(వివేకాది చతుష్టయమనగా –
నిత్యా నిత్య వస్తువివేకము,
ఇహాముత్ర ఫల భోగవిరాగము
శమదమాదులు - అనగా, శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధా, సమాధానములు.
ముముక్షుత్వము - మోక్షమునందు ఇచ్ఛకలిగి యుండుట.
ఈ నాలుగు కలిగినవాడే అధికారి; బ్రహ్మజ్ఞానమును పొందుటకు అర్హుడైనవాడు, తగినవాడు. అట్టివానికే గురువులు బ్రహ్మజ్ఞానము నుపదేశించెదరు.)
“శాంతో దాంత ఉపరతి స్తితి క్షుస్సమాహితః శ్రద్ధా విత్తో భూత్వా ఆత్మన్యే వాత్మానం పశ్యేత్” ఇతి.
(శాంతుడు, ధాతుడు, ఉపరితుడు, తితిక్షువు, సమాహితమైన మనస్సు కలవాడు, శ్రద్ధ కలవాడు, ఆత్మయందే పరమాత్మను - తనలోనే ఉన్న పరమాత్మను చూచును.)
(ఎవనికి నిష్కామకర్మోపాసనచే మలదోషము, విక్షేపదోషము నివృత్తి అయినను స్వస్వ రూపమును గుఱించి అజ్ఞానము - తానే బ్రహ్మము అను జ్ఞానము కలుగకుండుట అను అజ్ఞానము - నివృత్తి కాలేదో, అయినను ఎవడు సాధన చతుష్టయ సంపత్తి గలిగియుండునో అట్టివాడు అధికారి యనబడును.)
(వేద వేదాంగములను శాస్త్రములో విధించిన ప్రకారము అధ్యయనము చేసి, వేదార్ధమును సర్వమును గ్రహించినవాడై ఈ జన్మమందు కాని, ఇంకొక జన్మమందుకాని, కామ్య నిషిద్ధకర్మలను విడిచిపెట్టి, నిత్యకర్మలు, నైమిత్తిక కర్మలు, ప్రాయశ్చిత్తములను చేయుచు, ఉపాసనను అనుష్టించుటవలన ఎల్లపుడు నిర్మలమైన మనస్సు కలవాడై, సాధన చతుష్టయము కలవాడు అధికారి.)
(వేదాంత గ్రంధము లందు వాటిని విచారించుట ద్వారా ఆత్మజ్ఞానము నందు, ఆత్మజ్ఞానము ద్వారా మోక్షమందు అధికారము కలిగియుండువాడు.)
(బృహస్పతి యజ్ఞమందు బ్రాహ్మణునకు అధికారమున్నది, రాజసూయ యాగమందు క్షత్రియునకే అధికారమున్నది, వైశ్యయజ్ఞమందు వైశ్యునకే అధికారమున్నది. ఆ ప్రకారమే వేదాంత విచారమునందు సాధనచతుష్టయ సంపన్నునకే అధికారము కలదు - ఇతరునకు కాదు.)
అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే |
అన్యేత్వేవ మజానంతః శ్రుత్వాన్యేభ్యః ఉపాసతే||” (శ్రీమద్భగవద్గీత - 13 - 24,25)
(ధ్యానయోగులు, సాంఖ్యయోగులు, కర్మయోగులు, ఈ ముగ్గురు కానివారు - అనగా, ధ్యానయోగము, సాంఖ్యయోగము, కర్మయోగము అభ్యసించుటకు అసమర్ధులైనవారు గురువులను ఆశ్రయించి, గురూపదిష్ట మార్గముగా పరంపరా సాధనములవలన ఆత్మ సాక్షాత్కారమును పొందుదురు.)
