అహం = నేను అను అభిమానము; గర్వము.
కోపము; అంతఃకరణ చతుష్టయములో నొకటి -
అహం ఉదారో, అహం తేజస్వీ; అసహనః ఇత్యాదిః అహంకారః.
(నేను ఉదారస్వభావముకలవాడను, తేజస్సు కలవాడను, నాకు ఎదురు సహించనివాడను, నేను ఇట్టివాడను, అట్టి వాడను, ఇంతవాడను, అంతవాడను అను గర్వస్వభావము కలిగియుండుట అహంకారము).
(చేయవలసినదేదో, చేయరానిదేదో సమస్తము నేను తెలిసినవాడను అను భావము కలిగియుండుట)
(ఆత్మయందు హితాహిత జ్ఞానమందు స్వతంత్రాభిమానము కలిగియుండుట).
(నేను, నాది అని అభిమానించు అంతఃకరణముయొక్క వృత్తి అహంకారము).
(ఆత్మకాని దేహమందు నేను అని అనుకొనుటవలన అట్టి భావము అహంకారమని చెప్పబడుచున్నది).
(ఇంకొకరి అపేక్షలేకుండా - ఇంకొకరి సహాయము అపేక్షకుండా అంతయు నేనే చేయుచున్నాను అనుకొనుట అహంకారము).
(దేహము ఇంద్రియములు మొదలగు వాటియందు అవి ఆత్మయను భ్రమాహంకారము).
(ఆత్మగాని వస్తువులందు అవే ఆత్మ అను అభిమానము).
(చిత్తముయొక్క తత్వమును తెలిసిన మహానుభావులు అహంకారమనగా మనస్సే అని ఎఱుగుదురు. జంతువుల (భూతముల) లోపల (మనస్సులో) నుండు అహంభావము ఆ జంతువుయొక్క మనస్సే).
(నేను కర్తను అని అభిమానము కలిగియుండుట అహంకారము).
(సమస్త భూతములకు ఆది, కారణము అయినది అహంకారము).
(మన అందఱి సూక్ష్మశరీరమే అహంకారమని చెప్పబడుచున్నది).
(‘నేను వెళ్ళుచున్నాను’ అను లోకవ్యవహారములో కూటస్థుడైన పరమాత్మకన్న వేరైన వానినిగా ‘అహం’ అనుదానిని జ్ఞానియగువాడు తలచును. శాస్త్ర దృష్టిలో నేను దేనితోను సంబంధము లేనివాడను, చిదాత్మను అని అనుకొనునపుడు కేవలుడైన కూటస్థుడే అను అర్థములో ఆపదము వాడబడును).
(అహంకరణమే అహంకారము - నేను అని అనుకొనుట. లేని గుణములను తనయందారోపించుకొని ఇది నేనే అను భ్రమకలిగియుండుట. ఇదియే అహంకారము. దీనికేఅవిద్యయని పేరు - సమస్తదోషములకు మూలమైనది, సర్వ అనర్థములకు - కీడులకు - కారణమైనది).
(విడువ వలసిన సమస్త అనర్థములకు కారణము అహంకారమే).
(అహంకారములోనుండి భూతములు మొదలగునవి ఒకదానిలోనుండి ఒకటిగా పుట్టినవి. అందుచేత అహంకారము భూతేంద్రియమనోమయము - అనగా, వాటితో సూక్ష్మరూపములో నిండియున్నది - వాటికి కారణమైనది).
(మహాభూతములకు, పంచ తన్మాత్రలకు, కారణమైనది అహంకారము - అహంకారమునుండి సూక్ష్మపంచభూతములు - తన్మాత్రలు - పుట్టినవి).
(అవిద్యాత్మకము, అంతములేని వాసనలతో కూడినది, అవ్యక్తము అయినదే అహంకారమని చెప్పబడుచున్నది. ఇది సమస్త కారణవస్తువులకు కారణమైనది).
(మహత్తత్వములోనుండి అహంకారము పుట్టినది - అహంకారమునకు కారణము - పుట్టినచోటు - మహత్తత్వము).
