పాదనాం మత్రాణాంచ ఏకత్వాత్ అవిరుద్ధం.
(మాత్రను అధికరించి ఉండునది అధిమాత్రం. ఓంకార పాదములవలె విభజింపబడిన మాత్రల నధికరించి ఉండునది. ఓంకారమాత్రలు అయిన ‘అ’ కార ‘ఉ’ కార ‘మ’ కారములు ఆత్మయొక్క మాత్రలు; మాత్రలు అనినను, పాదములు అనినను ఒకటే అయినందున ఈ ప్రకారముగా చెప్పుటవలన విరోధము లేదు.)
(అధికమైన మాత్రలు - అంశలు, కలవాడు అధిమాత్రం ఆత్మ యొక్క పాదములైన విశ్వుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు అనినవియే మాత్రలు. ఓం కారము యొక్క మాత్రలు అయిన అకార, ఉకార, మకారములే ఆత్మ యొక్క పాదములు అయిన విశ్వుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు.)
(అకార ఉకార మకారములను మాత్రలు గలిగి నాదాత్మకమైనది ఓంకారము. ఆ ఓంకారమే ఆత్మ యని అర్ధము. ఈ మాత్రలను అధికరించి ఉండునది అధిమాత్రం, ఓంకారము, లేక ఆత్మ.)
(అకారము విశ్వుడు, ఉకారము తైజసుడు, మకారము ప్రాజ్ఞుడు. ఈ విశ్వ తైజస ప్రాజ్ఞులు ముగ్గురు తురీయము యొక్క మాత్రలు. అందుచేత ఆత్మ అధిమాత్రము.
(బ్రహ్మపాదములని చెప్పబడుచున్న అనిరుద్ధ, ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవులే మాత్రలు, ప్రణవమాత్రలు, భూతాకారములు. అందుచేత ఓంకారముయొక్క మాత్రలు అయిన అకార, ఉకార, మకారములే బ్రహ్మయొక్క, ఆత్మ యొక్క పాదములు అని అర్ధము - ఈ మాత్రలను అధికరించి యుండునది ఆత్మ, ఓంకారము, బ్రహ్మము.)
pādanāṃ matrāṇāṃca ēkatvāt aviruddhaṃ.
(mātranu adhikariṃci uṃḍunadi adhimātraṃ. ōṃkāra pādamulavale vibhajiṃpabaḍina mātrala nadhikariṃci uṃḍunadi. ōṃkāramātralu ayina ‘a’ kāra ‘u’ kāra ‘ma’ kāramulu ātmayokka mātralu; mātralu aninanu, pādamulu aninanu okaṭē ayinaṃduna ī prakāramugā ceppuṭavalana virōdhamu lēdu.)
(adhikamaina mātralu - aṃśalu, kalavāḍu adhimātraṃ ātma yokka pādamulaina viśvuḍu, taijasuḍu, prājñuḍu aninaviyē mātralu. ōṃ kāramu yokka mātralu ayina akāra, ukāra, makāramulē ātma yokka pādamulu ayina viśvuḍu, taijasuḍu, prājñuḍu.)
(akāra ukāra makāramulanu mātralu galigi nādātmakamainadi ōṃkāramu. ā ōṃkāramē ātma yani ardhamu. ī mātralanu adhikariṃci uṃḍunadi adhimātraṃ, ōṃkāramu, lēka ātma.)
(akāramu viśvuḍu, ukāramu taijasuḍu, makāramu prājñuḍu. ī viśva taijasa prājñulu mugguru turīyamu yokka mātralu. aṃducēta ātma adhimātramu.
(brahmapādamulani ceppabaḍucunna aniruddha, pradyumna saṃkarṣaṇa vāsudēvulē mātralu, praṇavamātralu, bhūtākāramulu. aṃducēta ōṃkāramuyokka mātralu ayina akāra, ukāra, makāramulē brahmayokka, ātma yokka pādamulu ani ardhamu - ī mātralanu adhikariṃci yuṃḍunadi ātma, ōṃkāramu, brahmamu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.