(ఊహించుటకు నలవి కానివాడు, చింతింప శక్యము గానివాడు.)
(ఇట్టివాడు అని అనుమానించుటకు అవకాశము ఉండువాడు చింత్యుడు. అదికానివాడు అచింత్యుడు.)
(మనసునకు విషయము కానివాడు - మనసులో ఇట్టి వాడని అలోచించుటకు వీలు కానివాడు.)
(ప్రత్యక్ష ప్రమాణమునకు మించినవాడు, ప్రత్యక్ష ప్రమాణము ద్వారా తెలుసుకొనుటకు వీలుకాని వాడు, అనుమాన ప్రమాణమునకు అందని వాడు, అనగా - అనుమానించుటకైనను వీలు పడనివాడు.)
అవ్యక్తత్వాత్ అచింత్యః. (వ్యక్తము కాడు, కంటికి కనబడడు. అందుచేత అచింత్యుడు.)
అంతఃకరణ వృత్త్య విషయ భూతం.
(అంతఃకరణ వృత్తికి విషయము కానివాడు - అంతః కరణముచే ఇటువంటివాడని అలోచించుటకు వీలు పడనివాడు.)
(వాక్కు యొక్క వృత్తి చెప్పుట, మనస్సు యొక్క వృత్తి చింతించుట. వాక్కుచే ఇటువంటివాడని చెప్పుటకుగాని, మనసులో ఇటువంటి వాడని అలోచించుటకు గాని అందనివాడు.)
చిత్త వృత్త్య భావాత్ అచింత్యః. (చిత్తమనునది లేకపోవుట వలన అచింత్యుడు.)
నిర్విశేషాత్మనా అచింత్యః. (విశేషములు లేకపోవుట వలన అచింత్యుడు.)
“యద్ధి కరణగోచరం తత్ మనసాపి చింత్యం, తద్విపరీతత్వాత్ అచింత్యం”. (శ్రీ శంకరః)
(ఇంద్రియములకు గోచరమైనది మనసు చేత కూడా అలోచింప తగినది. ఇంద్రియములకు తెలిసినది మనసునకు కూడా తెలియనగును. అట్లు కానిది కనుక అచింత్యము.)
(చింత్యమనగా చింతించుటకు అవకాశమున్నది, రూపములు మొదలగునవి కలిగియుండుట చేత అనుమానింప తగినది. సూక్ష్మేంద్రియములు గల లింగ శరీరము (సూక్ష్మ శరీరము) ప్రత్యక్షముగా కనబడదు. దాని కంటె కూడ విలక్షణమైనది, వేఱైనది. అందువలన అచింత్యము.)
(ప్రపంచమంతటి కన్న వేఱై ఇతడిట్టివాడు అని చింతించుటకు నలవికాని వాడు. అందుచేత అచింత్యుడు.)
(ఇంద్రియములకు గోచరమగు దానిని చింతించుటకు నలవి యగును. ఆత్మ ఇంద్రియములకు గోచరము కాదు. అందుచేత మనసునకు కూడా గోచరము కాదు. అందుచేత అచింత్యము.)
(ప్రమాత - జీవుడు - లేక అన్నింటిని కొలుచు వాడు - మొదలగువాటికి కూడా సాక్షి యగుట వలన ఏ ప్రమాణముల ద్వారా నైననూ తెలియబడనివాడు.)
సత్వాది గుణత్రయ సంపర్కము - సత్వ రజస్తమములు అను మూడు గుణముల సంపర్కము - లేనివాడు కాన ఇట్టి వాడని ఊహింప శక్యము కానివాడు.)
“అవ్యక్తోయ మ చింత్యోయ మ పికార్యోయ ముచ్యతే |” (శ్రీమద్భగవద్గీత - 2 - 25)
పై శ్లోకమునకు వ్యాఖ్యానము : -
“ఇంద్రియైర్వ్యజ్యతే స్థూల దేహాదిర్వ్యక్త ముచ్యతే |
ఆత్మా రూపాది హీనత్వాన్నా యం ప్రత్యక్షగోచరః |
ప్రత్యక్షేణ గృహీతోర్థో (అ) నుమేయః స్యాత్సదై క్వచిత్ |
నా ప్రత్యక్షే అను మే యత్వ మచింత్యే (అ) తీంద్రియే భవేత్ |
రూపాది భాన కార్యేణచింతార్హో లింగదేహకః |
చక్షురాది సమూహాత్మా తద్భిన్నో (అ) య మిహా ధవా ||” (గీతాభావ ప్రకాశము - 2 - 25)
(ఇంద్రియములకు గోచరమగు స్థూలదేహము మొదలగునవి వ్యక్తములు - కనబడునవి, స్పష్టముగా తెలుసుకొనుటకు వీలగునవి. రూపము మొదలగునవి లేనందున ఆత్మ ప్రత్యక్ష ప్రమాణము వలన తెలుసుకొనుటకు శక్యముకానిది. ప్రత్యక్ష ప్రమాణము చేత తెలుసుకొనిన వస్తువు అనుమానించతగి యుండును - అనగా, అనుమాన ప్రమాణము ద్వారా తెలియనగును. ప్రత్యక్ష ప్రమాణము చేత తెలుసుకొనుటకు వీలు కానిది. అనుమానించుటకు కూడా వీలు లేనిదే. అందుచేత అది అతీంద్రియము - అనగా, ఇంద్రియ శక్తికి మించినది. అందుచేత అచింత్యము - ఇటువంటిది అని చింతించుటకు వీలుకానిది. రూపము గలిగి యుండి పైకి కనబడుతూ ప్రకాశముగా ఉండుట వలన లింగదేహము - సూక్ష్మదేహము - చింతించుటకు, ఊహించుటకు వీలగును. కాని ఆత్మ అట్టిదికాదు. అందుచేత చింతించుటకు వీలు కానిది - అచింత్యము.)