(హిరణ్యగర్భునిచేత - మాయ లేక ప్రకృతిచేత - అధిష్టింపబడిన విక్షేప శక్తివలన - మహత్తత్వమువలన తమోగుణమువలన అహంకారమను స్థూలశక్తి పుట్టినది).
(అహంకారము 24 తత్వములలో నొకటి, అది ఎట్లు పుట్టినదో 21, 22 లో చెప్పబడినది).
(అహంకారము రెండు విధములు - మొదటిది పరాహం తా రూపము - రెండవదిమహత్తత్త్వము నుండి పుట్టినది. మొదటిది బృహదారణ్యకములో. “అహం బ్రహ్మస్మి” (నేను బ్రహ్మను అయితిని అని తెలుసుకొనుట అను చిత్త వృత్తి రూపము).
(అహంకారము మూడు విధములు - తామసము, రాజసము. సాత్వికము. తామసాహంకారమునుండి సూక్ష్మభూతములు పుట్టుచున్నవి. రాజసాహంకారమునుండి దశేంద్రియములు, - శరీరము వెలపల ఉండి పనిచేయునవి - పుట్టినవి. సాత్వికాహంకారమునుండి మనస్సు, దేవతలు పుట్టిరి. ఏ అహంకారమునుండి పుట్టినవి ఆ అహంకారములోనే లయమగును).
(అహంకారము మూడు విధములు - మనసునకు కారణభూతమై, మనోమ యమై వైకారికమనునది సాత్వి కాహంకారము. ఇది దేవమయము. ఇంద్రియముల నధిష్టించియుండు దేవతులకు కారణమగుటవలన దేవ మ యము. పంచభూతములుగా పరిణమించునది రాజసాహంకారము. తామసాహంకారమునుండి సూక్ష్మ పంచభూతములు పుట్టినవి).
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 5 - 86)
(అహంభావము అనునది మిధ్యారూపము - ఇది పరమాత్మతత్వము తెలిసిన తోడనే - బ్రహ్మజ్ఞానము కలిగిన వెంటనే - తొలగిపోవును. అహంకారము మూడు విధములుగానున్నది. ఈ మూడింటిలోనూ రెండు శ్రేష్టములు, మూడవది విడువ తగినది. ఈ ప్రపంచమంతా నేనే, నేనే పరమాత్మను, అచ్యుతుడను, నేనుతప్ప మరేదియును లేదు - అని అభిప్రాయము కలిగియుండుట మొదటి అహంకారము - ఇది శ్రేష్టమైనది. తనే పరమాత్మ అని, తనకు పరమాత్మకు భేదములేదు అనుకొనుట - రెండవ విధమైన అహంకారమెట్టిదనగా, అన్నింటికన్నా వ్యతిరేకమైనవాడిని, ఈ శరీరమంతయు నేనే అను అహంకారము - ఇది శుభావహమైనదే. దీని వలన బంధములేదు - కాళ్ళు, చేతులు మొదలగునవి నేను అను భావము మూడవది. ఇది లోకములో వాడుకలోనున్నది. ఇది తుచ్ఛమైనది. మొదట రెండువిధముల అహంకారముగలవాడు పరమపురుషునిపొందును).
