(రెండు వస్తువులు వేఱుగా నుండుట యొక్క భావమే ద్విత, ద్వితయే ద్వైతము; ద్వైతము కాకుండటే - ద్వైతము కానిది - అద్వైతము, అనగా - పరమాత్మ వేఱు, జీవాత్మ వేఱు, దేవుడు వేఱు, జీవుడు వేఱు - ఈ ఇద్దరు వేఱు వేఱు అనుట ద్వైతము; వీరిద్దఱూ ఒకటే అనుట, వేఱు వేఱు కాదు అనుట అద్వైతము.)
(“ఆత్మ ఒక్కటే, దాని కన్న రెండవ వస్తువు లేదు” అని శ్రుతి చెప్పుచున్నందున అద్వైతమనగా ఆత్మ ఒకటే - ఇదంతయు ఒకటే ఆత్మ, రెండవ వస్తువు లేనిది. ఈ ప్రపంచమంతా ఒక్క ఆత్మయే. అందుచేత ఆత్మ అద్వైతము. దానికి విపరీతముగా నుండునది - ఒకటి కానిది, అది ఒక్కటే కాక అనేకములు ఉండుట నానాత్వము; ద్వైతము.)
(రెండవది యనగా ప్రథానము, మాయ. ప్రపంచములో రెండు రకముల వస్తువులే కనబడుచున్నవి - ఆత్మ, అనాత్మ; లేక తెలివి గలవి, తెలివి లేనివి. తెలివితో కూడియున్నది ఆత్మ, రెండవది ప్రథానము, లేక మాయ. రెండవది ద్వితము. ద్వితముయొక్క భావము ద్వైతము - అనగా మిథ్యాజ్ఞానము. దేనివలన మిథ్యాజ్ఞానముండదో, దేనివలన మిథ్యాజ్ఞానము నశించునో అది అద్వైతము - మిథ్యాజ్ఞానమునకు విరోధి - అనగా, - ఇది నాది అను మిథ్యాజ్ఞానమును నివర్తింపచేయునది, పోగొట్టునది.)
(మిథ్యాజ్ఞానమును పోగొట్టునది.)
(జీవ బ్రహ్మలు వేఱు అనుట ద్వితము, ద్వితమే ద్వైతము - అనగా జీవుడు, బ్రహ్మ అను రెండురూపములుండుట. అవి కాకుండుట - అట్లు కాకుండుట - అవి కానిది అద్వైతము. జీవాత్మయొక్క రూపము పరమాత్మయొక్క రూపము ఒకటే - అనగా, రెండూ ఒకటే, అదియే పరబ్రహ్మ అని వేదాంతులు చెప్పుదురు.)
రెండు కానిది; రెండవ వస్తువు లేనిది.
“నదేవసోమ్య ! ఇదమగ్ర ఆసీత్ ఏకమేవా ద్వితీయం”. (చాందోగ్యోపనిషత్ - 6 - 2 - 1)
“ఆత్మావా ఇదమేక ఏవాగ్ర ఆసీత్” (ఐతరేయోపనిషత్ - 2 - 1 - 1 - 1)
(సృష్టికి పూర్వము ‘సత్’ పదార్ధమొకటే యుండెను. అనగా, ఇప్పుడు అనేక నామరూపములతో కనబడుచున్న ఈ ప్రపంచమంతయు (ఏకంగా) ఒకటే అయిన సత్ పదార్ధముగా నుండెను - అప్పుడు అటువంటిది మఱియొకటి లేదు - ఇంతేకాక, ఈ సత్పదార్ధము కాక, ఇతర పదార్ధమేదియు లేదు - (ఈ కనబడు ప్రపంచమంతయు మొదటలో సృష్టికి పూర్వము ఏకముగా ఒకటే అయిన ఆత్మగా ఉండెను - అటువంటి ఆత్మ గాని, మఱియే ఇతర పదార్ధముగాని అప్పుడు లేదు.) ఈ సత్పదార్ధమునుండియే (ఈ ఆత్మనుండియే) సృష్టి అంతయు కలిగినది. ఈ సృష్టిలోనున్న వస్తువులన్నియు ఆ సత్పదార్ధము (ఆత్మ)లోనుండియే - ఒకదానిలోనుండి ఒకటిగా పుట్టినవి - కనుక అవి అన్నియు పరమాత్మ రూపములే, పరమాత్మయే. బంగారముతో చేసిన వస్తువులన్నియు బంగారు వస్తువులేకాని ఇతరములు కావు. అందుచే ప్రపంచములోనున్న వస్తువులన్నీ - ప్రపంచమంతయు అతనే - అతనికి తప్పించి మఱొక వస్తువు లేదు. భగవంతుడు కాక రెండవ వస్తువు లేదు, ద్వైతము లేదు - అందుచేత అద్వైతము. పైన చెప్పిన ప్రకారము ఉపనిషద్వాక్యములు అద్వైతమును భోధించుచున్నవి. ఈ భోధ ఆఖరున “ఐతదాత్మ్య మిదం సర్వం” (ఈ ప్రపంచమంతయు ఆత్మయే) అని భోధించినది. పైన చెప్పినదే సిద్ధాంతము చేసినది.
(ఇదంతా - ఈ కనబడు జగత్తు అంతా - పరబ్రహ్మమే అని శ్రుతి చెప్పుచున్నది. అందుచేత అద్వైతము.)
స్వ మాత్రం. (బ్రహ్మ ఒక్కడు మాత్రము ఉన్నాడు - ఉన్నదంతా ఒక్క బ్రహ్మమే.)
భేదవికల్ప రహితం - (తనకి-బ్రహ్మకి - సృష్టిలో ఇతర వస్తువునకున్నూ భేదము లేదు - అందుచేత > అద్వైతము.)
“ప్రపంచో యది విద్యేత నివర్తేత న సంశయః |
మాయా మాత్ర మిదం ద్వైత మద్వైతం పరమార్ధతః ||” (మాండూక్యోపనిషత్ - గౌడపాదకారికా)
(ప్రపంచము అనునది ఏదైన భగవంతునికన్న వేఱైనది ఉన్నయెడల అది నశించవలసినదే. పరబ్రహ్మ కాని వస్తువు - పరబ్రహ్మ కంటె రెండవ వస్తువు - మాయామాత్రము, మాయ వలన ఉన్నదని అనిపించును. పరమార్ధదృష్టిలో - యదార్ధముగా - ఉన్నది ఒక్కటే, రెండవ వస్తువు లేనిది, అద్వైతము - అదియే పరబ్రహ్మ.)
