← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అధ్యాస adhyāsa

Original — తెలుగు
  1. “సత్యానృత వస్త్వభేద ప్రతీతి రధ్యాసః” (శ్రీశంకరః)

(సత్యమునకు అసత్యమునకు భేదము లేనట్లు కనుపింప చేయునది.)

  1. స్వాజ్ఞానం అధ్యాస హేతుః (తానెవరో, తన నిజతత్వమేదో తెలియకుండుటయే అధ్యాసకు కారణము.)

  2. మిధ్యాజ్ఞానం, అతస్మిక్ తద్బుద్ధిః, అయదార్ధాను భవః స్మృతిరూపః, పరత్ర పూర్వ దృష్టావ భాసః.

(అయదార్ధజ్ఞానము - అదికాని దానియందు అది యగు బుద్ధి కలిగి యుండుట. ఇదివఱకు చూచిన వస్తువు జ్ఞాపకమునకు రాగా అదే ఇది యని స్ఫురించుట. యదార్ధముకాని అనుభవము.)

(రాత్రి చీకటిలో త్రాడును చూచి అది పాము అనుకొనుట అధ్యాస ఈ ప్రకారముగానే చీకటిలో ముత్యపు చిప్పను చూచి అది వెండి యని అనుకొనుట; ఎండమావులను చూచి జలమని తలచుట, ఒక మొండిచెట్టుని చూచి అది మనిషి అని అనుకొనుట - అధ్యాస. ప్రతి అధ్యాస యందు ఒక వస్తువును ఇంకొక వస్తువు పొరపాటుగా అనుకొనుట. చీకటిలో త్రాడును, ముత్యపుచిప్పను చూచి ఇదివఱకు తన అనుభవములో చూచిన మఱియొక వస్తువు - త్రాడు, వెండి - జ్ఞాపకమునకు రాగా అదే ఇది యని అనుకొనుట అధ్యాస.పామును వెండిని ఇదివఱకు చూడని వానికి అధ్యాస కలుగదు.)

  1. ఒకవస్తువును చూచి దానియందు మఱియొక వస్తువునైనను మఱియొక వస్తువుయొక్క ధర్మములనైనను ఆరోపించుట, పరస్పర భేదముగల రెండువస్తువులయొక్క - ముత్యపు చిప్ప, వెండి, త్రాడు, పాము - భేదము తెలియనందున అధ్యాస కలుగును.

  2. దేహేంద్రియప్రాణ మనో అహంకారాదీనాం జన్మాది తద్వికారాణాం చ ఆత్మని ప్రత్యక్ చైతన్యమయే భానం ఆత్మనః తద్ధర్మాణాం సత్య జ్ఞానానంతా నందా దీనాం చ అనాత్మని భావంచ అధ్యాసః. ఇత్యుచ్యతే. అస్యె వై భ్రాంతిః, విక్షేపః, శోకః, ఇత్యాదివ్యపదేశాః.

(దేహము, ఇంద్రియములు, ప్రాణము, మనస్సు, అహంకారము, జననము మొదలగువాటి వికారములను ఆత్మయం దారోపించుట, - ఆత్మ ధర్మములైన సత్యము, జ్ఞానము, అనంతము, ఆనందము మొదలగువాటిని ఆత్మగాని వాటియందు - అనాత్మ వస్తువులందు - ఆరోపించుట అధ్యాస అని చెప్పబడును, ఈ అధ్యాసయే భ్రాంతి, విక్షేపము, శోకము మొదలగునవిగా చెప్పబడుచున్నవి.)