“అయం భావః –
- ఏ తేషాం మధ్యే ప్రథమో బంధ యోగ్యః, తృష్ణా ప్రోతత్వాత్ బంధా యైవ అన్యేతు త్రయః శుద్ధ తృష్ణాన్వి తత్వాత్ జీవన్ముక్తేష్వేవపాలసంతి. ఉపాదే యేష్వపి త్రిషు సర్వాత్మకోహమితి నిశ్చయః - శ్రేయాన్ అహం శబ్ద ప్రయోగః ఆచార్యః కృతః -
(అహంకారము నాలుగు విధములు : -పాదములు మొదలు శిరస్సువరకు నేను నా తలిదండ్రులచేత సృష్టింపబడితిని అనునది అసదభిప్రాయమగుటచేత అహంకారము. ఇది బంధించునది, అన్నింటిని మించినది, అన్నింటికంటె అధికమైనది. పరమ సూక్ష్మమైనది నేను అను అభిప్రాయము రెండవది. ఇది సత్పురుషులకు మోక్షము కలుగచేయునది. సమస్త జగత్తునకు ఆత్మను, జగత్తులోని పదార్థములన్నియు నేనే - నేను క్షీణించుట లేనివాడను - అని అనుకొనుట మూడవది. ఇదిమోక్షమును కలుగచేయును. సర్వ ప్రపంచము నేనే, ఆకాశముతో సమానమై, శూన్యమైనవాడను. అందుచేత ఆకాశమువలె సర్వ వికల్పములకు అతీతమైనవాడను అనునది నాలుగవది. ఈ నాలుగు విధముల అహంకారములో మొదటిది తృష్ణతో కూడియుండుటచేత బంధము కలిగించునది. మిగిలినమూడు విధముల అహంకారము శుద్ధ తృష్ణకలిగి యుండుటచేత అవి జీవన్ముక్తులకే కలుగును. సమస్తమైన వాటికి ఆత్మ అయినవాడను అనుకొనుట శ్రేష్తము - ఈ విధముగా సమస్త దృశ్య ప్రపంచముతోను సంబంధములేక పరమాత్మకంటె వేఱుగాని ప్రత్యగాత్మయందు ప్రత్యగాత్మపరముగా ‘అహం = నేను’ అనుమాట అచార్యులచేత వాడబడినది).
(ఈ నాలుగు విధములైన అహంకారమునకు ఉపాసించు దేవతలు, అధిష్టాన దేవతలు ఈ విధముగా చెప్పబడిరి :
అహంకారమునకు ఉపాసించు దేవత సంకర్షణుడు, అధి దేవత రుద్రుడు - మనస్సునకు ఉపాసించవలసిన దేవత అనిరుద్ధుడు, అధిదేవత చంద్రుడు, బుద్ధికి ప్రద్యుమ్నుడు ఉపాసించవలసిన దేవత, బ్రహ్మ అధిష్ఠాన దేవత. చిత్తమునకు ఉపాసించవలసిన దేవత వాసుదేవుడు, అధిష్టాన దేవత క్షేత్రజ్ఞుడు.
(ఇదం = ఇది అను బుద్ధి బాహ్యవస్తువులను గుఱించి వాడబడుచున్నది. అహం = నేను అను బుద్ధి ఆత్మను గుఱించి వాడుక చేయబడుచున్నది. ‘ఇదం’ అను మాట ఘతము మొదలగు అనాత్మ వస్తువులగుఱించి వాడబడుచున్నది, అహం = నేను అను మాట ఆత్మ గుఱించి చెప్పినపుడున్నూ వాడుట అందఱికి విశదమే. ఎక్కడైతే ఏ సందర్భములో ఇదం = ఇది అనుమాట వాడబడినదో ఆ సందర్భములో అది అనాత్మ గుఱించియే అని జ్ఞానులు తెలుసుకోవలెను - ఎక్కడైతే స్వభావముచేత అహం = నేను అనుమాట వాడుక చేయ బడినదో అది ఆత్మగుఱించియే అని తెలుసుకొనవలెను).
(సర్వ సాక్షి అయినటువంటిన్నీ, స్వయంజ్యోతి అయినటువంటిన్నీ, సత్యము, ఆనందము అద్వైతము అయిన ఆత్మను ‘అహం = నేను’ అను భావముతో చింతించవలెను. శివుడు, విష్ణువు, బ్రహ్మ మొదలగువారందరు “అహమేవ పరబ్రహ్మ” - నేనే పరబ్రహ్మను - అని ఆత్మగుఱించియే చెప్పియున్నారు. వారుకూడా చిన్మాత్రము, అద్వైతము, అయిన దానినే ‘అహం’ అను మాటకు అర్థము అని అంగీకరించియే “అహం అద్వైతం బ్రహ్మ” - నేను అద్వయుడైన బ్రహ్మను - అని వచించిరి, అంతేగాని ‘అహం’ అనగా దేహమనికాదు).
