“శ్రౌతో ధ్వరో (అ)గ్నిష్టోమాదిః క్రతుః” (గీతాభావప్రకాశము9 - 115)
(శ్రుతిలో చెప్పబడిన అగ్నిష్టోమము మొదలగునవి - క్రతువు)
“అహం క్రతుః” నేనే క్రతువును - యజ్ఞమును, యజ్ఞస్వరూపుడను అని శ్రీకృష్ణభగవానుడు స్వయముగా చెప్పెను - (శ్రీమద్భగవద్గీత - 9 - 16) అందుచేత క్రతువు చేయునపుడు అది భగవంతుని రూపమే అని భావించి, ధ్యానము ఉంచి, చేయవలెను. అన్ని వస్తువులు, అన్ని క్రియలు, అన్ని భావములు (abstract things) భగవంతుడే అని అతనికంటె వేరైనదేదియు లేదని భావన ఏ పని చేసినను ఉండవలెను. అధ్వరము చేయునపుడు ఆ యజ్ఞమే విష్ణువు -“యజ్ఞో వై విష్ణుః” అనియే కాకుండా, ఆ యజ్ఞముయొక్క అంగములన్నియు - అనగా, యజ్ఞము చేయించువాడు, యజ్ఞము చేయువాడు, అగ్నిహోత్రము, అందులో హోమము చేయబడు ద్రవ్యము, యజ్ఞభోక్తలైన దేవతలు విష్ణువే
అని భావముండవలయును) (చూడుము: - ‘యజ్ఞము’.)
“śrautō dhvarō (a)gniṣṭōmādiḥ kratuḥ” (gītābhāvaprakāśamu9 - 115)
(śrutilō ceppabaḍina agniṣṭōmamu modalagunavi - kratuvu)
“ahaṃ kratuḥ” nēnē kratuvunu - yajñamunu, yajñasvarūpuḍanu ani śrīkṛṣṇabhagavānuḍu svayamugā ceppenu - (śrīmadbhagavadgīta - 9 - 16) aṃducēta kratuvu cēyunapuḍu adi bhagavaṃtuni rūpamē ani bhāviṃci, dhyānamu uṃci, cēyavalenu. anni vastuvulu, anni kriyalu, anni bhāvamulu (abstract things) bhagavaṃtuḍē ani atanikaṃṭe vērainadēdiyu lēdani bhāvana ē pani cēsinanu uṃḍavalenu. adhvaramu cēyunapuḍu ā yajñamē viṣṇuvu -“yajñō vai viṣṇuḥ” aniyē kākuṃḍā, ā yajñamuyokka aṃgamulanniyu - anagā, yajñamu cēyiṃcuvāḍu, yajñamu cēyuvāḍu, agnihōtramu, aṃdulō hōmamu cēyabaḍu dravyamu, yajñabhōktalaina dēvatalu viṣṇuvē
ani bhāvamuṃḍavalayunu) (cūḍumu: - ‘yajñamu’.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.