ఆదారః ; ఆశ్రయః. (అధారము, ఆశ్రయము ; నివాసస్థానము.)
అధిష్ఠానం దేహాదిః - ఆది పదేన భూమ్యాదిః.
(దేహము మొదలగునవి - మొదలగునవి అనగా భూమి మొదలగునవి.)
(జీవాత్మ ఇందులో అధిష్టించియుండునుకనుక మహాభూతముల కూడికవలన కలిగిన శరీరము అధిష్టానము.)
(ఇచ్ఛాద్వేషములు, సుఖదుఃఖములు, జ్ఞానము - వీటిని వ్యక్తపఱచుచు వీటికి ఆశ్రయమైనది శరీరము అధిష్టానము)
(శ్రీమదాంధ్ర మహాభాగవతము- 2 - 10 - 268)
ఆ ఆశ్రయమే అధిష్టానము, సకలచరాచర జీవకోటికి, సమస్తభూతములకు అధిష్టానము.
(భ్రాంతి కలిగి యున్నపుడు ఏది ప్రకాశింపదో, ఉన్నట్లు తెలియబడదో, ఏది ప్రకాశించినపుడు భ్రాంతి పూర్తిగా నశించునో అదియే విశేషాంశము, అధిష్టానము, భ్రాంతివలన త్రాడు పాముగా కనబడును. అప్పుడు జ్ఞానము తోచదు. యదార్ధజ్ఞానము కలిగినప్పుడు భ్రాంతిపోగా త్రాడు త్రాడువలెనే కనబడును - ఆ జ్ఞానమే అధిష్టానము - విశేషాంశము.)
మత్ స్థాని సర్వ భూతాని - -” (శ్రీమద్భగవద్గీత - 9 - 4)
(కనబడని రూపముగల నాచేత ఈ ప్రపంచకమంతయు వ్యాపించబడియున్నది, లోపల పైన నిండియున్నది.ఈ సమస్త భూతములు నాయందే ఉన్నవి. వీటి అన్నింటికి ఉపాదానకారణము నేనే.)
పై శ్లోకమునకు వ్యాఖ్యానము : -
“భూత భౌతిక తద్ధేతురూపం దృశ్యమిదం జగత్ |
మయాధిష్టాన రూపేణ వ్యాప్తం సచ్చిన్మయాత్మనా |
కధం వ్యాప్తం త్వయా సర్వం పరిచ్ఛిన్నేన హతిచేత్ |
మైవం,సర్వేంద్రియతీత స్వప్రకాశైక మూర్తినా |
మయా వ్యాప్త మిదం సర్వమపరిచ్ఛిన్న దేహినా |
సంతీవాం తః స్ఫురం తీవ మద్రూపేణ స్థితాని భోః |
మత్ స్థానిసర్వభూతాని జంగమస్థావరాణి చ |
తేష్వధ్యస్తేషు భూతేషు నైవాహం సమవస్థితః |
బ్రహ్మాది సర్వభూతాని స్వాత్మవం త్యాత్మ నామయా |
స్థితాని మయ్యధిష్టానే సత్తస్ఫూర్తి ప్రదేహరే ||” (గీతాభావప్రకాశము- 9 – 30 to 36)
(భూతము, భౌతికములు, వాటికి కారణములు - అనగా, కారణకార్యములన్నియు రూపముగా గల ఈ జగత్తంతటికి అధిష్టానరూపుడనైన నేను వాటన్నింటిలోను వ్యాపించియున్నాను. సన్మాత్రుడను, చిన్మాత్రుడను అయిన నాచే ఈ జగత్తు అంతా నాసత్తామాత్రముతోను, చిన్మాత్రముతోను వ్యాపించబడియున్నది - ఏట్లు దీనినంతటినీ వ్యాపించియున్నాను అనగా, నేను ఇంద్రియములన్నింటికీ అతీతుడనై యున్నాను. స్వయంప్రకాశమే రూపముగా గలవాడను. అటువంటి నాచేత ఈ జగత్తు అంతా వ్యాప్తమై. యున్నది అంతులేని, ముక్కలు ముక్కలుగా తెగనిశరీరముగల నేను ఈ ప్రపంచమంతటను వాటిలో ఉన్న అన్ని వస్తువులలోను వ్యాపించియున్నాను. భూతములన్నీ నాలోన నుండి, నేను వాటిలో నాసత్తాస్ఫూర్తితో ఉన్నట్లుగానే ఉన్నవి. జంగమస్థావర రూపములైన ఈ సమస్తభూతములు నాయందే యున్నవి. సత్తాస్ఫూర్తి నిస్తూ అధిష్టానమైన నాయందే ఆత్మ గలిగియున్నవి.)
