అభ్యాసః ఏవ యోగః అభ్యాస యోగిః.
(అభ్యాసమే యోగముగాగలది. అభ్యాసయోగము.)
చిత్తస్య
ఏకస్మిన్ ఆలంబనే సర్వతః సమాహృత్య పునః పునః స్థాపనం అభ్యాసః- తత్పూర్వకో యోగః సమాధాన లక్షణః
అభ్యాస యోగః“. (శ్రీశంకరః)
(చిత్తమును
విషయములన్నింటినుండి లాగి, మరలించి తాను ఆశ్రయించుకొని ఉండు ఒకే లక్ష్యమునందు - ఒకే కార్యమునందు
మరలమరలనుంచుట అభ్యాసము - అట్టి అభ్యాసముతో చేయు చిత్త సమాధానము అభ్యాసయోగము.)
“మ
యి చిత్త సమర్పణ విష య భూతే ఏకస్మింత్యు ప్రత్యయావృత్తి లక్షణః విలక్షణ ప్రత్యయం సంతరితః అభ్యాసః,
సచ అసౌ యోగః” (శ్రీశంకరః)
(చిత్తముతో
ధ్యానించుటకు విషయమైనవాడిని నేను. అట్టి నా ఒక్కని యందే ఇతర విషయములందుకాక మనసు నిలుపుట
అభ్యాసము - అటువంటి అభ్యాసమే యోగముగా గలది అభ్యాసయోగము.)
మనసునకు
తగిన పరిపాకము లేనపుడు దానిని క్రమక్రమముగా నభ్యాసమువలన వశము చేసుకొనుటకు చేయు యోగము.
చంచలమగు
మనస్సును ఇతర విషయములనుండి మరల్చి ధ్యానలక్ష్యమందు మాటిమాటికి నుంచుట అభ్యాసయోగము.
మాటి
మాటికి భగవంతునియొక్క స్మరణము, చింతనము, ధ్యానము చేయుట - అభ్యాసము. అట్టి అభ్యాసములో నిరంతరము
యుక్తుడై యుండుట అభ్యాసయోగము.
స్థిరం
యథా భవతి ఏవం మ యి చిత్తం ధారయితుం యది శక్నో నభవ సి తర్హి విక్షిప్తం చిత్తం పునః ప్రత్యాహృత్య మాం
అను స్మరణ లక్షణో యోగాభ్యాసః అభ్యాసయోగః.
(నాయందు
చిత్తము స్థిరముగానుండునట్లు చేయలేకపోయిన యడల అటువంటి చంచల చిత్తమును తిరిగి మరలించి నన్ను
మరలమరల స్మరించుటే లక్షణముగాగల యోగాభ్యాసము అభ్యాసయోగము -..)
“అధ చిత్తం సమాధాతుం న
శక్నోషి మ యి స్థిరం |
అభ్యాస యోగేన తతో మామిచ్ఛాప్తుం
ధనంజయ ||“. (శ్రీమగ్భగవద్గీత - 12 - 9)
“మదుక్తరీత్యా చిత్తం చేన్నత్వం స్థాప యితుం క్షమః
|
మ యీశ్వరే
వాసుదేవే నిశ్చలం తర్హి సర్వదా |
ఆహృత్య సర్వతో
బాహ్యా దేకస్మిన్న వలంబనే |
చేతనః స్థాపనం
భూయో భూయో (అ)భ్యాసః స ఉచ్యతే |
తత్పూర్వకసమాధిర్యస్తేనమాం ప్రాప్తుమీశ్వరం |
యతస్య ప్రతిమాదౌత్వం
చిత్తం కురు సమాహితం||” (గీతాభావప్రకాశం - 12 - 79 to 81)
(నేను
చెప్పిన విధముగా నీవు చిత్తమును స్థాపించుటకు సమర్థుడవుకానిచో, ఈశ్వరుడు, వాసుదేవుడు అయిన
నాయందు మనస్సును నిల్పుము - సర్వ విధముల బాహ్య వస్తువులనుండి మనస్సును మరలించి ఒకే
అవలంబమునందు మనస్సును కూర్చుట అభ్యాసము - అట్టి అభ్యాసపూర్వకమైన సమాది యోగమున -
అభ్యాసయోగమున నన్ను పొందుటకు యత్నించుము.)
