← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అగుణః aguṇaḥ

Original — తెలుగు
  1. నిర్గుణః; గుణత్రయ రహితః. (గుణములు - సత్వ, రజ స్తమోగుణములు మూడు లేనివాడు.)

  2. సత్వాది గుణమూలక రాగద్వేష భయ రహితః.

(సత్వము, రజస్సు, తమస్సు అను మూడు గుణములు కారణముగా గల రాగ, ద్వేష, భయములు లేనివాడు.)

  1. హేయగుణరహితః (నిందింప తగిన గుణములు లేనివాడు.)

  2. సత్వాది ప్రకృతి గుణరహితః ; ప్రాకృతగుణ రహితః.

(సత్వగుణము, రజోగుణము, తమోగుణము అను ప్రకృతిగుణములు లేనివాడు. ప్రకృతిగుణములు అనగా ప్రకృతికి సంబంధించిన గుణములు.)

  1. గుణాతీతః = (త్రిగుణములకు అతీతుడైన వాడు, త్రిగుణములకు మించిన వాడు – త్రిగుణముల వశములో నుండక స్వతంత్రముగా నుండు వాడు - గుణములతో కలిసి యుండుట చేత ఆకారము - రూపము - వాటి దోషములు కలుగును. త్రిగుణములు లేకుండుట చేత భగవంతుడు నిరాకారుడు.)

  2. “నిర్గుణుండైన పరమేశ్వరుండు గలుగుచు, లేకుండుచు త్రిగుణంబుల తోడం గూడిన తనమాయ చేత నింతయు సృజియించి గుణవంతుని చందంబున నిజమాయా విలసితంబులయిన గుణంబులలో ప్రవేశించి విజ్ఞాన విజృంభితుండై వెలుంగు,”

“క. అగుణుం డగు పరమేశుడు

జగములు గల్పించు కొఱకు జతురత మాయా

సగుణుండగు గావున హరి

భగవంతుండనగ బరగె భవ్య చరిత్రా!” (శ్రీమదాంధ్ర మహా భాగవతము - 2 - 6 - 99)

  1. త్రిగుణముల లోను కలియక పరమాత్మ కేవలుడుగ నున్నపుడు - స్వస్వరూపములో నున్నపుడు - అగోచరుడు, కనబడడు. అట్టివానిని ఎట్లు చూడగలమనగా : -

ఆ. అన్న మవనియందు నమృతంబు గోవుల

యందు వహ్ని సమిధలందు నరులు

యోగవశత బొందు నోజను బుద్ధిచే

నగుణు నిన్నుగాంతు రాత్మవిదులు - (శ్రీమదాంధ్ర మహా భాగవతము - 8 - 6 - 166)

(జీవరాసులకు అహారమైన అన్నము మట్టిరూపములో ఉన్న భూమిలో నున్నది. ఈ మట్టియే జలము, సూర్యకాంతి, వాయువు యొక్క యోగము -కూడిక -వలన సస్యముగా మారును. ఆ ప్రకారమే గడ్డితిని, నీరు త్రాగు ఆవులలో పాలుగా మారును. కట్టెలలో అగ్ని ఆ ప్రకారము గానే ఉన్నది. ఇట్లు ఈ అన్నము, పాలు, అగ్ని పైకి కనబడకపోయినను అవి లోనున్నట్లు - భూమిలోను, ఆవులోను, కట్టెలలోను ఉన్నట్లు - నిర్గుణుడై, ఆకారము లేకపోవుట వలన సాధారణుల కంటికి కనబడని పరమాత్మను ఆత్మ తత్వమును తెలిసినవారు నిన్ను అన్నివస్తువుల లోను ఉన్న వానినిగా చూచెదరు.)

  1. గుణసామాన్య రహితం. (సామాన్య గుణములు లేనివాడు.)
Transliteration
  1. nirguṇaḥ; guṇatraya rahitaḥ. (guṇamulu - satva, raja stamōguṇamulu mūḍu lēnivāḍu.)

  2. satvādi guṇamūlaka rāgadvēṣa bhaya rahitaḥ.

(satvamu, rajassu, tamassu anu mūḍu guṇamulu kāraṇamugā gala rāga, dvēṣa, bhayamulu lēnivāḍu.)

  1. hēyaguṇarahitaḥ (niṃdiṃpa tagina guṇamulu lēnivāḍu.)

  2. satvādi prakṛti guṇarahitaḥ ; prākṛtaguṇa rahitaḥ.

(satvaguṇamu, rajōguṇamu, tamōguṇamu anu prakṛtiguṇamulu lēnivāḍu. prakṛtiguṇamulu anagā prakṛtiki saṃbaṃdhiṃcina guṇamulu.)

  1. guṇātītaḥ = (triguṇamulaku atītuḍaina vāḍu, triguṇamulaku miṃcina vāḍu – triguṇamula vaśamulō nuṃḍaka svataṃtramugā nuṃḍu vāḍu - guṇamulatō kalisi yuṃḍuṭa cēta ākāramu - rūpamu - vāṭi dōṣamulu kalugunu. triguṇamulu lēkuṃḍuṭa cēta bhagavaṃtuḍu nirākāruḍu.)

  2. “nirguṇuṃḍaina paramēśvaruṃḍu galugucu, lēkuṃḍucu triguṇaṃbula tōḍaṃ gūḍina tanamāya cēta niṃtayu sṛjiyiṃci guṇavaṃtuni caṃdaṃbuna nijamāyā vilasitaṃbulayina guṇaṃbulalō pravēśiṃci vijñāna vijṛṃbhituṃḍai veluṃgu,”

“ka. aguṇuṃ ḍagu paramēśuḍu

jagamulu galpiṃcu koṟaku jaturata māyā

saguṇuṃḍagu gāvuna hari

bhagavaṃtuṃḍanaga barage bhavya caritrā!” (śrīmadāṃdhra mahā bhāgavatamu - 2 - 6 - 99)

  1. triguṇamula lōnu kaliyaka paramātma kēvaluḍuga nunnapuḍu - svasvarūpamulō nunnapuḍu - agōcaruḍu, kanabaḍaḍu. aṭṭivānini eṭlu cūḍagalamanagā : -

ā. anna mavaniyaṃdu namṛtaṃbu gōvula

yaṃdu vahni samidhalaṃdu narulu

yōgavaśata boṃdu nōjanu buddhicē

naguṇu ninnugāṃtu rātmavidulu - (śrīmadāṃdhra mahā bhāgavatamu - 8 - 6 - 166)

(jīvarāsulaku ahāramaina annamu maṭṭirūpamulō unna bhūmilō nunnadi. ī maṭṭiyē jalamu, sūryakāṃti, vāyuvu yokka yōgamu -kūḍika -valana sasyamugā mārunu. ā prakāramē gaḍḍitini, nīru trāgu āvulalō pālugā mārunu. kaṭṭelalō agni ā prakāramu gānē unnadi. iṭlu ī annamu, pālu, agni paiki kanabaḍakapōyinanu avi lōnunnaṭlu - bhūmilōnu, āvulōnu, kaṭṭelalōnu unnaṭlu - nirguṇuḍai, ākāramu lēkapōvuṭa valana sādhāraṇula kaṃṭiki kanabaḍani paramātmanu ātma tatvamunu telisinavāru ninnu annivastuvula lōnu unna vāninigā cūcedaru.)

  1. guṇasāmānya rahitaṃ. (sāmānya guṇamulu lēnivāḍu.)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.