(జ్ఞానేంద్రియములకు అందనివాడు - జ్ఞానేంద్రియములచేత తెలుసుకొనుటకు వీలు లేనివాడు.)
(అందఱి జ్ఞానేంద్రియములకు గోచరము కానివాడు.)
(ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, మొదలగు ప్రమాణములచేత తెలియబడనివాడు.)
మాయమైనవాడు.
“అద్రేశ్య మగ్రాహ్య మగోత్రం” అని శ్రుతి.
(చూచుటకు, గ్రహించుటకు వీలుకానివాడు - జన్మ తెలిసుకొనుటకు అలవి కానివాడు.)
చక్షురాది గ్రహణా నర్హం (కన్ను మొదలగువాటిచే గ్రహించుటకు వీలు కానిది.)
జ్ఞానేంద్రియా విషయం.
(జ్ఞానేంద్రియములకు విషయముకానిది, అనగా కంటికి కనబడనిది, చెవికి వినబడనిది, బుద్ధికి ఆలోచింపరానిది.)
(దృశ్యమనగా కనబడుచున్నది - యీ స్థూల ప్రపంచము, అది లేనిది - అనగా స్థూలప్రపంచము వలె కనబడనిది.)
(దృశ్యమనగా చూడశక్యమైనది, మార్పు; మార్పు అనునది వికారము, కనబడునది కనుక. దృశ్యముకానిది అదృశ్యము - అనగా, వికారము లేనిది. కనబడినది అనగా ఇదివఱకు కనబడనిది ఇప్పుడు కనబడినది అని అర్ధము. అదియే వికారము, మార్పు. అట్టి మార్పు లేనిది.)
(jñānēṃdriyamulaku aṃdanivāḍu - jñānēṃdriyamulacēta telusukonuṭaku vīlu lēnivāḍu.)
(aṃdaṟi jñānēṃdriyamulaku gōcaramu kānivāḍu.)
(pratyakṣa pramāṇamu, anumāna pramāṇamu, modalagu pramāṇamulacēta teliyabaḍanivāḍu.)
māyamainavāḍu.
“adrēśya magrāhya magōtraṃ” ani śruti.
(cūcuṭaku, grahiṃcuṭaku vīlukānivāḍu - janma telisukonuṭaku alavi kānivāḍu.)
cakṣurādi grahaṇā narhaṃ (kannu modalaguvāṭicē grahiṃcuṭaku vīlu kānidi.)
jñānēṃdriyā viṣayaṃ.
(jñānēṃdriyamulaku viṣayamukānidi, anagā kaṃṭiki kanabaḍanidi, ceviki vinabaḍanidi, buddhiki ālōciṃparānidi.)
(dṛśyamanagā kanabaḍucunnadi - yī sthūla prapaṃcamu, adi lēnidi - anagā sthūlaprapaṃcamu vale kanabaḍanidi.)
(dṛśyamanagā cūḍaśakyamainadi, mārpu; mārpu anunadi vikāramu, kanabaḍunadi kanuka. dṛśyamukānidi adṛśyamu - anagā, vikāramu lēnidi. kanabaḍinadi anagā idivaṟaku kanabaḍanidi ippuḍu kanabaḍinadi ani ardhamu. adiyē vikāramu, mārpu. aṭṭi mārpu lēnidi.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.