← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అగ్రాహ్యం agrāhyaṃ

Original — తెలుగు
  1. కర్మేంద్రియా గోచరం, వాక్ హస్తాది కర్మేంద్రియా గోచరం.

(కర్మేంద్రియములకు గోచరము కానిది, వాక్కుచే చెప్పడానికి శక్యము కానిది, చేతులతో పట్టుకొనుటకు వీలు కానిది.)

  1. “కర్మేంద్రియైః అగ్రాహ్యం, కర్మేంద్రియైః నగ్రహ్యతే ఇతి అగ్రాహ్యం.” శ్రీశంకరః)

(కర్మేంద్రియములచే గ్రహించుటకు వీలుకానివాడు.)

  1. కరణైః అగ్రాహ్యం. (ఇంద్రియములచేత గ్రహించుటకు వీలు కానిది.)

  2. కర్మేద్రియా విషయం. (కర్మేంద్రియములకు విషయము కానివాడు.)

  3. అనుమానా గోచరం. (అనుమాన ప్రమాణము ద్వారా గ్రహించుటకు - తెలుసుకొనుటకు వీలుకానివాడు.)

  4. అదృశ్యం = (కనబడనివాడు)

  5. గ్రాహ్యేభ్యో అహంకారాదిభ్యో వ్యతిరిక్తం.

(గ్రహించతగు అహంకారము మొదలగు వాటికి వ్యతిరేకమైనవాడు, వేఱైనవాడు.)

  1. “ముక్తిం వినా తద్రూప విషయక గ్రహణ వ్యవహారయోః అభావాత్ అవ్యవహార్యం, అగ్రాహ్య మిత్యుచ్యతే |”. (శ్రీ కూరనారాయణః)

(ముక్తిని పొంది పరమాత్మతో ఐక్యమైననే తప్ప ఇతర రీతుల అతని రూపమును తెలుసుకొనుట మొదలగు వ్యాపారము లేనందున అవ్యవహార్యము, అగ్రాహ్యము అని చెప్పబడినది.)

  1. “యతో వాచో నివర్తింతే అప్రాప్య మనసా సహ - ఇతి శ్రుతేః” (తైత్తిరీయోపనిషత్)

(మనస్సు, వాక్కు ఇతనిని తెలుసుకొనలేక తిరిగి వచ్చినవి.)

Transliteration
  1. karmēṃdriyā gōcaraṃ, vāk hastādi karmēṃdriyā gōcaraṃ.

(karmēṃdriyamulaku gōcaramu kānidi, vākkucē ceppaḍāniki śakyamu kānidi, cētulatō paṭṭukonuṭaku vīlu kānidi.)

  1. “karmēṃdriyaiḥ agrāhyaṃ, karmēṃdriyaiḥ nagrahyatē iti agrāhyaṃ.” śrīśaṃkaraḥ)

(karmēṃdriyamulacē grahiṃcuṭaku vīlukānivāḍu.)

  1. karaṇaiḥ agrāhyaṃ. (iṃdriyamulacēta grahiṃcuṭaku vīlu kānidi.)

  2. karmēdriyā viṣayaṃ. (karmēṃdriyamulaku viṣayamu kānivāḍu.)

  3. anumānā gōcaraṃ. (anumāna pramāṇamu dvārā grahiṃcuṭaku - telusukonuṭaku vīlukānivāḍu.)

  4. adṛśyaṃ = (kanabaḍanivāḍu)

  5. grāhyēbhyō ahaṃkārādibhyō vyatiriktaṃ.

(grahiṃcatagu ahaṃkāramu modalagu vāṭiki vyatirēkamainavāḍu, vēṟainavāḍu.)

  1. “muktiṃ vinā tadrūpa viṣayaka grahaṇa vyavahārayōḥ abhāvāt avyavahāryaṃ, agrāhya mityucyatē |”. (śrī kūranārāyaṇaḥ)

(muktini poṃdi paramātmatō aikyamainanē tappa itara rītula atani rūpamunu telusukonuṭa modalagu vyāpāramu lēnaṃduna avyavahāryamu, agrāhyamu ani ceppabaḍinadi.)

  1. “yatō vācō nivartiṃtē aprāpya manasā saha - iti śrutēḥ” (taittirīyōpaniṣat)

(manassu, vākku itanini telusukonalēka tirigi vaccinavi.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.