← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అచ్యుతః acyutaḥ

Original — తెలుగు
  1. అవికారః (వికారములు, మార్పులు లేనివాడు.)

  2. సర్వదా నిర్వికారః - (ఎప్పుడైనను వికారములు, మార్పులు లేనివాడు.)

  3. క్షతి రహితః ; నాశ రహితః. (క్షీణించనివాడు; నాశము లేనివాడు.)

  4. షడ్భావ వికారశూన్య త్వాత్ అచ్యుతః. (ఆరు విధములైన వికారములు లేకపోవుటవల్ల అచ్యుతుడు.)

  5. నాస్తి చ్యుతం స్ఖలనం స్వపదాత్ యస్య సః.

(తనయొక్క పదము, స్థానమునుండి, అనగా, పరమపదమగు వైకుంఠము నుండి గాని, జగత్తుయొక్క సృష్టి స్థితి లయములు చేయు పదవి నుండి గాని ఎప్పుడూ దిగజారనివాడు.)

  1. ఆశ్రిత సం రక్షణ వ్రతాన్నచ్యుతే త్యచ్యుతః.

(తనను ఆశ్రయించుకొని యున్న భక్తులను సంరక్షించే వ్రతము నుండి దిగజారనివాడు.)

  1. స్వరూప సామర్ధ్యాత్ న చ్యవతే ఇత్యచ్యుతః, స్వపదాశ్రితాన్న చ్యవ తీతివా.

(స్వరూప సామర్ధ్యము నుండి, అనగా, - సచ్చిదానందము, అనంతము, అవ్యయము అగుట వలన వాటి శక్తి గలిగి యుండు, సార్థ్యము నుండి భ్రంశము నొందనివాడు, లేక, తనస్థానము అయిన వైకుంఠము నాశ్రయించి యున్న భక్తులను భ్రంశము నొందింపనివాడు, సంసార సముద్రమున జారిపోకుండ చూచువాడు.)

  1. స్వరూప చ్యుతిః విక్రియా, తద్రహితః; చ్యుతి రహితః,

(స్వరూపమునుండి దిగజారుట; అనగా వికారములు లేకుండుట, అవి లేనివాడు.)

  1. నిర్దోష గుణాత్మక నిగ్రహాత్ అచ్యుతః.

(దోషగుణములు లేనటువంటి రూపము గలవాడు గనుక అచ్యుతుడు.)

  1. చ్యుతి రహితః.(చ్యుతి అనగా జారుట, తగ్గుట, తెగిపోవుట, ఇవి లేనివాడు.)

  2. అన్నియు నశించినను తాను నశించని వాడు.

  3. “శాశ్వతం శివ మచ్యుతం” ఇతి శ్రుతేః- (నారాయణోపనిషత్) (మంత్రపుష్పము.)

  4. స్వస్వభావాదచ్యుతః. (తన స్వభావము నుండి చ్యుతి లేనివాడు, ఎప్పుడూ ఒకే రీతిగ నుండువాడు.)

  5. సర్వప్రకారేణాపి చ్యుత్యభావాత్ అచ్యుతః.

(ఏ ప్రకారముగా చూచినను చ్యుతి లేనివాడు - సృష్టి, స్థితి, లయములు చేయు శక్తి నుండి కాని, తన నిత్యత్వము నుండి కాని, ఆద్వయస్థితి నుండి కాని దిగజారనివాడు, ఎప్పుడూ ఒకే విధముగా - సూక్ష్మాతిసూక్ష్మముగా నుండువాడు.)

  1. “యస్మాన్నచ్యుతే పూర్వోహం అచ్యుతస్తే న కర్మణా |”.

(పూర్వమున్న స్థితినుండి చ్యుతి లేనివాడు. అందుచేత అచ్యుతుడు.)

Transliteration
  1. avikāraḥ (vikāramulu, mārpulu lēnivāḍu.)

  2. sarvadā nirvikāraḥ - (eppuḍainanu vikāramulu, mārpulu lēnivāḍu.)

  3. kṣati rahitaḥ ; nāśa rahitaḥ. (kṣīṇiṃcanivāḍu; nāśamu lēnivāḍu.)

  4. ṣaḍbhāva vikāraśūnya tvāt acyutaḥ. (āru vidhamulaina vikāramulu lēkapōvuṭavalla acyutuḍu.)

  5. nāsti cyutaṃ skhalanaṃ svapadāt yasya saḥ.

(tanayokka padamu, sthānamunuṃḍi, anagā, paramapadamagu vaikuṃṭhamu nuṃḍi gāni, jagattuyokka sṛṣṭi sthiti layamulu cēyu padavi nuṃḍi gāni eppuḍū digajāranivāḍu.)

  1. āśrita saṃ rakṣaṇa vratānnacyutē tyacyutaḥ.

(tananu āśrayiṃcukoni yunna bhaktulanu saṃrakṣiṃcē vratamu nuṃḍi digajāranivāḍu.)

  1. svarūpa sāmardhyāt na cyavatē ityacyutaḥ, svapadāśritānna cyava tītivā.

(svarūpa sāmardhyamu nuṃḍi, anagā, - saccidānaṃdamu, anaṃtamu, avyayamu aguṭa valana vāṭi śakti galigi yuṃḍu, sārthyamu nuṃḍi bhraṃśamu noṃdanivāḍu, lēka, tanasthānamu ayina vaikuṃṭhamu nāśrayiṃci yunna bhaktulanu bhraṃśamu noṃdiṃpanivāḍu, saṃsāra samudramuna jāripōkuṃḍa cūcuvāḍu.)

  1. svarūpa cyutiḥ vikriyā, tadrahitaḥ; cyuti rahitaḥ,

(svarūpamunuṃḍi digajāruṭa; anagā vikāramulu lēkuṃḍuṭa, avi lēnivāḍu.)

  1. nirdōṣa guṇātmaka nigrahāt acyutaḥ.

(dōṣaguṇamulu lēnaṭuvaṃṭi rūpamu galavāḍu ganuka acyutuḍu.)

  1. cyuti rahitaḥ.(cyuti anagā jāruṭa, tagguṭa, tegipōvuṭa, ivi lēnivāḍu.)

  2. anniyu naśiṃcinanu tānu naśiṃcani vāḍu.

  3. “śāśvataṃ śiva macyutaṃ” iti śrutēḥ- (nārāyaṇōpaniṣat) (maṃtrapuṣpamu.)

  4. svasvabhāvādacyutaḥ. (tana svabhāvamu nuṃḍi cyuti lēnivāḍu, eppuḍū okē rītiga nuṃḍuvāḍu.)

  5. sarvaprakārēṇāpi cyutyabhāvāt acyutaḥ.

(ē prakāramugā cūcinanu cyuti lēnivāḍu - sṛṣṭi, sthiti, layamulu cēyu śakti nuṃḍi kāni, tana nityatvamu nuṃḍi kāni, ādvayasthiti nuṃḍi kāni digajāranivāḍu, eppuḍū okē vidhamugā - sūkṣmātisūkṣmamugā nuṃḍuvāḍu.)

  1. “yasmānnacyutē pūrvōhaṃ acyutastē na karmaṇā |”.

(pūrvamunna sthitinuṃḍi cyuti lēnivāḍu. aṃducēta acyutuḍu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.