ఏకస్సమస్తం యదిహాస్తి కించిత్ తదచ్యుతో |
నాస్తి పరం తతో (అ) న్యత్ |
సోహం సచత్వం స చ సర్వమేతత్ ఆత్మా స్వరూపం త్యజ భేధ మోహం ||“. (విష్ణుపురాణే)
(సత్పదార్ధము, పరమము - ఉత్కృష్టమైనది, పరేశుడు ఒక్కటే. అతనే వాసుదేవుడు - సమస్తవస్తువులందు నివసించి యుండువాడు. అతను కానిది, అతనికి అన్య మైనది ఏదియు లేదు - అంతయు ఒకటే - ఇక్కడ ఈ ప్రపంచములో ఏ కొంచెము ఉన్నదో - ఉన్నదిఏ కొంచెమైనది అయినను అది అచ్యుతుడే. అతని కన్న పరమైనది - ఉత్కృష్టమైనది ఏదియు లేదు. అందుచేత అవే నీవు, అదియే నేను, అది, ఇది అంతా ఆత్మయే, ఆత్మ స్వరూపమే. పరమాత్మ వేఱు జీవాత్మ వేఱు, ఈ ప్రపంచము వేఱు, నువ్వు వేఱు, నేను వేఱు అను భేద బుద్ధికలిగించు మోహమును వదలివేయుము.)
(మహా నారాయణోపనిషత్)
(బంగారముతో చేయబడిన ఆభరణములకు బంగారమునకు ఏట్టి భేదమున్నదో, సముద్రమునీరునకు సముద్రములో పుట్టిన చిన్న కెరటములకు, పెద్ద కెరటములకు, నురుగుకు, నీటి బిందువులకు ఏట్టి భేదమున్నదో, భూమికిన్నీ అందులో ఉన్న పర్వతములు, చెట్లు, గడ్డి, లత మొదలగు లెక్కలేనన్నివస్తువులకు ఎట్టి భేదమున్నదో, అద్వైతపరమానందరూపుడను, పరబ్రహ్మమైన నాకు ఈ ప్రపంచములోని సమస్తవస్తువులకు గల భేదమట్టిదే - అనగా, బంగారమునకు, బంగారముతో చేసిన వస్తువులకు, రెండునూ బంగారమే కనుక భేదము లేదు, రూపములో భేదము - ఆ ప్రకారముగానే సముద్రములోని జలమే చిన్న, పెద్ద కెరటములుగను, నురగగను, బిందువులుగను మారుటవలన, అంతా సముద్రమేయగుటవలన, రూపములోనే భేదముగానియదార్ధముగా భేదము లేదు - ఎందుచేతననగా బంగారము కారణము, బంగారముతో చేయబడిన ఆభరణములు కార్యములు. ఈ ప్రకారముగానే సముద్రము కారణము, సముద్రములో పుట్టిన కెరటములు, నురుగు, నీటి బిందువులు, కార్యములు - ఆ రీతిగానే భూమి కారణము, భూమిలో పుట్టిన కొండ, ఱాయి, చెట్లు గడ్డి, లత మొదలగునవి కార్యములు. కారణమునకు, కార్యమునకు, భేదములేదు. ఆ ప్రకారముగానే పరబ్రహ్మ కారణము, పరబ్రహ్మలోనుండి పుట్టిన ప్రపంచము (లోని వస్తువులన్నియు) కార్యములు. అందుచేత పరబ్రహ్మకు ప్రపంచమునకు భేదము లేదు -, రెండూ ఒకటే. అందుచేత పరబ్రహ్మ అద్వైతుడు. దేనిలో చూచినను అన్నియు అతనే కనుక అద్వైతుడు. అన్నియు నా స్వరూపములే, నేను కానిది అణువంతైనను లేదు. అందుచేత అద్వైతము.)
ఇతి శ్రుతేః.
(వేదములో భోధించిన పరమార్ధము పరమాత్మ అనునది ఒక్కటే ఉన్నది, వేఱొకటి ఏమియు లేదు. అని శ్రుతి చెప్పుచున్నది.)
ఏకమేవ పరబ్రహ్మ తచ్ఛబ్దేనోపలక్షితః ||”
“సదేవ సోమ్య ! ఇదమగ్ర ఆసీత్” (చూడుము - 7)
(“ఈ కనబడు ప్రపంచమంతా సృష్టికిపూర్వము ఒక్క సత్ పదార్ధముగానే - ఆత్మగానే - ఉండెను” అను మొదలగు శ్రుతి సమస్తమైన వాటికి కారణమైనది ఒకే ఒక పరబ్రహ్మ, అదియే ‘తత్’ అను మాటచేత లక్ష్యమగునట్లు చెప్పబడుచున్నది. ఆ పరబ్రహ్మ ‘సత్’ అనునది ఒకటే ఈ ప్రపంచముగా పరిణమించినది - మారినది. అందుచేత అంతా పరబ్రహ్మమే, రెండవదిలేదు. అందుచేత అద్వైతము.)
(ఒకే సత్తామాత్రుడైన బ్రహ్మను అనేక విధములుగా కల్పించు చున్నారు. సత్తామాత్రుడు, సద్ఘనము అయినవాడు ఒక్కడే. అనేక విధములుగా మారుటవలన అనేకములు ఉన్నట్లు చెప్పుచున్నారు. కాని యదార్ధముగా భగవంతుడొకడే ఉన్నాడు. ఉన్నదంతా అతను ఒకడే. సృష్టి అంతా అతని రూపమే. సృష్టిలోని వస్తువులన్నీ అతని రూపములే, అతను తప్ప మఱియొక వస్తువు లేదు - అందుచేత అద్వైతము.)
కర్మాధ్యక్ష సర్వభూతాది వాసస్సాక్షి చేతః కేవలో నిర్గుణశ్చ ||
ఇతి శ్రుతేః.
(ఒకే దైవము భూతములన్నింటిలోను దాగియున్నట్లు పైకి కనబడకుండా ఉన్నాడు. అతనే అంతటను వ్యాపించియున్నాడు. అతనే అన్ని భూతములకు నంతరాత్మగా నున్నాడు - లోన ఆత్మగా ఉన్నాడు. భూతములు చేసిన కర్మలకతనే ఫలమును కలుగచేయువాడు; సర్వ భూతములందు అధి వసించియుండు అధి దైవము; సర్వ భూతముల కర్మలకు సాక్షి అయినవాడు, సర్వ భూతములకు చైతన్యమును - చేతనత్వమును - కలుగచేయువాడు. అన్నింటిలోనూ ఉన్నప్పటికీ దేనిని అంటక తానొక్కడే వేఱుగా నున్నట్లుండువాడు. అంతా కేవలముగా తానే అయి యున్నవాడు; సత్వరజస్తమములను త్రిగుణములు లేనివాడు, అందుచేత వాటి ప్రభావము తనమీద లేనివాడు. ఇటువంటివాడు ఒకే ఒక భగవంతుడున్నాడు. అటువంటివాడు మఱి యొకడులేడు. అందుచేత అద్వైతము.)
