← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అధ్యాత్మము adhyātmamu

Original — తెలుగు
  1. ఆత్మని శరీరే అధిగమ్యతే, ప్రత్యగాత్మ. (శరీరమందు ఉన్న ఆత్మ, ప్రత్యగాత్మ.)

  2. “ఆత్మన్యధి యత్ తదధ్యాత్మం, ఆత్మాధికారే యత్ తదితివా. స ఏవాత్మానం దేహమదికృత్య భోక్తృత్వేన వర్తమానో > ఆధ్యాత్మ శబ్దే నోచ్యతే” (శ్రీధరస్వామి)

(దేహమునకధికారియై భోక్తృరూపమున నుండువాడు)

  1. “ఆత్మని అధివసనాత్సంబంధ్యమానం ఇత్యధ్యాత్మ శబ్ద నిర్వచనం” (శ్రీవేదాంతదేశికః)

(దేహమందు అధివసించి యుండుటవలన బద్ధుడై యుండువాడు.)

  1. ఆత్మానం అధికృత్య తస్య భోగాయ తసత్వేన వర్తతే ఇత్యధ్యాత్మం, శరీరం.

(ఆత్మని ఆశ్రయించి యుండు దానికి భోగస్థానము వలె యుండునది - శరీరము.)

  1. ఆత్మానం దేహమధికృత్య వర్తతే ఇత్యధ్యాత్మం, ప్రత్యక్స్వరూపమేవ, ఆత్మానం దేహం అధికృత్యస్థితం -

“అధయ ఏ షోంత రక్షిణి పురుషో ద్రుశ్యతే” ఇత్యాది.

(దేహమందు అధికరించియుండునది - “కంటిలోపలనుండు పురుషుడు” అని చెప్పిన ప్రకారము దేహములో నుండు పురుషుడు - ప్రత్యగాత్మ.)

  1. ఆత్మానం భోక్తారం అధికృత్య యద్వర్తతే.

(భోక్త అయిన ఆత్మను అధికరించి వర్తించునది.)

  1. ఆత్మానం జీవమధికృత్య తదుపకారిత్వేన వర్తమానం వస్తు ఇత్యర్ధః - ఆత్మాధికరః - ఇతి.

(జీవుని అధికరించియుండి, అతనికి ఉపకారము చేయువాడు, ఆత్మాధికారి.)

  1. ఆత్మానం కార్యకారణ సంఘాతం అధికృత్య వర్తమానం అధ్యాత్మం, ఆత్మ తత్వం.

(కార్య సంఘమును కారణసంఘమును - అనగా, కార్యకారణములన్నింటినీ అధికరించి ప్రవర్తించునది - ఆత్మతత్వము.)

(ఈ విషయము శ్రీమదాంధ్ర మహాభాగవతములో ఈ క్రింద విధముగా చెప్పబడినది : -

సీ. కార్యవర్గంబును గారణసంఘంబు నధికరించి చరించు నాత్మ తత్వ

మధ్యాత్మ మనబడు ---“. (శ్రీమదాంధ్ర మహాభాగవతము -1 - 2 - 54)

  1. “య ఆత్మని తిష్టన్” ఇత్యాధ్యాత్మం. (ఆత్మయందుండునది పరమాత్మ అని శ్రుతి చెప్పబడినది > అధ్యాత్మము.)

  2. పరమాత్మ ధర్మః

(మోక్ష విషయమైన జ్ఞానము; వేదాంత జ్ఞానము - ఆత్మ తత్వము; పరబ్రహ్మము; పరమాత్మ స్వభావము.)

  1. ప్రత్యగాత్మ విషయం వస్తు.

(ప్రత్యగాత్మ జీవుని వాస్తవ స్వరూపము; స్వస్వరూపము; జీవాత్మ; దేహి.)

  1. ప్రత్యద్రూపేణ సర్వాత్మానం విరాజమధి కృత్య భవతీతి అధ్యాత్మం.

(పరమాత్మ అయిన విరాత్పురుషుని అధికరించి ప్రత్యగా ఉండునది.)

  1. ఆత్మనా జీవేన అధిష్టితాని ఇంద్రియాణి ఆధ్యాత్మ శబ్దేన అభిధీయంతే.

(జీవుడు అధిష్టించియున్న ఇంద్రియములు అధ్యాత్మమనబడుచున్నవి.)

