నాస్తి ద్వయం యస్య. (తనుకాక రెండవ వస్తువులు లేనివాడు.)
ద్వితీయ రహితః (రెండవ వస్తువు లేనివాడు.)
ద్వైతా భావాత్ అద్వయః - ‘ద్వయోర్భావః ద్విత’ (అనగా రెండు వస్తువులు వేఱు వేఱుగా నుండుట, ‘ద్విత’ యే ద్వైతము. ద్వైతము లేకుండుట, రెండు వస్తువులు లేకుండుట, రెండవది లేకుండుట. అద్వయము - అటువంటి వాడు అద్వయుడు; అద్వితీయుడు - రెండవ వస్తువన్నది లేకుండా తానొక్కడే యుండువాడు ; తను కాక మఱియొక వస్తువు లేకుండ ఉన్నవాడు.)
వ. ” --- తత్వవిదులు జ్ఞానమను పేర నద్వయమైనయది తత్వమని యెఱుంగుదురు” (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 1 - 2 - 56)
“సీ. --- భగవంతుండు సృష్టిపూర్వంబునందు
నాత్మీయ మాయా లయంబు నొందిన విశ్వగర్భుడై తాన యొక్కటి వెలుంగు
పరమాత్ము డభవుం డుపద్రష్ట యయ్యు వస్త్వంతర పరిశూన్యు డగుట జేసి
తే. ద్రష్ట గాకుండు ---” (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 3 - 5 - 198)
(శ్రీమదాంధ్ర మహాభాగవతము - 7 - 10 - 360)
వ. “దేహాదులకు గారణత్వంబున నాదియందును, నవధిత్వంబున నంత్యమందును గలుగుచు, బహిరంగంబున భోగ్యంబును, నంతరంగంబున భోక్తయు, బరంబును నపరంబును, జ్ఞానంబును, జ్ఞేయంబును, వచనంబును, వాచ్యమును, నప్రకాశమును, బ్రకాశంబు నైన వస్తువునకు వేఱొండు లేదు”. (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 7 - 15 - 469)
సర్వ వస్తు శరీరకతయా సర్వా భేదేన స్వాతిరిక్త సమస్త రహితం.
(సమస్త వస్తువులయొక్క శరీరములు తానే అయి ఉండుటవలన, తనకూ ఏ వస్తువునకు భేదము లేనందువలన, తను కానిది ఏ వస్తువు లేనందువలన అద్వయుడు.)
(పరమ పురుషార్ధమైన మోక్షము తననుండి తప్ప రెండవ దానినుండి, ఇతరమైన దానినుండి కలుగదు; అట్టివాడు అద్వయుడు.)
(నేను ప్రతిజ్ఞ చేసి సత్యము చెప్పుచున్నాను. నాకు వికారములు - మార్పులు - లేవు, వికారము పొందుటకుకారణము లేదు - నేను వికారమును పొంది మఱి యొకటిగా ఉండనందున, రెండవదిగా ఉండనందున, అద్వయుడను.)
(తనతో సమానమైనవాడు కాని, తనకంటె అధికుడు గాని లేనివాడు. “నత్వత్సమోస్త్యభ్యధికః కుతస్తే” - - (శ్రీమద్భగవద్గీత - 11 - 43)
అందుచేత ప్రపంచమంతటను తానే పూర్తిగా నిండియున్నవాడు, ఇంకొకడు ఉండుటకు అవకాశము ఇవ్వని వాడు.)
(తనతో సమానమైనది కాని, తన కంటె అధికుడు కాని లేడు గనుక అద్వయుడు. అద్వయుడని చెప్పుటచేత భగవంతుడు అనంతుడు అని చెప్పబడినది - అనగా. అంతము లేకుండునట్లు అంతట వ్యాపించియున్నవాడు అని అర్ధమగును. అనంతముగా వ్యాపించి యుండుటవలన ఇంకొక వస్తువు - ఇటువంటిదికాని, ఇంతకన్న గొప్పది కాని ఉండుటకు అవకాశము లేదు కనుక.)
(జీవుడు, ఈశ్వరుడు, ఇద్దరూ మాయ కలవారు. అందుచేత అన్ని విశేషములను ‘ఇది బ్రహ్మ కాదు, ఇది బ్రహ్మకాదు’ అని త్రోసిపుచ్చి, ఏది మిగిలియుండునో అది ఒకటే, ఒకే ఒకటైన - అద్వయమైన - బ్రహ్మము.)