అహంకారంబు గుణరూపంబునం జేసి త్రివిధంబును భూతరూపంబునం పంచవిధంబును, ఇంద్రియరూపంబుననేకాదశ విధంబును నై యుండు. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 32 - 1022)
“విజ్ఞానమయ కోశరూపంబగు నహంకారంబున ఆత్మానాత్మ వివేక శూన్యులు ‘అహం’ అనియెడు తం యనుభవంబువలన నాత్మయని చెప్పుదురు - నీలోత్సలంబనియెడి చోట నీలగుణ విశేషంబున గూడి విశేషంబగు నుత్పలంబు వేద్యంబగు చందంబున,”కృశోహం” అనునపుడు స్థూలశరీరంబు తోడను, “శ్రోతాహం” అనునపుడు ఇంద్రియంబులతోడను, ధాతాహం అనునపుడు అంతఃకరణంబులతోడను కూడి బ్రత్యగాత్మకు వేద్యంబగుటం జేసి అహంకారంబు ఆత్మయనుట అసత్యము. (వివేకచింతామణి)
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 32 - 1022)
(అహంకారమునకు వశమై యున్న ఊడల ఆపద కలుగును, బుద్ధిచెడును. అహంకారమువలననే కోరి కలు కలుగును, అహంకారమునుమించిన శత్రువు లేదు - బహుకాలమునుండి నాకుశత్రువుగానున్నఈ అహంకారమునాశ్రయించి భోజనము చేయను, నీరు త్రాగను, మరి భోగములను ఏమి అనుభవింతును -)
(జన్మము కలుగచేయుటకు అహంకారము అంకురమువంటిది. అదియే పెద్దచెట్టుగా పరిణమించును - ‘మమ ఇదం’ ‘ఇది నాది’ అనుబుద్ధి ఆ చెట్టుయొక్క శాఖలు, కొమ్మలు, ఫలములు).
(ఖదిరవృక్షములు కొండమీద పుట్టునట్లు, దీర్ఘకాలముండునవి బలము గలవియు అగు దుఃఖములు అహంకారము వలననే కలుగును).
(భగవంతునిశక్తి అయిన ప్రకృతి ఎనిమిది విధములుగానున్నది - అందులో అహంకారము ఒకటి).
(చూడుము - ‘ప్రకృతి’ - ‘అష్టప్రకృతులు’)
అహంకారము ఘటాదులవలె జడమై, దృశ్యమై స్వయంప్రకాశము కానందున అనాత్మయే.
“అహంకారోప శాంతేతు, రాజన్, జ్ఞానమతాప్యతే”.
(అహంకారము తొలగిపోవుటకు జ్ఞానము సంపాదింపవలెను - అహంకారము తొలగిపోయిన బ్రహ్మజ్ఞానము కలుగును).
(వాసనా క్షయహేతు సమ్యక్ జ్ఞాన సమాధ్యభ్యాసాది రూపః పురుష ప్రయత్నః, తేన భోగౌఘ భావనాం త్యక్త్వా వికసితాం పూర్ణాం సత్తాం బ్రహ్మసత్తాం గత్వా ఆశ్రిత్య అహంకారలయం వ్రజేత్).
(కర్మ వాసనలను క్షీణింపచేయు సమ్యక్ జ్ఞానము, సమాధి, అభ్యాసము మొదలగునవిగల పురుష ప్రయత్నముచేతభోగములన్నింటినీ విడిచిపెట్టి సద్రూపమైన పరబ్రహ్మను పొంది అహంకారమును లయింప చేయవలయును, లేకుండ చేసుకొనవలయును).
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 2 -)
(సృష్టిక్రమములో అహంకారము రెండవ ఘట్టము).
ahaṃ = nēnu anu abhimānamu; garvamu.
kōpamu; aṃtaḥkaraṇa catuṣṭayamulō nokaṭi -
ahaṃ udārō, ahaṃ tējasvī; asahanaḥ ityādiḥ ahaṃkāraḥ.
