‘నేను’ అను అహంకారము.
ఆత్మ ఇత్యర్థః (అహం అనగా ఆత్మ అని అర్థము).
అహంకార విశిష్టమైన ఆత్మ అహం శబ్దమునకు వాచ్యార్థము.
జడమైన అంతఃకరణము, స్వయం ప్రకాశమైన ఆత్మ - ఈ రెండును కలిసి ‘అహం’ అను మాటచే వ్యవహరింపబడుచున్నది‘అహం’ అనగా అహంకార విశిష్టమైన ఆత్మ - జీవాత్మ, అనియు శుద్ధచైతన్య ఘనమైన పరమాత్మ - ‘ఘటంఅహం జానామి’ (నేను ఘటమునుతెలుసుకొనుచున్నాను) అని చెప్పినపుడు జీవాత్మ అనియు, ‘అహం బ్రహ్మాస్మి’ (నేను పరబ్రహ్మ అయితిని) అనునపుడు పరమాత్మ అనియు రెండువిధములుగా చెప్ప బడుచున్నది).
(ఈ ప్రపంచమంతటను పూర్తిగా నిండియున్నవాడును, ఈ దేహమందు బుద్ధికి సాక్షిగా స్ఫురించువాడు అయిన పరమాత్మయే ‘అహం’ అని చెప్పబడుచున్నవాడు - ‘అహం’ అను మాటకు అర్థమగుచున్నవాడు).
(సమస్త ప్రపంచమునకు మూలకారణమైనటువంటిన్నీ, అన్నింటినీ చూచునది యగునదికనుక సర్వసాక్షి అయినటువంటిన్నీ, పరమాత్మయే అహం శబ్దమున కర్థము).
(’తదేవ సచ్చిదానందరూపమేవ బ్రహ్మ, నిష్కలం కళారహితం బ్రహ్మ సర్వస్మాదిభ్యదికం, నిర్వికల్పం నిర్గతాః వికల్పాః ఇదమనాదిం చేత్యాది రూపావస్తు శూన్యావా ప్రత్యయాః యస్మాత్ తన్నిర్వికల్పం; నిరంజనం నిర్గత మంజనమ విద్యా సర్వకారణం యస్మాత్ తన్నిరంజనం. ఏతాదృశం బ్రహ్మ బ్రహ్మవాదినః ప్రసిద్ధమిత్యాహుః, తదుక్తం ప్రసిద్ధం బ్రహ్మ సర్వపరిచ్ఛేద శూన్యం బృహత్ అహం, అస్మత్ప్రత్యయ వ్యవహార యోగ్యః, స్వయం ప్రకాశమాన చిదానంద బ్రహ్మాత్మనః భేదరహితం. ఇత్యనేన ప్రకారేణ జ్ఞాత్వా సాక్షాత్కృత్య బ్రహ్మ ఉక్తం స్వాత్మావ్యతిరిక్తం సంపద్యతే, సంపన్నో భవతి - “బ్రహ్మైవసన్ బ్రహ్మాప్యేతి”ఇతిశృత్యం తరాత్.
(తత్పదార్థ లక్ష్యమైనటువంటిన్నీ, సచ్చిదానంద రూపమైనటువంటిన్నీ, కళారహితమైనటువంటిన్నీ, అన్నింటికంటె పెద్దది, గొప్పది ఉత్కృష్టమైనదిన్నీ, వికల్పములు లేనటువంటిన్నీ, అన్నింటికి కారణమైన అవిద్య అను అంజనము లేనటువంటిన్నీ, త్రివిధపరిచ్ఛేదము లేనటువంటిన్నీ పరబ్రహ్మ నేనే - నేనే అని వ్యవహరించబడువాడను - ఆ బ్రహ్మమే - తనంతట తానే ప్రకాశించు చిదానంద పరబ్రహ్మకంటె వేరుకానివాడను - ఈ ప్రకారముగా పరబ్రహ్మను తెలుసుకొని, సాక్షాత్కరించుకొని, తనకంటె వ్యతిరిక్తముగానటువంటి పైన చెప్పబడిన లక్షణములు గల పరబ్రహ్మమును పొందును - ‘బ్రహ్మమే అయి బ్రహ్మను పొందును’ అని చెప్పబడియున్నది కనుక - బ్రహ్మలో కలియును అని అర్థము - ఇట్లు ఇంకొక శ్రుతి చెప్పుచున్నది.