- అద్వితీయ మిత్యర్థః.
(ద్వయమనగా సముదాయము, కూడిక, రెండింటి కూడిక. అదికానిది అద్వయము - సజాతీయమైన రెండవ వస్తువు లేనిది.)
(తనవలె సృష్టిస్థితిలయములు కలిగించు సర్వ శక్తి సమన్వితుడు - ఆత్మ వంటివాడు - స్వజాతీయుడు - ఇంకొకడు లేడు - అందుచేత, పరమాత్మ అద్వయుడు. తనకన్న ఏవిధముగానైనను ఉన్నవాడు, మరొకడు - విజాతీయుడు లేడు. అందుచేతకూడ భగవంతుడు అద్వయుడు),
(స్వజాతీయ, విజాతీయ, స్వగత భేదములేనివాడు - తన జాతికి సంబంధించినవాడు కాని - ష్టి స్థితి లయములు చేయ సమర్ధుడైనవాడుకాని - ఇతర జాతికి సంబంధించినవాడు కాని, లేనివాడు - తనలోనైనా ఏ విధమైన భేదము లేకుండ - అంతా సచ్చిదానందరసమే అయినవాడు.)
ఆత్మని జాతి గుణాద్యభిమాన రహితః. (తనలో జాతి, గుణము మొదలగు అభిమానము లేని వాడు.)
అవయవభేద రహితః
(అవయవములు పుట్టునవి, క్షీణించునవి. అట్టి అవయవవిభాగము లేక పూర్తిగా ఒకటే అయినవాడు - స్వగతభేద రహితుడు.)
(చూడుము : - 15.)
(సృష్టి అంతకును - కార్యములకు, కారణములకు - పరమ కారణము, మూలకారణము, ఆదికారణము - అగుటవల్ల అద్వయుడు - పరబ్రహ్మ తప్ప మఱియొకడు ఈ ప్రపంచమంతటికీ - దానిలోనున్న వస్తువులన్నింటికి కారణము, పుట్టుకస్థానము, పుట్టుటకు మొదలు పరబ్రహ్మకాక మఱియొకటిలేదు. అందుచేత పరబ్రహ్మ అద్వయుడు. బంగారము బంగారువస్తువులకు కారణము - ఎన్ని బంగారు వస్తువులు చేసినను అవన్నియు బంగారమునుండే తయారగును, కాని మఱియొక దానినుండి బంగారు వస్తువులు తయారు కావు. బంగారము అకృతము - కార్యము (కార్యవస్తువు) కాదు, కారణవస్తువైనది. బంగారు వస్తువులు బంగారమునుండి తయారైనవి కనుక అవి కృతికములు - కార్యములు.)
(భగవంతుడు తప్ప సర్వమునకు ద్రష్ట, సాక్షి అయినవాడుమఱియొకడు లేడు. అని శ్రుతి చెప్పుటవలన పరమాత్మ కంటె వ్యతిరిక్తమైన చేతనవస్తువులను ఒకటి తర్వాత నొకటిని ‘ఇదికాదు, ఇదికాదు’ అని ప్రపంచమంతను నిషేధించుటచేత, పరబ్రహ్మ ఒక్కడే, మఱియొక పరబ్రహ్మ లేడని, అందుచేతనే పరబ్రహ్మ అద్వయుడని సిద్ధాంతము చేయబడినది. పరబ్రహ్మ కానిది, పరబ్రహ్మ కన్న వ్యతిరిక్తమైనది లేదని నిరాకరించుట చేతనున్నూ, అన్నింటినీ నిరాకరించి పరబ్రహ్మము ఒకటే తుదకు మిగిలియున్నందువలనను ఇదియే, ఈ విధముగానే సిద్ధాంతము చేయబడినది అని తెలియవచ్చుచున్నది.)
(సుషుప్త్యవస్థయందు ఇంద్రియ వృత్తులకు అతీతుడు అగుటవలన రెండవ వస్తువును చూడనట్లే, జాగ్రదవస్థలో కూడా బ్రహ్మజ్ఞానమందు నిష్ఠకలిగియున్నవాడు రెండవ వస్తువును చూడడు - భగవంతుడు కాక మఱియొక వస్తువును చూడడు. రెండవ వస్తువును చూచినప్పటికీ, త్రాడును చూచి మిధ్యా రూపమైన పామువలె, ఆ వస్తువును పరమార్ధదృష్టి తో చూడడు - అతని దృష్టిలో అంతా పరమాత్మ తప్ప రెండవ వస్తువులేదుకనుక.)