(nēnu udārasvabhāvamukalavāḍanu, tējassu kalavāḍanu, nāku eduru sahiṃcanivāḍanu, nēnu iṭṭivāḍanu, aṭṭi vāḍanu, iṃtavāḍanu, aṃtavāḍanu anu garvasvabhāvamu kaligiyuṃḍuṭa ahaṃkāramu).
(cēyavalasinadēdō, cēyarānidēdō samastamu nēnu telisinavāḍanu anu bhāvamu kaligiyuṃḍuṭa)
(ātmayaṃdu hitāhita jñānamaṃdu svataṃtrābhimānamu kaligiyuṃḍuṭa).
(nēnu, nādi ani abhimāniṃcu aṃtaḥkaraṇamuyokka vṛtti ahaṃkāramu).
(ātmakāni dēhamaṃdu nēnu ani anukonuṭavalana aṭṭi bhāvamu ahaṃkāramani ceppabaḍucunnadi).
(iṃkokari apēkṣalēkuṃḍā - iṃkokari sahāyamu apēkṣakuṃḍā aṃtayu nēnē cēyucunnānu anukonuṭa ahaṃkāramu).
(dēhamu iṃdriyamulu modalagu vāṭiyaṃdu avi ātmayanu bhramāhaṃkāramu).
(ātmagāni vastuvulaṃdu avē ātma anu abhimānamu).
(cittamuyokka tatvamunu telisina mahānubhāvulu ahaṃkāramanagā manassē ani eṟuguduru. jaṃtuvula (bhūtamula) lōpala (manassulō) nuṃḍu ahaṃbhāvamu ā jaṃtuvuyokka manassē).
(nēnu kartanu ani abhimānamu kaligiyuṃḍuṭa ahaṃkāramu).
(samasta bhūtamulaku ādi, kāraṇamu ayinadi ahaṃkāramu).
(mana aṃdaṟi sūkṣmaśarīramē ahaṃkāramani ceppabaḍucunnadi).
(‘nēnu veḷḷucunnānu’ anu lōkavyavahāramulō kūṭasthuḍaina paramātmakanna vēraina vāninigā ‘ahaṃ’ anudānini jñāniyaguvāḍu talacunu. śāstra dṛṣṭilō nēnu dēnitōnu saṃbaṃdhamu lēnivāḍanu, cidātmanu ani anukonunapuḍu kēvaluḍaina kūṭasthuḍē anu arthamulō āpadamu vāḍabaḍunu).
(ahaṃkaraṇamē ahaṃkāramu - nēnu ani anukonuṭa. lēni guṇamulanu tanayaṃdārōpiṃcukoni idi nēnē anu bhramakaligiyuṃḍuṭa. idiyē ahaṃkāramu. dīnikēavidyayani pēru - samastadōṣamulaku mūlamainadi, sarva anarthamulaku - kīḍulaku - kāraṇamainadi).
(viḍuva valasina samasta anarthamulaku kāraṇamu ahaṃkāramē).
(ahaṃkāramulōnuṃḍi bhūtamulu modalagunavi okadānilōnuṃḍi okaṭigā puṭṭinavi. aṃducēta ahaṃkāramu bhūtēṃdriyamanōmayamu - anagā, vāṭitō sūkṣmarūpamulō niṃḍiyunnadi - vāṭiki kāraṇamainadi).
(mahābhūtamulaku, paṃca tanmātralaku, kāraṇamainadi ahaṃkāramu - ahaṃkāramunuṃḍi sūkṣmapaṃcabhūtamulu - tanmātralu - puṭṭinavi).
(avidyātmakamu, aṃtamulēni vāsanalatō kūḍinadi, avyaktamu ayinadē ahaṃkāramani ceppabaḍucunnadi. idi samasta kāraṇavastuvulaku kāraṇamainadi).
