(మీదకు వెళ్ళునది - ‘మంట’ మీదకి జ్వాలగా వెళ్ళును.)
(ముందుకు తీసుకొని వెళ్ళునది; అగ్రమును - అన్నింటికి తుదియగు ముక్తిని – పొందించునది.)
(అగ్రమును, కొసను పొందించువాడు - కర్మ ఫలమును పొందించువాడు.)
అభితో అగతీతి వా అగ్నిః. (అంతటను పొందించువాడు ; సర్వ వ్యాపి.)
అగ్నిరన్నాదః - (మనము దేనిని తినినను అది అంతా అన్నమే. అగ్ని అన్నమును తినును - సర్వ భక్షకుడు - దానిలో ఏమి వేసినను హుతమై పోవును.)
జీవః (జీవుడు.) “అహిం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహ మాశ్రితః |
ప్రాణాపానసమా యుక్తః పచామ్యన్నం చుతుర్విధం ||“. (శ్రీమద్భగవద్గీత - 15 - 14)
(ప్రాణుల దేహములో వైశ్యానరుడను పేరు గల జఠరాగ్నినై వారు తిను నాలుగు విధములయిన అన్నమును పచనము చేయుదును - వండినట్లు చేసి వారి శరీరములో జీర్ణమై పోవునట్లు చేయుదును అని శ్రీకృష్ణ భగవానుని వచనము) - “అహమగ్ని ర్వైశ్వానరో --- యేనేద మన్నం పచ్యతే -” (బృహదారణ్యకోపనిషత్)
“యదుష్ణం తత్తేజః” - (అగ్ని వలన కలుగు ఉష్ణమే - వేడిమియే - తేజస్సు.) (Energy)
భగవంతుడే అగ్నిరూపుడు.
(“అహమగ్ని రహం హుతం” (శ్రీమద్భగవద్గీత - 9 - 16)
(అగ్నిని నేనే, ఆ అగ్నిలో హోమము చేయబడినది - హతమైనది - నేనే. అన్నీ భగవంతుని రూపములే కనుక - అగ్నిలో హోమము చేసినదానిని అగ్ని తినును - భస్మము చేయును – భగవంతుని గుఱించి బ్రహ్మసూత్రాలలో “అత్తా చరాచర గ్రహణాత్”
(చరాచరములన్నింటిని తినువాడు) అని చెప్పబడి యున్నది. ఒక జీవి ఇంకొక జీవికి అహారము కనుక తినునటువంటి జీవునిలో అంతరాత్మ - జీవాత్మ - గా ఉండి, ఇంకొక జీవుని తిను చున్నాడు.)
(శ్రీమద్భగవద్గీత - 11 - 38)
అందుచేతనే ‘అగ్ని సాక్షిగా’ అని భగవంతుని సాక్షిగా అనుటకు బదులుగా చెప్పుట వాడుకలో నున్నది.)
“వాయోరగ్నిః, అగ్నే రూపః” (పంచ భూతములు సృష్టి క్రమములో ఎట్లు పుట్టినవో చెప్పినపుడు - ‘వాయువు నుండి అగ్ని పుట్టనదని, అగ్ని నుండి జలము పుట్టినది’ అని చెప్పబడినది.)
వ. ” --- పవనుండు నభోబలంబున రూపతన్మాత్రంబు వలన లోక లోచనం బైన తేజంబు నుత్పాదించె. తేజంబు కాలమాయాంశ యోగంబున నుత్తమ శ్లోకుని విలోకనంబున బవమాన యుక్తం బగుచు రసతన్మాత్రంబు వలన నంబువుల గలిగించె ---”
(శ్రీమదాంధ్ర మహాభాగవతము - 3 - 5 - 202)
(సమస్త దేవతలకు అగ్ని నోరువంటిది. దేవతల గుఱించి హోమము చేయబడిన వస్తువును అగ్నిలో వేయగా అగ్ని ద్వారా దానిని భుజింతురు.)
(బ్రహ్మవిద్యాసుధావర్ణము - 1)
“ఆకాశమే అగ్ని సం యోగాన బుద్ధి ఆయెను”. (బ్రహ్మవిద్యాసుధార్ణవము - 1)
“నాగ్నిస్తృప్త్యతి కాష్టానాం”
అగ్నిలో ఎన్ని సమిధలు వేసినను ‘చాలును’ అని అనది, తృప్తిచెందదు, ఇంకను మండుచునే యుండును. అందుచేతనే అగ్ని ‘అనలం’ (న + అలం = చాలదు) అని చెప్పబడుచున్నది.)