  1. “స్వభావో(అ)ధ్యాత్మ ఉచ్యతే” (శ్రీమద్భగవద్గీత - 8 - 3)

(స్వభావము అధ్యాత్మమని చెప్పబడుచున్నది.)

“స్వోభావః స్వస్వరూపం యత్ప్రత్యక్ చైతన్యమేవహి |

ఉచ్యతే అధ్యాత్మశబ్దేన నేంద్రియ గ్రామ మిత్యయం“. (గీతాభావ ప్రకాశము - 8 - 18)

(అక్షర బ్రహ్మ యొక్క స్వభావము, అనగా - స్వస్వరూపము - అదియే ప్రత్యక్ చైతన్యము - ప్రత్యగాత్మ; ప్రతిదేహములోను ఉన్న పరమాత్మ తత్వమే ప్రత్యక్ చైతన్యము, లేక ప్రత్యగాత్మ. ఇదియే స్వస్వభావము - ఇదియే ఆధ్యాత్మము - ఇంద్రియములు ఆధ్యాత్మముకాదు.)

  1. “స్వస్వైవ బ్రహ్మణః ఏవాంశతయా జీవ స్వరూపేణ భావో భవనం, స ఏవ ఆత్మానం దేహమధికృత్య భోక్తృత్వేన > వర్తమానో ఆధ్యాత్మశబ్దేనోచ్యతే”.

(తన యొక్క, అనగా, పరబ్రహ్మ యొక్క అంశయే జీవరూపమగుట. దేహమును అధికరించి భోక్తగా ప్రవర్తించు ఆ జీవుడే ఆధ్యాత్మయని చెప్పబడుచున్నాడు.)

  1. “ఆధ్యాత్మం జీవ ఉచ్యతే” (గీతాకల్పే)

(అధ్యాత్మమనగా జీవుడే చెప్పబడుచున్నాడు.)

  1. “ఆత్మానం దేహం అధికృత్య ప్రత్యగాత్మతయా ప్రవృత్తం పరమార్థ బ్రహ్మావసావం వస్తు స్వభావః

ఆధ్యాత్మం ఉచ్యతే, ఆధ్యాత్మ శబ్దేనాభిధీయతే“. (శ్రీ శంకరః)

(ఆత్మ యనగా దేహము; దేహమును అధికరించి ప్రత్యబ్రహ్మగా అయిన బ్రహ్మ పదార్థమే - బ్రహ్మ తత్వమే - లేక బ్రహ్మ స్వభావము అధ్యాత్మమని చెప్పబడుచున్నది.) (చూడుము - ‘అధి దైవతము’ - 6, 7)

  1. ఆత్మను గుఱించినది; పరబ్రహ్మము; పరమాత్మ స్వభావము; మోక్షవిషయమైనది.
Transliteration
  1. ātmani śarīrē adhigamyatē, pratyagātma. (śarīramaṃdu unna ātma, pratyagātma.)

  2. “ātmanyadhi yat tadadhyātmaṃ, ātmādhikārē yat taditivā. sa ēvātmānaṃ dēhamadikṛtya bhōktṛtvēna vartamānō > ādhyātma śabdē nōcyatē” (śrīdharasvāmi)

(dēhamunakadhikāriyai bhōktṛrūpamuna nuṃḍuvāḍu)

  1. “ātmani adhivasanātsaṃbaṃdhyamānaṃ ityadhyātma śabda nirvacanaṃ” (śrīvēdāṃtadēśikaḥ)

(dēhamaṃdu adhivasiṃci yuṃḍuṭavalana baddhuḍai yuṃḍuvāḍu.)

  1. ātmānaṃ adhikṛtya tasya bhōgāya tasatvēna vartatē ityadhyātmaṃ, śarīraṃ.

(ātmani āśrayiṃci yuṃḍu dāniki bhōgasthānamu vale yuṃḍunadi - śarīramu.)

  1. ātmānaṃ dēhamadhikṛtya vartatē ityadhyātmaṃ, pratyaksvarūpamēva, ātmānaṃ dēhaṃ adhikṛtyasthitaṃ -

“adhaya ē ṣōṃta rakṣiṇi puruṣō druśyatē” ityādi.

(dēhamaṃdu adhikariṃciyuṃḍunadi - “kaṃṭilōpalanuṃḍu puruṣuḍu” ani ceppina prakāramu dēhamulō nuṃḍu puruṣuḍu - pratyagātma.)

  1. ātmānaṃ bhōktāraṃ adhikṛtya yadvartatē.