(భగవంతుడు నిష్కలుడు, నిష్క్రియుడు, శాంతుడు, నిరవద్యుడు, నిరంజనుడు, నిర్గుణుడు, అని చెప్పు శ్రుతివాక్యములు పరబ్రహ్మ యొక్క, నిరవయవత్వమును, నిష్క్రియత్వమును, నిర్గుణత్వమును ప్రతిపాదించుచున్నవి. ఈ విధముగా శ్రుతులలో, పరబ్రహ్మకంటె వేరైన జగత్తు లేదని ప్రతిపాదించుటచేత పరబ్రహ్మయొక్క నిర్గుణత్వము, నిష్క్రియత్వము మొదలగునవి ప్రతిపాదించుటచేతను పరబ్రహ్మ నిర్విశేషమని తెలియుచున్నది. “ఏకమేవా ద్వితీయం” బ్రహ్మ ఒకడే కలడు, మరేదియు లేదు.- బ్రహ్మ కాక రెండవ వస్తువు లేదు - అని చెప్పబడుట. ఒకడే అయినటువంటిన్నీ, తను కాని రెండవ వస్తువు లేనటువంటిది అని చెప్పబడుట నిర్విశేష బ్రహ్మగుఱించియే యని ప్రతీతి. అయినను “యః స్వర్వజ్ఞః సర్వ విత్” ; “యస్య జ్ఞానమయం తపః” ; “సత్య కామః సత్య సంకల్పః” అనిన్నీ, “పరాస్య శక్తిర్వివిధైవ శ్రూయతే, స్వాభావికీ జ్ఞాన బల క్రియాచ” ఇత్యాధిభిః శ్రుతిభిః, “తేజో బలైశ్వర్య మహావ బోధ సువీర్య శక్త్యాది గుణైక రాశిః” ; “తదానంత గుణస్యాపి షడేవ ప్రధమే గుణాః” ఇత్యాదిభిః, అనగా - సర్వజ్ఞుడైనవాడు, అన్నియు తెలిసినవాడు, ఎవని తపస్సు జ్ఞానమయమో అనిన్నీ, సత్యమైనకోరికగలవాడు. సత్యమైన సంకల్పము కలవాడు - తను సంకల్పించినదానికి, సృష్టి మొదలగువాటికి, అడ్డు లేనటువంటివాడు - అనిన్నీ, “ఇతనిశక్తి గొప్పది, అనేకవిధములుగా ఉండనట్లు తెలియబడుచున్నది. స్వభావము, జ్ఞానశక్తి, క్రియా శక్తి” అనిన్నీ, తేజస్సు, ఐశ్వర్యము - ఈశ్వరత్వము - జ్ఞానము, వీర్యశక్తి మొదలగు గుణములకు నిధి అయిన వాడు అనిన్నీ, నీవు అనంతగుణములు కలవాడవైనను ఆరు గుణములు ప్రధానమైనవి -ముఖ్యమైనవి - అనిన్నీ, శ్రుతి వచనములే చెప్పుచున్నందున పరబ్రహ్మ సవిశేషమనికూడ తెలియబడుచున్నందున ఇదివఱకు పైన చెప్పబడిన ఏకత్వమున్నూ, అద్వితీయత్వమున్నూ సవిశేష బ్రహ్మపరములే యని తెలియబడుచున్నది.అందుచేత అద్వైతమనునది నిర్విశేషాద్వైతమని, సవిశేషాద్వైతమని రెండు విధములుగా నున్నది. ఇదియే విచిత్రము.)
రజ్జు రేవేతి చాద్వైతం తద్వదాత్మ వినిశ్చయః ||” (మాండూక్యోపనిషత్)
“యధా ఆప్తోక్తితః నిశ్చితాయాం రజ్జ్వాం తద్గత సర్పాది వికల్పో వినివర్తతే, తధా సర్వా పహ్నవ సిద్ధం బ్రహ్మ నిష్ప్రతి యోగి కా ద్వైతమితి జ్ఞాన సమకాలం స్పాజ్ఞాన వికల్పిత విశ్వ విశాది భేదేనా కలనాపి నివర్తతే |”
(చీకటిలో త్రాడునుచూచి పాము అను వికల్పము - భ్రాంతి -, అది త్రాడే అని నిశ్చయముగా తెలియగనే ఏ ప్రకారము నివర్తించునో - తొలగిపోవునో - ఆ ప్రకారమే ఆత్మ ద్వైతభ్రాంతి ఆప్త వాక్యమువలన తొలగగానే అద్వైతమని నిశ్చయమగును - ఈ కనబడు ప్రపంచము భ్రాంతివలన ప్రపంచముగ కనబడుచున్నది, కాని, ఆ భ్రాంతి తొలగగనే అంతా పరమాత్మయే, అద్వైతమే, ఒక్క భగవంతుడే ఉన్నాడు, ప్రపంచముకాని, ఇంకొక రెండవ వస్తువుకాని లేదు అని నిశ్చయమగును.)
