← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అధర్మము adharmamu

Original — తెలుగు
  1. ధర్మ విపర్యయః వేదప్రతిషిద్ధః

(ధర్మమునకు విరుద్ధమైనది, చేయకూడనిది అని వేదముచే నిషేధించబడినది.)

  1. అవైదికా గమోదితః; వర్ణాశ్రమాది వ్యవస్థా రహితః, తతః ఏవ అకర్తవ్యః.

(వేదముచేతను ఆగమముచేతను చెప్పబడనిది; వర్ణాశ్రమములు మొదలగు వ్యవస్థలు లేనిది, అందువలన చేయకూడనిది, ఆచరింపకూడనిది.)

  1. “విధర్మః పరధర్మశ్చా ప్యాభాస ఉపమాఛలః |

అధర్మ శాఖాః పంచేమే ధర్మజ్ఞో అధర్మవత్ త్యజేత్||” (శ్రీమద్భాగవతం - 7 - 15)

(విధర్మము, పరధర్మము, ధర్మంబువలె కనబడు అధర్మము, పాషాండధర్మము, కపట ధర్మము - ఈ అయిదు అధర్మముయొక్క శాఖలు - రూపములు. వీటిని ధర్మతత్వమును తెలిసినవాడు వదలివేయవలెను.)

పై శ్లోకమునకు శ్రీమదాంధ్ర మహాభగవతములో ఈ క్రింద విధముగ అనువాదము చేయబడినది : -

“వ. నిజ ధర్మబాధకం బయిన ధర్మంబును, బర ధర్మ ప్రేరితం బైన ధర్మంబును, నాభాసధర్మంబును, - ధర్మమువలె కనబడు అధర్మమును - బాషండధర్మంబును, గపట ధర్మంబును, ధర్మజ్ఞుం డైనవాడు మానవలయు”.

(శ్రీమదాంధ్ర మహాభాగవతము - 7 - 15 - 457)

  1. “క. వేద ప్రణిహితమే యను

మోదంబుగ ధర్మమయ్యె మున్ను తదన్యం

బేదియగునది యధర్మం

బాదియు హరిరూపు వేద మన వినుకతనన్.” (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 6 - 1 - 83)

  1. “హింసాది యుక్తత్వాత్ వైదికం కర్మా ధర్మా యేతీ యమస్యా శంకా నకార్యా - కధం ? - క్షాత్రం కర్మ యుద్ధ > లక్షణం గురు భ్రాతృ పుత్రాది హింసా లక్షణం అత్యంత క్రూరమపి స్వధర్మ ఇతి కృత్యా నా ధర్మాయ > తద కరణేన చ -” తతస్స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవా ప్స్యసి ||” (శ్రీ మద్భగవద్గీత - > 2 - 33)

ఇతి బ్రువతా యావజ్జీవాది శ్రుతిచోదితనాం పశ్వాది హింసా లక్షణ నాంచ కర్మాణాం ప్రాగేవ నాధర్మత్వమితి సునిశ్చిత ముక్తం భవతీతి“.

(హింస చేయుట చెప్పబడియుండు వైదిక కర్మ - వేదములో చెప్పబడిన కర్మ - ధర్మము కానేరదు అని శంకించరాదు. గురువులను, అన్నదమ్ములను, పుత్రులను, మొదలగువారిని హింసించు అతి క్రూరమైన క్షత్రియ లక్షణమైన యుద్ధము చేసినను అది అధర్మము కాదు. ఎందుచేతననగా “స్వధర్మమును కీర్తిని విడిచిపెట్టిన పాపము వచ్చును” అను శ్రీమద్భగవద్గీతా వచనమును బట్టి జీవితకాలమంతయు శ్రుతిలో చెప్పబడిన - యజ్ఞములలో చెప్పబడిన - పశుహింస మొదలగు లక్షణములుగల కర్మలు చేయుట అధర్మము కాదు అని నిశ్చయించి చెప్పబడినది. “అగ్నిష్టోమీయం పశుమాలభేత” - యాగమునకు పశువును సంపాదింప వలెను - అని శ్రుతి చెప్పుచున్నది కనుక ఇట్లు చేయుట హింస కానేరదు. ” న హింస్యాత్ సర్వ భూతాని” - ఏ భూతమునైనను, ఏ జీవినైనను - హింసించకూడదు అని శ్రుతిలో చెప్పినది సామాన్య ధర్మము - ఇది శ్రుతిలో నితరత్ర చెప్పబడిన - పైన చెప్పబడిన - పశు హింస కాక ఇతరత్ర చేసిన భూతహింసకు వర్తించును.) (చూడుము : - ‘ధర్మము’.)