“ఆలస్యుండు, నిష్ఠారుడు, గురుసేవా వంచకుండు, విద్యాచోరకుండు, ఈ దుర్గుణాలులేక, > స్తంబన, మోహన మారణోచ్చాటనాది కుహక విద్యలు లేక, విషయరసా సక్తుండు, అహంకార గర్వితుండు, > పాషాండమత సం యుతుండు, సోమరి, నాస్తికుండు, జ్ఞాన చోరుండు, పతితుండు, అకార్య > పరుండు, దూషకుండు అనే గుణాలు లేక, సాధనచతుష్టయ సంపన్నుండైన అతి కృతాధికారియైన వాడే > శిష్యుడు” (బ్రహ్మవిద్యా సుధావర్ణము - 1)
సధర్మో ద్వివిధోపీహ వర్ధమానో యధా భవేత్ |
సంప్రదాయ ముఖేనైవ తథా కార్యం మ యాధునా |
ఇతి సంచిత్యగోవిందో నిమిత్తీ కృత్యార్జునం |
సంగ్రామే (అ) వసరం లబ్ధ్వా ద్వివిధం ధర్మ మీశ్వరః |
తస్మాదుప దిదేశేడ్య ఉత్తమాయాధికారిణే |
ధర్మో అనుష్టీయ మానశ్చ గృహీతః సద్గుణాధికైః ||
-స్వయమే వహి కాలేనప్రచయం ప్రగమిష్యతి |
ఇత్యతో (అ) ర్జునముద్దిశ్య ధర్మం సంప్రోక్తవాన్ హరిః ||.” (గీతాభావ ప్రకాశము - 1 - 17 to 29)
(ప్రవృత్తి లక్షణము, నివృత్తి లక్షణము అను రెండువిధములుగల ధర్మము లోకములో వర్ధిల్లచేయుటకు కురుపాండవ యుద్ధమును అవసరముగా తీసుకొని తన అభిప్రాయములో ఉత్తమాధికారియగు అర్జునుని నిమిత్తమాత్రుడుగా చేసి శ్రీకృష్ణభగవానుడు ధర్మమును అతనికి బోధించెను. ఇందువలన అర్జునుని ద్వారా ఈ ధర్మము కాలక్రమమున ఒకరినుండి ఇంకొకరికి పరంపరగా తెలుసుకొనబడి ప్రపంచములో వృద్ధిపొందును అనిభగవంతుని ఆశయము. ఈ ధర్మము రెండువిధములలో ఒకటి స్వధర్మము - వర్ణాశ్రమ ధర్మము. క్షత్రియుడైన అర్జునుడు యుద్ధము చేయవలయునని - రెండవది తత్వోపదేశము. ఈ రెండు ధర్మములను బోధించుగురువు - లోకగురువైన భగవంతుడు. అతనికి ఇందుకు తగిన శిష్యుడు - అధికారి - ఉత్తమాధికారి - అన్ని లక్షణములుగల అధికారి అర్జునుడు. అందుచేత శ్రీకృష్ణుడు అర్జునునకు గీతద్వారా భాగవత తత్వము - పరమాత్మ తత్వమును బోధించెను. అర్జునుని ద్వారా లోకమందఱకు వ్యాప్తమైనది ఆ ధర్మము. అధికారి, ఉత్తమాధికారి అనగా అర్జునుడు - అర్జునుడు వంటివాడు.”
అర్జునస్యోపదేశేనాధి కారీ దర్శితో (అ) త్రచ |” (గీతాభావప్రకాశము - 1 - 85)
(శ్రీకృష్ణ భగవానుడువంటి లోకగురువు అయినవాడు అర్జునునకు ఉపదేశించుటచేత అధికారి ఎటువంటివాడో ఇక్కడ చెప్పబడినది.)
ద్వివిధా ద్విప్రకారైవ పూర్వాధ్యాయే స్ఫుటం మయా |
జ్ఞానకర్మ పరత్వాఖ్యా నిష్టోక్తా తే హితైషిణా ||” (గీతాభావప్రకాశము - 3 - 28, 29)
(అధికారులు - అనగా, వేదాధ్యయనమునకు తగినవారు – రెండు విధములు – చిత్తశుద్ధి కలవారు, చిత్తశుద్ధి లేనివారు. చిత్తశుద్ధి గలవారికి జ్ఞానయోగము, చిత్తశుద్ధి లేనివారికి కర్మయోగము చెప్పబడినది. కర్మయోగము నేర్చిన వారికి చిత్తశుద్ధి కలుగగా జ్ఞానయోగము నవలంబింప వచ్చును.)