(శోధిత తత్పదార్థభూతం ప్రత్యక్చైతన్యం సః శోధిత తత్పదార్థ భూతం పరిపూర్ణం బ్రహ్మైవ ఏవం సోహం ఇత్యస్యాపి - సః శోధిత తత్పదార్థరూపం చైతన్యమేవ. అహం శోధిత ‘త్వం’ పదార్థరూపం ప్రత్యక్చైతన్యమేవ వ్యతిరేకేణీ చైకత్వం).
(తత్వమసి = (‘తత్’ త్వం అను) మహావాక్యములోని ‘తత్’ - అది - అనుదానికి బాగావిమర్శించి నిశ్చయము చేయబడిన పరిపూర్ణుడైన చైతన్యమైన బ్రహ్మమే. “సోహం” అను మాటలోని ‘సః’ అను మాటకు కూడ అదియే అర్థము - చైతన్యముతో ప్రపంచమంతయు పూర్తిగానిండిన బ్రహ్మ అట్టి తత్పదార్థమైన బరబ్రహ్మమే సోహం (అతనే నేను) అనుమాటలోని ‘సః’ (అతను, వాడు) అనుమాటకు అహం (నేను) అని అర్థము - ఈ రెండూ ఒకటే అని తాత్పర్యము - అహం అనగా పరిపూర్ణ చైతన్యముగల పరబ్రహ్మమే).
(ఎల్లపుడు నేను బ్రహ్మనే - నేను దేవుడనుకాను, యక్షుడనుకాను, నరుడనుకాను. దేహము, ఇంద్రియ ములు, బుద్ధి అనునవి నేను కాను, మాయనుకాను, ఇంకొక దేవతనుకాను - నేను పరబ్రహ్మమే).
(నేనెవడనో సూర్యునిలో ఉన్న పురుషుడుకూడ వాడే, సూర్యునిలో ఉన్న పురుషుడేవడో నేనూ వాడే - ఇద్దరిలోనున్నది పరమాత్మ చైతన్యమొక్కటే).
(ఓ దేవీ! నీవే నేను, నేనే నువ్వు - ఇట్లు జీవునకు ఈశ్వరభావము, ఈశ్వరునకు జీవభావము చెప్పబడినది - పరమేశ్వరునిలోని చైతన్యము, జీవునిలోని చైతన్యము - సకల వస్తువులలోని చైతన్యము ఒకటే అని ఇందుమూలముగా చెప్పబడినది - “త్వమేవాహం, త్వమేవాహం న సంశయః”.
(మూడులోకములలోను, జాగ్రదాది మూడు అవస్థలలోను భోగము, భోగ్యము, భోక్తా అని త్రికముకన్న వేరైనవాడను, వాటికి సాక్షి అయి యున్నవాడను, చిన్మాత్రుడను నేను).
అనయోస్సామరస్యం యత్తస్మి న్నహమి తీర్యతే ||
(అన్ని అక్షరములకు మొదట అకారమున్నది. అది శివాత్మకము. వాటికి చివరను ‘హ’ లారమున్నది, అది కలారూపాత్మకము - ఈ రెండింటి కలియకచేత అహం అను శబ్దము కలిగినది. ఈ రెండు అక్షరముల మధ్యను మిగిలిన అక్షరములన్నియు నున్నవి. ఈ అక్షరములవలననే అన్నిశబ్దములు, పదములు, మంత్రములు, తత్వములు చెప్పబడుచున్నవి. ఈ రెండు అక్షరములు కలిసిన ‘అహం’ అను మాటకు ‘నేను’ అని అర్థము - అనగా జగత్తునకు కారణమైన పరమాత్మ - ఈ ‘అహం’ అనుమాట అన్ని వస్తువులలోను, అన్ని శరీరములలోను ఉన్న పరమాత్మను సూచించును -).