  1. చిద్రూపమైన బ్రహ్మమందు మాయా సంబంధము అధ్యాసము - శుద్ధ బ్రహ్మమునందు మాయ అధ్యాసము వలన ఆ బ్రహ్మమే ప్రకృతి, దాని వికారములు కలిసి, ప్రాజ్ఞుడు, తైజసుడు, విశ్వుడు అను నామాంతరములుగల జీవుడై తన పరతత్వమును విస్మరించి సంసారములో తిరుగుచుండును. ప్రపంచమంతా పరమాత్మయే అయి ఉండగా భ్రాంతివలన ప్రపంచముగా - బ్రహ్మకన్న వేరుగా - చూచుట అధ్యాస.”సర్వం ఖిల్విదం బ్రహ్మ” - ఇదంతా బ్రహ్మమే కదా ! - అని జ్ఞానమువలన ఈ అధ్యాస తొలగిపోవును,

  2. కాలత్రయేపి సర్పా భావౌ అపి ర ద్వాదౌ ప్రాతిభాసిక సర్పాది బుద్ధిః తాదృశ సర్పాది తజ్జ్ఞానంచ అధ్యాసః ఇత్యుచ్యతే. అయంచ అధ్యాసో ద్వివిధః - అర్ధాధ్యాసో, జ్ఞానాధ్యాసః - జ్ఞానాధ్యాసః ఏవ మిధ్యాజ్ఞానం, భ్రాంతిః ఇతి చ ఉచ్యతే.

(త్రికాలములందును త్రాడు పాము కానేరదు. అయినప్పటికీ చీకటిలో అది త్రాడు అని భ్రమింప చేయును - ఇదియే అధ్యాసము - ఈ అధ్యాసము రెండు విధములు - అర్ధా ధ్యాసము, జ్ఞానాధ్యాసము - జ్ఞానాధ్యాసమే మిధ్యా జ్ఞానమని, భ్రాంతియని చెప్పబడుచున్నది.)

  1. “అగ్ని సంగాత్ యధా లోహమగ్నిత్వ ముప గచ్ఛతి |

ఆత్మసంగాత్తధా గచ్ఛత్యాత్మతా మింద్రియాది కం |

న దేహపి న జీవోపి నభవేదుభయం తతః |

జాత్యేత రాదికం భ్రాంతం సత్యే స్వాత్మని కల్పితం ||”

ఇతి శ్రుతేః

(అగ్నిలో ఎర్రగా కాలిన ఇనుపకడ్డీ ఆ అగ్నివలనే ఎర్రగా ఉండి, వేడిగా ఉండును. కాని, ఆ రంగు, ఆ ఉష్ణత ఇనుప కడ్డీది కాదు - ఇనుపకడ్డీదే అనుకొనుట భ్రాంతియే. ఇనుప కడ్డీ యొక్క పొడుగు పొట్టి అనునవి అగ్నికి పట్టినట్లు కనబడును. అదియు భ్రాంతియే. ఇదియే అధ్యాస. ఈ ప్రకారముగానే ఇంద్రియములు మొదలగునవి ఆత్మను పొందియుండుటవలన అవి ఆత్మయే అనుకొనుట అధ్యాసము)

  1. “అస్తి, భాతి, ప్రియం” అనునవి - సత్తా, భాస, ప్రియములు - ఆత్మధర్మములు. నామరూపములు అనాత్మధర్మములు. ఈ అనాత్మధర్మములను ఆత్మయందును, ఆత్మధర్మములను అనాత్మయందు ఆరోపించుట అధ్యాసము. ఉదాహరణకు - భార్యా పుత్రాదులకు కలుగు సుఖదుఃఖములు ఆత్మయందారోపించుకొని, ‘అహం సుఖీ, అహం దుఃఖీ’ - నేను సుఖము కలవాడను, నేను దుఃఖము కలవాడను- అని అనుకొనుట,

  2. ఒక వస్తువునకును, ఇంకొక వస్తువునకును సామ్యము - పోలిక - లేకపోయినను - ఇది అదే అని అరోపించుట అధ్యాసము - (1) “మనో బ్రహ్మ ఇత్యుపాసీత” - మనస్సే బ్రహ్మ మని ఉపాసించవలెను - (2) “ఆదిత్యో బ్రహ్మ ఇత్యుపాసీత”. ఆదిత్యుడు - సూర్యుడు - బ్రహ్మ అని ఉపాసించవలెను, ఆదిత్యుని యందు బ్రహ్మదృష్టి పెట్టి ఉపాసించవలెను - అను నది అధ్యాస. (3) ప్రతిమ మొదలగివాటిని విష్ణువు మొదలగు రూప ములుగ్భాహావించుట భావించుట అధ్యాసము - ఆ ప్రతిమ విష్ణువను భావమున్నను అది ప్రతిమ అను బుద్ధిపోదు కనుక.

