← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అధ్యాస సామగ్రి adhyāsa sāmagri

Original — తెలుగు
  1. సామగ్రి యనగా కారణ సముదాయము - వంటకు పొయ్యి, కట్టెలు సామగ్రి అయినట్లు - అందుచేత అట్లే > అధ్యాసకు సామగ్రి - కారణములు - అయినవి. ఇవి ఆరు - (1) సత్య వస్తు జ్ఞాన సంస్కారము. > త్రాడును చూచి పాము అనుకొనునప్పుడు, ముత్యపుచిప్పను వెండి అనుకొనినప్పుడు ముందుగా > పాము, వెండి అను వస్తువులు తెలిసినవానికే త్రాడు పాము అని, ముత్యుపు చిప్ప వెండియని అధ్యాస > కలుగును - ఇతరులకు కలుగదు - ఇదియే సత్యవస్తువు - నిజమైన వస్తు జ్ఞానమువలన > కలుగు అధ్యాస. (2) ప్రమాతృదోషము (3) ప్రమాణ దోషము : - ప్రమాతయందుండు లోభ భయాది > దోషములునూ, నేత్రాది మాణమందుండు పిత్త కామ మలాది దోషములును అధ్యాసకు కారణము. (4) > ప్రమేయ దోషము - ముత్యపు చిప్పయందు సర్పము అను అధ్యాస, త్రాడునందు వెండి యను అధ్యాస > కలుగదు. అందుచేత ప్రమేయ దోషము అధ్యాసకు కారణము. (5), (6) - శుక్తియొక్క సామాన్యరూప > జ్ఞానము కలిగి, శుక్తికి, నీల, త్రికోణాకృతులు గలవు అను విశేషజ్ఞానము లేక పోయినయడల అధ్యాస > మగును - అట్టి వస్తుసామాన్య జ్ఞానము, విశేషజ్ఞానము లేనపుడు అధ్యాసకానేరదు - అందుచేత ఈ > రెండును అధ్యాసకు కారణములు - వీటినే (5) అధిష్టాన సామాన్య రూపజ్ఞానము, (6) అధిష్టాన విశేష > రూపా జ్ఞానము అని అందురు.
  1. (1) సత్యవస్త్వనుభవ జన్య సంస్కారః (2) ప్రమాతృదోషాః (3) ప్రమాణ దోషాః (4) ప్రమేయ > దోషాః (5) అధిష్ఠాన విశేషా జ్ఞానం (6) తత్సామాన్య జ్ఞానంచ ఇత్యేతాః అధ్యాస సామగ్ర్యః ; వినా > త్వాభిః అధ్యాసః ఏవ న సిద్ధ్యేత్. ఘటోత్పత్తౌ కులాలదండే చక్రమృత్ సలిలా దయః సామగ్ర్యః. యధా > ఏతాషాం అన్యతమ భావేనైవోత్పద్యతే ఘటః, తధా అధ్యాసామగ్రీణాం అన్యతమా భావే అపి అధ్యాసో నోత్పద్యతే. > తస్మాత్ పంచానాం సామగ్రీనాం ఆవశ్యకత్వాత్ తాసాం సర్వాసాం సత్వ ఏవ అధ్యాసో జాయతే, న అన్యధా.
Transliteration
  1. sāmagri yanagā kāraṇa samudāyamu - vaṃṭaku poyyi, kaṭṭelu sāmagri ayinaṭlu - aṃducēta aṭlē > adhyāsaku sāmagri - kāraṇamulu - ayinavi. ivi āru - (1) satya vastu jñāna saṃskāramu. > trāḍunu cūci pāmu anukonunappuḍu, mutyapucippanu veṃḍi anukoninappuḍu muṃdugā > pāmu, veṃḍi anu vastuvulu telisinavānikē trāḍu pāmu ani, mutyupu cippa veṃḍiyani adhyāsa > kalugunu - itarulaku kalugadu - idiyē satyavastuvu - nijamaina vastu jñānamuvalana > kalugu adhyāsa. (2) pramātṛdōṣamu (3) pramāṇa dōṣamu : - pramātayaṃduṃḍu lōbha bhayādi > dōṣamulunū, nētrādi māṇamaṃduṃḍu pitta kāma malādi dōṣamulunu adhyāsaku kāraṇamu. (4) > pramēya dōṣamu - mutyapu cippayaṃdu sarpamu anu adhyāsa, trāḍunaṃdu veṃḍi yanu adhyāsa > kalugadu. aṃducēta pramēya dōṣamu adhyāsaku kāraṇamu. (5), (6) - śuktiyokka sāmānyarūpa > jñānamu kaligi, śuktiki, nīla, trikōṇākṛtulu galavu anu viśēṣajñānamu lēka pōyinayaḍala adhyāsa > magunu - aṭṭi vastusāmānya jñānamu, viśēṣajñānamu lēnapuḍu adhyāsakānēradu - aṃducēta ī > reṃḍunu adhyāsaku kāraṇamulu - vīṭinē (5) adhiṣṭāna sāmānya rūpajñānamu, (6) adhiṣṭāna viśēṣa > rūpā jñānamu ani aṃduru.
  1. (1) satyavastvanubhava janya saṃskāraḥ (2) pramātṛdōṣāḥ (3) pramāṇa dōṣāḥ (4) pramēya > dōṣāḥ (5) adhiṣṭhāna viśēṣā jñānaṃ (6) tatsāmānya jñānaṃca ityētāḥ adhyāsa sāmagryaḥ ; vinā > tvābhiḥ adhyāsaḥ ēva na siddhyēt. ghaṭōtpattau kulāladaṃḍē cakramṛt salilā dayaḥ sāmagryaḥ. yadhā > ētāṣāṃ anyatama bhāvēnaivōtpadyatē ghaṭaḥ, tadhā adhyāsāmagrīṇāṃ anyatamā bhāvē api adhyāsō nōtpadyatē. > tasmāt paṃcānāṃ sāmagrīnāṃ āvaśyakatvāt tāsāṃ sarvāsāṃ satva ēva adhyāsō jāyatē, na anyadhā.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.