“స్థిరం
యథాస్యాత్ తథా చిత్తం సమాధాతుం స్థాప యితుం మయి సుగుణ బ్రహ్మణి నహి శక్నోషిచేత్ తతః ఏకస్మిన్ ప్రతిమాదౌ
అవలంబనే సర్వతః సమాహృత్య చేతసః పునః పునః స్థాపనం అభ్యాసః, తత్పూర్వకోయోగః సమాధిః
అభ్యాసయోగః”.
(పరబ్రహ్మము
అయిన నాయందు చిత్తమును స్థిరముగా నిలుపుటకు శక్తి లేనియడల నాతాలూకు ప్రతిమయందు (విగ్రహమందు)
నిలకడగా ఉంచి, చిత్తమును అన్నింటినుండి మరలించి, తిరిగి, తిరిగి దానియందే నెలకొల్పుట అభ్యాసము. ఇట్టి
అభ్యాసముతోకూడిన యోగము లేక సమాధి,అభ్యాసయోగము.)
“అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా
|
పరమం పురుషం దివ్యం యాతి
పార్థాను చింతయన్ ||“. (శ్రీమద్భగవద్గీత- 8 - 8)
(విభుడైన
వాసుదేవునియందు తుల్య ప్రత్యయా వృత్తిలక్షణమైన మనస్సు కలిగియుండుట అభ్యాసము - దానితోకూడిన మనస్సు
కలిగిన దానియందే లగ్నమై యుండుట అభ్యాసయోగము.)
“దివా రాత్రమవిచ్ఛిన్నం యామే
యామే, యామే యథా తథా |
అనేనా భ్యాసయోగేన
వాయురభ్యసితో భవేత్ |
వాయా వభ్యసితే
వహ్నిః ప్రత్యహం వర్థతే తనా |
వహ్నే వివర్థమానేతు
సుఖమన్నాది జీర్యతే |
అన్నస్య పరిపాకేన
రసవృద్ధిః ప్రజాయతే |
రసౌ వృద్ధిం గతే
నిత్యం వర్థంతే ధాతవస్తథా |
ధాతూనం వర్థనేనైవ
ప్రభోధో వర్థతే తసౌ |
దహ్యంతే సర్వ పాపాని జన్మకో ట్యార్జితాని చ||”
(వరాహోపనిషత్)
(రాత్రి
పగలు ఎడతెరిపి లేకుండా ప్రతిరాత్రి ఎదో ఒకమోస్తరుగా ఈ అభ్యాసయోగము చేయుటవల్ల (ప్రాణాయామము చేయుటవలన)
ప్రాణవాయువు అభ్యాసము చేయబడును - ప్రాణాయామము అభ్యాసముగా అది వశములోనుండును - ప్రాణాయామము
అభ్యాసముగాచేసినయడల శరీరములో వేడిమి ప్రతిరోజు వృద్ధిపొందును. శరీరములోని ఉష్ణత వృద్దిపొందినకొలదీ తినిన
అన్నము మొదలగునవి బాగుగా జీర్ణమగును - అన్నము పరిపాకముకాగా జీర్ణమైన అన్నరసము వృద్ధియగును -
అన్నరసము వృద్ధిపొందిన ధాతువులు వృద్ధిపొందును. ధాతువులు వృద్ధిపొందిన జ్ఞానము వృద్ధిపొందును.
దానితో కోటి జన్మలలో ఆర్జించిన పాపములు దహించుకొనిపోవును.)
“యథాగ్నిర్థారు మధ్యస్థో
నోత్తిష్టేన్మిథనం వినా |
వినాభ్యాసయోగేన జ్ఞానదీపస్త థానహి ||“.
(యోగశిఖోపనిషత్)
(కర్ర
లోపలనణగియున్న అగ్ని కర్రను మథించినగాని పైకి ఏ ప్రకారము కలుగదో ఆ ప్రకారముగానే అభ్యాసయోగము లేనిదే
జ్ఞానమను దీపము వెలగదు. అభ్యాసమువలన లోనున్న జ్ఞానము బైటపడును.)
“అవశ్యం ప్రాప్స్యుతే
ప్రాప్యం అభ్యాసే నాన్యథా |”.
(పొందవలసిన విషయము
అభ్యాసమువలననే పొందనగును - ఇంకొక రీతిగా పొందబడదు.)
