(ఇతరులను పీడింపకుండుట, బాధించకుండుట).
పరపీడనా భావః. (ఇతరులను బాధింపకుండుట).
అప్రాణి పీడా. (ప్రాణులను పీడించకుండుట). ప్రాణినాం పీడా వర్జనం.
“అహింసా ప్రాణి పీడాయ నివృత్తిః (గీతాభావప్రకాశము - 10 - 21)
(ప్రాణులకు కలుగు పీడ నివృత్తి చేయుట).
పరదుఃఖా హేతుత్వం - (ఇతరులకు దుఃఖము కలుగుటకు కారణము కాకుండుట).
భూతేషు అద్రోహః. (భూతములకు ద్రోహము కలుగచేయకుండుట).
కరణ త్రయేణాపి పరపీడా నివృత్తిః. (మనో వాక్కర్మలచేత ఇతరులకు బాధ కలుగచేయక ఉండుట).
అహింసానామ మనోవాక్కాయకర్మభిః సర్వభూతేషు సర్వదా అక్లేశజననం.” (శాండిల్యోపనిషత్).
(అహింస అనగా మనసులో ఆలోచనవలనగాని, మాటలవలనగాని, పనులచేతవలనగాని, సమస్త భూతములకు ఎప్పుడూ బాధకలుగకుండ చేయుట).
(మనసులో ఆలోచించుటవలనకాని, శరీరముతో చేయుపనులవలనకాని, మాటలవలనకాని ఏ జీవికైనను, ఏ ప్రకారముగనైనను, ఎప్పుడైనను, ఇకముందైనను దుఃఖము కలుగకుండనట్లు చేయుట, ఇంతేకాక ఎల్లపుడు, అందఱికి సుఖమునే కలుగచేయు పనులను చేయుటలో నిమగ్నమై యుండుట).
(అనురాగము - ఆసక్తి - లేకగాని, అహంకారములేకగాని, అనగా, నేనే ఈ పని చేయుచున్నాను అను భావము లేకగాని, చేసిన కర్మ చేయనట్లే. ఇది తెలిసి చేయువాడే పండితుడు - విద్వాంసుడు - అని బుద్ధిమంతులు చెప్పుదురు - అనగా హింస చేసినప్పటికీ దానియందాసక్తిలేకచేసినను, అహంకారబుద్ధితోకాక చేసినను అది హింస చేసినట్లుకాదు - అది అహింసయే).
(తడిసిపోయినకఱ్ఱలవలననే అగ్నికి పొగవచ్చును. కఱ్ఱ్తలు తడివికానిచో పొగ ఉండదు - పచ్చికఱ్ఱలలో తడి ఉన్నందున పొగవచ్చును - అనగా, అగ్నికి ఉపాధి అయిన కఱ్ఱలు తడిసినవైన యడల పొగవచ్చును, తడిసినవికానియడల పొగరాదు - ఆ ప్రకారముగానే రాగము మొదలగువాటితో పశువును చంపుట హింసయగును - అట్టిరాగము మొదలగునవి లేక పశువధచేసిన అది హింసకాదు, అహింసయే)
(హింస, అహింస అనునవి వేదములో చెప్పబడిన ప్రకారము మనోవాక్కాయములచే చేయబడుకర్మలు -మఱొక విధముగా హింసగాని, అహింసగాని కాదు. ఆత్మ - భగవంతుడు అన్నింటిలోను ఉన్నవాడు, హింసింపబడువాడుకాడు - హింసింపకూడనివాడు. అందుచేత అతనిని గ్రహించకూడదు. అంతా భగవంతుడే కనుక దేనినైనను హింసింపకూడదు అనునదియే అహింస. ఇట్టి అహింస శ్రేష్టమైనదని వేదాంతసారము తుదముట్టనెఱింగినవారి అభిప్రాయము -).
ఈరు, పేను, నల్లి, ఈగ, చీమ మొదలగు చిన్నచిన్న ప్రాణులను క్రూర జంతువులైన పాములు, తేళ్ళుమొదలగు విషజంతువులను, సింహములు, పులులు మొదలగువాటిని చంపకుండుటాహింస యనబడును - వేదములో చెప్పబడిన యజ్ఞములందు పశువులను చంపుటయూ అహింసయే యని చెప్పబడును -.