(తన శరీరము వేఱు, జీవాత్మ వేఱు అయినప్పటికీ రెండు కలిసియున్నవాడు ఒకే దేవదత్తుడు అను పేరుతో మనిషి యేప్రకారము వ్యవహరింప బడుచున్నాడో, ఆప్రకారమే చేతనములు అచేతనములతోను కూడియున్న సమస్త ప్రపంచమే శరీరముగా గల పరమాత్మ ఈ సమస్త ప్రపంచములోను అంతర్యామిగా నుండుటవలన తనవలె చేతనా చేతనములే అవయవములుగా గల శరీరము కలిగియుండి దానికి తానే అంతరాత్మ, సర్వాత్మ అయినటువంటి ఇంకొక వస్తువు లేకపోవుటవల్ల పరమాత్మ అద్వయుడు - తనవంటి వాడు ఇంకొకడు లేకపోవుటచేత అద్వయుడు.)
(తెలుసుకొనువాడు, తెలుసుకోతగినది, అని రెండు యార్పాటు భేదము లేనివాడు - జ్ఞాతృ (తెలుసుకొనువాడు), జ్ఞేయము (తెలుసుకోతగినది) అని రెండు వేఱుగా లేనివాడు; రెండూ ఒకటే, రెండూ తానే అయిన వాడు. జ్ఞాత వేఱుగాను జ్ఞేయము వేఱుగాని వ్యవహారములో కనబడుచున్నప్పటికిన్నీ, తనుకాని రెండవ వస్తువు కల్పితము, పరమార్ధ దృష్టిలో లేనిది, అంతయూ తానే పరమాత్మయే అగుటవలన - జ్ఞాత, జ్ఞేయము భగవంతుడే - అందు జ్ఞాత వేఱు, జ్ఞేయము వేఱు అను తేడా (రెండు వస్తువులుగా) లేనివాడు - అందుచేత భగవంతుడు అద్వయుడు.)
nāsti dvayaṃ yasya. (tanukāka reṃḍava vastuvulu lēnivāḍu.)
dvitīya rahitaḥ (reṃḍava vastuvu lēnivāḍu.)
dvaitā bhāvāt advayaḥ - ‘dvayōrbhāvaḥ dvita’ (anagā reṃḍu vastuvulu vēṟu vēṟugā nuṃḍuṭa, ‘dvita’ yē dvaitamu. dvaitamu lēkuṃḍuṭa, reṃḍu vastuvulu lēkuṃḍuṭa, reṃḍavadi lēkuṃḍuṭa. advayamu - aṭuvaṃṭi vāḍu advayuḍu; advitīyuḍu - reṃḍava vastuvannadi lēkuṃḍā tānokkaḍē yuṃḍuvāḍu ; tanu kāka maṟiyoka vastuvu lēkuṃḍa unnavāḍu.)
va. ” --- tatvavidulu jñānamanu pēra nadvayamainayadi tatvamani yeṟuṃguduru” (śrīmadāṃdhra mahābhāgavatamu - 1 - 2 - 56)
“sī. --- bhagavaṃtuṃḍu sṛṣṭipūrvaṃbunaṃdu
nātmīya māyā layaṃbu noṃdina viśvagarbhuḍai tāna yokkaṭi veluṃgu
paramātmu ḍabhavuṃ ḍupadraṣṭa yayyu vastvaṃtara pariśūnyu ḍaguṭa jēsi
tē. draṣṭa gākuṃḍu ---” (śrīmadāṃdhra mahābhāgavatamu - 3 - 5 - 198)
(śrīmadāṃdhra mahābhāgavatamu - 7 - 10 - 360)
va. “dēhādulaku gāraṇatvaṃbuna nādiyaṃdunu, navadhitvaṃbuna naṃtyamaṃdunu galugucu, bahiraṃgaṃbuna bhōgyaṃbunu, naṃtaraṃgaṃbuna bhōktayu, baraṃbunu naparaṃbunu, jñānaṃbunu, jñēyaṃbunu, vacanaṃbunu, vācyamunu, naprakāśamunu, brakāśaṃbu naina vastuvunaku vēṟoṃḍu lēdu”. (śrīmadāṃdhra mahābhāgavatamu - 7 - 15 - 469)
sarva vastu śarīrakatayā sarvā bhēdēna svātirikta samasta rahitaṃ.