ప్రాణాయామయోగమునే అభ్యాసయోగమనికూడ
అందురు.
Transliteration
abhyāsaḥ
ēva yōgaḥ abhyāsa yōgiḥ. (abhyāsamē yōgamugāgaladi. abhyāsayōgamu.)
cittasya
ēkasmin ālaṃbanē sarvataḥ samāhṛtya punaḥ punaḥ sthāpanaṃ abhyāsaḥ-
tatpūrvakō yōgaḥ samādhāna lakṣaṇaḥ abhyāsa yōgaḥ”. (śrīśaṃkaraḥ)
(cittamunu
viṣayamulanniṃṭinuṃḍi lāgi, maraliṃci tānu āśrayiṃcukoni uṃḍu okē
lakṣyamunaṃdu - okē kāryamunaṃdu maralamaralanuṃcuṭa abhyāsamu - aṭṭi
abhyāsamutō cēyu citta samādhānamu abhyāsayōgamu.)
“ma
yi citta samarpaṇa viṣa ya bhūtē ēkasmiṃtyu pratyayāvṛtti lakṣaṇaḥ
vilakṣaṇa pratyayaṃ saṃtaritaḥ abhyāsaḥ, saca asau yōgaḥ”
(śrīśaṃkaraḥ)
(cittamutō
dhyāniṃcuṭaku viṣayamainavāḍini nēnu. aṭṭi nā okkani yaṃdē itara
viṣayamulaṃdukāka manasu nilupuṭa abhyāsamu - aṭuvaṃṭi abhyāsamē
yōgamugā galadi abhyāsayōgamu.)
manasunaku
tagina paripākamu lēnapuḍu dānini kramakramamugā nabhyāsamuvalana vaśamu
cēsukonuṭaku cēyu yōgamu.
caṃcalamagu
manassunu itara viṣayamulanuṃḍi maralci dhyānalakṣyamaṃdu māṭimāṭiki
nuṃcuṭa abhyāsayōgamu.
māṭi
māṭiki bhagavaṃtuniyokka smaraṇamu, ciṃtanamu, dhyānamu cēyuṭa -
abhyāsamu. aṭṭi abhyāsamulō niraṃtaramu yuktuḍai yuṃḍuṭa
abhyāsayōgamu.
sthiraṃ
yathā bhavati ēvaṃ ma yi cittaṃ dhārayituṃ yadi śaknō nabhava si tarhi
vikṣiptaṃ cittaṃ punaḥ pratyāhṛtya māṃ anu smaraṇa lakṣaṇō yōgābhyāsaḥ
abhyāsayōgaḥ.
(nāyaṃdu
cittamu sthiramugānuṃḍunaṭlu cēyalēkapōyina yaḍala aṭuvaṃṭi caṃcala
cittamunu tirigi maraliṃci nannu maralamarala smariṃcuṭē lakṣaṇamugāgala
yōgābhyāsamu abhyāsayōgamu -..)
“adha cittaṃ
samādhātuṃ na śaknōṣi ma yi sthiraṃ |
abhyāsa
yōgēna tatō māmicchāptuṃ dhanaṃjaya ||“. (śrīmagbhagavadgīta - 12 -
9)
“maduktarītyā
cittaṃ cēnnatvaṃ sthāpa yituṃ kṣamaḥ |
ma yīśvarē vāsudēvē
niścalaṃ tarhi sarvadā |
āhṛtya sarvatō bāhyā
dēkasminna valaṃbanē |
cētanaḥ sthāpanaṃ
bhūyō bhūyō (a)bhyāsaḥ sa ucyatē |
tatpūrvakasamādhiryastēnamāṃ
prāptumīśvaraṃ |
yatasya
pratimādautvaṃ cittaṃ kuru samāhitaṃ||” (gītābhāvaprakāśaṃ - 12 - 79 to
81)
(nēnu
ceppina vidhamugā nīvu cittamunu sthāpiṃcuṭaku samarthuḍavukānicō,
īśvaruḍu, vāsudēvuḍu ayina nāyaṃdu manassunu nilpumu - sarva vidhamula
bāhya vastuvulanuṃḍi manassunu maraliṃci okē avalaṃbamunaṃdu manassunu
kūrcuṭa abhyāsamu - aṭṭi abhyāsapūrvakamaina samādi yōgamuna -
abhyāsayōgamuna nannu poṃduṭaku yatniṃcumu.)
