(మహావాక్యములని ప్రసిద్ధిగాంచిన నాలుగింటిలో ఇది ఒకటి. వేదాంతసారమును తెలియచేయునది మహావాక్యము - : నేను బ్రహ్మను” (అయితిని) అని జీవ బ్రహ్మల ఐక్యమును తెలియచేయునది. ఈ వాక్యము శుక్ల యజుర్వేదమునకు సంబంధించిన బృహదారణ్యకోపనిషత్తు లోనిది. దీని అర్థము - ‘నేను బ్రహ్మను అయితిని’. ఈ వాక్యములోని ‘అహం’ = నేను అను మాటచేత చెప్పబడినది జీవుడు - వాచ్యార్థము. - ‘బ్రహ్మ’ అను మాటచేత చెప్పబడినది ఈశ్వరుడు, లేక, పరబ్రహ్మ, పరమాత్మ - జీవాత్మయే పరమాత్మ, రెండూ ఒకటే - రెండింటికి భేదము లేదు –
(పరిపూర్ణుడు - అనగా ప్రపంచమంతటనూ, ప్రపంచమందు అన్ని వస్తువులలోను పూర్తిగా నిండియున్నవాడు పరమాత్మ. అట్టివాడు నైజముగా త్రివిధ పర్చ్ఛేదరహితుడు. అనగా దేశము చేతగాని, కాలము చేతగాని, వస్తువుచేతగాని పరిచ్ఛేదము లేనివాడు, పరిమితి లేనివాడు, సర్వకాలములందు, సమస్త ప్రదేశములందు, సర్వ వస్తువులందు ఉండువాడు. మాయ యను భగవంతుని శక్తి చేత కల్పించబడిన జగత్తునందు విద్య, లేక, జ్ఞానము కలుగుటకు ఆధారమైన ఈ మానవ దేహమందు బుద్ధికి సాక్షిగానుండి - బుద్ధియను సూక్ష్మ శరీరమునకు సాక్షిగానుండి, దేనివలనను వికారమును - మార్పును - పొందకుండనుండువాడు, తన సత్తాస్ఫూర్తిని తన దేహమునకిచ్చి దానికి చైతన్యము కలిగించి, ‘అహం’ = నేను అని వ్యవహరింప బడుచున్నవాడు పరమాత్మయే)
(దేశకాల వస్తు పరిచ్ఛేద రహితమైన పరమాత్మయే ఈ మహావాక్యములో ‘బ్రహ్మ’ అను మాటచేత చెప్పబడుచున్నాడు. అస్మి (= అయితిని - లేక అయి ఉన్నాను) అను పదము ‘అహం బ్రహ్మ’ అను రెండు మాటలకు ఐక్యము తెలియచేయుచున్నది, ఈ రెంటికిని భేదము లేదని తెలియచేయుచున్నది. జీవాత్మ, పరమాత్మ ఒకటే యని ఈ మహావాక్యము యొక్క తాత్పర్యము).
(ఒక వాక్యము యొక్క అర్థమును తెలుసుకొనుటకు పదముల అర్థమును నిశ్చయించవలెను - ఇది అన్వయవ్యతిరేకముల మూలముననే సాధ్యమగును - ఈ అఖండవాక్యార్థజ్ఞానము - దానిలోని పదార్థనిశ్చయము బ్రహ్మసాక్షాత్కారమునకు సాధనము - పదముల అర్థమును అన్వయించుకొని, ఇది పరబ్రహ్మకాదు,ఇదిపరబ్రహ్మ కాదు అని ఒక్కొక్క వస్తువును వ్యతిరేకించి, త్రోసివేయగా మిగిలిన ఒకే వస్తువు పరబ్రహ్మ అని తెలియనగును. దేహము మొదలగు అనాత్మ పదార్థములను విచారించి చూచి పరమాత్మ ఎవడు అని తెలుసుకొనవలెనని అభిప్రాయము కలవానికి “అహం బ్రహ్మస్మి” అని జ్ఞానము కలుగుటవల్ల, పరబ్రహ్మ ఎక్కడో ఉన్నాడనికాదు, ఎవరోకాదు, నేనే ఆ పరబ్రహ్మను అని తెలుసుకొనును).
