← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అచ్ఛేద్యః acchēdyaḥ

Original — తెలుగు
  1. ఛేదింప నలవి కానివాడు.

  2. అవయవవిభాగం కర్తుం న శక్యం, నిరవయవత్వాత్;

(ఆత్మ అవయవములు లేకుండుటవలన అవయవ విభాగం చేయుటకు శక్యము కానివాడు.)

  1. సూక్ష్మత్వేన ఛేదనా ద్యయోగ్యత్వాత్ ఆత్మా నాశరహితః, అతః నిత్యః.(సూక్ష్మము - చిన్నది – యగుట వలన ఛేదించుటకు నలవి కానందున నాశరహితుడు; అందువల్ల నిత్యుడు.)

  2. “నైనం ఛిందంతి శస్త్రాణి” (శ్రీమద్భగవద్గీత - 2 - 23)

“అఛ్చేద్యో యమదా హ్యోయం” (శ్రీ మద్భగవద్గీత - 2- 24)

పై శ్లోకభాగమునకు వ్యాఖ్యానము :-

“శస్త్రాణ్యంగ విభాగేన ద్విధా కర్తుం చిదాత్మకం |

ప్రసిధ్ధా నాశకా ఏ తే ప్రభావంతి న చాత్మని |

పృధివ్వబ్వహ్ని వాయూనాం నాశకత్వ ప్రసిద్ధతః |

తేషా మస్యాంతరోహ్యాత్మా తం వి నాతేమృషాత్మకాః - -

సత్తా స్పూర్తి ప్రదాతాస్తి శస్తా దీనామయం యతః |

ప్రేరకో (అ)oతర్యామి తయా కధయేతం మిమాన్యపి |

శస్త్రాదీని ప్రవద్యుస్తం స్వవ్యాపారైకగోచరం | (గీతాభావప్రకాశము - 2 - 290, 294, 295, 300, 301)

(ఆత్మను ముక్కలు చేయుటకు ఆయుధములకు శక్తిలేదు. ఆయుధములు, భూమి, నీరు, అగ్ని, వాయువు అన్నింటినీ నాశము చేయునవి యని లోకములో ప్రసిద్ధిగా ఉన్నప్పటికీ ఆత్మని నాశము చేయలేవు. ఎందుచేతననగా, వీటిని నాశము చేయునది ఆత్మ. వాటి అన్నింటిలోను ఆత్మ అంతర్యామిగా నున్నది. వాటిలో ఆత్మ లేకున్న యెడల అవి ఎందుకు పనికి రానివి, నిస్సత్తువలు అయిపోవును, ఏమియు చేయనేరవు. వాటిలోపల అంతర్యామిగా ఉండి, వాటికి తన సత్తా స్పూర్తినిచ్చి వాటిని ప్రేరేపించునది ఆత్మయే. అందుచేత శస్త్రములు, భూతములు ఆత్మని ఏ విధముగా నైనను నాశము చేయలేవు, ఛేదించలేవు. అందుచేత ఆత్మ అచ్ఛేద్యుడు.)

Transliteration
  1. chēdiṃpa nalavi kānivāḍu.

  2. avayavavibhāgaṃ kartuṃ na śakyaṃ, niravayavatvāt;

(ātma avayavamulu lēkuṃḍuṭavalana avayava vibhāgaṃ cēyuṭaku śakyamu kānivāḍu.)

  1. sūkṣmatvēna chēdanā dyayōgyatvāt ātmā nāśarahitaḥ, ataḥ nityaḥ.(sūkṣmamu - cinnadi – yaguṭa valana chēdiṃcuṭaku nalavi kānaṃduna nāśarahituḍu; aṃduvalla nityuḍu.)

  2. “nainaṃ chiṃdaṃti śastrāṇi” (śrīmadbhagavadgīta - 2 - 23)

“achcēdyō yamadā hyōyaṃ” (śrī madbhagavadgīta - 2- 24)

pai ślōkabhāgamunaku vyākhyānamu :-

“śastrāṇyaṃga vibhāgēna dvidhā kartuṃ cidātmakaṃ |

prasidhdhā nāśakā ē tē prabhāvaṃti na cātmani |

pṛdhivvabvahni vāyūnāṃ nāśakatva prasiddhataḥ |

tēṣā masyāṃtarōhyātmā taṃ vi nātēmṛṣātmakāḥ - -

sattā spūrti pradātāsti śastā dīnāmayaṃ yataḥ |

prērakō (a)otaryāmi tayā kadhayētaṃ mimānyapi |

śastrādīni pravadyustaṃ svavyāpāraikagōcaraṃ | (gītābhāvaprakāśamu - 2 - 290, 294, 295, 300, 301)

(ātmanu mukkalu cēyuṭaku āyudhamulaku śaktilēdu. āyudhamulu, bhūmi, nīru, agni, vāyuvu anniṃṭinī nāśamu cēyunavi yani lōkamulō prasiddhigā unnappaṭikī ātmani nāśamu cēyalēvu. eṃducētananagā, vīṭini nāśamu cēyunadi ātma. vāṭi anniṃṭilōnu ātma aṃtaryāmigā nunnadi. vāṭilō ātma lēkunna yeḍala avi eṃduku paniki rānivi, nissattuvalu ayipōvunu, ēmiyu cēyanēravu. vāṭilōpala aṃtaryāmigā uṃḍi, vāṭiki tana sattā spūrtinicci vāṭini prērēpiṃcunadi ātmayē. aṃducēta śastramulu, bhūtamulu ātmani ē vidhamugā nainanu nāśamu cēyalēvu, chēdiṃcalēvu. aṃducēta ātma acchēdyuḍu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.