(ఇతనికంటె మఱియొక వస్తువు లేదు అందుచేత అద్వితీయుడు.)
(భగవంతునితో సమానమైనవాడుకాని, సమానము కానివాడుగాని లేడు. అందుచేత భగవంతుడు అద్వితీయుడు.)
(శ్రీమదాంధ్ర మహభాగవతము -)
(తనతోసమానమైనదికాని, అసమానమైనదికాని లేకుండుటవలన భగవంతుడు అనంతుడు.)
ధారుండగు నీశ్వరుండు తలప నతనికిన్
లేరెందు సములు నధికులు
ధీరోత్తముడతండు నద్వితీయుండగుటన్” (శ్రీమదాంధ్ర మహాభాగవతము -)
(ఇప్పుడు ఈ కనబడు ప్రపంచమంతా మొదట, అనగా, ఈ ప్రపంచము సృష్టించబడకముందు, ‘సత్’ పదార్ధముగా ఉండెను, అదొక్కటే యుండెను, రెండవపదార్ధమేదియును లేకుండెను. అందుచేత పరమాత్మ అద్వితీయుడు.)
(ఇప్పుడు ఈ కనబడు ప్రపంచమంతయు, మొదట - అనగా, ఈ ప్రపంచము సృష్టింపబడకముందు ఒక్క ఆత్మగానే, ఒకే ఆత్మగా ఉండెను -సృష్టికి పూర్వము ఆత్మగాక రెండవవస్తువు లేదు - అందుచేత పరమాత్మ అద్వితీయుడు.)
నాత్మీయ మాయా లయంబు నొందిన విశ్వ గర్భుడై తాన యొక్కటి వెలుంగు
---” (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 3 - 5 - 198)
సృష్టి పూర్వమున జర్చింప నే నొకరుండ గలిగియుండుదు వీతకకర్మి నగుచు
సమధిక స్థూల సూక్ష్మ స్వరూపములు దత్కారణ ప్రకృతియు దగ మ దంశ
ఆ. మందు లీనమైన నద్వితీయుండనై
యుందు నాకు నన్య మొకటి లేదు
సృష్టికాలమందు సృష్టినాశంబున
జగము మత్స్యరూప మగును వత్స !” (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 2 - 9 -250)
(ఈ సృష్టిలో అనేక వస్తువులు ఏమియు లేవు. ఉన్నదంతా ఒకటే వస్తువు. అదియే పరమాత్మ – “ఉండేదీ రాముడొకడు ఊరక చెడిపోకె మనసా” - అంతా పరమాత్మయే - పరమాత్మ గాక మఱియొక వస్తువు లేదు. కనుక పరమాత్మ అద్వితీయుడు ---
“క. హరిమయము విశ్వమంతయు
హరి విశ్వమయుండు సంశయము పనిలేదా
హరిమయము గాని ద్రవ్యము
పరమాణువు లేదు వంశపావన ! వింటే” (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 2 - 1 - 17)
(There is not even the smallest particle of matter which does not contain Energy.)
(“ఇది లేదు, ఇది లేదు” అని అన్నింటిని వదలివేయగా మిగిలినది బ్రహ్మమే పరమాత్మ వ్యతిరిక్తము లేదు. అందుచేత పరమాత్మ అద్వితీయుడు.)