(mahattatvamulōnuṃḍi ahaṃkāramu puṭṭinadi - ahaṃkāramunaku kāraṇamu - puṭṭinacōṭu - mahattatvamu).
(hiraṇyagarbhunicēta - māya lēka prakṛticēta - adhiṣṭiṃpabaḍina vikṣēpa śaktivalana - mahattatvamuvalana tamōguṇamuvalana ahaṃkāramanu sthūlaśakti puṭṭinadi).
(ahaṃkāramu 24 tatvamulalō nokaṭi, adi eṭlu puṭṭinadō 21, 22 lō ceppabaḍinadi).
(ahaṃkāramu reṃḍu vidhamulu - modaṭidi parāhaṃ tā rūpamu - reṃḍavadimahattattvamu nuṃḍi puṭṭinadi. modaṭidi bṛhadāraṇyakamulō. “ahaṃ brahmasmi” (nēnu brahmanu ayitini ani telusukonuṭa anu citta vṛtti rūpamu).
(ahaṃkāramu mūḍu vidhamulu - tāmasamu, rājasamu. sātvikamu. tāmasāhaṃkāramunuṃḍi sūkṣmabhūtamulu puṭṭucunnavi. rājasāhaṃkāramunuṃḍi daśēṃdriyamulu, - śarīramu velapala uṃḍi panicēyunavi - puṭṭinavi. sātvikāhaṃkāramunuṃḍi manassu, dēvatalu puṭṭiri. ē ahaṃkāramunuṃḍi puṭṭinavi ā ahaṃkāramulōnē layamagunu).
(ahaṃkāramu mūḍu vidhamulu - manasunaku kāraṇabhūtamai, manōma yamai vaikārikamanunadi sātvi kāhaṃkāramu. idi dēvamayamu. iṃdriyamula nadhiṣṭiṃciyuṃḍu dēvatulaku kāraṇamaguṭavalana dēva ma yamu. paṃcabhūtamulugā pariṇamiṃcunadi rājasāhaṃkāramu. tāmasāhaṃkāramunuṃḍi sūkṣma paṃcabhūtamulu puṭṭinavi).
(śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 5 - 86)
(ahaṃbhāvamu anunadi midhyārūpamu - idi paramātmatatvamu telisina tōḍanē - brahmajñānamu kaligina veṃṭanē - tolagipōvunu. ahaṃkāramu mūḍu vidhamulugānunnadi. ī mūḍiṃṭilōnū reṃḍu śrēṣṭamulu, mūḍavadi viḍuva taginadi. ī prapaṃcamaṃtā nēnē, nēnē paramātmanu, acyutuḍanu, nēnutappa marēdiyunu lēdu - ani abhiprāyamu kaligiyuṃḍuṭa modaṭi ahaṃkāramu - idi śrēṣṭamainadi. tanē paramātma ani, tanaku paramātmaku bhēdamulēdu anukonuṭa - reṃḍava vidhamaina ahaṃkārameṭṭidanagā, anniṃṭikannā vyatirēkamainavāḍini, ī śarīramaṃtayu nēnē anu ahaṃkāramu - idi śubhāvahamainadē. dīni valana baṃdhamulēdu - kāḷḷu, cētulu modalagunavi nēnu anu bhāvamu mūḍavadi. idi lōkamulō vāḍukalōnunnadi. idi tucchamainadi. modaṭa reṃḍuvidhamula ahaṃkāramugalavāḍu paramapuruṣunipoṃdunu).