బ్రహ్మాదిస్థావరాం తేషు భూతేషూచ్ఛావచేషు యః |
నిర్విశేష చిదానందే మమ ద్వైతం నిరంజనం |
గుణరూప క్రియా వస్తు విక్రియాద్యేకహేతుకం |
భేదం త్యక్త్వాంధ్యజం శుద్ధం సచ్చిన్మాత్ర తయా స్థితం |
తత్పదార్ధక లక్ష్యస్యత్వమో లక్షణ సాక్షిణా |
ఇహైకత్వం శ్రుతే సిద్ధమత్యంతా భేదమాస్థితః |
అహం బ్రహ్మేతి వేదాంత వాక్య జ జ్ఞాన చక్షుషా |
అపరోక్షే కరోత్యాశు త్యక్త్వా విద్యాంచ తత్వ తాం |
కృత కృత్య తయా సోయం జీవన్ముక్త ఉదారధీః ||”
(‘తత్’, ‘త్వం’ అను రెండుపదముల అర్ధమును తెలియ చేసి ఇప్పుడు అఖండార్ధమును - ఉన్నదంతా ఒక్క భగవంతుడే అను సిద్ధాంతమును శ్రీ కృష్ణ భగవానుడు తెలియ చేయుచున్నాడు - ఇది గొప్పది, ఇది నీచమైనది అను విచక్షణ లేకయే, బ్రహ్మ మొదలు స్థావరములవఱకు గల భూతములన్నింటియందు, చిదానందుడు, నిరంజనుడు, నిర్విశేషుడు, నిర్మలుడు, గుణరూపక్రియావస్తు విక్రియాదులకు ఒకటే కారణమైనటువంటివాడు అగు నన్ను సన్మాత్రముగాను, చిన్మాత్రముగాను ఉన్న నన్ను, ‘తత్’ పదమునకు, ‘త్వం’ పదమునకు లక్ష్యమైనటువంటి నన్ను, సర్వసాక్షి అయిన నన్ను, శ్రుతిలో చెప్పిన ప్రకారము ప్రపంచమంతటిలోను, నేను ఒక్కడినే ఉన్నానని, నాకున్నూమఱిదేనికైనను ఏమియు భేదము లేదు అని, అంతా, అన్నీ నేనే అనిన్నీ, తెలుసుకొని వేదాంత వాక్యములవలన కలిగిన జ్ఞానముచేత “అహం బ్రహ్మాస్మి” - నేనే బ్రహ్మను అయితిని - జీవాత్మ పరమాత్మ ఒకటే, రెండింటికీ భేదములేదు అనిన్నీ, దీనినిబట్టి సృష్టిలోని ఏ వస్తువునకైనను పరమాత్మకును భేదములేదని తెలుసుకొని అవిద్యాకార్యమును విడిచినవాడు నన్ను (పరమాత్మను) చేరును - నన్ను సాక్షాత్కరించుకొనును. ఇదియే అఖండార్థ జ్ఞానము - అంతా భగవంతుడొక్కడే అనుట.)
(సమస్త భూతములందు ఉన్న నన్ను ఒకడుగానే తెలుసుకొని భజించువాడు. నన్నే కలియును.)
(తనజాతికి సంబంధించినది - తనవంటిది - రెండవ వస్తువు లేకుండునది - లేకుండుట.)
జగత్తులో పరమేశ్వరుడు తప్ప మఱియొక పదార్ధము లేదు అని భావము - “సర్వ వ్యాపకో నారాయణః” > అన్నింటిలోను వ్యాపించియున్నవాడు భగవంతుడు అని చెప్పుటచేత భగవంతుడు ప్రతివస్తువులోను > లోపల, బైట పూర్తిగా వ్యాపించి యున్నాడు. అతను వ్యాపించియుండని వస్తువు అణుమాత్రము లేదు - > “ఆ హరిమయము గాని వస్తువు పరమాణువు లేదు, వంశపావన వింటే ||”. (శ్రీ > మదాంధ్రమహాభాగవతము -) ప్రతివస్తువులోను పూర్తిగా వ్యాపించియుండుటవలన సృష్టి అంతటిలోను > పూర్తిగా వ్యాపించియున్నాడు - ప్రతి వస్తువు పరమాత్మలోనుండి పుట్టినదే, దానిలో పూర్తిగా అతను > వ్యాపించియున్నాడు అనుటవల్ల ఇంకే వస్తువు - రెండవది - ఉండుటకు అవకాశము లేదు.
“బ్రహ్మ నిత్యం, జగన్మిధ్యా, జీవో బ్రహ్మైవ నాపరః” -
(సృష్టిలో మూడు తత్వములున్నవి - పరబ్రహ్మ, ప్రకృతి, జీవుడు - లేక పరమాత్మ, ప్రకృతి, జీవాత్మ - ఈ మూడింటిలో పరబ్రహ్మ శాశ్వతముగా నుండునది. జీవుడు పరబ్రహ్మ యొక్క అంశయే కనుక పరబ్రహ్మకన్న వేఱుకాదు - ప్రకృతి పరబ్రహ్మలోనుండిపుట్టినదే కనుక అతనికంటె వేఱుకాదు. అందుచేత ఉన్నదంతా పరబ్రహ్మమే - ఒకటే - తత్వత్రయము అనుటయే గాని ఉన్నదంతా ఒక్క భగవత్తత్వమే - అందుచేత అద్వైతము.) (జగత్తు మిధ్య, నశించునది.)
పరమాత్మ జగత్తునకు కారణము. జగత్తు పరమాత్మయొక్క కార్యము. కారణమే కార్యముగా మారును. కార్యము > నశించిన కారణములోనే లీనమగును. మట్టి కారణము, మట్టితో చేసిన కుండ కార్యము - కార్యమైన కుండ > నశించగా - బద్దలు అయిపోగా మట్టిగానే యగును. అందుచేత కారణమునకు కార్యమునకు భేదము > లేదు - రెండూ ఒకటే. అట్లే పరమాత్మ జగత్తునకు కారణమగుటచేత పరమాత్మ జగత్తు ఒకటే - > రెండు లేవు - అందుచేత అద్వైతము.
చంద్రుడు ఒకడే అయినప్పటికీ దృష్టి దోషమువలన ఇద్దరు చంద్రులుగా కనబడినను చంద్రుడు ఒకడే > అని రూఢి అయినట్లు, పరమాత్మ ఒకడే ఉన్నప్పటికీ పరమాత్మ వేఱు, ప్రపంచము వేఱు అను బుద్ధి > అవిద్యా బ్రాంతివలన కలుగును.మహావాక్యముల బోధవలన కలిగిన జ్ఞానము వలన అంతా ఒకటే, అంతా > పరబ్రహ్మమే, ప్రపంచమనునది వేఱే లేదు అను అఖండార్ధము సిద్ధాంతము చేయబడినది.
“సర్వ ధర్మ విహీనంచ మనోవాచా మగోచరం |
నజాతీయ విజాతీయ పదార్ధా నామ సంభవాత్ |
అతస్తద్వ్యతి రికానా మద్వైతమితి సంజ్ఞితం||” (శివగీత)
(ఏ విధమైన ధర్మములు లేనందున, మనోవాక్కులకు గోచరము కానందున, వ్యతిరేకమైన సజాతీయ విజాతీయ పదార్ధము లేనందున ఆత్మ అద్వైతము.)