(ఆ పరమేశ్వరుడే క్రింద నున్నాడు, (మీదనున్నాడు), నేను మీదనున్నాను, ఆత్మయే క్రిందను మీదనున్నాడు -అనగా, నాకు, ఆత్మకు భేదము లేదు. ఇద్దరము ఒకటే. ఈ ప్రపంచమంతయు పరమాత్మయే. ఈ లోకములో (సృష్టిలో) అనేకమైన వస్తువులేవి లేవు - ఒకటికంటె హెచ్చు వస్తువులు ఏవి లేవు. పరమాత్మ కన్న పరమైనది, అపరమైనది - ఉత్కృష్టమైనది, తక్కువైనది ఏదీలేదు, అధికుడు లేడు, (“నాభ్యధికః కుతస్తే” - శ్రీమద్భగవద్గీత.) అంతా భగవంతుడే కనుక అతను కాక ఇంకేదియు లేదు - అతనికి ముందు ఏదియు లేదు, వెనుక ఏదియులేదు, అతనిలోనుండే అన్నియు పుట్టినవి, కనుక అతనికి ముందు ఉన్నట్టిదేదీ లేదు. అతను నాశము లేనివాడు కనుక అతని తర్వాత ఏదైన నుండుననుటకు అవకాశము లేదు. అందుచేత అతని తర్వాత ఎవడూ లేడు. అతనిలోపలగాని వెలుపల గాని ఏమియు లేదు. అతను సర్వవ్యాపకుడు; సూక్ష్మాతిసూక్ష్ముడు. అందుచేత అతనిలోన ఉండుటకు దేనికినీ అవకాశము లేదుకనుక అతనిలోపల ఏదియును లేదు. అతను అంతటను పూర్తిగా వ్యాపించియున్నాడు. (అందుచేతనే అతనిని పురుషుడందురు. అతను లేని ప్రదేశముకాని, వస్తువుగాని పరమాణువంతకూడా ఏదీ లేదు. అంతా అతనే యగుటవలన అతనికి వెలుపలనుండు వస్తువేదీ లేదు - అతని వెలుపలనుండుటకు అవకాశములేదు. అందుచేత పరమేశ్వరునికన్న వేరైన పదార్ధములేదు. అందుచేత అతను అద్వితీయుడు)
కుండకు మట్టి ఉపాదాన కారణము, కుమ్మరివాడు నిమిత్త కారణము. ప్రపంచమునకు భగవంతుడు ఉపాదానకారణము, నిమిత్త కారణముకూడా. అందుచేత తనకంటె వేరైన కారణవస్తువు మఱొకటి లేదు, రెండవ వస్తువు (ద్వితీయ వస్తువు) లేదు. కనుక భగవంతుడు అద్వితీయుడు.)
భావి వట వృక్ష శక్తి మద్వటబీజం స్వశక్త్యా స సద్వితీయం కథ్యతే, తద్వత్ బ్రహ్మాది న మాయా శక్త్యా న ద్వితీయం సత్వాది రూపేణ నిరూప్యమణే వ్యక్త రస్య నాస్తీతిఅవ్యక్తం, తతో అవ్యక్త శబ్దాత్ అపి అద్వైతా విరోధిత్వం ద్రష్టవ్యం.
(ముందుకాబోయే వటవృక్షము - మఱ్ఱిచెట్టు - యొక్క శక్తి వట బీజములో - మఱ్ఱి విత్తనములో ఉండుటవలన, ఆ శక్తి తనలోనే కలిగియుండుటవలన వటవృక్షము తనలోనుండి పుట్టి పెద్దదగుటకు ఇతర సహాయము లేకుండగనే ఆశక్తి తనలోనే కలిగియుండుటవలన ఆ వటబీజము స ద్వితీయము కాదు; అద్వితీయము - అనగా, ఆచెట్టును పుట్టించుటకు మఱియొక బీజము కాని ఇంకొక వస్తువుకాని అవసరము లేకుండగనే చేయునది. ఆ ప్రకారముగానే పరబ్రహ్మ తన మాయా శక్తిని తనలోనే కలిగి యుండుటచేత ప్రపంచ సృష్టికి కావలసిన సత్త్వము మొదలగునవి కలిగియుండి తనతో సరిసమానమైన - తనతో పోల్చతగిన మఱియొక వ్యక్తి లేనివాడు - బ్రహ్మవలె ఈ శక్తిని కలిగియున్నవాడు మఱి యొకడు - ద్వితీయుడు - లేడు. అందుచేత బ్రహ్మ అద్వితీయుడు.)
(వాఙ్మాత్రిముచే చెప్పబడుచున్నవి - కుండ, మూకుడు మొదలగునవి మృత్తికయొక్క - మట్టియొక్క - వికారములే - మార్పులే, కనుక నామ మాత్రములు - పేర్లు వేఱు వేఱుగా నున్నవి కాని అవి అన్నియు మట్టితోచేయబడి యుండుటవలన మట్టియే - అందుచేత మట్టి ఎన్ని మార్పులు చెందిననూ మట్టియే - మూకుడు మొదలగునవి నామ మాత్రములే. అవి పగిలియుండినపుడు మిగిలినది వాటికి కారణమైన మట్టియే అందుచేత కారణము మాత్రమే పరమార్ధము, శాశ్వతమైనది. కారణవస్తువులోనుండి పుట్టిన వస్తువు - మూకుడు వాటివలె భగవంతుడు లోనుండి పుట్టిన కార్యమంతయు మిధ్యయే - కల్పితమే, లేనిదే. అందుచేత పరమార్ధ దృష్టిలో భగవంతుడు ఒకడే ఉన్నాడు, రెండవది - ప్రపంచము - లేనిదే. అందుచేత భగవంతుడు అద్వితీయుడు.)