(మనస్సు యొక్క వృత్తి - అనగా, వ్యాపారము - చింతించుట, ఆలోచించుట. ఆ మనో వృత్తికి అందనివాడు.)
“యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ”
(వాక్కులు, మనస్సు ఆత్మను పొందలేక – నిర్ణయింప లేక - అనగా, ఇట్టివాడని చెప్పుటకు వీలుకాక, ఊహించుటకు అయినా వీలుకాక తిరిగి వచ్చినవి.)
(ఏది వాక్కుచే చెప్పుటకు వీలుకాదో, మనస్సులో భావించుటకు వలనపడదో అది అచింత్యము.)
ప్రకృతిభ్యః పరం, యచ్చతద చింత్యస్య లక్షణం ||”
(ఏ భావములు చింతించుటకు వలను పడదో వాటిని తర్కము చేత - యుక్తులచేత - సాధింప ప్రయత్నించ కూడదు. ప్రాకృతములైన వస్తువులకన్న ఉత్కృష్టమైనది అచింత్యము - చింతించుటకు వీలులేని లక్షణములు కలది - అట్టిది పరమాత్మ.)
(మనస్సునకు ఇంద్రియములకు తెలుసుకొనుటకు వీలుకాని విషయములు తెలుసుకొనవలెననిన వేదము వలన వాటిని తెలుసు కొనవలెను. వాటికి వేదమే ప్రమాణము.)
(ūhiṃcuṭaku nalavi kānivāḍu, ciṃtiṃpa śakyamu gānivāḍu.)
(iṭṭivāḍu ani anumāniṃcuṭaku avakāśamu uṃḍuvāḍu ciṃtyuḍu. adikānivāḍu aciṃtyuḍu.)
(manasunaku viṣayamu kānivāḍu - manasulō iṭṭi vāḍani alōciṃcuṭaku vīlu kānivāḍu.)
(pratyakṣa pramāṇamunaku miṃcinavāḍu, pratyakṣa pramāṇamu dvārā telusukonuṭaku vīlukāni vāḍu, anumāna pramāṇamunaku aṃdani vāḍu, anagā - anumāniṃcuṭakainanu vīlu paḍanivāḍu.)
avyaktatvāt aciṃtyaḥ. (vyaktamu kāḍu, kaṃṭiki kanabaḍaḍu. aṃducēta aciṃtyuḍu.)
aṃtaḥkaraṇa vṛttya viṣaya bhūtaṃ.
(aṃtaḥkaraṇa vṛttiki viṣayamu kānivāḍu - aṃtaḥ karaṇamucē iṭuvaṃṭivāḍani alōciṃcuṭaku vīlu paḍanivāḍu.)
(vākku yokka vṛtti ceppuṭa, manassu yokka vṛtti ciṃtiṃcuṭa. vākkucē iṭuvaṃṭivāḍani ceppuṭakugāni, manasulō iṭuvaṃṭi vāḍani alōciṃcuṭaku gāni aṃdanivāḍu.)
citta vṛttya bhāvāt aciṃtyaḥ. (cittamanunadi lēkapōvuṭa valana aciṃtyuḍu.)
nirviśēṣātmanā aciṃtyaḥ. (viśēṣamulu lēkapōvuṭa valana aciṃtyuḍu.)
“yaddhi karaṇagōcaraṃ tat manasāpi ciṃtyaṃ, tadviparītatvāt aciṃtyaṃ”. (śrī śaṃkaraḥ)
(iṃdriyamulaku gōcaramainadi manasu cēta kūḍā alōciṃpa taginadi. iṃdriyamulaku telisinadi manasunaku kūḍā teliyanagunu. aṭlu kānidi kanuka aciṃtyamu.)
