← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అధ్రువం adhruvaṃ

Original — తెలుగు
  1. నశ్వరం ; క్షణికం ; అనిత్యం ; నధ్రువం.

(నశించిపోవునది; క్షణమాత్రముండునది; నిత్యముకానిది ; ధ్రువముకానిది; ధ్రువముగానుండనిది; నిశ్చయము చేయబడనది; స్థిరముకానిది; చంచలము.)

  1. కళా, కాష్టా, క్షణోన్మేషణ నిమేషాదివత్ అత్యంతాల్ప కాలావస్థాయి.

(కళా, కాష్ట, క్షణము, ఉన్మేషనిమేషములు అనునవి కాలపరిమాణములో అత్యల్పకాలమును తెలియచేయునవి. వాటివలె తక్కువ కాలముండునవి)

  1. “సీ. జనులు దిక్పాలుర సంపదాయు ర్విభవములు గోరుదురు భవ్యంబు లనుచు

నవి యెంతయును రోష హాస జృంభితమైన మాతండ్రి బొమముడి మహిమ జేసి

విహతంబు లగు నట్టి వీరుండు నీచేత నిమిషమాత్రంబున నేడు మడిసె

గావున ధ్రువములు గావు బ్రహ్మాదుల శ్రీవిభవంబులు జీవితములు

తే. కాలరూపకు డగు నురుక్రమునిచేత

విదళితము లగు నిలువవు - - -” (శ్రీమదాంధ్ర మహాభాగవతము- 7 - 9 - 357)

Transliteration
  1. naśvaraṃ ; kṣaṇikaṃ ; anityaṃ ; nadhruvaṃ.

(naśiṃcipōvunadi; kṣaṇamātramuṃḍunadi; nityamukānidi ; dhruvamukānidi; dhruvamugānuṃḍanidi; niścayamu cēyabaḍanadi; sthiramukānidi; caṃcalamu.)

  1. kaḷā, kāṣṭā, kṣaṇōnmēṣaṇa nimēṣādivat atyaṃtālpa kālāvasthāyi.

(kaḷā, kāṣṭa, kṣaṇamu, unmēṣanimēṣamulu anunavi kālaparimāṇamulō atyalpakālamunu teliyacēyunavi. vāṭivale takkuva kālamuṃḍunavi)

  1. “sī. janulu dikpālura saṃpadāyu rvibhavamulu gōruduru bhavyaṃbu lanucu

navi yeṃtayunu rōṣa hāsa jṛṃbhitamaina mātaṃḍri bomamuḍi mahima jēsi

vihataṃbu lagu naṭṭi vīruṃḍu nīcēta nimiṣamātraṃbuna nēḍu maḍise

gāvuna dhruvamulu gāvu brahmādula śrīvibhavaṃbulu jīvitamulu

tē. kālarūpaku ḍagu nurukramunicēta

vidaḷitamu lagu niluvavu - - -” (śrīmadāṃdhra mahābhāgavatamu- 7 - 9 - 357)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.