(ఉపనిషత్తులలో భగవంతుని గుఱించి - భగవత్తత్వము గుఱించి చెప్పబడిన విద్య.)
(జీవుడు, పరమాత్మ ఈ రెండింటియొక్క యాధాత్మ్యమును తెలియచేయు విద్య; దానిలో చెప్పబడిన విషయములోను, ఫలమునిచ్చుటలోను ఇతర విద్యలన్నింటికన్నను ఉత్కృష్టమైనది.)
విద్యానాం మోక్షార్ధత్వాత్ ప్రథానం. (మోక్షమే పురుషార్ధమగుటవల్ల విద్యలన్నింటిలోను ప్రధానమైనది.)
“అధ్యాత్మవిద్యా విద్యానాం ప్రధానం” (యోగవాసిష్టము - 6 - 21)
(విద్యలన్నింటిలోను అధ్యాత్మ విద్య ప్రధానమైనది.)
(న్యాయ వైశేషికుల మతము ప్రకారము అధ్యాత్మ విద్య - ఆత్మ కన్న దేహమువేరని - చెప్పుచున్నది. సాంఖ్యులమతమందు బ్రహ్మకన్న ప్రకృతి వేరని చెప్పబడినది. వేదాంత మతమందు అంతా బ్రహ్మమని చెప్పబడినది - బ్రహ్మకంటె వేరైనదేదియు లేదని చెప్పబడినది. కాని అన్ని మతములలోను ఆత్మతత్వమే, బ్రహ్మతత్వమే చెప్పబడినందువల్ల ఈ ఆత్మ తత్వజ్ఞానము అధ్యాత్మ విద్య యని చెప్పబడినది.)
“ఆధ్యాత్మ విద్యా విద్యానాం మోక్షహేతురహం హరిః |”. (గీతాభావప్రకాశము - 10 - 133)
(విద్యలన్నింటిలోను మోక్షమునకు కారణమైన అధ్యాత్మవిద్య హరి యైన నేనే)తనవిభూతులన్నింటినీ చెప్పుచూ శ్రీకృష్ణభగవానుడు అధ్యాత్మ విద్య తన విభూతి అని చెప్పెను. “జ్ఞానాదేవ తు కైవల్యం”
(జ్ఞానమువలననే మోక్షము కలుగును అని చెప్పబడియున్నది. కనుక అట్టి అధ్యాత్మ విద్య భగవంతుని రూపమే.)
(upaniṣattulalō bhagavaṃtuni guṟiṃci - bhagavattatvamu guṟiṃci ceppabaḍina vidya.)
(jīvuḍu, paramātma ī reṃḍiṃṭiyokka yādhātmyamunu teliyacēyu vidya; dānilō ceppabaḍina viṣayamulōnu, phalamuniccuṭalōnu itara vidyalanniṃṭikannanu utkṛṣṭamainadi.)
vidyānāṃ mōkṣārdhatvāt prathānaṃ. (mōkṣamē puruṣārdhamaguṭavalla vidyalanniṃṭilōnu pradhānamainadi.)
“adhyātmavidyā vidyānāṃ pradhānaṃ” (yōgavāsiṣṭamu - 6 - 21)
(vidyalanniṃṭilōnu adhyātma vidya pradhānamainadi.)
(nyāya vaiśēṣikula matamu prakāramu adhyātma vidya - ātma kanna dēhamuvērani - ceppucunnadi. sāṃkhyulamatamaṃdu brahmakanna prakṛti vērani ceppabaḍinadi. vēdāṃta matamaṃdu aṃtā brahmamani ceppabaḍinadi - brahmakaṃṭe vērainadēdiyu lēdani ceppabaḍinadi. kāni anni matamulalōnu ātmatatvamē, brahmatatvamē ceppabaḍinaṃduvalla ī ātma tatvajñānamu adhyātma vidya yani ceppabaḍinadi.)
“ādhyātma vidyā vidyānāṃ mōkṣahēturahaṃ hariḥ |”. (gītābhāvaprakāśamu - 10 - 133)
(vidyalanniṃṭilōnu mōkṣamunaku kāraṇamaina adhyātmavidya hari yaina nēnē)tanavibhūtulanniṃṭinī ceppucū śrīkṛṣṇabhagavānuḍu adhyātma vidya tana vibhūti ani ceppenu. “jñānādēva tu kaivalyaṃ”
(jñānamuvalananē mōkṣamu kalugunu ani ceppabaḍiyunnadi. kanuka aṭṭi adhyātma vidya bhagavaṃtuni rūpamē.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.