(‘అహం’ - ‘నేను’ - అనుకొనుట, పరమాత్మగాక తానే అని భావించుట అథ్యాస).
‘nēnu’ anu ahaṃkāramu.
ātma ityarthaḥ (ahaṃ anagā ātma ani arthamu).
ahaṃkāra viśiṣṭamaina ātma ahaṃ śabdamunaku vācyārthamu.
jaḍamaina aṃtaḥkaraṇamu, svayaṃ prakāśamaina ātma - ī reṃḍunu kalisi ‘ahaṃ’ anu māṭacē vyavahariṃpabaḍucunnadi’ahaṃ’ anagā ahaṃkāra viśiṣṭamaina ātma - jīvātma, aniyu śuddhacaitanya ghanamaina paramātma - ‘ghaṭaṃahaṃ jānāmi’ (nēnu ghaṭamunutelusukonucunnānu) ani ceppinapuḍu jīvātma aniyu, ‘ahaṃ brahmāsmi’ (nēnu parabrahma ayitini) anunapuḍu paramātma aniyu reṃḍuvidhamulugā ceppa baḍucunnadi).
(ī prapaṃcamaṃtaṭanu pūrtigā niṃḍiyunnavāḍunu, ī dēhamaṃdu buddhiki sākṣigā sphuriṃcuvāḍu ayina paramātmayē ‘ahaṃ’ ani ceppabaḍucunnavāḍu - ‘ahaṃ’ anu māṭaku arthamagucunnavāḍu).
(samasta prapaṃcamunaku mūlakāraṇamainaṭuvaṃṭinnī, anniṃṭinī cūcunadi yagunadikanuka sarvasākṣi ayinaṭuvaṃṭinnī, paramātmayē ahaṃ śabdamuna karthamu).
(’tadēva saccidānaṃdarūpamēva brahma, niṣkalaṃ kaḷārahitaṃ brahma sarvasmādibhyadikaṃ, nirvikalpaṃ nirgatāḥ vikalpāḥ idamanādiṃ cētyādi rūpāvastu śūnyāvā pratyayāḥ yasmāt tannirvikalpaṃ; niraṃjanaṃ nirgata maṃjanama vidyā sarvakāraṇaṃ yasmāt tanniraṃjanaṃ. ētādṛśaṃ brahma brahmavādinaḥ prasiddhamityāhuḥ, taduktaṃ prasiddhaṃ brahma sarvaparicchēda śūnyaṃ bṛhat ahaṃ, asmatpratyaya vyavahāra yōgyaḥ, svayaṃ prakāśamāna cidānaṃda brahmātmanaḥ bhēdarahitaṃ. ityanēna prakārēṇa jñātvā sākṣātkṛtya brahma uktaṃ svātmāvyatiriktaṃ saṃpadyatē, saṃpannō bhavati - “brahmaivasan brahmāpyēti”itiśṛtyaṃ tarāt.
(tatpadārtha lakṣyamainaṭuvaṃṭinnī, saccidānaṃda rūpamainaṭuvaṃṭinnī, kaḷārahitamainaṭuvaṃṭinnī, anniṃṭikaṃṭe peddadi, goppadi utkṛṣṭamainadinnī, vikalpamulu lēnaṭuvaṃṭinnī, anniṃṭiki kāraṇamaina avidya anu aṃjanamu lēnaṭuvaṃṭinnī, trividhaparicchēdamu lēnaṭuvaṃṭinnī parabrahma nēnē - nēnē ani vyavahariṃcabaḍuvāḍanu - ā brahmamē - tanaṃtaṭa tānē prakāśiṃcu cidānaṃda parabrahmakaṃṭe vērukānivāḍanu - ī prakāramugā parabrahmanu telusukoni, sākṣātkariṃcukoni, tanakaṃṭe vyatiriktamugānaṭuvaṃṭi paina ceppabaḍina lakṣaṇamulu gala parabrahmamunu poṃdunu - ‘brahmamē ayi brahmanu poṃdunu’ ani ceppabaḍiyunnadi kanuka - brahmalō kaliyunu ani arthamu - iṭlu iṃkoka śruti ceppucunnadi.