అధికారి అయినవాడు బ్రహ్మజ్ఞానము కలుగుటకు ఈశ్వరుని ఉపాసించవలెను - “జ్ఞానమిచ్ఛేత్ మహేశ్వరాత్”.
అధికారులు నాలుగు విధములు :- ఉత్తములు, - ఉత్తమాధికారి (అర్జునుడువంటివాడు), > మధ్యములు, మందులు, మందతరులు.)
(vivēkādi catuṣṭayamanagā –
nityā nitya vastuvivēkamu,
ihāmutra phala bhōgavirāgamu
śamadamādulu - anagā, śamamu, damamu, uparati, titikṣa, śraddhā, samādhānamulu.
mumukṣutvamu - mōkṣamunaṃdu icchakaligi yuṃḍuṭa.
ī nālugu kaliginavāḍē adhikāri; brahmajñānamunu poṃduṭaku arhuḍainavāḍu, taginavāḍu. aṭṭivānikē guruvulu brahmajñānamu nupadēśiṃcedaru.)
“śāṃtō dāṃta uparati stiti kṣussamāhitaḥ śraddhā vittō bhūtvā ātmanyē vātmānaṃ paśyēt” iti.
(śāṃtuḍu, dhātuḍu, uparituḍu, titikṣuvu, samāhitamaina manassu kalavāḍu, śraddha kalavāḍu, ātmayaṃdē paramātmanu - tanalōnē unna paramātmanu cūcunu.)
(evaniki niṣkāmakarmōpāsanacē maladōṣamu, vikṣēpadōṣamu nivṛtti ayinanu svasva rūpamunu guṟiṃci ajñānamu - tānē brahmamu anu jñānamu kalugakuṃḍuṭa anu ajñānamu - nivṛtti kālēdō, ayinanu evaḍu sādhana catuṣṭaya saṃpatti galigiyuṃḍunō aṭṭivāḍu adhikāri yanabaḍunu.)
(vēda vēdāṃgamulanu śāstramulō vidhiṃcina prakāramu adhyayanamu cēsi, vēdārdhamunu sarvamunu grahiṃcinavāḍai ī janmamaṃdu kāni, iṃkoka janmamaṃdukāni, kāmya niṣiddhakarmalanu viḍicipeṭṭi, nityakarmalu, naimittika karmalu, prāyaścittamulanu cēyucu, upāsananu anuṣṭiṃcuṭavalana ellapuḍu nirmalamaina manassu kalavāḍai, sādhana catuṣṭayamu kalavāḍu adhikāri.)
(vēdāṃta graṃdhamu laṃdu vāṭini vicāriṃcuṭa dvārā ātmajñānamu naṃdu, ātmajñānamu dvārā mōkṣamaṃdu adhikāramu kaligiyuṃḍuvāḍu.)
(bṛhaspati yajñamaṃdu brāhmaṇunaku adhikāramunnadi, rājasūya yāgamaṃdu kṣatriyunakē adhikāramunnadi, vaiśyayajñamaṃdu vaiśyunakē adhikāramunnadi. ā prakāramē vēdāṃta vicāramunaṃdu sādhanacatuṣṭaya saṃpannunakē adhikāramu kaladu - itarunaku kādu.)
anyē sāṃkhyēna yōgēna karmayōgēna cāparē |
anyētvēva majānaṃtaḥ śrutvānyēbhyaḥ upāsatē||” (śrīmadbhagavadgīta - 13 - 24,25)
(dhyānayōgulu, sāṃkhyayōgulu, karmayōgulu, ī mugguru kānivāru - anagā, dhyānayōgamu, sāṃkhyayōgamu, karmayōgamu abhyasiṃcuṭaku asamardhulainavāru guruvulanu āśrayiṃci, gurūpadiṣṭa mārgamugā paraṃparā sādhanamulavalana ātma sākṣātkāramunu poṃduduru.)