(ఈ కనబడు ప్రపంచమంతా పురుషుడే, పరమ పురుషుడే, పరమాత్మయే. అందుచేత పరమాత్మ గాక మఱొక వస్తువు లేదు - అందుచేత పరమాత్మ అద్వితీయుడు.)
స్వ వ్యతిరిక్త భావా భావ రహితః న ద్వితీయో (అ) స్తి కశ్చిత్ ఉక్తాన్నారాయణాత్ సర్వాధిష్టాన భూతాత్ ద్వితీయః కశ్చిద్భావో (అ) భావో వా ద్వితీయ సంఖ్య పూరణో నాస్తి.నాస్య ద్వితీయం వస్త్వంతరం విద్యతే ఇత్యద్వితీయం అనేన మృద్వ్యతిరేకేణ మృదో యథా అన్యత్ ఘటాద్యాకారేణ పరిణామ యితృ కులాలాది నిమిత్తకారణం దృష్టం తథా సద్వ్యతిరేకేణ సతస్సహకారికారిణం ద్వితీయం ప్రాప్తం ప్రతిషిద్ధ్యతే, స్వయమేవ చేతనత్వేన నిమిత్తత్త్వ సంభవాత్. నను చేతనత్వే (అ) పి కులాలస్య స్వ వ్యతిరిక్త మృద్రూపో పాదానాపేక్షా దృష్టా. ఏవ మత్రాపి ఉపాదానాపేక్షా అస్తీతి చేత్, మైవం అచ్ఛిన్న నిమిత్తోపాదానత్వ సంభవాత్ “తదైక్షత బహుస్యాం ప్రజాయే యేతి శ్రుతిః. తత్ర ఈక్షణేన నిమిత్తత్త్వం బహు భవనే నోపాదానత్వంచ అద్వితీయస్య సద్వస్తునో (అ) వగమ్యతే. అతో జగతః నిమిత్తముపాదానం చ స్వయమేవేత్యర్థః నను అవిక్రియస్యా సంగస్య బ్రహ్మణః కథముభయ విధ కారణత్వం సంభవతి ? మాయ యేతి చేత్ తర్హి తయాద్వైతాపత్తి రితి, మైవం, తస్యాస్సద్రూపే బ్రహ్మణ్యధ్యస్తత్వేన అనిర్వచనీయతయా స్వత స్సత్తా (అ) భావాత్. ఏవంచ మాయా శక్తి వశా ద విక్రియస్యాపి బ్రహ్మణ స్ససృష్టాత్వాదిక ముపపద్యతే, నాపి ద్వైతాపత్తిఃమాయాయా అనిర్వచనీయత్వేన వస్తుత్వా సంభవాదితి.
“అతశ్చ కారణం నిత్య మేకమేవాద్వయం సురాః |
కులాలాదే ర్మృదాదేశ్చ భేద దృష్టే (అ) పి భూతలే |
అచైతన్యాన్మృదాదేస్తు కులాలాది రపేక్ష్యతే |
అత్ర కారణమద్వైతం శుద్ధచైతన్యమేవహి |
తేన నాపేక్ష్యతేహ్యన్యత్ కారణం చేతనాత్మకం |
స్వయం చేతనమప్యేతత్ కారణం స కులాలవత్ |
అపేక్షతే మృదాతుల్యమ చిద్రూపం తు కారణం |
ప్రతీత్యా కేవలం శక్తి ర చిద్రూపా తమోమయా |
సర్వ ప్రకారై ర్విద్వధ్భిః అనిర్మ్వాచ్యాస్తి శాంకరీ |
తయా దుర్ఘట కారిణ్యా తాదాత్మ్యే నైవ సంగతం |
కారణం సకలం స్రష్ట్రే సర్వ సర్వ సంహర్తృ చాస్తికాః |
పాలకంచ సదా సత్య చిద్రూపత్వాత్ సురోత్తమాః || (బ్రహ్మగీతాయాం)
(తనకు వ్యతిరేకమైనది, తను కానిది, ఏవిధమైన భావముకాని, అభావముకాని, లేనిది అని చెప్పబడిన నారాయణుడు సర్వమునకు అధిష్ఠానమైనవాడు అగుటచేత అద్వితీయుడు.) (ఇతనికి - పరమాత్మకు - రెండవ వస్తువు - అతను కాక ఇంకొక వస్తువు - లేనందున అద్వితీయుడు.మట్టితో కుండ చేయుటకు మట్టి, కుమ్మరివాడు అను రెండు వస్తువులుండవలెను.