(జాగ్రత్, స్వప్నము, సుషుప్తి అను మూడు అవస్థలుగల ఈ సర్వప్రపంచము బ్రహ్మమే - ఆ బ్రహ్మము నేనే -ఈ ప్రపంచమునకు సృష్టి, స్థితి, లయములు ఏ బ్రహ్మవలన కలుగుచున్నవో ఆ బ్రహ్మ నేనే - ఈ దేహము అను ఉపాధిలో కప్పబడి పైకి కనబడకుండ ఉన్నాను. ఆ పరబ్రహ్మ నేనే జ్ఞానముకలవాడు అన్నివిధములైన బంధములచేత విడువబడును - ముక్తిని పొందును).
(mahāvākyamulani prasiddhigāṃcina nālugiṃṭilō idi okaṭi. vēdāṃtasāramunu teliyacēyunadi mahāvākyamu - : nēnu brahmanu” (ayitini) ani jīva brahmala aikyamunu teliyacēyunadi. ī vākyamu śukla yajurvēdamunaku saṃbaṃdhiṃcina bṛhadāraṇyakōpaniṣattu lōnidi. dīni arthamu - ‘nēnu brahmanu ayitini’. ī vākyamulōni ‘ahaṃ’ = nēnu anu māṭacēta ceppabaḍinadi jīvuḍu - vācyārthamu. - ‘brahma’ anu māṭacēta ceppabaḍinadi īśvaruḍu, lēka, parabrahma, paramātma - jīvātmayē paramātma, reṃḍū okaṭē - reṃḍiṃṭiki bhēdamu lēdu –
(paripūrṇuḍu - anagā prapaṃcamaṃtaṭanū, prapaṃcamaṃdu anni vastuvulalōnu pūrtigā niṃḍiyunnavāḍu paramātma. aṭṭivāḍu naijamugā trividha parcchēdarahituḍu. anagā dēśamu cētagāni, kālamu cētagāni, vastuvucētagāni paricchēdamu lēnivāḍu, parimiti lēnivāḍu, sarvakālamulaṃdu, samasta pradēśamulaṃdu, sarva vastuvulaṃdu uṃḍuvāḍu. māya yanu bhagavaṃtuni śakti cēta kalpiṃcabaḍina jagattunaṃdu vidya, lēka, jñānamu kaluguṭaku ādhāramaina ī mānava dēhamaṃdu buddhiki sākṣigānuṃḍi - buddhiyanu sūkṣma śarīramunaku sākṣigānuṃḍi, dēnivalananu vikāramunu - mārpunu - poṃdakuṃḍanuṃḍuvāḍu, tana sattāsphūrtini tana dēhamunakicci dāniki caitanyamu kaligiṃci, ‘ahaṃ’ = nēnu ani vyavahariṃpa baḍucunnavāḍu paramātmayē)
(dēśakāla vastu paricchēda rahitamaina paramātmayē ī mahāvākyamulō ‘brahma’ anu māṭacēta ceppabaḍucunnāḍu. asmi (= ayitini - lēka ayi unnānu) anu padamu ‘ahaṃ brahma’ anu reṃḍu māṭalaku aikyamu teliyacēyucunnadi, ī reṃṭikini bhēdamu lēdani teliyacēyucunnadi. jīvātma, paramātma okaṭē yani ī mahāvākyamu yokka tātparyamu).
(oka vākyamu yokka arthamunu telusukonuṭaku padamula arthamunu niścayiṃcavalenu - idi anvayavyatirēkamula mūlamunanē sādhyamagunu - ī akhaṃḍavākyārthajñānamu - dānilōni padārthaniścayamu brahmasākṣātkāramunaku sādhanamu - padamula arthamunu anvayiṃcukoni, idi parabrahmakādu,idiparabrahma kādu ani okkokka vastuvunu vyatirēkiṃci, trōsivēyagā migilina okē vastuvu parabrahma ani teliyanagunu. dēhamu modalagu anātma padārthamulanu vicāriṃci cūci paramātma evaḍu ani telusukonavalenani abhiprāyamu kalavāniki “ahaṃ brahmasmi” ani jñānamu kaluguṭavalla, parabrahma ekkaḍō unnāḍanikādu, evarōkādu, nēnē ā parabrahmanu ani telusukonunu).
(jāgrat, svapnamu, suṣupti anu mūḍu avasthalugala ī sarvaprapaṃcamu brahmamē - ā brahmamu nēnē -ī prapaṃcamunaku sṛṣṭi, sthiti, layamulu ē brahmavalana kalugucunnavō ā brahma nēnē - ī dēhamu anu upādhilō kappabaḍi paiki kanabaḍakuṃḍa unnānu. ā parabrahma nēnē jñānamukalavāḍu annividhamulaina baṃdhamulacēta viḍuvabaḍunu - muktini poṃdunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.