(కార్యకారణ సంఘాతమందు ఇవి ఆత్మయని అభిప్రాయము కలిగియుండుట అహంకారము - అట్టి అహంకారము కలిగియుండుటచేత అనేక విధములుగా మూఢమైన అంతఃకరణము కలవాడు - అవిద్యవలన ఈకార్యములను తనయందే ఆరోపించుకొని ఈ కర్మలను నేనే చేయుచున్నాను అని తలచును).
అహంకారః ఇతి దేహాత్మ భ్రమః- ఏవ అత్ర వివక్షితః.
(అహంకారముచేత అనేకవిధములుగా మూఢమైన ఆత్మ (అంతఃకరణము) కలవాడు. అహంకారమనగా ఆత్మకాని ప్రకృతియందు ‘నేను’ అను పరమాత్మకానిదానియందు - అనాత్మవస్తువునందు‘నేను’ అను అభిమానము కలిగి యుండుట. ప్రకృతివలన వికారమును చెందిన అనేక వస్తువులుగా మారినవాటియందు ‘ఇవి నేను’ అను అభిప్రాయము కలిగియుండుట. అట్టి అహం అభిమానమువలన తనయొక్క నిజస్వరూపమును - తన పరమాత్మయే అను జ్ఞానమును తెలియనివాడై త్రిగుణములవలన కలుగు కర్మలకు నేనే కర్తను అని తలచును).
(అహంకారముచేత మూఢబుద్ధి కలవాడు. కర్మలను నేను చేయుచున్నాను - నేను ఈ కర్మలకు కర్తనుఅను అధ్యాస కలవాడు).
(ఈ కార్య కారణ సంఘాతమునకు నేనే కారణము అను అహంకారముచేత తనయొక్క నిజతత్వమును - తానే ఆత్మయను విషయమును - తెలుసుకొనలేని అంతఃకరణము కలవాడు. అనాత్మ వస్తువులందు ఆత్మయను అభిమానము కలవాడు).
(kāryakāraṇa saṃghātamaṃdu ivi ātmayani abhiprāyamu kaligiyuṃḍuṭa ahaṃkāramu - aṭṭi ahaṃkāramu kaligiyuṃḍuṭacēta anēka vidhamulugā mūḍhamaina aṃtaḥkaraṇamu kalavāḍu - avidyavalana īkāryamulanu tanayaṃdē ārōpiṃcukoni ī karmalanu nēnē cēyucunnānu ani talacunu).
ahaṃkāraḥ iti dēhātma bhramaḥ- ēva atra vivakṣitaḥ.
(ahaṃkāramucēta anēkavidhamulugā mūḍhamaina ātma (aṃtaḥkaraṇamu) kalavāḍu. ahaṃkāramanagā ātmakāni prakṛtiyaṃdu ‘nēnu’ anu paramātmakānidāniyaṃdu - anātmavastuvunaṃdu’nēnu’ anu abhimānamu kaligi yuṃḍuṭa. prakṛtivalana vikāramunu ceṃdina anēka vastuvulugā mārinavāṭiyaṃdu ‘ivi nēnu’ anu abhiprāyamu kaligiyuṃḍuṭa. aṭṭi ahaṃ abhimānamuvalana tanayokka nijasvarūpamunu - tana paramātmayē anu jñānamunu teliyanivāḍai triguṇamulavalana kalugu karmalaku nēnē kartanu ani talacunu).
(ahaṃkāramucēta mūḍhabuddhi kalavāḍu. karmalanu nēnu cēyucunnānu - nēnu ī karmalaku kartanuanu adhyāsa kalavāḍu).
(ī kārya kāraṇa saṃghātamunaku nēnē kāraṇamu anu ahaṃkāramucēta tanayokka nijatatvamunu - tānē ātmayanu viṣayamunu - telusukonalēni aṃtaḥkaraṇamu kalavāḍu. anātma vastuvulaṃdu ātmayanu abhimānamu kalavāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.