(దేవతలందరిమీద అధికరించియుండు వాడు.)
(అధిదైవతమనగా హిరణ్యగర్భుడు, లేక, దేవుడైన సంకర్షణుడు.)
(అధిదైవతమని నిర్దేశింపబడిన పురుషుడు - దేవతలందఱికి పైన ఉండువాడు - అనగా, ఇంద్రుడు, ప్రజాపతి మొదలగు దైవతములందఱికన్న పైన ఉండు, ఇంద్రుడు, ప్రజాపతి మొదలగు దేవతలకు భోగ్యవస్తువులకన్న విలక్షణమైన వాటిని భుజించు పురుషుడు.)
(పురమందు, - అనగా, శరీరమునందు శయనించుటచేత పురుషుడు అని చెప్పబడుచున్నాడు, అనగా, - జీవుడు, అతని సం రక్షకుడుకాని, బ్రహ్మగాని, అతను సమస్త దేవతలను అధికరించి వాటికి పతి - అనగా, ప్రభువు - అయినవాడు. అందుచేత అధిదైవతము - దేవతలమీద అధికారిగానుండువాడు, లేక దేవతలను అధికరించి యుండు వాడు.)
(సూర్యమండలమందు ఉన్నటువంటి వైరాజపురుషుడు - విరాట్పురుషుడు - తన అంశవలననే కలిగిన సమస్త దేవతలకు అధిపతి అయినవాడు అధిదైవతమని చెప్పబడుచున్నాడు. “అతనేమొట్టమొదట శరీరమును పొందినవాడు - శరీరముగలవాటిలో మొదటివాడు పురుషుడు అని చెప్పబడుచున్నాడు - భూతములకు మొదటి కర్త, చతుర్ముఖబ్రహ్మ, సృష్టికి పూర్వమున్నవాడు.)
(శ్రీమదాంధ్ర మహాభాగవతము - 2 - 10 - 268)
(దేవతాస్థానమైన ఆదిత్యుని అధికరించియుండువాడు. “ఆదిత్యుని లోపలకనబడు హిరణ్యమయమైన పురుషుడు” అని శ్రుతి. (హిరణ్యమయమనగా - ఇక్కడ సృష్టిని చేయగలుగు చిచ్ఛక్తి.)
(ఆదిత్యుని లోపల ఉన్నప్పటికీ ఆదిత్యునికి తెలియనివాడు, ఆదిత్యుడు(తనకు) శరీరమైనవాడు, ఆదిత్యునిలోపల ఉండి ఆదిత్యుని అతని పనిలో నియమించువాడు. అట్టివాడు, అతనే ఆత్మ, అంతర్యామి, అమృతుడు, అధిదైవతము.)
(వైకారికమని చెప్పబడు సాత్వికాహంకారంబువలన పుట్టిన దిక్కులు, వాయువు, అర్కుడు, ప్రచేతనుడు, అశ్వినీదేవతలు, వహ్ని, ఇంద్రుడు, ఉపేంద్రుడు, మిత్రుడు అను దేవతలకు కారణమగుటవలన అధిదైవతము.)
(శ్రీమదాంధ్ర మహాభాగవతము - 2 - 5 - 86)
(ఇవన్నియు భగవంతునిలోనుండి మహత్తత్వముద్వారా పుట్టినవి. ఈ దేవతలకు - దేవతలు పుట్టుటకు - మూలకారణమగుటవలన భగవంతుడు అధిదైవతము.)