(śōdhita tatpadārthabhūtaṃ pratyakcaitanyaṃ saḥ śōdhita tatpadārtha bhūtaṃ paripūrṇaṃ brahmaiva ēvaṃ sōhaṃ ityasyāpi - saḥ śōdhita tatpadārtharūpaṃ caitanyamēva. ahaṃ śōdhita ‘tvaṃ’ padārtharūpaṃ pratyakcaitanyamēva vyatirēkēṇī caikatvaṃ).
(tatvamasi = (‘tat’ tvaṃ anu) mahāvākyamulōni ‘tat’ - adi - anudāniki bāgāvimarśiṃci niścayamu cēyabaḍina paripūrṇuḍaina caitanyamaina brahmamē. “sōhaṃ” anu māṭalōni ‘saḥ’ anu māṭaku kūḍa adiyē arthamu - caitanyamutō prapaṃcamaṃtayu pūrtigāniṃḍina brahma aṭṭi tatpadārthamaina barabrahmamē sōhaṃ (atanē nēnu) anumāṭalōni ‘saḥ’ (atanu, vāḍu) anumāṭaku ahaṃ (nēnu) ani arthamu - ī reṃḍū okaṭē ani tātparyamu - ahaṃ anagā paripūrṇa caitanyamugala parabrahmamē).
(ellapuḍu nēnu brahmanē - nēnu dēvuḍanukānu, yakṣuḍanukānu, naruḍanukānu. dēhamu, iṃdriya mulu, buddhi anunavi nēnu kānu, māyanukānu, iṃkoka dēvatanukānu - nēnu parabrahmamē).
(nēnevaḍanō sūryunilō unna puruṣuḍukūḍa vāḍē, sūryunilō unna puruṣuḍēvaḍō nēnū vāḍē - iddarilōnunnadi paramātma caitanyamokkaṭē).
(ō dēvī! nīvē nēnu, nēnē nuvvu - iṭlu jīvunaku īśvarabhāvamu, īśvarunaku jīvabhāvamu ceppabaḍinadi - paramēśvarunilōni caitanyamu, jīvunilōni caitanyamu - sakala vastuvulalōni caitanyamu okaṭē ani iṃdumūlamugā ceppabaḍinadi - “tvamēvāhaṃ, tvamēvāhaṃ na saṃśayaḥ”.
(mūḍulōkamulalōnu, jāgradādi mūḍu avasthalalōnu bhōgamu, bhōgyamu, bhōktā ani trikamukanna vērainavāḍanu, vāṭiki sākṣi ayi yunnavāḍanu, cinmātruḍanu nēnu).
anayōssāmarasyaṃ yattasmi nnahami tīryatē ||
(anni akṣaramulaku modaṭa akāramunnadi. adi śivātmakamu. vāṭiki civaranu ‘ha’ lāramunnadi, adi kalārūpātmakamu - ī reṃḍiṃṭi kaliyakacēta ahaṃ anu śabdamu kaliginadi. ī reṃḍu akṣaramula madhyanu migilina akṣaramulanniyu nunnavi. ī akṣaramulavalananē anniśabdamulu, padamulu, maṃtramulu, tatvamulu ceppabaḍucunnavi. ī reṃḍu akṣaramulu kalisina ‘ahaṃ’ anu māṭaku ‘nēnu’ ani arthamu - anagā jagattunaku kāraṇamaina paramātma - ī ‘ahaṃ’ anumāṭa anni vastuvulalōnu, anni śarīramulalōnu unna paramātmanu sūciṃcunu -).
(‘ahaṃ’ - ‘nēnu’ - anukonuṭa, paramātmagāka tānē ani bhāviṃcuṭa athyāsa).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.