(అధిష్టించియుండు దేవత, లేక దేవుడు, అధిష్టాన దేవత. ఆశ్రయించుకొనియుండు దేవత, కనిపెట్టి చూచుచుండు దేవత.)
(దేవతలచే అధిష్టంపబడి ప్రేరేపింపబడుచున్నది అధిష్టానము.- వాక్కుమొదలగు ఇంద్రియములు వాటి వాటి దేవతులచేత నధిష్టింపబడియే వాటి వాటి పనులు చేయుచున్నవి.)
(వహ్ని మొదలగు అభిమాన దేవతలచేత అధిష్టించబడి యుండుటవలనే వాక్కు మొదలగు ఇంద్రియములు వాటి వాటి కార్యములందు ప్రవర్తించుచున్నవి, వాటి వాటి పనులు చేయుచున్నవి.)
ఏలెడు దేవత, రక్షించు దేవత, మంత్రముచే ఏ దేవతను గుఱించి జపింప వలయునో ఆ దేవత.
ఈ సృష్టిలో కొన్ని కొన్ని తత్వములకు అధిదేవతలు నియమింపబడిరి -
(పృధివికి బ్రహ్మ, జలమునకు విష్ణువు, అగ్నికి రుద్రుడు, వాయువునకు ఈశ్వరుడు, ఆకాశమునకు సదాశివుడు అధి దేవతలు.)
(శ్రోత్రేంద్రియమునకు దిక్కు, త్వక్కుకు - చర్మమునకు - వాయువు, కండ్లకు సూర్యుడు, రసనేంద్రియమునకు వరుణుడు, ఘ్రాణమునకు అశ్వినీ దేవతలు, వాగింద్రియమునకు వహ్ని, చేతులకు ఇంద్రుడు, కాళ్ళకు ఉపేంద్రుడు, పాయువునకు మిత్రుడు, ఉపస్థునకు ప్రజాపతి, మనస్సునకు చంద్రుడు అధి దేవతలు.)
వ. “--- వైకారికంబైన సాత్వికాహంకారంబు వలన జంద్ర దైవతంబైన మనంబు గలిగె, మఱియు దిక్కులు, వాయువు, అర్కుండు, ప్రచేతస్సు, అశ్వినులు, వహ్ని, ఇంద్రుండు, ఉపేంద్రుండు, మిత్రుండు ప్రజాపతియు ననియెడి దశ దేవతలు గలిగిరి. తైజసంబయిన రాజసాహంకారంబు వలన దిగ్ధైవతంబైన శ్రవణేంద్రియంబు, వాయుదైవతంబైన త్వగింద్రియంబు, సూర్యదేవతం బైన నయనేంద్రియంబు, ప్రచేతోదైవతంబైన రసనేంద్రియంబు, అశ్వనీదేవతం బైన ఘ్రాణేంద్రియంబు, వహ్నిదైవతంబైన వాగింద్రియంబు, ఇంద్రదైవతం బైన హస్తేంద్రియంబు, ఉపేంద్రదైవతంబైన పాదేంద్రియంబు, మిత్రదైవతం బైన గుదేంద్రియము, ప్రజాపతిదైవతంబైన గుహ్యేంద్రియంబు ననియెడి దశేంద్రియంబులును - - -”
(శ్రీమదాంధ్ర మహాభాగవతము - 2 - 5 - 86, - 3 - 6, - 214, 215)
(adhiṣṭiṃciyuṃḍu dēvata, lēka dēvuḍu, adhiṣṭāna dēvata. āśrayiṃcukoniyuṃḍu dēvata, kanipeṭṭi cūcucuṃḍu dēvata.)
(dēvatalacē adhiṣṭaṃpabaḍi prērēpiṃpabaḍucunnadi adhiṣṭānamu.- vākkumodalagu iṃdriyamulu vāṭi vāṭi dēvatulacēta nadhiṣṭiṃpabaḍiyē vāṭi vāṭi panulu cēyucunnavi.)
(vahni modalagu abhimāna dēvatalacēta adhiṣṭiṃcabaḍi yuṃḍuṭavalanē vākku modalagu iṃdriyamulu vāṭi vāṭi kāryamulaṃdu pravartiṃcucunnavi, vāṭi vāṭi panulu cēyucunnavi.)
ēleḍu dēvata, rakṣiṃcu dēvata, maṃtramucē ē dēvatanu guṟiṃci japiṃpa valayunō ā dēvata.
ī sṛṣṭilō konni konni tatvamulaku adhidēvatalu niyamiṃpabaḍiri -
(pṛdhiviki brahma, jalamunaku viṣṇuvu, agniki rudruḍu, vāyuvunaku īśvaruḍu, ākāśamunaku sadāśivuḍu adhi dēvatalu.)
(śrōtrēṃdriyamunaku dikku, tvakkuku - carmamunaku - vāyuvu, kaṃḍlaku sūryuḍu, rasanēṃdriyamunaku varuṇuḍu, ghrāṇamunaku aśvinī dēvatalu, vāgiṃdriyamunaku vahni, cētulaku iṃdruḍu, kāḷḷaku upēṃdruḍu, pāyuvunaku mitruḍu, upasthunaku prajāpati, manassunaku caṃdruḍu adhi dēvatalu.)
va. “--- vaikārikaṃbaina sātvikāhaṃkāraṃbu valana jaṃdra daivataṃbaina manaṃbu galige, maṟiyu dikkulu, vāyuvu, arkuṃḍu, pracētassu, aśvinulu, vahni, iṃdruṃḍu, upēṃdruṃḍu, mitruṃḍu prajāpatiyu naniyeḍi daśa dēvatalu galigiri. taijasaṃbayina rājasāhaṃkāraṃbu valana digdhaivataṃbaina śravaṇēṃdriyaṃbu, vāyudaivataṃbaina tvagiṃdriyaṃbu, sūryadēvataṃ baina nayanēṃdriyaṃbu, pracētōdaivataṃbaina rasanēṃdriyaṃbu, aśvanīdēvataṃ baina ghrāṇēṃdriyaṃbu, vahnidaivataṃbaina vāgiṃdriyaṃbu, iṃdradaivataṃ baina hastēṃdriyaṃbu, upēṃdradaivataṃbaina pādēṃdriyaṃbu, mitradaivataṃ baina gudēṃdriyamu, prajāpatidaivataṃbaina guhyēṃdriyaṃbu naniyeḍi daśēṃdriyaṃbulunu - - -”
(śrīmadāṃdhra mahābhāgavatamu - 2 - 5 - 86, - 3 - 6, - 214, 215)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.