వ. ” --- సకల జీవచతుర్విధాంతఃకరణంబు లైన యే చిత్తాహంకారబుద్ధి మనంబులకు గ్రమంబున వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్నానిరుద్ధు లధిదైవతంబు లగుదురు ---” (శ్రీ మదాంధ్ర మహాభాగవతము - 3 -1 - 57)
“అధిభూతం క్షరో భావః పురుషశ్చాధి దైవతం”- (శ్రీమద్భగవద్గీత - 8 - 4)
పై శ్లోకమునకు వ్యాఖ్యానము : -
“పూర్ణం సర్వమనే నేతి శయనాత్ పూర్షు దేతివా |
సూర్యమండల మద్ధ్యస్థః పురుషశ్చాధి దైవతం |
సర్వ ప్రాణీంద్రియాణాం యః స్యాదనుగ్రాహకః ప్రమాన్ |
హిరణ్యగర్భ ఏవాసౌ ఆదిత్యాంతర్గితః స్మృతః |
సవై శరీరీ ప్రధమః సవై పురుష ఉచ్యతే |
ఆదికర్తా సభూతానాం బ్రహ్మాగ్రే సమవర్తత||” (గీతాభావప్రకాశము - 8 - 22 to 24)
(పురుషుడు అనుమాటకు అర్ధము రెండు విధములుగా ఉన్నది - “పూర్ణమనేన సర్వం” ఈ ప్రపంచమంతయు అతనితో నిండియున్నది. ఈ సృష్టి అంతటిలోను - సృష్టిలోని ప్రతివస్తువులోను భగవంతుడు ప్రవేశించియుండి వాటి అంతటిలోను, లోపల, బైట పూర్తిగా వ్యాపించియున్నాడు. ఉప్పు గలు లోని రసమంతా ఉప్పు రసమే అయినట్లు సృష్టిలోని ప్రతి వస్తువులోను అతనే పూర్తిగా నిండియున్నాడు. అతను పూర్తిగా నిండియుండని వస్తువే లేదు - “ఆ హరిమయము గానివస్తువు పరమాణువు లేదు” (శ్రీమదాంధ్ర మహాభాగవతము ---) ఇట్లు పూర్తిగా నిండి యుండుట వలన పూర్ణుడు అని చెప్పబడుచున్నాడు. “పురి శయనాత్ పురుషః” పురమందు శయనించి యుండువాడు, పురము అ నగా తాను సృష్టించిన ప్రతిశరీరము, ప్రతివస్తువు - వాటిలో భగవంతుడు శయనించి యుండుటవలన - అతనికి పురమే. “తత్ సృష్టా తదేవాను ప్రావిశత్” - దానిని - ప్రపంచమును - సృష్టించి, దానిలోనే ప్రవేశించెను - సృష్టించిన ప్రతివస్తువులోను ప్రవేశించియున్నాడు. శయనించియుండుట అనగా - చైతన్యమున్నట్లు పైకి కనబడకుండా ఉండుట - ఱాయి మొదలగువాటివంటివి. ఆ ప్రకారముగా ఉన్న పురుషుడే అధిదైవతము - సూర్యమండలమధ్యమందున్నవాడు, అనగా, సూర్యమండలమధ్యమందుండి దానికి ఆ తేజస్సును కలుగచేయువాడు - “యదాదిత్య గతం తేజః - - - తత్తేజోవిద్ధి మామకం” - (శ్రీమద్భగవద్గీత - 15 - 12) అట్టి పురుషుడే అధి దైవతము. అతనే హిరణ్యగర్భుడు అని చెప్పబడుచున్నాడు. సమస్తమైన ప్రాణుల ఇంద్రియములను తన తేజస్సుచే ప్రేరేపించువాడు. అతనే మొదటి శరీరి - శరీరము గలవాడు - సృష్టి క్రమములో భగవంతుడు తన చిచ్ఛక్తితో జడమైన ప్రకృతిలో ప్రవేశించెను. అందువలన ప్రకృతి చైతన్యవంతమై తనలోనుండి మహత్తత్వము మొదలగువాటినిపుట్టించెను - అందుచేత పురుషునికి ప్రకృతి పురము - అందుచేత భగవంతుడు మొదటి పురుషుడు. ప్రకృతి వికారములైన మిగిలిన వస్తువులన్నింటిలోకూడ భగవంతుని చిచ్ఛక్తి ఉన్నందున అవి అన్నియు అతనికి పురములే. అతనికి మొదటి పురము ప్రకృతి - అందులో ప్రవేశించెను కనుక మొదటిపురుషుడు, ఆదిపురుషుడు, పురాణపురుషుడు - అతడే భూతములకు ఆది కర్త, సృష్టి ప్రారంభములో బ్రహ్మగానుండెను - “సూర్యమండల మధ్యవర్తీ నారాయణః”