వీటిలో ఏది లేకపోయినను మట్టికుండ తయారు కానేరదు. ఈ రెండింటిలో మట్టి ఉపాదానకారణము, (material for making the pot) - (material cause.) కుమ్మరివాడు నిమిత్త కారణము. ప్రపంచసృష్టికి భగవంతుడే ఉపాదాన కారణము, నిమిత్తకారణము కూడ అయి ఉన్నాడు - ప్రకృతి రూపములో ఉపాదానకారణము చిచ్ఛక్తిరూపములో నిమిత్తకారణము - కూడా తానే అయి ఉన్నాడు. జడమైన ప్రకృతిరూపములో తన చిచ్ఛక్తి - చైతన్య శక్తి - రూపముతో ప్రవేశించి ప్రకృతి చేత సృష్టి చేయించుచున్నాడు. అందుచేత అతనికి రెండవ వస్తువులేదు, అందుచేత అతను అద్వయుడు. “తదైక్షత, బహుస్యాం ప్రజాయాయేతి” అని భగవంతునుకి కోరిక కలిగెను - (“నేను ఒక్కడిని అయినను బహురూపములుగా మారెదను, ఈ ప్రజలను పుట్టించెదను” అనుటవలన ఉపాదానత్వము - ఉపాదానకారణము - తానే అని చెప్పబడినది - అనగా, భగవంతునికొక్కడికే ఈ రెండు కారణములు చెప్పబడినవి. అయిన యెడల అవిక్రియుడు - మార్పులు లేనివాడు, స్వస్వరూపమునుండి మారువాడు కాడు - అసంగుడు - దేనితో కలిసినను దేనిని అంటనివాడు, ‘సత్’ రూపముగా గలవాడు, అగు పరబ్రహ్మకు ఈ రెండు విధముల కారణము - ఉపాదానకారణము, నిమిత్త కారణము - కలుగుచున్నది. అని చెప్పిన అది మాయచేత కలుగుచున్నది. అని చెప్పిన మాయ - ప్రకృతి యను రెండవ వస్తువు ఉన్నట్లు. అందుచేత పరబ్రహ్మ ద్వితీయుడే కాని అద్వితీయుడుకాడని స్ఫురించును. కాని అట్లు కాదు - మాయ - ప్రకృతి - పరబ్రహ్మయందు అధ్యస్తమై యున్నది. దానికి స్వతహా సత్తాస్ఫూర్తి - చైతన్య శక్తి - లేనందున అది రెండవ వస్తువు కాదు - ఇంకొక పరబ్రహ్మ కాదు. ఇందువలన పరబ్రహ్మ అవిక్రియుడైనను - మార్పు పొందనివాడైనను - అతనికి సృష్టి చేయుటయందు కర్తృత్వము - ఉభయ కారణత్వము ఆరోపింపబడినది. భగవంతునికి రెండు శక్తులున్నవి - ఒకటి ప్రకృతి. జడము,కుండచేయుటకు మట్టివంటిది. రెండవ శక్తి చైతన్య శక్తి. ఈ రెండు శక్తులు భగవంతునిలోనే ఉన్నవి - ఏ ఒకటియు భగవంతునికంటె వేఱుగాలేదు.
“భూమి రాపో (అ) నలో వాయుః ఖం మనోబుద్ధి రేవచ |
అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి రష్టదా ||
అవరేయం ఇతస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మేపరాం |
జీవ భూతాం మహా భాహో ! య యేదం ధార్యతే జగత్ ||” (శ్రీమద్భగవద్గీత - 7 - 4, 5)
(నాకు రెండు ప్రకృతులు - శక్తులు - ఉన్నవి. ఒకటి అపరా, ఇది జడము, ఎనిమిది విధములుగా, రూపములుగా - పంచభూతములు, మనస్సు, బుద్ధి, అహంకారము - ఉన్నది. కుమ్మరివానికి కుండ చేయుటకు మట్టివంటిది. రెండవది పరాశక్తి - చైతన్య శక్తి. ఇది అన్నింటిలోను ప్రవేశించి, వ్యాపించి యుండి, వాటిని చైతన్యవంతముగా - శక్తివంతముగా చేయునది. ఇదియే జగత్తును నడిపించుచున్నది. ఈ రెండు శక్తులు నావే కనుక,- అవి నేనే కనుక - ఆ రెండింటిని విడదీయలేని రూపములో సృష్టిలో ఉన్నందున, వాటికి నాకు భేదములేనందున, అది నాకంటె వేరైన వస్తువులుకావు. అందుచేత కుండ విషయములో వలె నేనుకాక రెండవ వస్తువు లేదుకనుక నేను అద్వితీయుడను. నేను సృష్టిచేయుటకు, మట్టి కుమ్మరిని అపేక్షించినట్లు రెండవ వస్తువు యొక్క అపేక్ష లేకనే సృష్టికి రెండు కారణములయిన ఉపాదానకారణము, నిమిత్తకారణము నేనే అయి యున్నాను. ఈ సృష్టి చేయు విధానములో చైతన్య శక్తి కలది నేను కాని రెండవ వస్తువు లేదు. కనుక నేను అద్వయుడను.)