(samasta vastuvulayokka śarīramulu tānē ayi uṃḍuṭavalana, tanakū ē vastuvunaku bhēdamu lēnaṃduvalana, tanu kānidi ē vastuvu lēnaṃduvalana advayuḍu.)
(parama puruṣārdhamaina mōkṣamu tananuṃḍi tappa reṃḍava dāninuṃḍi, itaramaina dāninuṃḍi kalugadu; aṭṭivāḍu advayuḍu.)
(nēnu pratijña cēsi satyamu ceppucunnānu. nāku vikāramulu - mārpulu - lēvu, vikāramu poṃduṭakukāraṇamu lēdu - nēnu vikāramunu poṃdi maṟi yokaṭigā uṃḍanaṃduna, reṃḍavadigā uṃḍanaṃduna, advayuḍanu.)
(tanatō samānamainavāḍu kāni, tanakaṃṭe adhikuḍu gāni lēnivāḍu. “natvatsamōstyabhyadhikaḥ kutastē” - - (śrīmadbhagavadgīta - 11 - 43)
aṃducēta prapaṃcamaṃtaṭanu tānē pūrtigā niṃḍiyunnavāḍu, iṃkokaḍu uṃḍuṭaku avakāśamu ivvani vāḍu.)
(tanatō samānamainadi kāni, tana kaṃṭe adhikuḍu kāni lēḍu ganuka advayuḍu. advayuḍani ceppuṭacēta bhagavaṃtuḍu anaṃtuḍu ani ceppabaḍinadi - anagā. aṃtamu lēkuṃḍunaṭlu aṃtaṭa vyāpiṃciyunnavāḍu ani ardhamagunu. anaṃtamugā vyāpiṃci yuṃḍuṭavalana iṃkoka vastuvu - iṭuvaṃṭidikāni, iṃtakanna goppadi kāni uṃḍuṭaku avakāśamu lēdu kanuka.)
(jīvuḍu, īśvaruḍu, iddarū māya kalavāru. aṃducēta anni viśēṣamulanu ‘idi brahma kādu, idi brahmakādu’ ani trōsipucci, ēdi migiliyuṃḍunō adi okaṭē, okē okaṭaina - advayamaina - brahmamu.)
- advitīya mityarthaḥ.
(dvayamanagā samudāyamu, kūḍika, reṃḍiṃṭi kūḍika. adikānidi advayamu - sajātīyamaina reṃḍava vastuvu lēnidi.)
(tanavale sṛṣṭisthitilayamulu kaligiṃcu sarva śakti samanvituḍu - ātma vaṃṭivāḍu - svajātīyuḍu - iṃkokaḍu lēḍu - aṃducēta, paramātma advayuḍu. tanakanna ēvidhamugānainanu unnavāḍu, marokaḍu - vijātīyuḍu lēḍu. aṃducētakūḍa bhagavaṃtuḍu advayuḍu),
(svajātīya, vijātīya, svagata bhēdamulēnivāḍu - tana jātiki saṃbaṃdhiṃcinavāḍu kāni - ṣṭi sthiti layamulu cēya samardhuḍainavāḍukāni - itara jātiki saṃbaṃdhiṃcinavāḍu kāni, lēnivāḍu - tanalōnainā ē vidhamaina bhēdamu lēkuṃḍa - aṃtā saccidānaṃdarasamē ayinavāḍu.)
ātmani jāti guṇādyabhimāna rahitaḥ. (tanalō jāti, guṇamu modalagu abhimānamu lēni vāḍu.)
avayavabhēda rahitaḥ
(avayavamulu puṭṭunavi, kṣīṇiṃcunavi. aṭṭi avayavavibhāgamu lēka pūrtigā okaṭē ayinavāḍu - svagatabhēda rahituḍu.)
(cūḍumu : - 15.)
