← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అద్వైతత్రయము advaitatrayamu

Original — తెలుగు

దీనిని గుఱించి శ్రీ మదాంధ్ర మహాభాగవతములో ఈ క్రింద విధముగా చెప్పబడినది : -

వ. --- “భావాద్వైత, క్రియాద్వైత, ద్రవ్యాద్వైతంబులు మూడు గలవు. అందు బట తంతు న్యాయంబున గార్యకారణంబులందు వస్తువొక్కటియై యుండు నని యెఱింగి, యేకత్వా లోచనంబు చేసి, వికల్పంబు లేదని భావించుట భావాద్వైతంబు. మనో వా క్కాయ కృతంబు లైన సర్వకర్మంబులను ఫలభేదంబు సేయక, పరబ్రహ్మార్పణంబు సేయుట క్రియాద్వైతంబు. పుత్రమిత్రకళత్రాది సర్వప్రాణులకుం దనకును దేహంబునకుం బంచభూతాత్మకత్వంబున భోక్త యొక్కండను పరమార్థత్వంబున నర్ధకామంబులయెడ నైక్యదృష్టి జేయుట ద్రవ్యాద్వైతంబు. నేర్పున నాత్మ తత్వానుభవంబున నద్వైత త్రయంబును విలోకించి, వస్తుభేదబుద్ధియు గర్మభేదబుద్ధియు, స్వకీయ పరకీయ బుద్ధియు, స్వప్నంబులుగా దలంచి ముని యైనవాడు మానవలయు.” (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 7 - 15 - 469)

Transliteration

dīnini guṟiṃci śrī madāṃdhra mahābhāgavatamulō ī kriṃda vidhamugā ceppabaḍinadi : -

va. --- “bhāvādvaita, kriyādvaita, dravyādvaitaṃbulu mūḍu galavu. aṃdu baṭa taṃtu nyāyaṃbuna gāryakāraṇaṃbulaṃdu vastuvokkaṭiyai yuṃḍu nani yeṟiṃgi, yēkatvā lōcanaṃbu cēsi, vikalpaṃbu lēdani bhāviṃcuṭa bhāvādvaitaṃbu. manō vā kkāya kṛtaṃbu laina sarvakarmaṃbulanu phalabhēdaṃbu sēyaka, parabrahmārpaṇaṃbu sēyuṭa kriyādvaitaṃbu. putramitrakaḷatrādi sarvaprāṇulakuṃ danakunu dēhaṃbunakuṃ baṃcabhūtātmakatvaṃbuna bhōkta yokkaṃḍanu paramārthatvaṃbuna nardhakāmaṃbulayeḍa naikyadṛṣṭi jēyuṭa dravyādvaitaṃbu. nērpuna nātma tatvānubhavaṃbuna nadvaita trayaṃbunu vilōkiṃci, vastubhēdabuddhiyu garmabhēdabuddhiyu, svakīya parakīya buddhiyu, svapnaṃbulugā dalaṃci muni yainavāḍu mānavalayu.” (śrīmadāṃdhra mahābhāgavatamu - 7 - 15 - 469)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.