  3. “అహమితి ప్రథమో అధ్యాసః” అని వ్యాస సూత్రము.

    1. పరిశుద్ధమైన ఆత్మను అజ్ఞానము ఆవరించుటవలన మొదట తానే దేహమనియు, ఇంద్రియములనుచు > తలచి, పిమ్మట దేహ ధర్మములను తనధర్మములని తలచును - ఇట్లే దేహము, ఇంద్రియములు > మొదలగు వాటియందు ఆత్మ స్వరూపమును ఆత్మ ధర్మములని తలచును.’నేను, నాది’ అని > తలచును. ఈ ప్రకారము తాను కాని వస్తువు తానని తలచుట అధ్యాస అనబడును. ఈ > అధ్యాసకు మూలము అజ్ఞానము.

    2. బ్రహ్మస్వరూపమగు తనయందు సంసారి యగు జీవుడు అను బుద్ధి కలుగుట అధ్యాస. ఈ అధ్యాస > యదార్ధజ్ఞానమువలననే కలుగును - చీకటిలో త్రాడును చూచి పాము అని కలిగిన బుద్ధి ఇది > పాము కాదు త్రాడే అను యదార్ధజ్ఞానము కలుగగానే తొలగిపోవును. “అహం బ్రహ్మాస్మి” (నేనే > బ్రహ్మము, నేనే బ్రహ్మ స్వరూపుడను అయితిని) అను యదార్ధజ్ఞానము కలుగగానే సంసారి, > జీవుడు అను భ్రమ - భ్రాంతి - పోవును. అందుచేతనే “తరతి శోకమాత్మవిత్”- బ్రహ్మజ్ఞానము > కలవాడు సంసార శోకమును తరించును - అని చెప్పబడినది. “నాస్యః పంథా అయనాయ విద్యతే” - > మోక్షమునకు మఱియొక మార్గము కనబడదు - బ్రహ్మజ్ఞానము వలననే మోక్షము కలుగును - > అనికూడ చెప్పబడినది - “జ్ఞానాదేవతు కైవల్యం” బ్రహ్మజ్ఞానము వలననే కైవల్యము - మోక్షము.

  4. అధ్యాసమే ఆరోపము - అధ్యారోపము అని చెప్పబడును.

