చూడబడనిది; భాగ్యము; అగ్ని; నీరు మొదలగువాటివలన కలిగెడు కీడు.
సుఖ దుఃఖములకు కారణమైన పుణ్య పాప రూపమైన కర్మల ఫలము -; తెలియక జరుగునది.
లోచన ప్రథమతి క్రాంతం - (కంటితో చూడగలిగిన శక్తికి మించినది.)
జ్ఞానేంద్రియా గోచరం.
(జ్ఞానేంద్రియములకు గోచరముకానిది - అనగా, కంటికి కనబడకుండా జరుగునది - ఎట్లు జరిగినదో మనసుతో ఊహించుటకు అవకాశము లేనిది. మిగిలిన జ్ఞానేంద్రియముల శక్తికి ఈ ప్రకారమే అతీతమైనది.)
(బాహ్యేంద్రియ జ్ఞానమునకు మించినది - బాహ్యేంద్రియ జ్ఞానముచే తెలియ శక్యము కానిది.)
(దృష్టముకానిది అదృష్టము, కండ్లకు విషయముకానిది - కంటి చూపునకు దొరకనిది.)
(దైవాత్ - అనగా, దైవము వలన - జరిగినదని చెప్పబడినది. పరమాత్మ కార్యము - అది జరుగకముందు జరుగునని ఎవరికి తెలియదు కనుక.)
(కర్మయొక్క సూక్ష్మరూపమును పొందియున్న సంస్కార విశేషమే అదృష్టమని కొందఱిచేత చెప్పబడినది. కనబడని ఆత్మ ధర్మము అని నైయాయికులు, వైశేషికులు అభిప్రాయ పడుచున్నారు - పతంజలిమతమువారు ఇది బుద్ధి ధర్మము అని అభిప్రాయపడుచున్నారు.)
(ఆత్మ పాదములయిన విశ్వుడు, ప్రాజ్ఞుడు, తైజనుడు స్థూల సూక్ష్మ శరీరములలో నుండుట అనుమాన ప్రమాణమువలన తెలుసుకోతగును, కాని ఆత్మయొక్క చతుర్ధపాదము మట్టుకు ఏ విధముగా నైనను కానరాదు - అవగాహన చేసుకొనుటకుకూడ నలవికాదు. అందుచేత అది - ఆత్మ చతుర్ధపాదము పరమాత్మ, అదృష్టము అనిచెప్పబడినది.)
(అడవిలో చెట్లను దహించువేయుచున్న అగ్ని దగ్గరగానున్న చెట్లను విడిచిపెట్టి ఎక్కడో దూరముగా ఉన్నవాటిని దహించివేయును. దీనికి ప్రాణుల అదృష్టము తప్ప ఇంకొక కారణము కానరాదు. ఆ ప్రకారముగానే జీవుల జననమరణములకు కారణము ఊహించుటకు అలవికాదు.)
cūḍabaḍanidi; bhāgyamu; agni; nīru modalaguvāṭivalana kaligeḍu kīḍu.
sukha duḥkhamulaku kāraṇamaina puṇya pāpa rūpamaina karmala phalamu -; teliyaka jarugunadi.
lōcana prathamati krāṃtaṃ - (kaṃṭitō cūḍagaligina śaktiki miṃcinadi.)
jñānēṃdriyā gōcaraṃ.
(jñānēṃdriyamulaku gōcaramukānidi - anagā, kaṃṭiki kanabaḍakuṃḍā jarugunadi - eṭlu jariginadō manasutō ūhiṃcuṭaku avakāśamu lēnidi. migilina jñānēṃdriyamula śaktiki ī prakāramē atītamainadi.)
(bāhyēṃdriya jñānamunaku miṃcinadi - bāhyēṃdriya jñānamucē teliya śakyamu kānidi.)
(dṛṣṭamukānidi adṛṣṭamu, kaṃḍlaku viṣayamukānidi - kaṃṭi cūpunaku dorakanidi.)
(daivāt - anagā, daivamu valana - jariginadani ceppabaḍinadi. paramātma kāryamu - adi jarugakamuṃdu jarugunani evariki teliyadu kanuka.)
(karmayokka sūkṣmarūpamunu poṃdiyunna saṃskāra viśēṣamē adṛṣṭamani koṃdaṟicēta ceppabaḍinadi. kanabaḍani ātma dharmamu ani naiyāyikulu, vaiśēṣikulu abhiprāya paḍucunnāru - pataṃjalimatamuvāru idi buddhi dharmamu ani abhiprāyapaḍucunnāru.)
(ātma pādamulayina viśvuḍu, prājñuḍu, taijanuḍu sthūla sūkṣma śarīramulalō nuṃḍuṭa anumāna pramāṇamuvalana telusukōtagunu, kāni ātmayokka caturdhapādamu maṭṭuku ē vidhamugā nainanu kānarādu - avagāhana cēsukonuṭakukūḍa nalavikādu. aṃducēta adi - ātma caturdhapādamu paramātma, adṛṣṭamu aniceppabaḍinadi.)
(aḍavilō ceṭlanu dahiṃcuvēyucunna agni daggaragānunna ceṭlanu viḍicipeṭṭi ekkaḍō dūramugā unnavāṭini dahiṃcivēyunu. dīniki prāṇula adṛṣṭamu tappa iṃkoka kāraṇamu kānarādu. ā prakāramugānē jīvula jananamaraṇamulaku kāraṇamu ūhiṃcuṭaku alavikādu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.