(itanikaṃṭe maṟiyoka vastuvu lēdu aṃducēta advitīyuḍu.)
(bhagavaṃtunitō samānamainavāḍukāni, samānamu kānivāḍugāni lēḍu. aṃducēta bhagavaṃtuḍu advitīyuḍu.)
(śrīmadāṃdhra mahabhāgavatamu -)
(tanatōsamānamainadikāni, asamānamainadikāni lēkuṃḍuṭavalana bhagavaṃtuḍu anaṃtuḍu.)
dhāruṃḍagu nīśvaruṃḍu talapa natanikin
lēreṃdu samulu nadhikulu
dhīrōttamuḍataṃḍu nadvitīyuṃḍaguṭan” (śrīmadāṃdhra mahābhāgavatamu -)
(ippuḍu ī kanabaḍu prapaṃcamaṃtā modaṭa, anagā, ī prapaṃcamu sṛṣṭiṃcabaḍakamuṃdu, ‘sat’ padārdhamugā uṃḍenu, adokkaṭē yuṃḍenu, reṃḍavapadārdhamēdiyunu lēkuṃḍenu. aṃducēta paramātma advitīyuḍu.)
(ippuḍu ī kanabaḍu prapaṃcamaṃtayu, modaṭa - anagā, ī prapaṃcamu sṛṣṭiṃpabaḍakamuṃdu okka ātmagānē, okē ātmagā uṃḍenu -sṛṣṭiki pūrvamu ātmagāka reṃḍavavastuvu lēdu - aṃducēta paramātma advitīyuḍu.)
nātmīya māyā layaṃbu noṃdina viśva garbhuḍai tāna yokkaṭi veluṃgu
---” (śrīmadāṃdhra mahābhāgavatamu - 3 - 5 - 198)
sṛṣṭi pūrvamuna jarciṃpa nē nokaruṃḍa galigiyuṃḍudu vītakakarmi nagucu
samadhika sthūla sūkṣma svarūpamulu datkāraṇa prakṛtiyu daga ma daṃśa
ā. maṃdu līnamaina nadvitīyuṃḍanai
yuṃdu nāku nanya mokaṭi lēdu
sṛṣṭikālamaṃdu sṛṣṭināśaṃbuna
jagamu matsyarūpa magunu vatsa !” (śrīmadāṃdhra mahābhāgavatamu - 2 - 9 -250)
(ī sṛṣṭilō anēka vastuvulu ēmiyu lēvu. unnadaṃtā okaṭē vastuvu. adiyē paramātma – “uṃḍēdī rāmuḍokaḍu ūraka ceḍipōke manasā” - aṃtā paramātmayē - paramātma gāka maṟiyoka vastuvu lēdu. kanuka paramātma advitīyuḍu ---
“ka. harimayamu viśvamaṃtayu
hari viśvamayuṃḍu saṃśayamu panilēdā
harimayamu gāni dravyamu
paramāṇuvu lēdu vaṃśapāvana ! viṃṭē” (śrīmadāṃdhra mahābhāgavatamu - 2 - 1 - 17)
(There is not even the smallest particle of matter which does not contain Energy.)
(“idi lēdu, idi lēdu” ani anniṃṭini vadalivēyagā migilinadi brahmamē paramātma vyatiriktamu lēdu. aṃducēta paramātma advitīyuḍu.)