(ఇచ్చట సూర్యుడు, ఆదిత్యుడు అని చెప్పుటవలన ఒక్క సూర్యుడే యని యర్ధముకాదు - సూర్యునివలె ప్రకాశవంతములైన సకలవస్తువులు అని అర్థము - - “యేన సూర్యస్తపతి తేజసా ఇద్ధః”.) (మహానారాయణోపనిషత్ - 1 - 3)
(దేనివలన సూర్యుడు తన తేజస్సుతో వేడిని కలుగ చేయుచు, సర్వ భూతములకు చైతన్యశక్తిని - (Energy ని) కలిగించుచున్నాడో) –
“సీ. పూర్ణుడయ్యును మహాభూత పంచక యోగమున మేనులను బురములు స్రుజించి
పురములలోనుండి పురుష భావంబున దీపించు నెప్పుడు ధీరవృత్తి
బంచభూతములను బదినొకం డింద్రియముల బ్రకాశింపించి భూరిమహిమ
షోడశాత్మకు డన శోభిల్లి జీవత్వనృత్త వినోదంబు నెఱపుచుండు” (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 2 - 4 - 68)
ప్రయాణకాలే పి చ మాం తే విదుర్యుక్త చేతనః ||” (శ్రీమద్భగవద్గీత - 7 - 30)
(అధిభూతము, అధిదైవతము, అధియజ్ఞము నేనే - భగవంతుడే - అని మరణకాలమందు ఎవరు తెలుసుకొనెదరో వారు - యోగచిత్తముకలవారు నన్ను తెలుసుకొనెదరు - తత్వ జ్ఞానము గలవారగుదురు - నాసాక్షాత్కారమును పొందుదురు-.)
ప్రావళి కాత్మనాయకుడ వై పెనుపొందిన నీకు నీ ధరా
దేవత లెల్ల నెన్న నధిదేవత లై రట యెట్టి చోద్యమో
దేవ ! సమస్త పావన ! సుధీజనతావన !విశ్వభావనా !” (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 3 - 16 - 566)
(dēvatalaṃdarimīda adhikariṃciyuṃḍu vāḍu.)
(adhidaivatamanagā hiraṇyagarbhuḍu, lēka, dēvuḍaina saṃkarṣaṇuḍu.)
(adhidaivatamani nirdēśiṃpabaḍina puruṣuḍu - dēvatalaṃdaṟiki paina uṃḍuvāḍu - anagā, iṃdruḍu, prajāpati modalagu daivatamulaṃdaṟikanna paina uṃḍu, iṃdruḍu, prajāpati modalagu dēvatalaku bhōgyavastuvulakanna vilakṣaṇamaina vāṭini bhujiṃcu puruṣuḍu.)
(puramaṃdu, - anagā, śarīramunaṃdu śayaniṃcuṭacēta puruṣuḍu ani ceppabaḍucunnāḍu, anagā, - jīvuḍu, atani saṃ rakṣakuḍukāni, brahmagāni, atanu samasta dēvatalanu adhikariṃci vāṭiki pati - anagā, prabhuvu - ayinavāḍu. aṃducēta adhidaivatamu - dēvatalamīda adhikārigānuṃḍuvāḍu, lēka dēvatalanu adhikariṃci yuṃḍu vāḍu.)
(sūryamaṃḍalamaṃdu unnaṭuvaṃṭi vairājapuruṣuḍu - virāṭpuruṣuḍu - tana aṃśavalananē kaligina samasta dēvatalaku adhipati ayinavāḍu adhidaivatamani ceppabaḍucunnāḍu. “atanēmoṭṭamodaṭa śarīramunu poṃdinavāḍu - śarīramugalavāṭilō modaṭivāḍu puruṣuḍu ani ceppabaḍucunnāḍu - bhūtamulaku modaṭi karta, caturmukhabrahma, sṛṣṭiki pūrvamunnavāḍu.)