“జీవేశ్వరులకు భేదములేదు, రెండూ ఒకటే -” : ‘జీవేశ్వర యో రైక్యం’ అను చెప్పు మతము - > అద్వైతము.
అద్వైతము అనగా ఏకత్వము అని అర్ధముకాదు, విడదీయరానిది - బ్రహ్మకంటె జీవుడు వేఱుకాదు - బ్రహ్మ > కంటె జీవుడు వేఱు అని అతనినుండి జీవుడు విడదీయరానిది.
“ఏకం ఏవ అద్వైతం భావనాత్రయోపదేశేన ధృఢీకరోతి భావాద్వైతం, క్రియాద్వైతం, ద్రవ్యాద్వైతం ఇతి త్రివిధం”
(అద్వైతమనునది ఒకటే అయినను అది మూడు రకములుగా నున్నదని ధృడపఱచబడినది :- భావాద్వైతము, ద్రవ్యాద్వైతము, క్రియాద్వైతము - వస్తు భేదబుద్ధి, కర్మ భేదబుద్ధి, స్వకీయము, పరకీయము అను భేదబుద్ధి విడిచి అంతా ఒకటే అను జ్ఞానము కలిగియుండవలెను.)
(అద్వైతము అయినది, ఆనందమైనది, జన్మ తెలియనటువంటి రఘురామచంద్రుని భజించెదను.)
(reṃḍu vastuvulu vēṟugā nuṃḍuṭa yokka bhāvamē dvita, dvitayē dvaitamu; dvaitamu kākuṃḍaṭē - dvaitamu kānidi - advaitamu, anagā - paramātma vēṟu, jīvātma vēṟu, dēvuḍu vēṟu, jīvuḍu vēṟu - ī iddaru vēṟu vēṟu anuṭa dvaitamu; vīriddaṟū okaṭē anuṭa, vēṟu vēṟu kādu anuṭa advaitamu.)
(“ātma okkaṭē, dāni kanna reṃḍava vastuvu lēdu” ani śruti ceppucunnaṃduna advaitamanagā ātma okaṭē - idaṃtayu okaṭē ātma, reṃḍava vastuvu lēnidi. ī prapaṃcamaṃtā okka ātmayē. aṃducēta ātma advaitamu. dāniki viparītamugā nuṃḍunadi - okaṭi kānidi, adi okkaṭē kāka anēkamulu uṃḍuṭa nānātvamu; dvaitamu.)
(reṃḍavadi yanagā prathānamu, māya. prapaṃcamulō reṃḍu rakamula vastuvulē kanabaḍucunnavi - ātma, anātma; lēka telivi galavi, telivi lēnivi. telivitō kūḍiyunnadi ātma, reṃḍavadi prathānamu, lēka māya. reṃḍavadi dvitamu. dvitamuyokka bhāvamu dvaitamu - anagā mithyājñānamu. dēnivalana mithyājñānamuṃḍadō, dēnivalana mithyājñānamu naśiṃcunō adi advaitamu - mithyājñānamunaku virōdhi - anagā, - idi nādi anu mithyājñānamunu nivartiṃpacēyunadi, pōgoṭṭunadi.)
(mithyājñānamunu pōgoṭṭunadi.)
(jīva brahmalu vēṟu anuṭa dvitamu, dvitamē dvaitamu - anagā jīvuḍu, brahma anu reṃḍurūpamuluṃḍuṭa. avi kākuṃḍuṭa - aṭlu kākuṃḍuṭa - avi kānidi advaitamu. jīvātmayokka rūpamu paramātmayokka rūpamu okaṭē - anagā, reṃḍū okaṭē, adiyē parabrahma ani vēdāṃtulu ceppuduru.)
reṃḍu kānidi; reṃḍava vastuvu lēnidi.
“nadēvasōmya ! idamagra āsīt ēkamēvā dvitīyaṃ”. (cāṃdōgyōpaniṣat - 6 - 2 - 1)
“ātmāvā idamēka ēvāgra āsīt” (aitarēyōpaniṣat - 2 - 1 - 1 - 1)
(sṛṣṭiki pūrvamu ‘sat’ padārdhamokaṭē yuṃḍenu. anagā, ippuḍu anēka nāmarūpamulatō kanabaḍucunna ī prapaṃcamaṃtayu (ēkaṃgā) okaṭē ayina sat padārdhamugā nuṃḍenu - appuḍu aṭuvaṃṭidi maṟiyokaṭi lēdu - iṃtēkāka, ī satpadārdhamu kāka, itara padārdhamēdiyu lēdu - (ī kanabaḍu prapaṃcamaṃtayu modaṭalō sṛṣṭiki pūrvamu ēkamugā okaṭē ayina ātmagā uṃḍenu - aṭuvaṃṭi ātma gāni, maṟiyē itara padārdhamugāni appuḍu lēdu.) ī satpadārdhamunuṃḍiyē (ī ātmanuṃḍiyē) sṛṣṭi aṃtayu kaliginadi. ī sṛṣṭilōnunna vastuvulanniyu ā satpadārdhamu (ātma)lōnuṃḍiyē - okadānilōnuṃḍi okaṭigā puṭṭinavi - kanuka avi anniyu paramātma rūpamulē, paramātmayē. baṃgāramutō cēsina vastuvulanniyu baṃgāru vastuvulēkāni itaramulu kāvu. aṃducē prapaṃcamulōnunna vastuvulannī - prapaṃcamaṃtayu atanē - ataniki tappiṃci maṟoka vastuvu lēdu. bhagavaṃtuḍu kāka reṃḍava vastuvu lēdu, dvaitamu lēdu - aṃducēta advaitamu. paina ceppina prakāramu upaniṣadvākyamulu advaitamunu bhōdhiṃcucunnavi. ī bhōdha ākharuna “aitadātmya midaṃ sarvaṃ” (ī prapaṃcamaṃtayu ātmayē) ani bhōdhiṃcinadi. paina ceppinadē siddhāṃtamu cēsinadi.
(idaṃtā - ī kanabaḍu jagattu aṃtā - parabrahmamē ani śruti ceppucunnadi. aṃducēta advaitamu.)
sva mātraṃ. (brahma okkaḍu mātramu unnāḍu - unnadaṃtā okka brahmamē.)
bhēdavikalpa rahitaṃ - (tanaki-brahmaki - sṛṣṭilō itara vastuvunakunnū bhēdamu lēdu - aṃducēta > advaitamu.)