(ā paramēśvaruḍē kriṃda nunnāḍu, (mīdanunnāḍu), nēnu mīdanunnānu, ātmayē kriṃdanu mīdanunnāḍu -anagā, nāku, ātmaku bhēdamu lēdu. iddaramu okaṭē. ī prapaṃcamaṃtayu paramātmayē. ī lōkamulō (sṛṣṭilō) anēkamaina vastuvulēvi lēvu - okaṭikaṃṭe heccu vastuvulu ēvi lēvu. paramātma kanna paramainadi, aparamainadi - utkṛṣṭamainadi, takkuvainadi ēdīlēdu, adhikuḍu lēḍu, (“nābhyadhikaḥ kutastē” - śrīmadbhagavadgīta.) aṃtā bhagavaṃtuḍē kanuka atanu kāka iṃkēdiyu lēdu - ataniki muṃdu ēdiyu lēdu, venuka ēdiyulēdu, atanilōnuṃḍē anniyu puṭṭinavi, kanuka ataniki muṃdu unnaṭṭidēdī lēdu. atanu nāśamu lēnivāḍu kanuka atani tarvāta ēdaina nuṃḍunanuṭaku avakāśamu lēdu. aṃducēta atani tarvāta evaḍū lēḍu. atanilōpalagāni velupala gāni ēmiyu lēdu. atanu sarvavyāpakuḍu; sūkṣmātisūkṣmuḍu. aṃducēta atanilōna uṃḍuṭaku dēnikinī avakāśamu lēdukanuka atanilōpala ēdiyunu lēdu. atanu aṃtaṭanu pūrtigā vyāpiṃciyunnāḍu. (aṃducētanē atanini puruṣuḍaṃduru. atanu lēni pradēśamukāni, vastuvugāni paramāṇuvaṃtakūḍā ēdī lēdu. aṃtā atanē yaguṭavalana ataniki velupalanuṃḍu vastuvēdī lēdu - atani velupalanuṃḍuṭaku avakāśamulēdu. aṃducēta paramēśvarunikanna vēraina padārdhamulēdu. aṃducēta atanu advitīyuḍu)
kuṃḍaku maṭṭi upādāna kāraṇamu, kummarivāḍu nimitta kāraṇamu. prapaṃcamunaku bhagavaṃtuḍu upādānakāraṇamu, nimitta kāraṇamukūḍā. aṃducēta tanakaṃṭe vēraina kāraṇavastuvu maṟokaṭi lēdu, reṃḍava vastuvu (dvitīya vastuvu) lēdu. kanuka bhagavaṃtuḍu advitīyuḍu.)
bhāvi vaṭa vṛkṣa śakti madvaṭabījaṃ svaśaktyā sa sadvitīyaṃ kathyatē, tadvat brahmādi na māyā śaktyā na dvitīyaṃ satvādi rūpēṇa nirūpyamaṇē vyakta rasya nāstītiavyaktaṃ, tatō avyakta śabdāt api advaitā virōdhitvaṃ draṣṭavyaṃ.
(muṃdukābōyē vaṭavṛkṣamu - maṟṟiceṭṭu - yokka śakti vaṭa bījamulō - maṟṟi vittanamulō uṃḍuṭavalana, ā śakti tanalōnē kaligiyuṃḍuṭavalana vaṭavṛkṣamu tanalōnuṃḍi puṭṭi peddadaguṭaku itara sahāyamu lēkuṃḍaganē āśakti tanalōnē kaligiyuṃḍuṭavalana ā vaṭabījamu sa dvitīyamu kādu; advitīyamu - anagā, āceṭṭunu puṭṭiṃcuṭaku maṟiyoka bījamu kāni iṃkoka vastuvukāni avasaramu lēkuṃḍaganē cēyunadi. ā prakāramugānē parabrahma tana māyā śaktini tanalōnē kaligi yuṃḍuṭacēta prapaṃca sṛṣṭiki kāvalasina sattvamu modalagunavi kaligiyuṃḍi tanatō sarisamānamaina - tanatō pōlcatagina maṟiyoka vyakti lēnivāḍu - brahmavale ī śaktini kaligiyunnavāḍu maṟi yokaḍu - dvitīyuḍu - lēḍu. aṃducēta brahma advitīyuḍu.)
(vāṅmātrimucē ceppabaḍucunnavi - kuṃḍa, mūkuḍu modalagunavi mṛttikayokka - maṭṭiyokka - vikāramulē - mārpulē, kanuka nāma mātramulu - pērlu vēṟu vēṟugā nunnavi kāni avi anniyu maṭṭitōcēyabaḍi yuṃḍuṭavalana maṭṭiyē - aṃducēta maṭṭi enni mārpulu ceṃdinanū maṭṭiyē - mūkuḍu modalagunavi nāma mātramulē. avi pagiliyuṃḍinapuḍu migilinadi vāṭiki kāraṇamaina maṭṭiyē aṃducēta kāraṇamu mātramē paramārdhamu, śāśvatamainadi. kāraṇavastuvulōnuṃḍi puṭṭina vastuvu - mūkuḍu vāṭivale bhagavaṃtuḍu lōnuṃḍi puṭṭina kāryamaṃtayu midhyayē - kalpitamē, lēnidē. aṃducēta paramārdha dṛṣṭilō bhagavaṃtuḍu okaḍē unnāḍu, reṃḍavadi - prapaṃcamu - lēnidē. aṃducēta bhagavaṃtuḍu advitīyuḍu.)