(śrīmadāṃdhra mahābhāgavatamu - 2 - 10 - 268)
(dēvatāsthānamaina ādityuni adhikariṃciyuṃḍuvāḍu. “ādityuni lōpalakanabaḍu hiraṇyamayamaina puruṣuḍu” ani śruti. (hiraṇyamayamanagā - ikkaḍa sṛṣṭini cēyagalugu cicchakti.)
(ādityuni lōpala unnappaṭikī ādityuniki teliyanivāḍu, ādityuḍu(tanaku) śarīramainavāḍu, ādityunilōpala uṃḍi ādityuni atani panilō niyamiṃcuvāḍu. aṭṭivāḍu, atanē ātma, aṃtaryāmi, amṛtuḍu, adhidaivatamu.)
(vaikārikamani ceppabaḍu sātvikāhaṃkāraṃbuvalana puṭṭina dikkulu, vāyuvu, arkuḍu, pracētanuḍu, aśvinīdēvatalu, vahni, iṃdruḍu, upēṃdruḍu, mitruḍu anu dēvatalaku kāraṇamaguṭavalana adhidaivatamu.)
(śrīmadāṃdhra mahābhāgavatamu - 2 - 5 - 86)
(ivanniyu bhagavaṃtunilōnuṃḍi mahattatvamudvārā puṭṭinavi. ī dēvatalaku - dēvatalu puṭṭuṭaku - mūlakāraṇamaguṭavalana bhagavaṃtuḍu adhidaivatamu.)
va. ” --- sakala jīvacaturvidhāṃtaḥkaraṇaṃbu laina yē cittāhaṃkārabuddhi manaṃbulaku gramaṃbuna vāsudēva saṃkarṣaṇa pradyumnāniruddhu ladhidaivataṃbu laguduru ---” (śrī madāṃdhra mahābhāgavatamu - 3 -1 - 57)
“adhibhūtaṃ kṣarō bhāvaḥ puruṣaścādhi daivataṃ”- (śrīmadbhagavadgīta - 8 - 4)
pai ślōkamunaku vyākhyānamu : -
“pūrṇaṃ sarvamanē nēti śayanāt pūrṣu dētivā |
sūryamaṃḍala maddhyasthaḥ puruṣaścādhi daivataṃ |
sarva prāṇīṃdriyāṇāṃ yaḥ syādanugrāhakaḥ pramān |
hiraṇyagarbha ēvāsau ādityāṃtargitaḥ smṛtaḥ |
savai śarīrī pradhamaḥ savai puruṣa ucyatē |
ādikartā sabhūtānāṃ brahmāgrē samavartata||” (gītābhāvaprakāśamu - 8 - 22 to 24)
(puruṣuḍu anumāṭaku ardhamu reṃḍu vidhamulugā unnadi - “pūrṇamanēna sarvaṃ” ī prapaṃcamaṃtayu atanitō niṃḍiyunnadi. ī sṛṣṭi aṃtaṭilōnu - sṛṣṭilōni prativastuvulōnu bhagavaṃtuḍu pravēśiṃciyuṃḍi vāṭi aṃtaṭilōnu, lōpala, baiṭa pūrtigā vyāpiṃciyunnāḍu. uppu galu lōni rasamaṃtā uppu rasamē ayinaṭlu sṛṣṭilōni prati vastuvulōnu atanē pūrtigā niṃḍiyunnāḍu. atanu pūrtigā niṃḍiyuṃḍani vastuvē lēdu - “ā harimayamu gānivastuvu paramāṇuvu lēdu” (śrīmadāṃdhra mahābhāgavatamu ---) iṭlu pūrtigā niṃḍi yuṃḍuṭa valana pūrṇuḍu ani ceppabaḍucunnāḍu. “puri śayanāt puruṣaḥ” puramaṃdu śayaniṃci yuṃḍuvāḍu, puramu a nagā tānu sṛṣṭiṃcina pratiśarīramu, prativastuvu - vāṭilō bhagavaṃtuḍu śayaniṃci yuṃḍuṭavalana - ataniki puramē. “tat sṛṣṭā tadēvānu prāviśat” - dānini - prapaṃcamunu - sṛṣṭiṃci, dānilōnē pravēśiṃcenu - sṛṣṭiṃcina prativastuvulōnu