  5. అధ్యాసో నామ అతన్మిన్ తద్బుధ్ధిః ఇత్య వో చామ - తద్యథా - తల్లక్షణం యధా స్పష్టం భవతి తథా ఉదాహ్రీయతే ఇత్యర్ధః - పుత్ర భార్యా దిషు వికలేషు సకలేషువా అహమేవ వికలస్సకలోవా ఇతి బాహ్య ధర్మాన్ ఆత్మని అధ్యస్యతి -స్వదేహా ద్భేదేన ప్రత్యక్షాః పుత్రాదయః బాహ్యాః. తద్థర్మాన్ సాకల్యాదీన్ దేహ విశిష్టాత్మని అధ్యస్యతి. తద్ధర్మ జ్ఞానాత్ స్వస్మిన్ తత్తుల్య ధర్మాన్ అధ్యస్య తీత్యర్థః - తదా దేహ ధర్మాన్ స్థూలోహం, కృశోహం, గౌరోహం, తిష్టామి, గచ్ఛామి, లంఘయామి చ ఇతి తధా ఇంద్రియ ధర్మాన్ మూకః, క్లీబో, బధిరః, కాణో, అంధోహం ఇతి. తథా అంతఃకరణ ధర్మాన్, కామ సంకల్ప విచికిత్సా ధ్యవసా యాదీన్ - దేహేంద్రియాదీన్ మనో విశిష్టాత్మని అధ్యస్యతి కృశిత్వాది ధర్మవతో దేహా దేరాత్మని తాదాత్మ్యేనకల్పి తత్త్వాత్, తద్ధర్మాః సాక్షాదాత్మని అధ్యస్తా ఇతి మంతవ్యం. ఏవం అహం ప్రత్యయినం అశేష స్వ ప్రచార సాక్షిణి ప్రత్యగాత్మని అధ్యస్య తంచ ప్రత్యగాత్మానంసర్వసాక్షిణం తద్విపర్యయేణ అంతఃకరణాదిషు అన్యస్యతి - ఏవం ఆత్మని అనాత్మతద్ధర్మాధ్యాసం ఉదాహృత్య అనాత్మని అనాత్మని ఆత్మనోపి సంసృష్ట త్వేన అధ్యాసమాహ - ఏవమయ మనాది ర నంతో నైసర్గికో అధ్యాసో అనాత్మని అనాత్మని ఆత్మనోపి సంసృష్ట త్వేన అధ్యాసమాహ - ఏవ మయ మనాది రనంతో నైసర్గికో అధ్యాసో మిధ్యా ప్రత్యయ రూపః కర్తృత్వ భోక్తృత్వ ప్రవర్తకఃసర్వలోక ప్రత్యక్షః (ప్రవాహతో నైసర్గికత్వం) జ్ఞానం వినాధ్వంసా భావాత్ ఆనంత్యం.మిధ్యా ప్రత్యయః - మిధ్యా మాయా తయా ప్రతీయత ఇతి ప్రత్యయః, కార్య ప్రపంచః తత్స్రతీతిశ్చ. అస్య అనర్థహేతోః ప్రహాణాయ ఆత్మైకత్వ విద్యాప్రతిపత్తయే సర్వే వేదాంతాః ఆరభ్యంతే” (శ్రీశంకరః) (బ్రహ్మ సూత్రభాష్యే) (1-1)

(అధ్యాస అనగా అదికానిదానియందు అది యను బుద్ధి, జ్ఞానము కలుగుట. అది ఎట్లనగా - దాని లక్షణము స్పష్టముగా తెలియునట్లు ఉదాహరించుచున్నాను - తన దేహముకన్న వేరై ప్రత్యక్షముగా ఎదుట కనబడుచున్న భార్య, పుత్రుడు మొదలగువారు బాహ్య వస్తువులు. అట్టి భార్యా పుత్రాదులయొక్క కష్ట సుఖములు తన దేహము కన్న వేరైన ఆత్మయందు - తన యందు - ఆరోపించుకొను చున్నాడు. ఈ ప్రకారముగానే దేహమునకు సంబంధించిన ధర్మములైన “నేను బాగా బలిసియున్నాను”, “నేను చిక్కి పోయితిని”, “నడుచుచున్నాను”, “కూర్చుని ఉన్నాను” అనువాటిని కూడ ఆత్మ యందు ఆరోపించుకొనును. ఆ ప్రకారముగానే ఇంద్రియధర్మములైన “నేను మూగవాడిని”, చెవిటి వాడిని“,”గుడ్డి వాడిని” అని ఆత్మయందారోపించుకొనును. ఈ రీతిగా సర్వ సాక్షి అయిన ప్రత్యగాత్మయందు ‘అహం’ అను ప్రత్యయమును - అనగా, ‘నేను’ అను భావము అధ్యస్తము చేయబడుచున్నది - ఆరోపణ చేయబడుచున్నది. విపర్యయముగా - అటునుండి ఇటు - సర్వ సాక్షి అయిన ప్రత్యగాత్మను అంతఃకరణము మొదలగు వాటియందు అధ్యాసము చేయబడుచున్నది. ఈ ప్రకారముగ ఆత్మయందనాత్మ ధర్మములను, అనాత్మవస్తువులైన దేహాదులందు ఆత్మ ధర్మములు నారోపించ బడుచున్నవి. ఈ అధ్యాస మొదలు తుది లేనిది - ఎప్పుడు ప్రారంభమైనదో తెలియదు, దీనికి అంతమనునది లేదు - ఎందుచేతననగా ఇది ప్రవాహరూపము, బ్రహ్మజ్ఞానము లేనియెడల అంతమొందునది కాదు. అందుచేతకూడా అనంతము - ప్రపంచముతోపాటు ఇదికూడ మిధ్యయే, మాయాకార్యము - అనర్ధమునకు కారణమైన దీనిని అంతమొందించుటకే అన్ని ఉపనిషత్తులు పూని ఉపన్యసించుచున్నవి.)