(sṛṣṭi aṃtakunu - kāryamulaku, kāraṇamulaku - parama kāraṇamu, mūlakāraṇamu, ādikāraṇamu - aguṭavalla advayuḍu - parabrahma tappa maṟiyokaḍu ī prapaṃcamaṃtaṭikī - dānilōnunna vastuvulanniṃṭiki kāraṇamu, puṭṭukasthānamu, puṭṭuṭaku modalu parabrahmakāka maṟiyokaṭilēdu. aṃducēta parabrahma advayuḍu. baṃgāramu baṃgāruvastuvulaku kāraṇamu - enni baṃgāru vastuvulu cēsinanu avanniyu baṃgāramunuṃḍē tayāragunu, kāni maṟiyoka dāninuṃḍi baṃgāru vastuvulu tayāru kāvu. baṃgāramu akṛtamu - kāryamu (kāryavastuvu) kādu, kāraṇavastuvainadi. baṃgāru vastuvulu baṃgāramunuṃḍi tayārainavi kanuka avi kṛtikamulu - kāryamulu.)
(bhagavaṃtuḍu tappa sarvamunaku draṣṭa, sākṣi ayinavāḍumaṟiyokaḍu lēḍu. ani śruti ceppuṭavalana paramātma kaṃṭe vyatiriktamaina cētanavastuvulanu okaṭi tarvāta nokaṭini ‘idikādu, idikādu’ ani prapaṃcamaṃtanu niṣēdhiṃcuṭacēta, parabrahma okkaḍē, maṟiyoka parabrahma lēḍani, aṃducētanē parabrahma advayuḍani siddhāṃtamu cēyabaḍinadi. parabrahma kānidi, parabrahma kanna vyatiriktamainadi lēdani nirākariṃcuṭa cētanunnū, anniṃṭinī nirākariṃci parabrahmamu okaṭē tudaku migiliyunnaṃduvalananu idiyē, ī vidhamugānē siddhāṃtamu cēyabaḍinadi ani teliyavaccucunnadi.)
(suṣuptyavasthayaṃdu iṃdriya vṛttulaku atītuḍu aguṭavalana reṃḍava vastuvunu cūḍanaṭlē, jāgradavasthalō kūḍā brahmajñānamaṃdu niṣṭhakaligiyunnavāḍu reṃḍava vastuvunu cūḍaḍu - bhagavaṃtuḍu kāka maṟiyoka vastuvunu cūḍaḍu. reṃḍava vastuvunu cūcinappaṭikī, trāḍunu cūci midhyā rūpamaina pāmuvale, ā vastuvunu paramārdhadṛṣṭi tō cūḍaḍu - atani dṛṣṭilō aṃtā paramātma tappa reṃḍava vastuvulēdukanuka.)
(tana śarīramu vēṟu, jīvātma vēṟu ayinappaṭikī reṃḍu kalisiyunnavāḍu okē dēvadattuḍu anu pērutō maniṣi yēprakāramu vyavahariṃpa baḍucunnāḍō, āprakāramē cētanamulu acētanamulatōnu kūḍiyunna samasta prapaṃcamē śarīramugā gala paramātma ī samasta prapaṃcamulōnu aṃtaryāmigā nuṃḍuṭavalana tanavale cētanā cētanamulē avayavamulugā gala śarīramu kaligiyuṃḍi dāniki tānē aṃtarātma, sarvātma ayinaṭuvaṃṭi iṃkoka vastuvu lēkapōvuṭavalla paramātma advayuḍu - tanavaṃṭi vāḍu iṃkokaḍu lēkapōvuṭacēta advayuḍu.)
(telusukonuvāḍu, telusukōtaginadi, ani reṃḍu yārpāṭu bhēdamu lēnivāḍu - jñātṛ (telusukonuvāḍu), jñēyamu (telusukōtaginadi) ani reṃḍu vēṟugā lēnivāḍu; reṃḍū okaṭē, reṃḍū tānē ayina vāḍu. jñāta vēṟugānu jñēyamu vēṟugāni vyavahāramulō kanabaḍucunnappaṭikinnī, tanukāni reṃḍava vastuvu kalpitamu, paramārdha dṛṣṭilō lēnidi, aṃtayū tānē paramātmayē aguṭavalana - jñāta, jñēyamu bhagavaṃtuḍē - aṃdu jñāta vēṟu, jñēyamu vēṟu anu tēḍā (reṃḍu vastuvulugā) lēnivāḍu - aṃducēta bhagavaṃtuḍu advayuḍu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.