“ālasyuṃḍu, niṣṭhāruḍu, gurusēvā vaṃcakuṃḍu, vidyācōrakuṃḍu, ī durguṇālulēka, > staṃbana, mōhana māraṇōccāṭanādi kuhaka vidyalu lēka, viṣayarasā saktuṃḍu, ahaṃkāra garvituṃḍu, > pāṣāṃḍamata saṃ yutuṃḍu, sōmari, nāstikuṃḍu, jñāna cōruṃḍu, patituṃḍu, akārya > paruṃḍu, dūṣakuṃḍu anē guṇālu lēka, sādhanacatuṣṭaya saṃpannuṃḍaina ati kṛtādhikāriyaina vāḍē > śiṣyuḍu” (brahmavidyā sudhāvarṇamu - 1)
sadharmō dvividhōpīha vardhamānō yadhā bhavēt |
saṃpradāya mukhēnaiva tathā kāryaṃ ma yādhunā |
iti saṃcityagōviṃdō nimittī kṛtyārjunaṃ |
saṃgrāmē (a) vasaraṃ labdhvā dvividhaṃ dharma mīśvaraḥ |
tasmādupa didēśēḍya uttamāyādhikāriṇē |
dharmō anuṣṭīya mānaśca gṛhītaḥ sadguṇādhikaiḥ ||
-svayamē vahi kālēnapracayaṃ pragamiṣyati |
ityatō (a) rjunamuddiśya dharmaṃ saṃprōktavān hariḥ ||.” (gītābhāva prakāśamu - 1 - 17 to 29)
(pravṛtti lakṣaṇamu, nivṛtti lakṣaṇamu anu reṃḍuvidhamulugala dharmamu lōkamulō vardhillacēyuṭaku kurupāṃḍava yuddhamunu avasaramugā tīsukoni tana abhiprāyamulō uttamādhikāriyagu arjununi nimittamātruḍugā cēsi śrīkṛṣṇabhagavānuḍu dharmamunu ataniki bōdhiṃcenu. iṃduvalana arjununi dvārā ī dharmamu kālakramamuna okarinuṃḍi iṃkokariki paraṃparagā telusukonabaḍi prapaṃcamulō vṛddhipoṃdunu anibhagavaṃtuni āśayamu. ī dharmamu reṃḍuvidhamulalō okaṭi svadharmamu - varṇāśrama dharmamu. kṣatriyuḍaina arjunuḍu yuddhamu cēyavalayunani - reṃḍavadi tatvōpadēśamu. ī reṃḍu dharmamulanu bōdhiṃcuguruvu - lōkaguruvaina bhagavaṃtuḍu. ataniki iṃduku tagina śiṣyuḍu - adhikāri - uttamādhikāri - anni lakṣaṇamulugala adhikāri arjunuḍu. aṃducēta śrīkṛṣṇuḍu arjununaku gītadvārā bhāgavata tatvamu - paramātma tatvamunu bōdhiṃcenu. arjununi dvārā lōkamaṃdaṟaku vyāptamainadi ā dharmamu. adhikāri, uttamādhikāri anagā arjunuḍu - arjunuḍu vaṃṭivāḍu.”
arjunasyōpadēśēnādhi kārī darśitō (a) traca |” (gītābhāvaprakāśamu - 1 - 85)
(śrīkṛṣṇa bhagavānuḍuvaṃṭi lōkaguruvu ayinavāḍu arjununaku upadēśiṃcuṭacēta adhikāri eṭuvaṃṭivāḍō ikkaḍa ceppabaḍinadi.)
dvividhā dviprakāraiva pūrvādhyāyē sphuṭaṃ mayā |
jñānakarma paratvākhyā niṣṭōktā tē hitaiṣiṇā ||” (gītābhāvaprakāśamu - 3 - 28, 29)
(adhikārulu - anagā, vēdādhyayanamunaku taginavāru – reṃḍu vidhamulu – cittaśuddhi kalavāru, cittaśuddhi lēnivāru. cittaśuddhi galavāriki jñānayōgamu, cittaśuddhi lēnivāriki karmayōgamu ceppabaḍinadi. karmayōgamu nērcina vāriki cittaśuddhi kalugagā jñānayōgamu navalaṃbiṃpa vaccunu.)
adhikāri ayinavāḍu brahmajñānamu kaluguṭaku īśvaruni upāsiṃcavalenu - “jñānamicchēt mahēśvarāt”.
adhikārulu nālugu vidhamulu :- uttamulu, - uttamādhikāri (arjunuḍuvaṃṭivāḍu), > madhyamulu, maṃdulu, maṃdatarulu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.