  1. ఏటి ఒడ్డున కదలని చెట్లను చూచి, ఏటిలో పోవుచున్న పడవలోనున్న వాడు చెట్లు కదులుచున్నవనుకొనును. - రైలు పరుగెత్తుచున్నపుడు రైలు మార్గము పక్కనున్న చెట్లు పరుగెత్తుచున్నట్లు అనిపించును - పరుగెత్తుచున్న రైలు ధర్మము స్థిరముగానున్న చెట్ల యందారోపించడమైనది. ఇది అధ్యాస.
Transliteration
  1. “satyānṛta vastvabhēda pratīti radhyāsaḥ” (śrīśaṃkaraḥ)

(satyamunaku asatyamunaku bhēdamu lēnaṭlu kanupiṃpa cēyunadi.)

  1. svājñānaṃ adhyāsa hētuḥ (tānevarō, tana nijatatvamēdō teliyakuṃḍuṭayē adhyāsaku kāraṇamu.)

  2. midhyājñānaṃ, atasmik tadbuddhiḥ, ayadārdhānu bhavaḥ smṛtirūpaḥ, paratra pūrva dṛṣṭāva bhāsaḥ.

(ayadārdhajñānamu - adikāni dāniyaṃdu adi yagu buddhi kaligi yuṃḍuṭa. idivaṟaku cūcina vastuvu jñāpakamunaku rāgā adē idi yani sphuriṃcuṭa. yadārdhamukāni anubhavamu.)

(rātri cīkaṭilō trāḍunu cūci adi pāmu anukonuṭa adhyāsa ī prakāramugānē cīkaṭilō mutyapu cippanu cūci adi veṃḍi yani anukonuṭa; eṃḍamāvulanu cūci jalamani talacuṭa, oka moṃḍiceṭṭuni cūci adi maniṣi ani anukonuṭa - adhyāsa. prati adhyāsa yaṃdu oka vastuvunu iṃkoka vastuvu porapāṭugā anukonuṭa. cīkaṭilō trāḍunu, mutyapucippanu cūci idivaṟaku tana anubhavamulō cūcina maṟiyoka vastuvu - trāḍu, veṃḍi - jñāpakamunaku rāgā adē idi yani anukonuṭa adhyāsa.pāmunu veṃḍini idivaṟaku cūḍani vāniki adhyāsa kalugadu.)

  1. okavastuvunu cūci dāniyaṃdu maṟiyoka vastuvunainanu maṟiyoka vastuvuyokka dharmamulanainanu ārōpiṃcuṭa, paraspara bhēdamugala reṃḍuvastuvulayokka - mutyapu cippa, veṃḍi, trāḍu, pāmu - bhēdamu teliyanaṃduna adhyāsa kalugunu.

  2. dēhēṃdriyaprāṇa manō ahaṃkārādīnāṃ janmādi tadvikārāṇāṃ ca ātmani pratyak caitanyamayē bhānaṃ ātmanaḥ taddharmāṇāṃ satya jñānānaṃtā naṃdā dīnāṃ ca anātmani bhāvaṃca adhyāsaḥ. ityucyatē. asye vai bhrāṃtiḥ, vikṣēpaḥ, śōkaḥ, ityādivyapadēśāḥ.

(dēhamu, iṃdriyamulu, prāṇamu, manassu, ahaṃkāramu, jananamu modalaguvāṭi vikāramulanu ātmayaṃ dārōpiṃcuṭa, - ātma dharmamulaina satyamu, jñānamu, anaṃtamu, ānaṃdamu modalaguvāṭini ātmagāni vāṭiyaṃdu - anātma vastuvulaṃdu - ārōpiṃcuṭa adhyāsa ani ceppabaḍunu, ī adhyāsayē bhrāṃti, vikṣēpamu, śōkamu modalagunavigā ceppabaḍucunnavi.)

