పరబ్రహ్మము ఆదిమధ్యాంతములు లేనివాడు, ఇతనే అనేక రూపములతో ప్రపంచమువలె భ్రాంతివలన కనబడుచున్నాడు - చీకటిలో త్రాడు పామువలె భ్రాంతివలన కనబడినట్లు అజ్ఞానముచే, భ్రాంతిచేత ప్రపంచమనునది బ్రహ్మకంటె వేఱుగా ఉన్నట్లు తోచును - వాస్తవముగా ఆ ప్రపంచములోని వస్తువులన్నియు పరబ్రహ్మ రూపములే - అందుచేత అంతా పరబ్రహ్మమే, రెండవ వస్తువులేదు - ప్రపంచములో రెండు విధముల వస్తువులు ఉన్నవి - చేతనములు, అచేతనములు. వీటిలో ఒకటి సత్ పరబ్రహ్మము, పరమాత్మ, పురుషుడు, అక్షరుడు అని సందర్భముననుసరించి చెప్పబడుచున్నాడు. రెండవది అనాత్మ, ప్రకృతి, మాయ, క్షరము - ప్రకృతి జడము, తనంతట ఏ పనియు చేయలేదు - పరమాత్మ ఈ ప్రకృతిలో ప్రవేశించి దానిని చైతన్యవంతము చేయుటవలన అది మహత్తత్వము మొదలగు వస్తువులుగా మారుచున్నది. వీటివలన లింగశరీరము కలుగును. లింగశరీరములోనున్న పరబ్రహ్మ చైతన్యమే జీవుడు. అందుచేత పరమాత్మ, జీవుడు ఒకటే, వారిద్దఱికి భేదములేదు - అగ్నినుండి వెడలు విస్ఫులింగములవలె పరమాత్మనుండి పైకి వచ్చిన చైతన్యాంశ ప్రకృతిపరిణామముల వలన ఏర్పడిన శరీరములో ప్రవేశించి, కర్మానుసారము, జననమరణములు, కష్టసుఖముల ననుభవించినట్లుండి, వేదాంతబోధవలన తన నిజస్వరూపమును తెలుసుకొని సంసారభ్రాంతి వదలి తన స్వస్వరూపము అయిన పరమాత్మయందు లీనమగును - ఇదియే అద్వైతసిద్ధాంతము.
parabrahmamu ādimadhyāṃtamulu lēnivāḍu, itanē anēka rūpamulatō prapaṃcamuvale bhrāṃtivalana kanabaḍucunnāḍu - cīkaṭilō trāḍu pāmuvale bhrāṃtivalana kanabaḍinaṭlu ajñānamucē, bhrāṃticēta prapaṃcamanunadi brahmakaṃṭe vēṟugā unnaṭlu tōcunu - vāstavamugā ā prapaṃcamulōni vastuvulanniyu parabrahma rūpamulē - aṃducēta aṃtā parabrahmamē, reṃḍava vastuvulēdu - prapaṃcamulō reṃḍu vidhamula vastuvulu unnavi - cētanamulu, acētanamulu. vīṭilō okaṭi sat parabrahmamu, paramātma, puruṣuḍu, akṣaruḍu ani saṃdarbhamunanusariṃci ceppabaḍucunnāḍu. reṃḍavadi anātma, prakṛti, māya, kṣaramu - prakṛti jaḍamu, tanaṃtaṭa ē paniyu cēyalēdu - paramātma ī prakṛtilō pravēśiṃci dānini caitanyavaṃtamu cēyuṭavalana adi mahattatvamu modalagu vastuvulugā mārucunnadi. vīṭivalana liṃgaśarīramu kalugunu. liṃgaśarīramulōnunna parabrahma caitanyamē jīvuḍu. aṃducēta paramātma, jīvuḍu okaṭē, vāriddaṟiki bhēdamulēdu - agninuṃḍi veḍalu visphuliṃgamulavale paramātmanuṃḍi paiki vaccina caitanyāṃśa prakṛtipariṇāmamula valana ērpaḍina śarīramulō pravēśiṃci, karmānusāramu, jananamaraṇamulu, kaṣṭasukhamula nanubhaviṃcinaṭluṃḍi, vēdāṃtabōdhavalana tana nijasvarūpamunu telusukoni saṃsārabhrāṃti vadali tana svasvarūpamu ayina paramātmayaṃdu līnamagunu - idiyē advaitasiddhāṃtamu.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.