pravēśiṃciyunnāḍu. śayaniṃciyuṃḍuṭa anagā - caitanyamunnaṭlu paiki kanabaḍakuṃḍā uṃḍuṭa - ṟāyi modalaguvāṭivaṃṭivi. ā prakāramugā unna puruṣuḍē adhidaivatamu - sūryamaṃḍalamadhyamaṃdunnavāḍu, anagā, sūryamaṃḍalamadhyamaṃduṃḍi dāniki ā tējassunu kalugacēyuvāḍu - “yadāditya gataṃ tējaḥ - - - tattējōviddhi māmakaṃ” - (śrīmadbhagavadgīta - 15 - 12) aṭṭi puruṣuḍē adhi daivatamu. atanē hiraṇyagarbhuḍu ani ceppabaḍucunnāḍu. samastamaina prāṇula iṃdriyamulanu tana tējassucē prērēpiṃcuvāḍu. atanē modaṭi śarīri - śarīramu galavāḍu - sṛṣṭi kramamulō bhagavaṃtuḍu tana cicchaktitō jaḍamaina prakṛtilō pravēśiṃcenu. aṃduvalana prakṛti caitanyavaṃtamai tanalōnuṃḍi mahattatvamu modalaguvāṭinipuṭṭiṃcenu - aṃducēta puruṣuniki prakṛti puramu - aṃducēta bhagavaṃtuḍu modaṭi puruṣuḍu. prakṛti vikāramulaina migilina vastuvulanniṃṭilōkūḍa bhagavaṃtuni cicchakti unnaṃduna avi anniyu ataniki puramulē. ataniki modaṭi puramu prakṛti - aṃdulō pravēśiṃcenu kanuka modaṭipuruṣuḍu, ādipuruṣuḍu, purāṇapuruṣuḍu - ataḍē bhūtamulaku ādi karta, sṛṣṭi prāraṃbhamulō brahmagānuṃḍenu - “sūryamaṃḍala madhyavartī nārāyaṇaḥ”
(iccaṭa sūryuḍu, ādityuḍu ani ceppuṭavalana okka sūryuḍē yani yardhamukādu - sūryunivale prakāśavaṃtamulaina sakalavastuvulu ani arthamu - - “yēna sūryastapati tējasā iddhaḥ”.) (mahānārāyaṇōpaniṣat - 1 - 3)
(dēnivalana sūryuḍu tana tējassutō vēḍini kaluga cēyucu, sarva bhūtamulaku caitanyaśaktini - (Energy ni) kaligiṃcucunnāḍō) –
“sī. pūrṇuḍayyunu mahābhūta paṃcaka yōgamuna mēnulanu buramulu srujiṃci
puramulalōnuṃḍi puruṣa bhāvaṃbuna dīpiṃcu neppuḍu dhīravṛtti
baṃcabhūtamulanu badinokaṃ ḍiṃdriyamula brakāśiṃpiṃci bhūrimahima
ṣōḍaśātmaku ḍana śōbhilli jīvatvanṛtta vinōdaṃbu neṟapucuṃḍu” (śrīmadāṃdhra mahābhāgavatamu - 2 - 4 - 68)
prayāṇakālē pi ca māṃ tē viduryukta cētanaḥ ||” (śrīmadbhagavadgīta - 7 - 30)
(adhibhūtamu, adhidaivatamu, adhiyajñamu nēnē - bhagavaṃtuḍē - ani maraṇakālamaṃdu evaru telusukonedarō vāru - yōgacittamukalavāru nannu telusukonedaru - tatva jñānamu galavāraguduru - nāsākṣātkāramunu poṃduduru-.)
prāvaḷi kātmanāyakuḍa vai penupoṃdina nīku nī dharā
dēvata lella nenna nadhidēvata lai raṭa yeṭṭi cōdyamō
dēva ! samasta pāvana ! sudhījanatāvana !viśvabhāvanā !” (śrīmadāṃdhra mahābhāgavatamu - 3 - 16 - 566)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.