  1. cidrūpamaina brahmamaṃdu māyā saṃbaṃdhamu adhyāsamu - śuddha brahmamunaṃdu māya adhyāsamu valana ā brahmamē prakṛti, dāni vikāramulu kalisi, prājñuḍu, taijasuḍu, viśvuḍu anu nāmāṃtaramulugala jīvuḍai tana paratatvamunu vismariṃci saṃsāramulō tirugucuṃḍunu. prapaṃcamaṃtā paramātmayē ayi uṃḍagā bhrāṃtivalana prapaṃcamugā - brahmakanna vērugā - cūcuṭa adhyāsa.”sarvaṃ khilvidaṃ brahma” - idaṃtā brahmamē kadā ! - ani jñānamuvalana ī adhyāsa tolagipōvunu,

  2. kālatrayēpi sarpā bhāvau api ra dvādau prātibhāsika sarpādi buddhiḥ tādṛśa sarpādi tajjñānaṃca adhyāsaḥ ityucyatē. ayaṃca adhyāsō dvividhaḥ - ardhādhyāsō, jñānādhyāsaḥ - jñānādhyāsaḥ ēva midhyājñānaṃ, bhrāṃtiḥ iti ca ucyatē.

(trikālamulaṃdunu trāḍu pāmu kānēradu. ayinappaṭikī cīkaṭilō adi trāḍu ani bhramiṃpa cēyunu - idiyē adhyāsamu - ī adhyāsamu reṃḍu vidhamulu - ardhā dhyāsamu, jñānādhyāsamu - jñānādhyāsamē midhyā jñānamani, bhrāṃtiyani ceppabaḍucunnadi.)

  1. “agni saṃgāt yadhā lōhamagnitva mupa gacchati |

ātmasaṃgāttadhā gacchatyātmatā miṃdriyādi kaṃ |

na dēhapi na jīvōpi nabhavēdubhayaṃ tataḥ |

jātyēta rādikaṃ bhrāṃtaṃ satyē svātmani kalpitaṃ ||”

iti śrutēḥ

(agnilō erragā kālina inupakaḍḍī ā agnivalanē erragā uṃḍi, vēḍigā uṃḍunu. kāni, ā raṃgu, ā uṣṇata inupa kaḍḍīdi kādu - inupakaḍḍīdē anukonuṭa bhrāṃtiyē. inupa kaḍḍī yokka poḍugu poṭṭi anunavi agniki paṭṭinaṭlu kanabaḍunu. adiyu bhrāṃtiyē. idiyē adhyāsa. ī prakāramugānē iṃdriyamulu modalagunavi ātmanu poṃdiyuṃḍuṭavalana avi ātmayē anukonuṭa adhyāsamu)

  1. “asti, bhāti, priyaṃ” anunavi - sattā, bhāsa, priyamulu - ātmadharmamulu. nāmarūpamulu anātmadharmamulu. ī anātmadharmamulanu ātmayaṃdunu, ātmadharmamulanu anātmayaṃdu ārōpiṃcuṭa adhyāsamu. udāharaṇaku - bhāryā putrādulaku kalugu sukhaduḥkhamulu ātmayaṃdārōpiṃcukoni, ‘ahaṃ sukhī, ahaṃ duḥkhī’ - nēnu sukhamu kalavāḍanu, nēnu duḥkhamu kalavāḍanu- ani anukonuṭa,

  2. oka vastuvunakunu, iṃkoka vastuvunakunu sāmyamu - pōlika - lēkapōyinanu - idi adē ani arōpiṃcuṭa adhyāsamu - (1) “manō brahma ityupāsīta” - manassē brahma mani upāsiṃcavalenu - (2) “ādityō brahma ityupāsīta”. ādityuḍu - sūryuḍu - brahma ani upāsiṃcavalenu, ādityuni yaṃdu brahmadṛṣṭi peṭṭi upāsiṃcavalenu - anu nadi adhyāsa. (3) pratima modalagivāṭini viṣṇuvu modalagu rūpa mulugbhāhāviṃcuṭa bhāviṃcuṭa adhyāsamu - ā pratima viṣṇuvanu bhāvamunnanu adi pratima anu buddhipōdu kanuka.