(bhōkta ayina ātmanu adhikariṃci vartiṃcunadi.)

  1. ātmānaṃ jīvamadhikṛtya tadupakāritvēna vartamānaṃ vastu ityardhaḥ - ātmādhikaraḥ - iti.

(jīvuni adhikariṃciyuṃḍi, ataniki upakāramu cēyuvāḍu, ātmādhikāri.)

  1. ātmānaṃ kāryakāraṇa saṃghātaṃ adhikṛtya vartamānaṃ adhyātmaṃ, ātma tatvaṃ.

(kārya saṃghamunu kāraṇasaṃghamunu - anagā, kāryakāraṇamulanniṃṭinī adhikariṃci pravartiṃcunadi - ātmatatvamu.)

(ī viṣayamu śrīmadāṃdhra mahābhāgavatamulō ī kriṃda vidhamugā ceppabaḍinadi : -

sī. kāryavargaṃbunu gāraṇasaṃghaṃbu nadhikariṃci cariṃcu nātma tatva

madhyātma manabaḍu ---“. (śrīmadāṃdhra mahābhāgavatamu -1 - 2 - 54)

  1. “ya ātmani tiṣṭan” ityādhyātmaṃ. (ātmayaṃduṃḍunadi paramātma ani śruti ceppabaḍinadi > adhyātmamu.)

  2. paramātma dharmaḥ

(mōkṣa viṣayamaina jñānamu; vēdāṃta jñānamu - ātma tatvamu; parabrahmamu; paramātma svabhāvamu.)

  1. pratyagātma viṣayaṃ vastu.

(pratyagātma jīvuni vāstava svarūpamu; svasvarūpamu; jīvātma; dēhi.)

  1. pratyadrūpēṇa sarvātmānaṃ virājamadhi kṛtya bhavatīti adhyātmaṃ.

(paramātma ayina virātpuruṣuni adhikariṃci pratyagā uṃḍunadi.)

  1. ātmanā jīvēna adhiṣṭitāni iṃdriyāṇi ādhyātma śabdēna abhidhīyaṃtē.

(jīvuḍu adhiṣṭiṃciyunna iṃdriyamulu adhyātmamanabaḍucunnavi.)

  1. “svabhāvō(a)dhyātma ucyatē” (śrīmadbhagavadgīta - 8 - 3)

(svabhāvamu adhyātmamani ceppabaḍucunnadi.)

“svōbhāvaḥ svasvarūpaṃ yatpratyak caitanyamēvahi |

ucyatē adhyātmaśabdēna nēṃdriya grāma mityayaṃ”. (gītābhāva prakāśamu - 8 - 18)

(akṣara brahma yokka svabhāvamu, anagā - svasvarūpamu - adiyē pratyak caitanyamu - pratyagātma; pratidēhamulōnu unna paramātma tatvamē pratyak caitanyamu, lēka pratyagātma. idiyē svasvabhāvamu - idiyē ādhyātmamu - iṃdriyamulu ādhyātmamukādu.)

  1. “svasvaiva brahmaṇaḥ ēvāṃśatayā jīva svarūpēṇa bhāvō bhavanaṃ, sa ēva ātmānaṃ dēhamadhikṛtya bhōktṛtvēna > vartamānō ādhyātmaśabdēnōcyatē”.

(tana yokka, anagā, parabrahma yokka aṃśayē jīvarūpamaguṭa. dēhamunu adhikariṃci bhōktagā pravartiṃcu ā jīvuḍē ādhyātmayani ceppabaḍucunnāḍu.)

  1. “ādhyātmaṃ jīva ucyatē” (gītākalpē)

(adhyātmamanagā jīvuḍē ceppabaḍucunnāḍu.)

  1. “ātmānaṃ dēhaṃ adhikṛtya pratyagātmatayā pravṛttaṃ paramārtha brahmāvasāvaṃ vastu svabhāvaḥ

ādhyātmaṃ ucyatē, ādhyātma śabdēnābhidhīyatē”. (śrī śaṃkaraḥ)

(ātma yanagā dēhamu; dēhamunu adhikariṃci pratyabrahmagā ayina brahma padārthamē - brahma tatvamē - lēka brahma svabhāvamu adhyātmamani ceppabaḍucunnadi.) (cūḍumu - ‘adhi daivatamu’ - 6, 7)

  1. ātmanu guṟiṃcinadi; parabrahmamu; paramātma svabhāvamu; mōkṣaviṣayamainadi.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.