“sthiraṃ
yathāsyāt tathā cittaṃ samādhātuṃ sthāpa yituṃ mayi suguṇa brahmaṇi nahi
śaknōṣicēt tataḥ ēkasmin pratimādau avalaṃbanē sarvataḥ samāhṛtya
cētasaḥ punaḥ punaḥ sthāpanaṃ abhyāsaḥ, tatpūrvakōyōgaḥ samādhiḥ
abhyāsayōgaḥ”.
(parabrahmamu
ayina nāyaṃdu cittamunu sthiramugā nilupuṭaku śakti lēniyaḍala nātālūku
pratimayaṃdu (vigrahamaṃdu) nilakaḍagā uṃci, cittamunu anniṃṭinuṃḍi
maraliṃci, tirigi, tirigi dāniyaṃdē nelakolpuṭa abhyāsamu. iṭṭi
abhyāsamutōkūḍina yōgamu lēka samādhi,abhyāsayōgamu.)
“abhyāsayōgayuktēna cētasā
nānyagāminā |
paramaṃ
puruṣaṃ divyaṃ yāti pārthānu ciṃtayan ||“. (śrīmadbhagavadgīta- 8 -
8)
(vibhuḍaina
vāsudēvuniyaṃdu tulya pratyayā vṛttilakṣaṇamaina manassu kaligiyuṃḍuṭa
abhyāsamu - dānitōkūḍina manassu kaligina dāniyaṃdē lagnamai yuṃḍuṭa
abhyāsayōgamu.)
“divā
rātramavicchinnaṃ yāmē yāmē, yāmē yathā tathā |
anēnā bhyāsayōgēna
vāyurabhyasitō bhavēt |
vāyā vabhyasitē
vahniḥ pratyahaṃ varthatē tanā |
vahnē vivarthamānētu
sukhamannādi jīryatē |
annasya paripākēna
rasavṛddhiḥ prajāyatē |
rasau vṛddhiṃ
gatē nityaṃ varthaṃtē dhātavastathā |
dhātūnaṃ
varthanēnaiva prabhōdhō varthatē tasau |
dahyaṃtē
sarva pāpāni janmakō ṭyārjitāni ca||” (varāhōpaniṣat)
(rātri
pagalu eḍateripi lēkuṃḍā pratirātri edō okamōstarugā ī abhyāsayōgamu
cēyuṭavalla (prāṇāyāmamu cēyuṭavalana) prāṇavāyuvu abhyāsamu cēyabaḍunu
- prāṇāyāmamu abhyāsamugā adi vaśamulōnuṃḍunu - prāṇāyāmamu
abhyāsamugācēsinayaḍala śarīramulō vēḍimi pratirōju vṛddhipoṃdunu.
śarīramulōni uṣṇata vṛddipoṃdinakoladī tinina annamu modalagunavi bāgugā
jīrṇamagunu - annamu paripākamukāgā jīrṇamaina annarasamu vṛddhiyagunu -
annarasamu vṛddhipoṃdina dhātuvulu vṛddhipoṃdunu. dhātuvulu
vṛddhipoṃdina jñānamu vṛddhipoṃdunu. dānitō kōṭi janmalalō ārjiṃcina
pāpamulu dahiṃcukonipōvunu.)
“yathāgnirthāru
madhyasthō nōttiṣṭēnmithanaṃ vinā |
vinābhyāsayōgēna
jñānadīpasta thānahi ||“. (yōgaśikhōpaniṣat)
(karra
lōpalanaṇagiyunna agni karranu mathiṃcinagāni paiki ē prakāramu kalugadō
ā prakāramugānē abhyāsayōgamu lēnidē jñānamanu dīpamu velagadu.
abhyāsamuvalana lōnunna jñānamu baiṭapaḍunu.)
“avaśyaṃ
prāpsyutē prāpyaṃ abhyāsē nānyathā |”.
(poṃdavalasina
viṣayamu abhyāsamuvalananē poṃdanagunu - iṃkoka rītigā
poṃdabaḍadu.)
prāṇāyāmayōgamunē
abhyāsayōgamanikūḍa aṃduru.
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.