunaḥ tanmadhyē paunaḥ punyēna pratipādanaṃ abhyāsaḥ -
yathā, tatraivā dvitīya vastunaḥ madhyē tatva ‘masīti’ nava kṛtaḥ
pratipādanaṃ.
(oka
prakaraṇalō oka viṣayamuguṟiṃci ceppinapuḍu madhyamadhya māṭimāṭiki
dānini (dāni sārāṃśamunu)ceppuṭa abhyāsamu - cāṃdōgyōpaniṣattulōni
ṣaṣṭādhyāyamunaṃdu paramātma advitīyuḍu, atanu okaḍē yunnāḍu, atanu
tappa maṟēdiyunulēdu anu viṣayamunu bōdhiṃcucu dāni sārāṃśamaina
mahāvākyamaina “tatvamasi” (nīvē ā paramātmavu) - (ā paramātma, nīvu
ōkaṭē - ī prakāramu prapaṃcamulō vastuvulannī ā paramātmayē) - ani
tommidi paryāyamulu ā bōdha manasulō bāgā nāṭuṭaku ceppabaḍinadi. idi
abhyāsamu koṟaku - ī abhyāsamuvalana ījñānamu rūḍhiyagunani innisārlu
nokki vakkāṇiṃcinaṭlu ceppaḍamainadi.)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.