“ayaṃ bhāvaḥ –
- ē tēṣāṃ madhyē prathamō baṃdha yōgyaḥ, tṛṣṇā prōtatvāt baṃdhā yaiva anyētu trayaḥ śuddha tṛṣṇānvi tatvāt jīvanmuktēṣvēvapālasaṃti. upādē yēṣvapi triṣu sarvātmakōhamiti niścayaḥ - śrēyān ahaṃ śabda prayōgaḥ ācāryaḥ kṛtaḥ -
(ahaṃkāramu nālugu vidhamulu : -pādamulu modalu śirassuvaraku nēnu nā talidaṃḍrulacēta sṛṣṭiṃpabaḍitini anunadi asadabhiprāyamaguṭacēta ahaṃkāramu. idi baṃdhiṃcunadi, anniṃṭini miṃcinadi, anniṃṭikaṃṭe adhikamainadi. parama sūkṣmamainadi nēnu anu abhiprāyamu reṃḍavadi. idi satpuruṣulaku mōkṣamu kalugacēyunadi. samasta jagattunaku ātmanu, jagattulōni padārthamulanniyu nēnē - nēnu kṣīṇiṃcuṭa lēnivāḍanu - ani anukonuṭa mūḍavadi. idimōkṣamunu kalugacēyunu. sarva prapaṃcamu nēnē, ākāśamutō samānamai, śūnyamainavāḍanu. aṃducēta ākāśamuvale sarva vikalpamulaku atītamainavāḍanu anunadi nālugavadi. ī nālugu vidhamula ahaṃkāramulō modaṭidi tṛṣṇatō kūḍiyuṃḍuṭacēta baṃdhamu kaligiṃcunadi. migilinamūḍu vidhamula ahaṃkāramu śuddha tṛṣṇakaligi yuṃḍuṭacēta avi jīvanmuktulakē kalugunu. samastamaina vāṭiki ātma ayinavāḍanu anukonuṭa śrēṣtamu - ī vidhamugā samasta dṛśya prapaṃcamutōnu saṃbaṃdhamulēka paramātmakaṃṭe vēṟugāni pratyagātmayaṃdu pratyagātmaparamugā ‘ahaṃ = nēnu’ anumāṭa acāryulacēta vāḍabaḍinadi).
(ī nālugu vidhamulaina ahaṃkāramunaku upāsiṃcu dēvatalu, adhiṣṭāna dēvatalu ī vidhamugā ceppabaḍiri :
ahaṃkāramunaku upāsiṃcu dēvata saṃkarṣaṇuḍu, adhi dēvata rudruḍu - manassunaku upāsiṃcavalasina dēvata aniruddhuḍu, adhidēvata caṃdruḍu, buddhiki pradyumnuḍu upāsiṃcavalasina dēvata, brahma adhiṣṭhāna dēvata. cittamunaku upāsiṃcavalasina dēvata vāsudēvuḍu, adhiṣṭāna dēvata kṣētrajñuḍu.
(idaṃ = idi anu buddhi bāhyavastuvulanu guṟiṃci vāḍabaḍucunnadi. ahaṃ = nēnu anu buddhi ātmanu guṟiṃci vāḍuka cēyabaḍucunnadi. ‘idaṃ’ anu māṭa ghatamu modalagu anātma vastuvulaguṟiṃci vāḍabaḍucunnadi, ahaṃ = nēnu anu māṭa ātma guṟiṃci ceppinapuḍunnū vāḍuṭa aṃdaṟiki viśadamē. ekkaḍaitē ē saṃdarbhamulō idaṃ = idi anumāṭa vāḍabaḍinadō ā saṃdarbhamulō adi anātma guṟiṃciyē ani jñānulu telusukōvalenu - ekkaḍaitē svabhāvamucēta ahaṃ = nēnu anumāṭa vāḍuka cēya baḍinadō adi ātmaguṟiṃciyē ani telusukonavalenu).
(sarva sākṣi ayinaṭuvaṃṭinnī, svayaṃjyōti ayinaṭuvaṃṭinnī, satyamu, ānaṃdamu advaitamu ayina ātmanu ‘ahaṃ = nēnu’ anu bhāvamutō ciṃtiṃcavalenu. śivuḍu, viṣṇuvu, brahma modalaguvāraṃdaru “ahamēva parabrahma” - nēnē parabrahmanu - ani ātmaguṟiṃciyē ceppiyunnāru. vārukūḍā cinmātramu, advaitamu, ayina dāninē ‘ahaṃ’ anu māṭaku arthamu ani aṃgīkariṃciyē “ahaṃ advaitaṃ brahma” - nēnu advayuḍaina brahmanu - ani vaciṃciri, aṃtēgāni ‘ahaṃ’ anagā dēhamanikādu).