(ī kanabaḍu prapaṃcamaṃtā puruṣuḍē, parama puruṣuḍē, paramātmayē. aṃducēta paramātma gāka maṟoka vastuvu lēdu - aṃducēta paramātma advitīyuḍu.)
sva vyatirikta bhāvā bhāva rahitaḥ na dvitīyō (a) sti kaścit uktānnārāyaṇāt sarvādhiṣṭāna bhūtāt dvitīyaḥ kaścidbhāvō (a) bhāvō vā dvitīya saṃkhya pūraṇō nāsti.nāsya dvitīyaṃ vastvaṃtaraṃ vidyatē ityadvitīyaṃ anēna mṛdvyatirēkēṇa mṛdō yathā anyat ghaṭādyākārēṇa pariṇāma yitṛ kulālādi nimittakāraṇaṃ dṛṣṭaṃ tathā sadvyatirēkēṇa satassahakārikāriṇaṃ dvitīyaṃ prāptaṃ pratiṣiddhyatē, svayamēva cētanatvēna nimittattva saṃbhavāt. nanu cētanatvē (a) pi kulālasya sva vyatirikta mṛdrūpō pādānāpēkṣā dṛṣṭā. ēva matrāpi upādānāpēkṣā astīti cēt, maivaṃ acchinna nimittōpādānatva saṃbhavāt “tadaikṣata bahusyāṃ prajāyē yēti śrutiḥ. tatra īkṣaṇēna nimittattvaṃ bahu bhavanē nōpādānatvaṃca advitīyasya sadvastunō (a) vagamyatē. atō jagataḥ nimittamupādānaṃ ca svayamēvētyarthaḥ nanu avikriyasyā saṃgasya brahmaṇaḥ kathamubhaya vidha kāraṇatvaṃ saṃbhavati ? māya yēti cēt tarhi tayādvaitāpatti riti, maivaṃ, tasyāssadrūpē brahmaṇyadhyastatvēna anirvacanīyatayā svata ssattā (a) bhāvāt. ēvaṃca māyā śakti vaśā da vikriyasyāpi brahmaṇa ssasṛṣṭātvādika mupapadyatē, nāpi dvaitāpattiḥmāyāyā anirvacanīyatvēna vastutvā saṃbhavāditi.
“ataśca kāraṇaṃ nitya mēkamēvādvayaṃ surāḥ |
kulālādē rmṛdādēśca bhēda dṛṣṭē (a) pi bhūtalē |
acaitanyānmṛdādēstu kulālādi rapēkṣyatē |
atra kāraṇamadvaitaṃ śuddhacaitanyamēvahi |
tēna nāpēkṣyatēhyanyat kāraṇaṃ cētanātmakaṃ |
svayaṃ cētanamapyētat kāraṇaṃ sa kulālavat |
apēkṣatē mṛdātulyama cidrūpaṃ tu kāraṇaṃ |
pratītyā kēvalaṃ śakti ra cidrūpā tamōmayā |
sarva prakārai rvidvadhbhiḥ anirmvācyāsti śāṃkarī |
tayā durghaṭa kāriṇyā tādātmyē naiva saṃgataṃ |
kāraṇaṃ sakalaṃ sraṣṭrē sarva sarva saṃhartṛ cāstikāḥ |
pālakaṃca sadā satya cidrūpatvāt surōttamāḥ || (brahmagītāyāṃ)
(tanaku vyatirēkamainadi, tanu kānidi, ēvidhamaina bhāvamukāni, abhāvamukāni, lēnidi ani ceppabaḍina nārāyaṇuḍu sarvamunaku adhiṣṭhānamainavāḍu aguṭacēta advitīyuḍu.) (itaniki - paramātmaku - reṃḍava vastuvu - atanu kāka iṃkoka vastuvu - lēnaṃduna advitīyuḍu.maṭṭitō kuṃḍa cēyuṭaku maṭṭi, kummarivāḍu anu reṃḍu vastuvuluṃḍavalenu.vīṭilō ēdi lēkapōyinanu maṭṭikuṃḍa tayāru kānēradu. ī reṃḍiṃṭilō maṭṭi upādānakāraṇamu, (material for making the pot) - (material cause.) kummarivāḍu nimitta kāraṇamu. prapaṃcasṛṣṭiki bhagavaṃtuḍē upādāna kāraṇamu, nimittakāraṇamu kūḍa ayi unnāḍu - prakṛti rūpamulō upādānakāraṇamu cicchaktirūpamulō nimittakāraṇamu - kūḍā tānē ayi unnāḍu. jaḍamaina prakṛtirūpamulō