← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అచేతనము acētanamu

Original — తెలుగు
  1. జడం; జ్ఞానశూన్యం ఇతికర్తవ్యతా జ్ఞాన శూన్యం.

(జడము; జ్ఞానము లేనిది. ఇది ఇట్లు చేయ వలయునను జ్ఞానము లేనిది.)

  1. చేతనరహితః, నిర్జీవః. (చైతన్యము లేనిది, ప్రాణము లేనిది.)

  2. ఘట పటాది. (ఘటము, పటము మొదలగునవి - కుండ, బట్ట వంటివి.)

  3. అచేతనమైన సువర్ణము వలన పుట్టిన కట కార్యాభరణముల చందంబున అచేతనమగు అవ్యక్తమువలన పుట్టినమహత్తత్త్వము మొదలగు ఇరువది నాలుగు తత్వములు అచేతనములు.

  4. “కాలకర్మ స్వభావంబులం దగులుపడక సమస్తంబును జీవయుక్తంబుజేయు నీశ్వండ చేతనంబును నచేతనంబుగ నొనర్చె.”

(శ్రీ మదాంధ్రమహాభాగవతము - 2 - 5 - 86)

(పరబ్రహ్మ చైతన్య ఘనము - చిత్ ఘనం - ఘనీభవించిన చైతన్యము - ప్రపంచములోని వస్తువులు - అనగా, ప్రకృతి దాని వికృతుల నుండి పుట్టిన వన్నియు జడములు, అచేతనములు - పరబ్రహ్మ ఈ జడవస్తువులన్నింటిలోను ప్రవేశించి వాటికి తన సత్తానిచ్చి ఈ అచేతనములను చేతనములుగా చేసెను. - “తత్ సృష్త్ట్వా తదేవానుప్రావిశత్” (దానిని సృష్టించి దాని లోనే ప్రవేశించెను) అని శ్రుతి - లోకములను - అనగా, లోకములోని వస్తువులను సృష్టించి వాటిలోనే ప్రవేశించెను.)

Transliteration
  1. jaḍaṃ; jñānaśūnyaṃ itikartavyatā jñāna śūnyaṃ.

(jaḍamu; jñānamu lēnidi. idi iṭlu cēya valayunanu jñānamu lēnidi.)

  1. cētanarahitaḥ, nirjīvaḥ. (caitanyamu lēnidi, prāṇamu lēnidi.)

  2. ghaṭa paṭādi. (ghaṭamu, paṭamu modalagunavi - kuṃḍa, baṭṭa vaṃṭivi.)

  3. acētanamaina suvarṇamu valana puṭṭina kaṭa kāryābharaṇamula caṃdaṃbuna acētanamagu avyaktamuvalana puṭṭinamahattattvamu modalagu iruvadi nālugu tatvamulu acētanamulu.

  4. “kālakarma svabhāvaṃbulaṃ dagulupaḍaka samastaṃbunu jīvayuktaṃbujēyu nīśvaṃḍa cētanaṃbunu nacētanaṃbuga nonarce.”

(śrī madāṃdhramahābhāgavatamu - 2 - 5 - 86)

(parabrahma caitanya ghanamu - cit ghanaṃ - ghanībhaviṃcina caitanyamu - prapaṃcamulōni vastuvulu - anagā, prakṛti dāni vikṛtula nuṃḍi puṭṭina vanniyu jaḍamulu, acētanamulu - parabrahma ī jaḍavastuvulanniṃṭilōnu pravēśiṃci vāṭiki tana sattānicci ī acētanamulanu cētanamulugā cēsenu. - “tat sṛṣtṭvā tadēvānuprāviśat” (dānini sṛṣṭiṃci dāni lōnē pravēśiṃcenu) ani śruti - lōkamulanu - anagā, lōkamulōni vastuvulanu sṛṣṭiṃci vāṭilōnē pravēśiṃcenu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.