← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అధశ్శాఖః adhaśśākhaḥ

Original — తెలుగు
  1. ” మహ దహంకార తన్మాత్రాదయః శాఖాః ఇవ అస్య సంసార వృక్షస్య - అశ్వత్థస్య - అధః భవంతీతి సో > అయం అధశ్శాఖః సంసార వృక్షః“. (శ్రీ శంకరః)

(వేదాంతులు సంసారమును అశ్వత్థ వృక్షముతో పోల్చిరి. వృక్షములకు సాధారణముగా వేళ్ళు క్రిందను శాఖలు మీదను ఉండును. కాని అశ్వత్థమను ఈ సంసార వృక్షమునకు వేర్లు, మొదలు మీదని (భగవంతునిలోను) శాఖలు క్రిందను - ప్రపంచములోను, ఉన్నవని పోలికకు చెప్పుచున్నారు - మహత్తత్వము, అహంకారము, తన్మాత్రలు మొదలగునవి శాఖలు క్రిందగా వ్యాపించువాటినిగా చెప్పిరి. సృష్టిలోని వస్తువులు అన్నియు భగవంతుని నుండిపుట్టినవి కనుక ఈ చెట్టు వేళ్ళు (వేరులు) మీదని - ఆకాశములో - భగవంతు నిలో ఉన్నవనిన్నీ, క్రిందను శాఖలు ఉన్నవని, అవి పెరుగునట్లు సంసారము పెరుగు ననుట - విపరీతముగా చెప్పబడినది. అట్లు క్రిందను శాఖలు గలదికనుక అధః శాఖః అని ఈ సంసార వృక్షము - అశ్వత్థము - చెప్పబడినది.

  1. “పృధివీ నివాసి సకల నర,పశు.మృగ, క్రిమి, కీట, పతంగ స్థావరాంతతయా అధశ్శాఖత్వం” > (శ్రీరామానుజః)

(భూమిమీద నివసించియున్న మానవులు, పశువులు, మృగములు, క్రిమిలు, కీటకములు, పక్షులు, చెట్లు ఇంకా ఆఖరివరకు ఉన్నవన్నీ, ఆఖరున ఉండుటవల్ల అన్నింటికంటె కింది కొమ్మలుగా గణింపబడుచున్నవి.

  1. “అధో నికృష్టా శాఖాః భూతాని” (శ్రీ ఆనందతీర్థః)

(ఈ అశ్వత్థ వృక్షమునకు అడుగుకొమ్మలు, చివరికొమ్మలు భూతములు.)

  1. సంసారమనునది భగవంతునిలోనుండి పుట్టి, మహత్తత్త్వవముతో ప్రారంభమై కింది కిందికి కొమ్మలు > పెంచుకొని ప్రపంచము రూపముగా వ్యాపించినది. కొమ్మలు కొట్టివేసినను చెట్టి చనిపోదు. అందుచేత ఈ > సంసారమను వృక్షమును వేళ్ళతోనే పీకివేయవలెను - అనగా సంసారము లేకుండ చేసుకొనవలెను - > (చూడుము -“అశ్వత్థము”)
Transliteration
  1. ” maha dahaṃkāra tanmātrādayaḥ śākhāḥ iva asya saṃsāra vṛkṣasya - aśvatthasya - adhaḥ bhavaṃtīti sō > ayaṃ adhaśśākhaḥ saṃsāra vṛkṣaḥ”. (śrī śaṃkaraḥ)

(vēdāṃtulu saṃsāramunu aśvattha vṛkṣamutō pōlciri. vṛkṣamulaku sādhāraṇamugā vēḷḷu kriṃdanu śākhalu mīdanu uṃḍunu. kāni aśvatthamanu ī saṃsāra vṛkṣamunaku vērlu, modalu mīdani (bhagavaṃtunilōnu) śākhalu kriṃdanu - prapaṃcamulōnu, unnavani pōlikaku ceppucunnāru - mahattatvamu, ahaṃkāramu, tanmātralu modalagunavi śākhalu kriṃdagā vyāpiṃcuvāṭinigā ceppiri. sṛṣṭilōni vastuvulu anniyu bhagavaṃtuni nuṃḍipuṭṭinavi kanuka ī ceṭṭu vēḷḷu (vērulu) mīdani - ākāśamulō - bhagavaṃtu nilō unnavaninnī, kriṃdanu śākhalu unnavani, avi perugunaṭlu saṃsāramu perugu nanuṭa - viparītamugā ceppabaḍinadi. aṭlu kriṃdanu śākhalu galadikanuka adhaḥ śākhaḥ ani ī saṃsāra vṛkṣamu - aśvatthamu - ceppabaḍinadi.

  1. “pṛdhivī nivāsi sakala nara,paśu.mṛga, krimi, kīṭa, pataṃga sthāvarāṃtatayā adhaśśākhatvaṃ” > (śrīrāmānujaḥ)

(bhūmimīda nivasiṃciyunna mānavulu, paśuvulu, mṛgamulu, krimilu, kīṭakamulu, pakṣulu, ceṭlu iṃkā ākharivaraku unnavannī, ākharuna uṃḍuṭavalla anniṃṭikaṃṭe kiṃdi kommalugā gaṇiṃpabaḍucunnavi.

  1. “adhō nikṛṣṭā śākhāḥ bhūtāni” (śrī ānaṃdatīrthaḥ)

(ī aśvattha vṛkṣamunaku aḍugukommalu, civarikommalu bhūtamulu.)

  1. saṃsāramanunadi bhagavaṃtunilōnuṃḍi puṭṭi, mahattattvavamutō prāraṃbhamai kiṃdi kiṃdiki kommalu > peṃcukoni prapaṃcamu rūpamugā vyāpiṃcinadi. kommalu koṭṭivēsinanu ceṭṭi canipōdu. aṃducēta ī > saṃsāramanu vṛkṣamunu vēḷḷatōnē pīkivēyavalenu - anagā saṃsāramu lēkuṃḍa cēsukonavalenu - > (cūḍumu -“aśvatthamu”)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.