“prapaṃcō yadi vidyēta nivartēta na saṃśayaḥ |
māyā mātra midaṃ dvaita madvaitaṃ paramārdhataḥ ||” (māṃḍūkyōpaniṣat - gauḍapādakārikā)
(prapaṃcamu anunadi ēdaina bhagavaṃtunikanna vēṟainadi unnayeḍala adi naśiṃcavalasinadē. parabrahma kāni vastuvu - parabrahma kaṃṭe reṃḍava vastuvu - māyāmātramu, māya valana unnadani anipiṃcunu. paramārdhadṛṣṭilō - yadārdhamugā - unnadi okkaṭē, reṃḍava vastuvu lēnidi, advaitamu - adiyē parabrahma.)
ēkassamastaṃ yadihāsti kiṃcit tadacyutō |
nāsti paraṃ tatō (a) nyat |
sōhaṃ sacatvaṃ sa ca sarvamētat ātmā svarūpaṃ tyaja bhēdha mōhaṃ ||“. (viṣṇupurāṇē)
(satpadārdhamu, paramamu - utkṛṣṭamainadi, parēśuḍu okkaṭē. atanē vāsudēvuḍu - samastavastuvulaṃdu nivasiṃci yuṃḍuvāḍu. atanu kānidi, ataniki anya mainadi ēdiyu lēdu - aṃtayu okaṭē - ikkaḍa ī prapaṃcamulō ē koṃcemu unnadō - unnadiē koṃcemainadi ayinanu adi acyutuḍē. atani kanna paramainadi - utkṛṣṭamainadi ēdiyu lēdu. aṃducēta avē nīvu, adiyē nēnu, adi, idi aṃtā ātmayē, ātma svarūpamē. paramātma vēṟu jīvātma vēṟu, ī prapaṃcamu vēṟu, nuvvu vēṟu, nēnu vēṟu anu bhēda buddhikaligiṃcu mōhamunu vadalivēyumu.)
(mahā nārāyaṇōpaniṣat)
(baṃgāramutō cēyabaḍina ābharaṇamulaku baṃgāramunaku ēṭṭi bhēdamunnadō, samudramunīrunaku samudramulō puṭṭina cinna keraṭamulaku, pedda keraṭamulaku, nuruguku, nīṭi biṃduvulaku ēṭṭi bhēdamunnadō, bhūmikinnī aṃdulō unna parvatamulu, ceṭlu, gaḍḍi, lata modalagu lekkalēnannivastuvulaku eṭṭi bhēdamunnadō, advaitaparamānaṃdarūpuḍanu, parabrahmamaina nāku ī prapaṃcamulōni samastavastuvulaku gala bhēdamaṭṭidē - anagā, baṃgāramunaku, baṃgāramutō cēsina vastuvulaku, reṃḍunū baṃgāramē kanuka bhēdamu lēdu, rūpamulō bhēdamu - ā prakāramugānē samudramulōni jalamē cinna, pedda keraṭamuluganu, nuragaganu, biṃduvuluganu māruṭavalana, aṃtā samudramēyaguṭavalana, rūpamulōnē bhēdamugāniyadārdhamugā bhēdamu lēdu - eṃducētananagā baṃgāramu kāraṇamu, baṃgāramutō cēyabaḍina ābharaṇamulu kāryamulu. ī prakāramugānē samudramu kāraṇamu, samudramulō puṭṭina keraṭamulu, nurugu, nīṭi biṃduvulu, kāryamulu - ā rītigānē bhūmi kāraṇamu, bhūmilō puṭṭina koṃḍa, ṟāyi, ceṭlu gaḍḍi, lata modalagunavi kāryamulu. kāraṇamunaku, kāryamunaku, bhēdamulēdu. ā prakāramugānē parabrahma kāraṇamu, parabrahmalōnuṃḍi puṭṭina prapaṃcamu (lōni vastuvulanniyu) kāryamulu. aṃducēta parabrahmaku prapaṃcamunaku bhēdamu lēdu -, reṃḍū okaṭē. aṃducēta parabrahma advaituḍu. dēnilō cūcinanu anniyu atanē kanuka advaituḍu. anniyu nā svarūpamulē, nēnu kānidi aṇuvaṃtainanu lēdu. aṃducēta advaitamu.)
iti śrutēḥ.
(vēdamulō bhōdhiṃcina paramārdhamu paramātma anunadi okkaṭē unnadi, vēṟokaṭi ēmiyu lēdu. ani śruti ceppucunnadi.)
ēkamēva parabrahma tacchabdēnōpalakṣitaḥ ||”
“sadēva sōmya ! idamagra āsīt” (cūḍumu - 7)
(“ī kanabaḍu prapaṃcamaṃtā sṛṣṭikipūrvamu okka sat padārdhamugānē - ātmagānē - uṃḍenu” anu modalagu śruti samastamaina vāṭiki kāraṇamainadi okē oka parabrahma, adiyē ‘tat’ anu māṭacēta lakṣyamagunaṭlu ceppabaḍucunnadi. ā parabrahma ‘sat’ anunadi okaṭē ī prapaṃcamugā pariṇamiṃcinadi - mārinadi. aṃducēta aṃtā parabrahmamē, reṃḍavadilēdu. aṃducēta advaitamu.)
(okē sattāmātruḍaina brahmanu anēka vidhamulugā kalpiṃcu cunnāru. sattāmātruḍu, sadghanamu ayinavāḍu okkaḍē. anēka vidhamulugā māruṭavalana anēkamulu unnaṭlu ceppucunnāru. kāni yadārdhamugā bhagavaṃtuḍokaḍē unnāḍu. unnadaṃtā atanu okaḍē. sṛṣṭi aṃtā atani rūpamē. sṛṣṭilōni vastuvulannī atani rūpamulē, atanu tappa maṟiyoka vastuvu lēdu - aṃducēta advaitamu.)
karmādhyakṣa sarvabhūtādi vāsassākṣi cētaḥ kēvalō nirguṇaśca ||
iti śrutēḥ.
(okē daivamu bhūtamulanniṃṭilōnu dāgiyunnaṭlu paiki kanabaḍakuṃḍā unnāḍu. atanē aṃtaṭanu vyāpiṃciyunnāḍu. atanē anni bhūtamulaku naṃtarātmagā nunnāḍu - lōna ātmagā unnāḍu. bhūtamulu cēsina karmalakatanē phalamunu kalugacēyuvāḍu; sarva bhūtamulaṃdu adhi vasiṃciyuṃḍu adhi daivamu; sarva bhūtamula karmalaku sākṣi ayinavāḍu, sarva bhūtamulaku caitanyamunu - cētanatvamunu - kalugacēyuvāḍu. anniṃṭilōnū unnappaṭikī dēnini aṃṭaka tānokkaḍē vēṟugā nunnaṭluṃḍuvāḍu. aṃtā kēvalamugā tānē ayi yunnavāḍu; satvarajastamamulanu triguṇamulu lēnivāḍu, aṃducēta vāṭi prabhāvamu tanamīda lēnivāḍu. iṭuvaṃṭivāḍu okē oka bhagavaṃtuḍunnāḍu. aṭuvaṃṭivāḍu maṟi yokaḍulēḍu. aṃducēta advaitamu.)
