క్రిందకుపోవుట; హీనత్వము నొందుట; తక్కువస్థితి, నాశము.
“అధాతుః పాప వృద్ధి స్యాత్ పాప వృద్ధేర్దరిద్రతా |
దారిద్ర్యాత్ కురుతే పాపంపాపాత్తస్మా దధోగతిః ||” (స్కాంద పురాణము -)
(దానము చేయకపోవుటవలన పాపము వృద్ధిపొందును, పాపము వృద్ధిపొందిన దరిద్రము కలుగును, దరిద్రమువలన పాపముచేయును. పాపము చేయుటవలన అధోగతి కలుగును.)
(ఒక చిన్నవిషయమువలన, లేక ఒక చిన్నవానివలన ఉన్నత స్థితి కలుగును. అట్లే ఒక చిన్న విషయమువలన - చిన్న కారణమువలన, లేక ఒక చిన్నవాని వలన అధోగతి కలుగగలదు.)
గొఱమాలిన యెఱుక లెఱిగి కొందఱు నీ పే
రెఱిగియు దలపగనొల్లరు
పఱతురధోగతులజాడ బద్మదళాక్షా!” (శ్రీమదాంధ్ర మహాభాగవతము- 10 -పూ.భా. 94.)
(జ్ఞానము కలవారమని - పనికి మాలిన జ్ఞానము సంపాదించి భగవంతుడున్నాడని తెలిసికూడ అతనిని తలపరు. అట్టివారు అధోగతికి పోవుదురు.)
kriṃdakupōvuṭa; hīnatvamu noṃduṭa; takkuvasthiti, nāśamu.
“adhātuḥ pāpa vṛddhi syāt pāpa vṛddhērdaridratā |
dāridryāt kurutē pāpaṃpāpāttasmā dadhōgatiḥ ||” (skāṃda purāṇamu -)
(dānamu cēyakapōvuṭavalana pāpamu vṛddhipoṃdunu, pāpamu vṛddhipoṃdina daridramu kalugunu, daridramuvalana pāpamucēyunu. pāpamu cēyuṭavalana adhōgati kalugunu.)
(oka cinnaviṣayamuvalana, lēka oka cinnavānivalana unnata sthiti kalugunu. aṭlē oka cinna viṣayamuvalana - cinna kāraṇamuvalana, lēka oka cinnavāni valana adhōgati kalugagaladu.)
goṟamālina yeṟuka leṟigi koṃdaṟu nī pē
reṟigiyu dalapaganollaru
paṟaturadhōgatulajāḍa badmadaḷākṣā!” (śrīmadāṃdhra mahābhāgavatamu- 10 -pū.bhā. 94.)
(jñānamu kalavāramani - paniki mālina jñānamu saṃpādiṃci bhagavaṃtuḍunnāḍani telisikūḍa atanini talaparu. aṭṭivāru adhōgatiki pōvuduru.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.