గురు సన్నిధిని ఆనుపూర్వికంగా వేదమును చదువుట.
అధ్యయనం చ అక్షరమాత్ర పాఠః ఇది వైదికాః; సార్ధాక్షర గ్రహణమితి మీమాంసకాః.
(అధ్యయమనగా అక్షరమాత్ర పఠనమే అను వైదికుల అభిప్రాయము, అర్ధముతోటి పఠించుట అని మీమాంసకుల అభిప్రాయము.)
(సత్పురుషుడై సదాచారనిష్టుడై వేదమును తెలిసినటువంటి ఆచార్యుని చేరి, వ్రత నియమములతో కూడిన ఆ గురువు ఏ ప్రకారముగా అక్షరరాశి అయిన వేదములోని ఉదాత్త నుదాత్తములతో అక్షరములు నుచ్చరించునో దాని ఫలమును గ్రహించుట.)
(అధ్యయమనగా స్వాధ్యాయ సంస్కారము - “స్వాధ్యాయము అధ్యయనము చేయవలసినది” అని శ్రుతిలో చెప్పబడి యున్నది. సంస్కారమనగా ఇతరకార్యములను చేయుటకు అర్హత కలుగచేయుట. సంస్కారము స్వాధ్యాయమునకు ఉండవలసినదే ధర్మార్ధ కామ మోక్షములను చతుర్విధ పురుషార్ధములను వాటికి సాధనములనుభోధించునది కనుక.)
guru sannidhini ānupūrvikaṃgā vēdamunu caduvuṭa.
adhyayanaṃ ca akṣaramātra pāṭhaḥ idi vaidikāḥ; sārdhākṣara grahaṇamiti mīmāṃsakāḥ.
(adhyayamanagā akṣaramātra paṭhanamē anu vaidikula abhiprāyamu, ardhamutōṭi paṭhiṃcuṭa ani mīmāṃsakula abhiprāyamu.)
(satpuruṣuḍai sadācāraniṣṭuḍai vēdamunu telisinaṭuvaṃṭi ācāryuni cēri, vrata niyamamulatō kūḍina ā guruvu ē prakāramugā akṣararāśi ayina vēdamulōni udātta nudāttamulatō akṣaramulu nuccariṃcunō dāni phalamunu grahiṃcuṭa.)
(adhyayamanagā svādhyāya saṃskāramu - “svādhyāyamu adhyayanamu cēyavalasinadi” ani śrutilō ceppabaḍi yunnadi. saṃskāramanagā itarakāryamulanu cēyuṭaku arhata kalugacēyuṭa. saṃskāramu svādhyāyamunaku uṃḍavalasinadē dharmārdha kāma mōkṣamulanu caturvidha puruṣārdhamulanu vāṭiki sādhanamulanubhōdhiṃcunadi kanuka.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.