(bhagavaṃtuḍu niṣkaluḍu, niṣkriyuḍu, śāṃtuḍu, niravadyuḍu, niraṃjanuḍu, nirguṇuḍu, ani ceppu śrutivākyamulu parabrahma yokka, niravayavatvamunu, niṣkriyatvamunu, nirguṇatvamunu pratipādiṃcucunnavi. ī vidhamugā śrutulalō, parabrahmakaṃṭe vēraina jagattu lēdani pratipādiṃcuṭacēta parabrahmayokka nirguṇatvamu, niṣkriyatvamu modalagunavi pratipādiṃcuṭacētanu parabrahma nirviśēṣamani teliyucunnadi. “ēkamēvā dvitīyaṃ” brahma okaḍē kalaḍu, marēdiyu lēdu.- brahma kāka reṃḍava vastuvu lēdu - ani ceppabaḍuṭa. okaḍē ayinaṭuvaṃṭinnī, tanu kāni reṃḍava vastuvu lēnaṭuvaṃṭidi ani ceppabaḍuṭa nirviśēṣa brahmaguṟiṃciyē yani pratīti. ayinanu “yaḥ svarvajñaḥ sarva vit” ; “yasya jñānamayaṃ tapaḥ” ; “satya kāmaḥ satya saṃkalpaḥ” aninnī, “parāsya śaktirvividhaiva śrūyatē, svābhāvikī jñāna bala kriyāca” ityādhibhiḥ śrutibhiḥ, “tējō balaiśvarya mahāva bōdha suvīrya śaktyādi guṇaika rāśiḥ” ; “tadānaṃta guṇasyāpi ṣaḍēva pradhamē guṇāḥ” ityādibhiḥ, anagā - sarvajñuḍainavāḍu, anniyu telisinavāḍu, evani tapassu jñānamayamō aninnī, satyamainakōrikagalavāḍu. satyamaina saṃkalpamu kalavāḍu - tanu saṃkalpiṃcinadāniki, sṛṣṭi modalaguvāṭiki, aḍḍu lēnaṭuvaṃṭivāḍu - aninnī, “itaniśakti goppadi, anēkavidhamulugā uṃḍanaṭlu teliyabaḍucunnadi. svabhāvamu, jñānaśakti, kriyā śakti” aninnī, tējassu, aiśvaryamu - īśvaratvamu - jñānamu, vīryaśakti modalagu guṇamulaku nidhi ayina vāḍu aninnī, nīvu anaṃtaguṇamulu kalavāḍavainanu āru guṇamulu pradhānamainavi -mukhyamainavi - aninnī, śruti vacanamulē ceppucunnaṃduna parabrahma saviśēṣamanikūḍa teliyabaḍucunnaṃduna idivaṟaku paina ceppabaḍina ēkatvamunnū, advitīyatvamunnū saviśēṣa brahmaparamulē yani teliyabaḍucunnadi.aṃducēta advaitamanunadi nirviśēṣādvaitamani, saviśēṣādvaitamani reṃḍu vidhamulugā nunnadi. idiyē vicitramu.)
rajju rēvēti cādvaitaṃ tadvadātma viniścayaḥ ||” (māṃḍūkyōpaniṣat)
“yadhā āptōktitaḥ niścitāyāṃ rajjvāṃ tadgata sarpādi vikalpō vinivartatē, tadhā sarvā pahnava siddhaṃ brahma niṣprati yōgi kā dvaitamiti jñāna samakālaṃ spājñāna vikalpita viśva viśādi bhēdēnā kalanāpi nivartatē |”
(cīkaṭilō trāḍunucūci pāmu anu vikalpamu - bhrāṃti -, adi trāḍē ani niścayamugā teliyaganē ē prakāramu nivartiṃcunō - tolagipōvunō - ā prakāramē ātma dvaitabhrāṃti āpta vākyamuvalana tolagagānē advaitamani niścayamagunu - ī kanabaḍu prapaṃcamu bhrāṃtivalana prapaṃcamuga kanabaḍucunnadi, kāni, ā bhrāṃti tolagaganē aṃtā paramātmayē, advaitamē, okka bhagavaṃtuḍē unnāḍu, prapaṃcamukāni, iṃkoka reṃḍava vastuvukāni lēdu ani niścayamagunu.)
brahmādisthāvarāṃ tēṣu bhūtēṣūcchāvacēṣu yaḥ |
nirviśēṣa cidānaṃdē mama dvaitaṃ niraṃjanaṃ |
guṇarūpa kriyā vastu vikriyādyēkahētukaṃ |
bhēdaṃ tyaktvāṃdhyajaṃ śuddhaṃ saccinmātra tayā sthitaṃ |
tatpadārdhaka lakṣyasyatvamō lakṣaṇa sākṣiṇā |
ihaikatvaṃ śrutē siddhamatyaṃtā bhēdamāsthitaḥ |
ahaṃ brahmēti vēdāṃta vākya ja jñāna cakṣuṣā |
aparōkṣē karōtyāśu tyaktvā vidyāṃca tatva tāṃ |
kṛta kṛtya tayā sōyaṃ jīvanmukta udāradhīḥ ||”
(‘tat’, ‘tvaṃ’ anu reṃḍupadamula ardhamunu teliya cēsi ippuḍu akhaṃḍārdhamunu - unnadaṃtā okka bhagavaṃtuḍē anu siddhāṃtamunu śrī kṛṣṇa bhagavānuḍu teliya cēyucunnāḍu - idi goppadi, idi nīcamainadi anu vicakṣaṇa lēkayē, brahma modalu sthāvaramulavaṟaku gala bhūtamulanniṃṭiyaṃdu, cidānaṃduḍu, niraṃjanuḍu, nirviśēṣuḍu, nirmaluḍu, guṇarūpakriyāvastu vikriyādulaku okaṭē kāraṇamainaṭuvaṃṭivāḍu agu nannu sanmātramugānu, cinmātramugānu unna nannu, ‘tat’ padamunaku, ‘tvaṃ’ padamunaku lakṣyamainaṭuvaṃṭi nannu, sarvasākṣi ayina nannu, śrutilō ceppina prakāramu prapaṃcamaṃtaṭilōnu, nēnu okkaḍinē unnānani, nākunnūmaṟidēnikainanu ēmiyu bhēdamu lēdu ani, aṃtā, annī nēnē aninnī, telusukoni vēdāṃta vākyamulavalana kaligina jñānamucēta “ahaṃ brahmāsmi” - nēnē brahmanu ayitini - jīvātma paramātma okaṭē, reṃḍiṃṭikī bhēdamulēdu aninnī, dīninibaṭṭi sṛṣṭilōni ē vastuvunakainanu paramātmakunu bhēdamulēdani telusukoni avidyākāryamunu viḍicinavāḍu nannu (paramātmanu) cērunu - nannu sākṣātkariṃcukonunu. idiyē akhaṃḍārtha jñānamu - aṃtā bhagavaṃtuḍokkaḍē anuṭa.)
