← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అహంకారసర్గః ahaṃkārasargaḥ

Original — తెలుగు
  1. అహంకారస్య సర్గో ద్వితీయ స్సర్గః - తస్య లక్షణం ద్రవ్య జ్ఞానక్రియాత్మకం.

(అహంకారసర్గము సృష్టిలో రెండవ సర్గము - అది ద్రవ్య జ్ఞాన క్రియాత్మకము).

  1. “ద్రవ్యజ్ఞాన క్రియాత్మకంబైన యహంకార తత్వంబు ద్వితీయ సర్గంబు” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 10 - 344)

  2. “రజస్సత్త్వంబులచేత నుపబృంహితంబై - పెంపొందినబడినదై - వికారంబునొందిన మహత్తత్త్వంబువలన తమః ప్రథానంబై ద్రవ్యజ్ఞానక్రియాత్మకంబగు నహంకారంబు గలిగె. అది రూపాంతరంబులొందుచూ ద్రవ్య శక్తియైన రాజసంబును క్రియాశక్తి అయిన తామసంబును, జ్ఞానశక్తి అయిన సాత్వికంబును అనుమూడు విధములయ్యె. అందు భూతాదియైన తామసాహంకారంబువలన నభంబు గలిగె. వైకారికంబైన సాత్వికాహారంబువలన చంద్రదైవతంబైన మనంబు కలిగె. మఱియు దిక్కులును, వాయువును,, అర్కుండును, ప్రచేతనుండును, అశ్వినులు, వహ్నియు, ఇంద్రుండును, ఉపేంద్రుండును, మిత్రుండును, ప్రజాపతియు ననియెడి దశ దేవతలు గలిగిరి. తైజసంబయిన రాజ సాహంకారబువలన దశేంద్రియంబులు, భోధజనకాంతః కరణైక భాగంబయిన బుద్ధియు, క్రియాజనకాంతః కరణంబైన ప్రాణంబునుం గలిగె”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 -- 86)

  3. సర్గము అనగా సృష్టి. ఇది పది విధములు - ఒకదాని తర్వాత నొకటిగా వచ్చునవి. వీటిలో రెండవది అహంకారసృష్టి. ఇది ద్రవ్య జ్ఞాన క్రియలు అను మూడు లక్షణములు గలది. సృష్టి భగవంతునిలోనుండి ప్రారంభమైనది మొదలు కాలస్వభావముల కారణముగా అనేక పరిణామములు- మార్పులు - చెందుచున్నది. ఒక మొక్క పుట్టి, కొంతకాలమునకు ఆకు వేసి, కొమ్మలువేసి, పువ్వు పుట్టి, కాయలు కాచుట అనునవి మార్పులు - ఈ ప్రకారముగానే సృష్టి ప్రారంభమునుండి కాలక్రమేణ సృష్టిలోని వస్తువులు అనేక విధములుగా మారు చున్నవి. ఇట్లు మారినవాటిలో ముఖ్యమైన మార్పు - తత్వము ఒక్కొక్క విధమైన సృష్టి - సర్గము అని చెప్పబడినది. ఈ ప్రకారముగానే సృష్టి ప్రారంభమునుండి కాలక్రమేణ సృష్టిలోని వస్తువులు అనేక విధములుగా మారు చున్నవి. ఇట్లు మారినవాటిలో ముఖ్యమైన మార్పు - తత్వము ఒక్కొక్క విధమైన సృష్టి - సర్గము అని చెప్పబడినది.ఈ ప్రకారముగా జరుగు మార్పులలో మొదటిది - మొదటి ఘట్టము - మహత్తత్వము - ఈ మహత్తత్త్వములోనుండి పుట్టినది - పుట్టినవస్తుజాలమురెండవ ఘట్టము - రెండవ సర్గము - ఇదియే అహంకారము - అందుచేత అహంకారము రెండవ సర్గము.

Transliteration
  1. ahaṃkārasya sargō dvitīya ssargaḥ - tasya lakṣaṇaṃ dravya jñānakriyātmakaṃ.

(ahaṃkārasargamu sṛṣṭilō reṃḍava sargamu - adi dravya jñāna kriyātmakamu).

  1. “dravyajñāna kriyātmakaṃbaina yahaṃkāra tatvaṃbu dvitīya sargaṃbu” (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 10 - 344)

  2. “rajassattvaṃbulacēta nupabṛṃhitaṃbai - peṃpoṃdinabaḍinadai - vikāraṃbunoṃdina mahattattvaṃbuvalana tamaḥ prathānaṃbai dravyajñānakriyātmakaṃbagu nahaṃkāraṃbu galige. adi rūpāṃtaraṃbuloṃducū dravya śaktiyaina rājasaṃbunu kriyāśakti ayina tāmasaṃbunu, jñānaśakti ayina sātvikaṃbunu anumūḍu vidhamulayye. aṃdu bhūtādiyaina tāmasāhaṃkāraṃbuvalana nabhaṃbu galige. vaikārikaṃbaina sātvikāhāraṃbuvalana caṃdradaivataṃbaina manaṃbu kalige. maṟiyu dikkulunu, vāyuvunu,, arkuṃḍunu, pracētanuṃḍunu, aśvinulu, vahniyu, iṃdruṃḍunu, upēṃdruṃḍunu, mitruṃḍunu, prajāpatiyu naniyeḍi daśa dēvatalu galigiri. taijasaṃbayina rāja sāhaṃkārabuvalana daśēṃdriyaṃbulu, bhōdhajanakāṃtaḥ karaṇaika bhāgaṃbayina buddhiyu, kriyājanakāṃtaḥ karaṇaṃbaina prāṇaṃbunuṃ galige”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 -- 86)

  3. sargamu anagā sṛṣṭi. idi padi vidhamulu - okadāni tarvāta nokaṭigā vaccunavi. vīṭilō reṃḍavadi ahaṃkārasṛṣṭi. idi dravya jñāna kriyalu anu mūḍu lakṣaṇamulu galadi. sṛṣṭi bhagavaṃtunilōnuṃḍi prāraṃbhamainadi modalu kālasvabhāvamula kāraṇamugā anēka pariṇāmamulu- mārpulu - ceṃducunnadi. oka mokka puṭṭi, koṃtakālamunaku āku vēsi, kommaluvēsi, puvvu puṭṭi, kāyalu kācuṭa anunavi mārpulu - ī prakāramugānē sṛṣṭi prāraṃbhamunuṃḍi kālakramēṇa sṛṣṭilōni vastuvulu anēka vidhamulugā māru cunnavi. iṭlu mārinavāṭilō mukhyamaina mārpu - tatvamu okkokka vidhamaina sṛṣṭi - sargamu ani ceppabaḍinadi. ī prakāramugānē sṛṣṭi prāraṃbhamunuṃḍi kālakramēṇa sṛṣṭilōni vastuvulu anēka vidhamulugā māru cunnavi. iṭlu mārinavāṭilō mukhyamaina mārpu - tatvamu okkokka vidhamaina sṛṣṭi - sargamu ani ceppabaḍinadi.ī prakāramugā jarugu mārpulalō modaṭidi - modaṭi ghaṭṭamu - mahattatvamu - ī mahattattvamulōnuṃḍi puṭṭinadi - puṭṭinavastujālamureṃḍava ghaṭṭamu - reṃḍava sargamu - idiyē ahaṃkāramu - aṃducēta ahaṃkāramu reṃḍava sargamu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.