ahaṃkāraṃbu guṇarūpaṃbunaṃ jēsi trividhaṃbunu bhūtarūpaṃbunaṃ paṃcavidhaṃbunu, iṃdriyarūpaṃbunanēkādaśa vidhaṃbunu nai yuṃḍu. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 32 - 1022)
“vijñānamaya kōśarūpaṃbagu nahaṃkāraṃbuna ātmānātma vivēka śūnyulu ‘ahaṃ’ aniyeḍu taṃ yanubhavaṃbuvalana nātmayani ceppuduru - nīlōtsalaṃbaniyeḍi cōṭa nīlaguṇa viśēṣaṃbuna gūḍi viśēṣaṃbagu nutpalaṃbu vēdyaṃbagu caṃdaṃbuna,”kṛśōhaṃ” anunapuḍu sthūlaśarīraṃbu tōḍanu, “śrōtāhaṃ” anunapuḍu iṃdriyaṃbulatōḍanu, dhātāhaṃ anunapuḍu aṃtaḥkaraṇaṃbulatōḍanu kūḍi bratyagātmaku vēdyaṃbaguṭaṃ jēsi ahaṃkāraṃbu ātmayanuṭa asatyamu. (vivēkaciṃtāmaṇi)
(śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 32 - 1022)
(ahaṃkāramunaku vaśamai yunna ūḍala āpada kalugunu, buddhiceḍunu. ahaṃkāramuvalananē kōri kalu kalugunu, ahaṃkāramunumiṃcina śatruvu lēdu - bahukālamunuṃḍi nākuśatruvugānunnaī ahaṃkāramunāśrayiṃci bhōjanamu cēyanu, nīru trāganu, mari bhōgamulanu ēmi anubhaviṃtunu -)
(janmamu kalugacēyuṭaku ahaṃkāramu aṃkuramuvaṃṭidi. adiyē peddaceṭṭugā pariṇamiṃcunu - ‘mama idaṃ’ ‘idi nādi’ anubuddhi ā ceṭṭuyokka śākhalu, kommalu, phalamulu).
(khadiravṛkṣamulu koṃḍamīda puṭṭunaṭlu, dīrghakālamuṃḍunavi balamu galaviyu agu duḥkhamulu ahaṃkāramu valananē kalugunu).
(bhagavaṃtuniśakti ayina prakṛti enimidi vidhamulugānunnadi - aṃdulō ahaṃkāramu okaṭi).
(cūḍumu - ‘prakṛti’ - ‘aṣṭaprakṛtulu’)
ahaṃkāramu ghaṭādulavale jaḍamai, dṛśyamai svayaṃprakāśamu kānaṃduna anātmayē.
“ahaṃkārōpa śāṃtētu, rājan, jñānamatāpyatē”.
(ahaṃkāramu tolagipōvuṭaku jñānamu saṃpādiṃpavalenu - ahaṃkāramu tolagipōyina brahmajñānamu kalugunu).
(vāsanā kṣayahētu samyak jñāna samādhyabhyāsādi rūpaḥ puruṣa prayatnaḥ, tēna bhōgaugha bhāvanāṃ tyaktvā vikasitāṃ pūrṇāṃ sattāṃ brahmasattāṃ gatvā āśritya ahaṃkāralayaṃ vrajēt).
(karma vāsanalanu kṣīṇiṃpacēyu samyak jñānamu, samādhi, abhyāsamu modalagunavigala puruṣa prayatnamucētabhōgamulanniṃṭinī viḍicipeṭṭi sadrūpamaina parabrahmanu poṃdi ahaṃkāramunu layiṃpa cēyavalayunu, lēkuṃḍa cēsukonavalayunu).
(śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 2 -)
(sṛṣṭikramamulō ahaṃkāramu reṃḍava ghaṭṭamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.