(samasta bhūtamulaṃdu unna nannu okaḍugānē telusukoni bhajiṃcuvāḍu. nannē kaliyunu.)
(tanajātiki saṃbaṃdhiṃcinadi - tanavaṃṭidi - reṃḍava vastuvu lēkuṃḍunadi - lēkuṃḍuṭa.)
jagattulō paramēśvaruḍu tappa maṟiyoka padārdhamu lēdu ani bhāvamu - “sarva vyāpakō nārāyaṇaḥ” > anniṃṭilōnu vyāpiṃciyunnavāḍu bhagavaṃtuḍu ani ceppuṭacēta bhagavaṃtuḍu prativastuvulōnu > lōpala, baiṭa pūrtigā vyāpiṃci yunnāḍu. atanu vyāpiṃciyuṃḍani vastuvu aṇumātramu lēdu - > “ā harimayamu gāni vastuvu paramāṇuvu lēdu, vaṃśapāvana viṃṭē ||”. (śrī > madāṃdhramahābhāgavatamu -) prativastuvulōnu pūrtigā vyāpiṃciyuṃḍuṭavalana sṛṣṭi aṃtaṭilōnu > pūrtigā vyāpiṃciyunnāḍu - prati vastuvu paramātmalōnuṃḍi puṭṭinadē, dānilō pūrtigā atanu > vyāpiṃciyunnāḍu anuṭavalla iṃkē vastuvu - reṃḍavadi - uṃḍuṭaku avakāśamu lēdu.
“brahma nityaṃ, jaganmidhyā, jīvō brahmaiva nāparaḥ” -
(sṛṣṭilō mūḍu tatvamulunnavi - parabrahma, prakṛti, jīvuḍu - lēka paramātma, prakṛti, jīvātma - ī mūḍiṃṭilō parabrahma śāśvatamugā nuṃḍunadi. jīvuḍu parabrahma yokka aṃśayē kanuka parabrahmakanna vēṟukādu - prakṛti parabrahmalōnuṃḍipuṭṭinadē kanuka atanikaṃṭe vēṟukādu. aṃducēta unnadaṃtā parabrahmamē - okaṭē - tatvatrayamu anuṭayē gāni unnadaṃtā okka bhagavattatvamē - aṃducēta advaitamu.) (jagattu midhya, naśiṃcunadi.)
paramātma jagattunaku kāraṇamu. jagattu paramātmayokka kāryamu. kāraṇamē kāryamugā mārunu. kāryamu > naśiṃcina kāraṇamulōnē līnamagunu. maṭṭi kāraṇamu, maṭṭitō cēsina kuṃḍa kāryamu - kāryamaina kuṃḍa > naśiṃcagā - baddalu ayipōgā maṭṭigānē yagunu. aṃducēta kāraṇamunaku kāryamunaku bhēdamu > lēdu - reṃḍū okaṭē. aṭlē paramātma jagattunaku kāraṇamaguṭacēta paramātma jagattu okaṭē - > reṃḍu lēvu - aṃducēta advaitamu.
caṃdruḍu okaḍē ayinappaṭikī dṛṣṭi dōṣamuvalana iddaru caṃdrulugā kanabaḍinanu caṃdruḍu okaḍē > ani rūḍhi ayinaṭlu, paramātma okaḍē unnappaṭikī paramātma vēṟu, prapaṃcamu vēṟu anu buddhi > avidyā brāṃtivalana kalugunu.mahāvākyamula bōdhavalana kaligina jñānamu valana aṃtā okaṭē, aṃtā > parabrahmamē, prapaṃcamanunadi vēṟē lēdu anu akhaṃḍārdhamu siddhāṃtamu cēyabaḍinadi.
“sarva dharma vihīnaṃca manōvācā magōcaraṃ |
najātīya vijātīya padārdhā nāma saṃbhavāt |
atastadvyati rikānā madvaitamiti saṃjñitaṃ||” (śivagīta)
(ē vidhamaina dharmamulu lēnaṃduna, manōvākkulaku gōcaramu kānaṃduna, vyatirēkamaina sajātīya vijātīya padārdhamu lēnaṃduna ātma advaitamu.)
“jīvēśvarulaku bhēdamulēdu, reṃḍū okaṭē -” : ‘jīvēśvara yō raikyaṃ’ anu ceppu matamu - > advaitamu.
advaitamu anagā ēkatvamu ani ardhamukādu, viḍadīyarānidi - brahmakaṃṭe jīvuḍu vēṟukādu - brahma > kaṃṭe jīvuḍu vēṟu ani ataninuṃḍi jīvuḍu viḍadīyarānidi.
“ēkaṃ ēva advaitaṃ bhāvanātrayōpadēśēna dhṛḍhīkarōti bhāvādvaitaṃ, kriyādvaitaṃ, dravyādvaitaṃ iti trividhaṃ”
(advaitamanunadi okaṭē ayinanu adi mūḍu rakamulugā nunnadani dhṛḍapaṟacabaḍinadi :- bhāvādvaitamu, dravyādvaitamu, kriyādvaitamu - vastu bhēdabuddhi, karma bhēdabuddhi, svakīyamu, parakīyamu anu bhēdabuddhi viḍici aṃtā okaṭē anu jñānamu kaligiyuṃḍavalenu.)
(advaitamu ayinadi, ānaṃdamainadi, janma teliyanaṭuvaṃṭi raghurāmacaṃdruni bhajiṃcedanu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.