శబ్ద స్పర్శ రూపాణి అగ్ని గుణాః. (శబ్ద స్పర్శ రూపములు అగ్ని గుణములు.)
“ఆకాశా ద్వాయుః వాయోరగ్నిః” ఆకాశములోనుండి వాయువు పుట్టినది, వాయువు లోనుండి అగ్ని పుట్టినది. ఆకాశము యొక్క గుణము శబ్దము - వాయువు యొక్క గుణము స్పర్శ, అగ్ని యొక్క గుణము రూపము – ఆకాశములో నుండి వాయువు పుట్టినది కనుక వాయువునకు తన అసాధారణ గుణమైన స్పర్శయే గాక, ఆకాశము యొక్క గుణము శబ్దము కూడ వచ్చినది. ఆ ప్రకారమే వాయువులో నుండి అగ్ని పుట్టినది కనుక దానికి దాని యసాధారణ గుణమైన రూపమే కాక వాయువు తాలూకు రెండు గుణములైన శబ్దస్పర్శములు కూడ కలిగినవి - తండ్రి గుణములు కొడుకునకు వచ్చినట్లు. అందుచేత అగ్నికి మొత్తము మీద శబ్ద స్పర్శ రూపములను మూడు గుణములు కలిగినవి.
“వ. --- భూతాదియైన తామసాహంకారంబు వలన నభంబు గలిగె. నభంబునకు సూక్ష్మరూపంబు ద్రష్ట్ర దృశ్యంబులకు బోధకం బైన శబ్దంబు గుణం బగు. నభంబు వలన వాయువు గలిగె. వాయువునకు బరాన్వయంబున శబ్దంబు స్పర్శంబు నను రెండు గుణంబులు గలిగి యుండును. - - - వాయువు వలన రూప స్పర్శ శబ్దంబు లనియెడి గుణంబులు మూటి తోడ దేజంబు గలిగె - - - -.”
(శ్రీమదాంధ్ర మహా భాగవతము - 2 - 5 - 86)
అగ్నియొక్క నిజాంశమే చక్షుస్సాయెను, పృధివిని గూడగా ఘ్రాణమాయెను, అప్ఫునం గూడగా రసమాయెను, వాయువును గూడి త్వక్కాయెను, అకాశాన గూడి శ్రోత్త్రమాయెను. ఇవి అగ్ని తత్వ భేధాలు.” (బ్రహ్మవిద్యాసుధార్ణవము - 1)
“క్షుదా తృష్ణ స్తదా నిద్రా చాలస్యం స్త్రీసంగమః |
అగ్నేః పంచగుణాః ప్రోక్తా స్సమాంశాః పరి కీర్తితాః ||”
(క్షుత్తు,, తృష్ణ, ఆలస్యము, నిద్ర, మైధునము - స్త్రీ సంగమము - అను అయిదు అగ్ని వంశములు – గుణములు - అనగా, ఈ అయిదు గుణములు కలుగుటకు అగ్ని కారణము)
śabda sparśa rūpāṇi agni guṇāḥ. (śabda sparśa rūpamulu agni guṇamulu.)
“ākāśā dvāyuḥ vāyōragniḥ” ākāśamulōnuṃḍi vāyuvu puṭṭinadi, vāyuvu lōnuṃḍi agni puṭṭinadi. ākāśamu yokka guṇamu śabdamu - vāyuvu yokka guṇamu sparśa, agni yokka guṇamu rūpamu – ākāśamulō nuṃḍi vāyuvu puṭṭinadi kanuka vāyuvunaku tana asādhāraṇa guṇamaina sparśayē gāka, ākāśamu yokka guṇamu śabdamu kūḍa vaccinadi. ā prakāramē vāyuvulō nuṃḍi agni puṭṭinadi kanuka dāniki dāni yasādhāraṇa guṇamaina rūpamē kāka vāyuvu tālūku reṃḍu guṇamulaina śabdasparśamulu kūḍa kaliginavi - taṃḍri guṇamulu koḍukunaku vaccinaṭlu. aṃducēta agniki mottamu mīda śabda sparśa rūpamulanu mūḍu guṇamulu kaliginavi.
“va. --- bhūtādiyaina tāmasāhaṃkāraṃbu valana nabhaṃbu galige. nabhaṃbunaku sūkṣmarūpaṃbu draṣṭra dṛśyaṃbulaku bōdhakaṃ baina śabdaṃbu guṇaṃ bagu. nabhaṃbu valana vāyuvu galige. vāyuvunaku barānvayaṃbuna śabdaṃbu sparśaṃbu nanu reṃḍu guṇaṃbulu galigi yuṃḍunu. - - - vāyuvu valana rūpa sparśa śabdaṃbu laniyeḍi guṇaṃbulu mūṭi tōḍa dējaṃbu galige - - - -.”
(śrīmadāṃdhra mahā bhāgavatamu - 2 - 5 - 86)
agniyokka nijāṃśamē cakṣussāyenu, pṛdhivini gūḍagā ghrāṇamāyenu, apphunaṃ gūḍagā rasamāyenu, vāyuvunu gūḍi tvakkāyenu, akāśāna gūḍi śrōttramāyenu. ivi agni tatva bhēdhālu.” (brahmavidyāsudhārṇavamu - 1)
“kṣudā tṛṣṇa stadā nidrā cālasyaṃ strīsaṃgamaḥ |
agnēḥ paṃcaguṇāḥ prōktā ssamāṃśāḥ pari kīrtitāḥ ||”
(kṣuttu,, tṛṣṇa, ālasyamu, nidra, maidhunamu - strī saṃgamamu - anu ayidu agni vaṃśamulu – guṇamulu - anagā, ī ayidu guṇamulu kaluguṭaku agni kāraṇamu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.