tana cicchakti - caitanya śakti - rūpamutō pravēśiṃci prakṛti cēta sṛṣṭi cēyiṃcucunnāḍu. aṃducēta ataniki reṃḍava vastuvulēdu, aṃducēta atanu advayuḍu. “tadaikṣata, bahusyāṃ prajāyāyēti” ani bhagavaṃtunuki kōrika kaligenu - (“nēnu okkaḍini ayinanu bahurūpamulugā māredanu, ī prajalanu puṭṭiṃcedanu” anuṭavalana upādānatvamu - upādānakāraṇamu - tānē ani ceppabaḍinadi - anagā, bhagavaṃtunikokkaḍikē ī reṃḍu kāraṇamulu ceppabaḍinavi. ayina yeḍala avikriyuḍu - mārpulu lēnivāḍu, svasvarūpamunuṃḍi māruvāḍu kāḍu - asaṃguḍu - dēnitō kalisinanu dēnini aṃṭanivāḍu, ‘sat’ rūpamugā galavāḍu, agu parabrahmaku ī reṃḍu vidhamula kāraṇamu - upādānakāraṇamu, nimitta kāraṇamu - kalugucunnadi. ani ceppina adi māyacēta kalugucunnadi. ani ceppina māya - prakṛti yanu reṃḍava vastuvu unnaṭlu. aṃducēta parabrahma dvitīyuḍē kāni advitīyuḍukāḍani sphuriṃcunu. kāni aṭlu kādu - māya - prakṛti - parabrahmayaṃdu adhyastamai yunnadi. dāniki svatahā sattāsphūrti - caitanya śakti - lēnaṃduna adi reṃḍava vastuvu kādu - iṃkoka parabrahma kādu. iṃduvalana parabrahma avikriyuḍainanu - mārpu poṃdanivāḍainanu - ataniki sṛṣṭi cēyuṭayaṃdu kartṛtvamu - ubhaya kāraṇatvamu ārōpiṃpabaḍinadi. bhagavaṃtuniki reṃḍu śaktulunnavi - okaṭi prakṛti. jaḍamu,kuṃḍacēyuṭaku maṭṭivaṃṭidi. reṃḍava śakti caitanya śakti. ī reṃḍu śaktulu bhagavaṃtunilōnē unnavi - ē okaṭiyu bhagavaṃtunikaṃṭe vēṟugālēdu.
“bhūmi rāpō (a) nalō vāyuḥ khaṃ manōbuddhi rēvaca |
ahaṃkāra itīyaṃ mē bhinnā prakṛti raṣṭadā ||
avarēyaṃ itastvanyāṃ prakṛtiṃ viddhi mēparāṃ |
jīva bhūtāṃ mahā bhāhō ! ya yēdaṃ dhāryatē jagat ||” (śrīmadbhagavadgīta - 7 - 4, 5)
(nāku reṃḍu prakṛtulu - śaktulu - unnavi. okaṭi aparā, idi jaḍamu, enimidi vidhamulugā, rūpamulugā - paṃcabhūtamulu, manassu, buddhi, ahaṃkāramu - unnadi. kummarivāniki kuṃḍa cēyuṭaku maṭṭivaṃṭidi. reṃḍavadi parāśakti - caitanya śakti. idi anniṃṭilōnu pravēśiṃci, vyāpiṃci yuṃḍi, vāṭini caitanyavaṃtamugā - śaktivaṃtamugā cēyunadi. idiyē jagattunu naḍipiṃcucunnadi. ī reṃḍu śaktulu nāvē kanuka,- avi nēnē kanuka - ā reṃḍiṃṭini viḍadīyalēni rūpamulō sṛṣṭilō unnaṃduna, vāṭiki nāku bhēdamulēnaṃduna, adi nākaṃṭe vēraina vastuvulukāvu. aṃducēta kuṃḍa viṣayamulō vale nēnukāka reṃḍava vastuvu lēdukanuka nēnu advitīyuḍanu. nēnu sṛṣṭicēyuṭaku, maṭṭi kummarini apēkṣiṃcinaṭlu reṃḍava vastuvu yokka apēkṣa lēkanē sṛṣṭiki reṃḍu kāraṇamulayina upādānakāraṇamu, nimittakāraṇamu nēnē ayi yunnānu. ī sṛṣṭi cēyu vidhānamulō caitanya śakti kaladi nēnu kāni reṃḍava vastuvu lēdu. kanuka nēnu advayuḍanu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.