  3. “ahamiti prathamō adhyāsaḥ” ani vyāsa sūtramu.

    1. pariśuddhamaina ātmanu ajñānamu āvariṃcuṭavalana modaṭa tānē dēhamaniyu, iṃdriyamulanucu > talaci, pimmaṭa dēha dharmamulanu tanadharmamulani talacunu - iṭlē dēhamu, iṃdriyamulu > modalagu vāṭiyaṃdu ātma svarūpamunu ātma dharmamulani talacunu.’nēnu, nādi’ ani > talacunu. ī prakāramu tānu kāni vastuvu tānani talacuṭa adhyāsa anabaḍunu. ī > adhyāsaku mūlamu ajñānamu.

    2. brahmasvarūpamagu tanayaṃdu saṃsāri yagu jīvuḍu anu buddhi kaluguṭa adhyāsa. ī adhyāsa > yadārdhajñānamuvalananē kalugunu - cīkaṭilō trāḍunu cūci pāmu ani kaligina buddhi idi > pāmu kādu trāḍē anu yadārdhajñānamu kalugagānē tolagipōvunu. “ahaṃ brahmāsmi” (nēnē > brahmamu, nēnē brahma svarūpuḍanu ayitini) anu yadārdhajñānamu kalugagānē saṃsāri, > jīvuḍu anu bhrama - bhrāṃti - pōvunu. aṃducētanē “tarati śōkamātmavit”- brahmajñānamu > kalavāḍu saṃsāra śōkamunu tariṃcunu - ani ceppabaḍinadi. “nāsyaḥ paṃthā ayanāya vidyatē” - > mōkṣamunaku maṟiyoka mārgamu kanabaḍadu - brahmajñānamu valananē mōkṣamu kalugunu - > anikūḍa ceppabaḍinadi - “jñānādēvatu kaivalyaṃ” brahmajñānamu valananē kaivalyamu - mōkṣamu.

  4. adhyāsamē ārōpamu - adhyārōpamu ani ceppabaḍunu.

  5. adhyāsō nāma atanmin tadbudhdhiḥ itya vō cāma - tadyathā - tallakṣaṇaṃ yadhā spaṣṭaṃ bhavati tathā udāhrīyatē ityardhaḥ - putra bhāryā diṣu vikalēṣu sakalēṣuvā ahamēva vikalassakalōvā iti bāhya dharmān ātmani adhyasyati -svadēhā dbhēdēna pratyakṣāḥ putrādayaḥ bāhyāḥ. tadtharmān sākalyādīn dēha viśiṣṭātmani adhyasyati. taddharma jñānāt svasmin tattulya dharmān adhyasya tītyarthaḥ - tadā dēha dharmān sthūlōhaṃ, kṛśōhaṃ, gaurōhaṃ, tiṣṭāmi, gacchāmi, laṃghayāmi ca iti tadhā iṃdriya dharmān mūkaḥ, klībō, badhiraḥ, kāṇō, aṃdhōhaṃ iti. tathā aṃtaḥkaraṇa dharmān, kāma saṃkalpa vicikitsā dhyavasā yādīn - dēhēṃdriyādīn manō viśiṣṭātmani adhyasyati kṛśitvādi dharmavatō dēhā dērātmani tādātmyēnakalpi tattvāt, taddharmāḥ sākṣādātmani adhyastā iti maṃtavyaṃ. ēvaṃ ahaṃ pratyayinaṃ aśēṣa sva pracāra sākṣiṇi pratyagātmani adhyasya taṃca pratyagātmānaṃsarvasākṣiṇaṃ tadviparyayēṇa aṃtaḥkaraṇādiṣu anyasyati - ēvaṃ ātmani anātmataddharmādhyāsaṃ udāhṛtya anātmani anātmani ātmanōpi saṃsṛṣṭa tvēna adhyāsamāha - ēvamaya manādi ra naṃtō naisargikō adhyāsō anātmani anātmani ātmanōpi saṃsṛṣṭa tvēna adhyāsamāha - ēva maya manādi ranaṃtō naisargikō adhyāsō midhyā pratyaya rūpaḥ kartṛtva bhōktṛtva pravartakaḥsarvalōka pratyakṣaḥ (pravāhatō naisargikatvaṃ) jñānaṃ vinādhvaṃsā bhāvāt ānaṃtyaṃ.midhyā pratyayaḥ - midhyā māyā tayā pratīyata iti pratyayaḥ, kārya prapaṃcaḥ tatsratītiśca. asya anarthahētōḥ prahāṇāya ātmaikatva vidyāpratipattayē sarvē vēdāṃtāḥ ārabhyaṃtē” (śrīśaṃkaraḥ) (brahma sūtrabhāṣyē) (1-1)