(ciṃtyamanagā ciṃtiṃcuṭaku avakāśamunnadi, rūpamulu modalagunavi kaligiyuṃḍuṭa cēta anumāniṃpa taginadi. sūkṣmēṃdriyamulu gala liṃga śarīramu (sūkṣma śarīramu) pratyakṣamugā kanabaḍadu. dāni kaṃṭe kūḍa vilakṣaṇamainadi, vēṟainadi. aṃduvalana aciṃtyamu.)
(prapaṃcamaṃtaṭi kanna vēṟai itaḍiṭṭivāḍu ani ciṃtiṃcuṭaku nalavikāni vāḍu. aṃducēta aciṃtyuḍu.)
(iṃdriyamulaku gōcaramagu dānini ciṃtiṃcuṭaku nalavi yagunu. ātma iṃdriyamulaku gōcaramu kādu. aṃducēta manasunaku kūḍā gōcaramu kādu. aṃducēta aciṃtyamu.)
(pramāta - jīvuḍu - lēka anniṃṭini kolucu vāḍu - modalaguvāṭiki kūḍā sākṣi yaguṭa valana ē pramāṇamula dvārā nainanū teliyabaḍanivāḍu.)
satvādi guṇatraya saṃparkamu - satva rajastamamulu anu mūḍu guṇamula saṃparkamu - lēnivāḍu kāna iṭṭi vāḍani ūhiṃpa śakyamu kānivāḍu.)
“avyaktōya ma ciṃtyōya ma pikāryōya mucyatē |” (śrīmadbhagavadgīta - 2 - 25)
pai ślōkamunaku vyākhyānamu : -
“iṃdriyairvyajyatē sthūla dēhādirvyakta mucyatē |
ātmā rūpādi hīnatvānnā yaṃ pratyakṣagōcaraḥ |
pratyakṣēṇa gṛhītōrthō (a) numēyaḥ syātsadai kvacit |
nā pratyakṣē anu mē yatva maciṃtyē (a) tīṃdriyē bhavēt |
rūpādi bhāna kāryēṇaciṃtārhō liṃgadēhakaḥ |
cakṣurādi samūhātmā tadbhinnō (a) ya mihā dhavā ||” (gītābhāva prakāśamu - 2 - 25)
(iṃdriyamulaku gōcaramagu sthūladēhamu modalagunavi vyaktamulu - kanabaḍunavi, spaṣṭamugā telusukonuṭaku vīlagunavi. rūpamu modalagunavi lēnaṃduna ātma pratyakṣa pramāṇamu valana telusukonuṭaku śakyamukānidi. pratyakṣa pramāṇamu cēta telusukonina vastuvu anumāniṃcatagi yuṃḍunu - anagā, anumāna pramāṇamu dvārā teliyanagunu. pratyakṣa pramāṇamu cēta telusukonuṭaku vīlu kānidi. anumāniṃcuṭaku kūḍā vīlu lēnidē. aṃducēta adi atīṃdriyamu - anagā, iṃdriya śaktiki miṃcinadi. aṃducēta aciṃtyamu - iṭuvaṃṭidi ani ciṃtiṃcuṭaku vīlukānidi. rūpamu galigi yuṃḍi paiki kanabaḍutū prakāśamugā uṃḍuṭa valana liṃgadēhamu - sūkṣmadēhamu - ciṃtiṃcuṭaku, ūhiṃcuṭaku vīlagunu. kāni ātma aṭṭidikādu. aṃducēta ciṃtiṃcuṭaku vīlu kānidi - aciṃtyamu.)
(manassu yokka vṛtti - anagā, vyāpāramu - ciṃtiṃcuṭa, ālōciṃcuṭa. ā manō vṛttiki aṃdanivāḍu.)
“yatō vācō nivartaṃtē aprāpya manasā saha”
(vākkulu, manassu ātmanu poṃdalēka – nirṇayiṃpa lēka - anagā, iṭṭivāḍani ceppuṭaku vīlukāka, ūhiṃcuṭaku ayinā vīlukāka tirigi vaccinavi.)
(ēdi vākkucē ceppuṭaku vīlukādō, manassulō bhāviṃcuṭaku valanapaḍadō adi aciṃtyamu.)
prakṛtibhyaḥ paraṃ, yaccatada ciṃtyasya lakṣaṇaṃ ||”
(ē bhāvamulu ciṃtiṃcuṭaku valanu paḍadō vāṭini tarkamu cēta - yuktulacēta - sādhiṃpa prayatniṃca kūḍadu. prākṛtamulaina vastuvulakanna utkṛṣṭamainadi aciṃtyamu - ciṃtiṃcuṭaku vīlulēni lakṣaṇamulu kaladi - aṭṭidi paramātma.)
(manassunaku iṃdriyamulaku telusukonuṭaku vīlukāni viṣayamulu telusukonavalenanina vēdamu valana vāṭini telusu konavalenu. vāṭiki vēdamē pramāṇamu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.