  1. యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత |

అభ్యుత్థానమధర్మస్య తదా త్మానం సృజామ్యహం ||. (శ్రీమద్భగవద్గీత - 4 - 7)

(ఎప్పుడెప్పుడు ధర్మమునకు హాని కలుగునో, అధర్మము వృద్ధిపొందునో అప్పుడు నేను ధర్మమును మరల బాగా స్థాపించుటకు, అధర్మము నణచుటకు అవతారమును ఎత్తుదును.)

” - - - అధర్మాం శైః స్వర్గమోక్ష విరోధిభిః |

శ్రుతి స్మృతి నిషిద్ధస్య ధర్మస్యానర్ధకారిణః |

ఉద్భవో ధర్మ శత్రోశ్చ భవతీ హయ దాయదా |

తదా తదాత్మానం నిత్యస్థం స్వమాయయా|

దర్శయామి సృష్టమివ చిద్ఘనం పరమార్ధతః ||” (గీతాభావప్రకాశము - 4 - 52 to 54)

(స్వర్గమునకును మోక్షమునకును కారణమైనటువంటి ఏకర్మలు వేదమునందు చెప్పబడినవో అవి ధర్మములు. వేదములోను శాస్త్రములోను చేయకూడదని నిషేధింపబడిన ధర్మములకు, ధర్మకర్మలకు అనర్ధకరమైన పనులు, ధర్మమునకు శత్రురూపమైనవియు అయిన కర్మలు అధర్మములు. ఈ అధర్మములు ఎప్పుడు ప్రబలి ధర్మములైన పనులకు ఆటంకము - అడ్డు - కలిగించి అవి చేయబడకుండా చేయునో అప్పుడు అధర్మములను అణచివేయుటకు, ధర్మమును తిరిగి ఉద్ధరించుటకు - స్థాపించుటకు భగవంతుడు అవతారమెత్తును. భగవంతుడు నిత్యుడు. ఎక్కడపడితే అక్కడ దేనిలోపడితే దానిలో - ఎప్పుడుపడితే అప్పుడు సూక్ష్మరూపములో ఉన్నప్పటికీ, స్థూల శరీరము దాల్చును, స్థూలరూపములో ఆవిర్భవించును.)

Transliteration
  1. dharma viparyayaḥ vēdapratiṣiddhaḥ

(dharmamunaku viruddhamainadi, cēyakūḍanidi ani vēdamucē niṣēdhiṃcabaḍinadi.)

  1. avaidikā gamōditaḥ; varṇāśramādi vyavasthā rahitaḥ, tataḥ ēva akartavyaḥ.

(vēdamucētanu āgamamucētanu ceppabaḍanidi; varṇāśramamulu modalagu vyavasthalu lēnidi, aṃduvalana cēyakūḍanidi, ācariṃpakūḍanidi.)

  1. “vidharmaḥ paradharmaścā pyābhāsa upamāchalaḥ |

adharma śākhāḥ paṃcēmē dharmajñō adharmavat tyajēt||” (śrīmadbhāgavataṃ - 7 - 15)

(vidharmamu, paradharmamu, dharmaṃbuvale kanabaḍu adharmamu, pāṣāṃḍadharmamu, kapaṭa dharmamu - ī ayidu adharmamuyokka śākhalu - rūpamulu. vīṭini dharmatatvamunu telisinavāḍu vadalivēyavalenu.)

pai ślōkamunaku śrīmadāṃdhra mahābhagavatamulō ī kriṃda vidhamuga anuvādamu cēyabaḍinadi : -

“va. nija dharmabādhakaṃ bayina dharmaṃbunu, bara dharma prēritaṃ baina dharmaṃbunu, nābhāsadharmaṃbunu, - dharmamuvale kanabaḍu adharmamunu - bāṣaṃḍadharmaṃbunu, gapaṭa dharmaṃbunu, dharmajñuṃ ḍainavāḍu mānavalayu”.