(శ్రీమదాంధ్ర మహాభాగవతము - 4 - 1 - 34)
(mīdaku veḷḷunadi - ‘maṃṭa’ mīdaki jvālagā veḷḷunu.)
(muṃduku tīsukoni veḷḷunadi; agramunu - anniṃṭiki tudiyagu muktini – poṃdiṃcunadi.)
(agramunu, kosanu poṃdiṃcuvāḍu - karma phalamunu poṃdiṃcuvāḍu.)
abhitō agatīti vā agniḥ. (aṃtaṭanu poṃdiṃcuvāḍu ; sarva vyāpi.)
agnirannādaḥ - (manamu dēnini tininanu adi aṃtā annamē. agni annamunu tinunu - sarva bhakṣakuḍu - dānilō ēmi vēsinanu hutamai pōvunu.)
jīvaḥ (jīvuḍu.) “ahiṃ vaiśvānarō bhūtvā prāṇināṃ dēha māśritaḥ |
prāṇāpānasamā yuktaḥ pacāmyannaṃ cuturvidhaṃ ||“. (śrīmadbhagavadgīta - 15 - 14)
(prāṇula dēhamulō vaiśyānaruḍanu pēru gala jaṭharāgninai vāru tinu nālugu vidhamulayina annamunu pacanamu cēyudunu - vaṃḍinaṭlu cēsi vāri śarīramulō jīrṇamai pōvunaṭlu cēyudunu ani śrīkṛṣṇa bhagavānuni vacanamu) - “ahamagni rvaiśvānarō --- yēnēda mannaṃ pacyatē -” (bṛhadāraṇyakōpaniṣat)
“yaduṣṇaṃ tattējaḥ” - (agni valana kalugu uṣṇamē - vēḍimiyē - tējassu.) (Energy)
bhagavaṃtuḍē agnirūpuḍu.
(“ahamagni rahaṃ hutaṃ” (śrīmadbhagavadgīta - 9 - 16)
(agnini nēnē, ā agnilō hōmamu cēyabaḍinadi - hatamainadi - nēnē. annī bhagavaṃtuni rūpamulē kanuka - agnilō hōmamu cēsinadānini agni tinunu - bhasmamu cēyunu – bhagavaṃtuni guṟiṃci brahmasūtrālalō “attā carācara grahaṇāt”
(carācaramulanniṃṭini tinuvāḍu) ani ceppabaḍi yunnadi. oka jīvi iṃkoka jīviki ahāramu kanuka tinunaṭuvaṃṭi jīvunilō aṃtarātma - jīvātma - gā uṃḍi, iṃkoka jīvuni tinu cunnāḍu.)
(śrīmadbhagavadgīta - 11 - 38)
aṃducētanē ‘agni sākṣigā’ ani bhagavaṃtuni sākṣigā anuṭaku badulugā ceppuṭa vāḍukalō nunnadi.)
“vāyōragniḥ, agnē rūpaḥ” (paṃca bhūtamulu sṛṣṭi kramamulō eṭlu puṭṭinavō ceppinapuḍu - ‘vāyuvu nuṃḍi agni puṭṭanadani, agni nuṃḍi jalamu puṭṭinadi’ ani ceppabaḍinadi.)
va. ” --- pavanuṃḍu nabhōbalaṃbuna rūpatanmātraṃbu valana lōka lōcanaṃ baina tējaṃbu nutpādiṃce. tējaṃbu kālamāyāṃśa yōgaṃbuna nuttama ślōkuni vilōkanaṃbuna bavamāna yuktaṃ bagucu rasatanmātraṃbu valana naṃbuvula galigiṃce ---”
(śrīmadāṃdhra mahābhāgavatamu - 3 - 5 - 202)
(samasta dēvatalaku agni nōruvaṃṭidi. dēvatala guṟiṃci hōmamu cēyabaḍina vastuvunu agnilō vēyagā agni dvārā dānini bhujiṃturu.)
(brahmavidyāsudhāvarṇamu - 1)
“ākāśamē agni saṃ yōgāna buddhi āyenu”. (brahmavidyāsudhārṇavamu - 1)
“nāgnistṛptyati kāṣṭānāṃ”
agnilō enni samidhalu vēsinanu ‘cālunu’ ani anadi, tṛpticeṃdadu, iṃkanu maṃḍucunē yuṃḍunu. aṃducētanē agni ‘analaṃ’ (na + alaṃ = cāladu) ani ceppabaḍucunnadi.)
(śrīmadāṃdhra mahābhāgavatamu - 4 - 1 - 34)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.