ādāraḥ ; āśrayaḥ. (adhāramu, āśrayamu ; nivāsasthānamu.)
adhiṣṭhānaṃ dēhādiḥ - ādi padēna bhūmyādiḥ.
(dēhamu modalagunavi - modalagunavi anagā bhūmi modalagunavi.)
(jīvātma iṃdulō adhiṣṭiṃciyuṃḍunukanuka mahābhūtamula kūḍikavalana kaligina śarīramu adhiṣṭānamu.)
(icchādvēṣamulu, sukhaduḥkhamulu, jñānamu - vīṭini vyaktapaṟacucu vīṭiki āśrayamainadi śarīramu adhiṣṭānamu)
(śrīmadāṃdhra mahābhāgavatamu- 2 - 10 - 268)
ā āśrayamē adhiṣṭānamu, sakalacarācara jīvakōṭiki, samastabhūtamulaku adhiṣṭānamu.
(bhrāṃti kaligi yunnapuḍu ēdi prakāśiṃpadō, unnaṭlu teliyabaḍadō, ēdi prakāśiṃcinapuḍu bhrāṃti pūrtigā naśiṃcunō adiyē viśēṣāṃśamu, adhiṣṭānamu, bhrāṃtivalana trāḍu pāmugā kanabaḍunu. appuḍu jñānamu tōcadu. yadārdhajñānamu kaliginappuḍu bhrāṃtipōgā trāḍu trāḍuvalenē kanabaḍunu - ā jñānamē adhiṣṭānamu - viśēṣāṃśamu.)
mat sthāni sarva bhūtāni - -” (śrīmadbhagavadgīta - 9 - 4)
(kanabaḍani rūpamugala nācēta ī prapaṃcakamaṃtayu vyāpiṃcabaḍiyunnadi, lōpala paina niṃḍiyunnadi.ī samasta bhūtamulu nāyaṃdē unnavi. vīṭi anniṃṭiki upādānakāraṇamu nēnē.)
pai ślōkamunaku vyākhyānamu : -
“bhūta bhautika taddhēturūpaṃ dṛśyamidaṃ jagat |
mayādhiṣṭāna rūpēṇa vyāptaṃ saccinmayātmanā |
kadhaṃ vyāptaṃ tvayā sarvaṃ paricchinnēna haticēt |
maivaṃ,sarvēṃdriyatīta svaprakāśaika mūrtinā |
mayā vyāpta midaṃ sarvamaparicchinna dēhinā |
saṃtīvāṃ taḥ sphuraṃ tīva madrūpēṇa sthitāni bhōḥ |
mat sthānisarvabhūtāni jaṃgamasthāvarāṇi ca |
tēṣvadhyastēṣu bhūtēṣu naivāhaṃ samavasthitaḥ |
brahmādi sarvabhūtāni svātmavaṃ tyātma nāmayā |
sthitāni mayyadhiṣṭānē sattasphūrti pradēharē ||” (gītābhāvaprakāśamu- 9 – 30 to 36)
(bhūtamu, bhautikamulu, vāṭiki kāraṇamulu - anagā, kāraṇakāryamulanniyu rūpamugā gala ī jagattaṃtaṭiki adhiṣṭānarūpuḍanaina nēnu vāṭanniṃṭilōnu vyāpiṃciyunnānu. sanmātruḍanu, cinmātruḍanu ayina nācē ī jagattu aṃtā nāsattāmātramutōnu, cinmātramutōnu vyāpiṃcabaḍiyunnadi - ēṭlu dīninaṃtaṭinī vyāpiṃciyunnānu anagā, nēnu iṃdriyamulanniṃṭikī atītuḍanai yunnānu. svayaṃprakāśamē rūpamugā galavāḍanu. aṭuvaṃṭi nācēta ī jagattu aṃtā vyāptamai. yunnadi aṃtulēni, mukkalu mukkalugā teganiśarīramugala nēnu ī prapaṃcamaṃtaṭanu vāṭilō unna anni vastuvulalōnu vyāpiṃciyunnānu. bhūtamulannī nālōna nuṃḍi, nēnu vāṭilō nāsattāsphūrtitō unnaṭlugānē unnavi. jaṃgamasthāvara rūpamulaina ī samastabhūtamulu nāyaṃdē yunnavi. sattāsphūrti nistū adhiṣṭānamaina nāyaṃdē ātma galigiyunnavi.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.