(adhyāsa anagā adikānidāniyaṃdu adi yanu buddhi, jñānamu kaluguṭa. adi eṭlanagā - dāni lakṣaṇamu spaṣṭamugā teliyunaṭlu udāhariṃcucunnānu - tana dēhamukanna vērai pratyakṣamugā eduṭa kanabaḍucunna bhārya, putruḍu modalaguvāru bāhya vastuvulu. aṭṭi bhāryā putrādulayokka kaṣṭa sukhamulu tana dēhamu kanna vēraina ātmayaṃdu - tana yaṃdu - ārōpiṃcukonu cunnāḍu. ī prakāramugānē dēhamunaku saṃbaṃdhiṃcina dharmamulaina “nēnu bāgā balisiyunnānu”, “nēnu cikki pōyitini”, “naḍucucunnānu”, “kūrcuni unnānu” anuvāṭini kūḍa ātma yaṃdu ārōpiṃcukonunu. ā prakāramugānē iṃdriyadharmamulaina “nēnu mūgavāḍini”, ceviṭi vāḍini”, “guḍḍi vāḍini” ani ātmayaṃdārōpiṃcukonunu. ī rītigā sarva sākṣi ayina pratyagātmayaṃdu ‘ahaṃ’ anu pratyayamunu - anagā, ‘nēnu’ anu bhāvamu adhyastamu cēyabaḍucunnadi - ārōpaṇa cēyabaḍucunnadi. viparyayamugā - aṭunuṃḍi iṭu - sarva sākṣi ayina pratyagātmanu aṃtaḥkaraṇamu modalagu vāṭiyaṃdu adhyāsamu cēyabaḍucunnadi. ī prakāramuga ātmayaṃdanātma dharmamulanu, anātmavastuvulaina dēhādulaṃdu ātma dharmamulu nārōpiṃca baḍucunnavi. ī adhyāsa modalu tudi lēnidi - eppuḍu prāraṃbhamainadō teliyadu, dīniki aṃtamanunadi lēdu - eṃducētananagā idi pravāharūpamu, brahmajñānamu lēniyeḍala aṃtamoṃdunadi kādu. aṃducētakūḍā anaṃtamu - prapaṃcamutōpāṭu idikūḍa midhyayē, māyākāryamu - anardhamunaku kāraṇamaina dīnini aṃtamoṃdiṃcuṭakē anni upaniṣattulu pūni upanyasiṃcucunnavi.)

  1. ēṭi oḍḍuna kadalani ceṭlanu cūci, ēṭilō pōvucunna paḍavalōnunna vāḍu ceṭlu kadulucunnavanukonunu. - railu parugettucunnapuḍu railu mārgamu pakkanunna ceṭlu parugettucunnaṭlu anipiṃcunu - parugettucunna railu dharmamu sthiramugānunna ceṭla yaṃdārōpiṃcaḍamainadi. idi adhyāsa.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.