(śrīmadāṃdhra mahābhāgavatamu - 7 - 15 - 457)

  1. “ka. vēda praṇihitamē yanu

mōdaṃbuga dharmamayye munnu tadanyaṃ

bēdiyagunadi yadharmaṃ

bādiyu harirūpu vēda mana vinukatanan.” (śrīmadāṃdhra mahābhāgavatamu - 6 - 1 - 83)

  1. “hiṃsādi yuktatvāt vaidikaṃ karmā dharmā yētī yamasyā śaṃkā nakāryā - kadhaṃ ? - kṣātraṃ karma yuddha > lakṣaṇaṃ guru bhrātṛ putrādi hiṃsā lakṣaṇaṃ atyaṃta krūramapi svadharma iti kṛtyā nā dharmāya > tada karaṇēna ca -” tatassvadharmaṃ kīrtiṃca hitvā pāpamavā psyasi ||” (śrī madbhagavadgīta - > 2 - 33)

iti bruvatā yāvajjīvādi śruticōditanāṃ paśvādi hiṃsā lakṣaṇa nāṃca karmāṇāṃ prāgēva nādharmatvamiti suniścita muktaṃ bhavatīti”.

(hiṃsa cēyuṭa ceppabaḍiyuṃḍu vaidika karma - vēdamulō ceppabaḍina karma - dharmamu kānēradu ani śaṃkiṃcarādu. guruvulanu, annadammulanu, putrulanu, modalaguvārini hiṃsiṃcu ati krūramaina kṣatriya lakṣaṇamaina yuddhamu cēsinanu adi adharmamu kādu. eṃducētananagā “svadharmamunu kīrtini viḍicipeṭṭina pāpamu vaccunu” anu śrīmadbhagavadgītā vacanamunu baṭṭi jīvitakālamaṃtayu śrutilō ceppabaḍina - yajñamulalō ceppabaḍina - paśuhiṃsa modalagu lakṣaṇamulugala karmalu cēyuṭa adharmamu kādu ani niścayiṃci ceppabaḍinadi. “agniṣṭōmīyaṃ paśumālabhēta” - yāgamunaku paśuvunu saṃpādiṃpa valenu - ani śruti ceppucunnadi kanuka iṭlu cēyuṭa hiṃsa kānēradu. ” na hiṃsyāt sarva bhūtāni” - ē bhūtamunainanu, ē jīvinainanu - hiṃsiṃcakūḍadu ani śrutilō ceppinadi sāmānya dharmamu - idi śrutilō nitaratra ceppabaḍina - paina ceppabaḍina - paśu hiṃsa kāka itaratra cēsina bhūtahiṃsaku vartiṃcunu.) (cūḍumu : - ‘dharmamu’.)

  1. yadā yadāhi dharmasya glānirbhavati bhārata |

abhyutthānamadharmasya tadā tmānaṃ sṛjāmyahaṃ ||. (śrīmadbhagavadgīta - 4 - 7)

(eppuḍeppuḍu dharmamunaku hāni kalugunō, adharmamu vṛddhipoṃdunō appuḍu nēnu dharmamunu marala bāgā sthāpiṃcuṭaku, adharmamu naṇacuṭaku avatāramunu ettudunu.)

” - - - adharmāṃ śaiḥ svargamōkṣa virōdhibhiḥ |

śruti smṛti niṣiddhasya dharmasyānardhakāriṇaḥ |

udbhavō dharma śatrōśca bhavatī haya dāyadā |

tadā tadātmānaṃ nityasthaṃ svamāyayā|

darśayāmi sṛṣṭamiva cidghanaṃ paramārdhataḥ ||” (gītābhāvaprakāśamu - 4 - 52 to 54)

(svargamunakunu mōkṣamunakunu kāraṇamainaṭuvaṃṭi ēkarmalu vēdamunaṃdu ceppabaḍinavō avi dharmamulu. vēdamulōnu śāstramulōnu cēyakūḍadani niṣēdhiṃpabaḍina dharmamulaku, dharmakarmalaku anardhakaramaina panulu, dharmamunaku śatrurūpamainaviyu ayina karmalu adharmamulu. ī adharmamulu eppuḍu prabali dharmamulaina panulaku āṭaṃkamu - aḍḍu - kaligiṃci avi cēyabaḍakuṃḍā cēyunō appuḍu adharmamulanu aṇacivēyuṭaku, dharmamunu tirigi uddhariṃcuṭaku - sthāpiṃcuṭaku bhagavaṃtuḍu avatāramettunu. bhagavaṃtuḍu nityuḍu. ekkaḍapaḍitē akkaḍa dēnilōpaḍitē dānilō - eppuḍupaḍitē appuḍu sūkṣmarūpamulō unnappaṭikī, sthūla śarīramu dālcunu, sthūlarūpamulō āvirbhaviṃcunu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.