“శ్రోద్ధాదులందే, ప్రఖ్యాత శ్రాద్ధ దివసంబులందే, రాజైనవాడే, మేధ్యంబులయిన పశువులనే వనంబునదే, యధోప యుక్తంబుగానే వధియింపజను - అను నియమమాత్రంబుగలదు, గావున జ్ఞానియైన విద్వాంసుండు ఆచరింపండు, గాక, యాచరించినం గర్మానుష్ఠాన జనితంబయిన జ్ఞానంబునం జేసి యందు చొరయండు. అట్లుగాక నియమో ల్లంఘనంబునగర్మాచరణుండగువాడు అభిమానంబునొంది కర్మబద్ధుండై గుణప్రవాహ పతితుండును, నష్టప్రజ్ఞుండునునై యధోగతిం గూలు”. (శ్రీమదాంధ్ర,మహాభాగవతము - 4 - 26 -
(పైన చెప్పిన దానినిబట్టి వేదములో చెప్పిన ప్రకారము చేసిన పశుహింస హింసకాదు, అది అహింసయే).
(ప్రాణిహింస చేయుట యందత్యంత అనురాగము కలిగియుండుటవలన ఎప్పుడూ హింసచేయుచుండు అజ్ఞానులను చూచి “యజ్ఞముకొఱకు అయిన పశువును పొందవలెను - యజ్ఞములో చంపుటకు యుక్తమైన పశువును చేకూర్చుకొనవలెను” అని స్వర్గము మొదలగువాటిని పొందించే ఫలముగల వేదవాక్యములను పురస్కరించుకొని వేదమార్గమును ముందు అవలంభింపచేసి, తర్వాత గుడజిహ్వికాన్యాయమున - ముందు తీయని బెల్లము రుచి చూపించి తరువాత మందు తినుపించునట్లుగా - నశించు స్వభావముగలస్వర్గాది ఫలమున్నూ, ఏ విధమైన అపరాధముచేయని ఎన్నో ప్రాణుల వధించుటచేత సాధ్యమగు యాగములు మున్నగునవి ముక్తికి విరోధములగుటచేత వారికి అట్లు చేయుట మంచిదికాదని తలచి, పరమపురుషార్థమైన మోక్షమును సాధించుటకు నివృత్తిమార్గమందు వారిని ప్రవర్తింపచేయుటకు “హింసింపరాదు”అను వేదవాక్యము ద్వారా “యజ్ఞములు చేయవలయును, వాటికొఱకు పశువులను చంపవచ్చును” అను వేదవాక్యమును నిందించుచున్నావేగాని, అన్నివిధముల వేదవాక్యములను నిందచేయుటకే నీ అవతారకారణము కాదు). (బుద్ధావతారము)
(సమస్త భూతములను - సమస్తభూతములలోను ఏ భూతమును హింసింపరాదు).
(హింస చేయకుండుటయే పరమ ధర్మము, ఉత్కృష్టమైన ధర్మము).
(ఒక్క ప్రాణి ప్రాణమును రక్షించుటకంటె ఒక ప్రాణిని హింస చేయకుండుట పరమ ధర్మము, ఉత్కృష్టమైన ధర్మము).
“ఆ. వారిజాక్షులందు వైవాహికములందు
ప్రాణ విత్త మాన భంగమందు
--- ---
బొంకవచ్చు నఘము పొంద డధిప”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 19 - 585)
కాని ఈ ధర్మమునకు బలిచక్రవర్తి అంగీకరించలేదు - ఇట్లే యజ్ఞములో ప్రాణహింస చేయుట, ధర్మయుద్ధములోనైనను ప్రాలను - శత్రువులను - చంపుట అహింసయని ధర్మరాజు అంగీకరించలేదు -
వ. మఱియు బ్రజాపరిపాల పరుండయిన రాజు ధర్మయుద్ధంబున శత్రువుల వధియించిన బాపంబు లేదని శాస్త్రవచనంబు గలదు. అయిన నది విజ్ఞానంబుకొఱకు సమర్థంబుగాదు - చతురంగంబుల ననే కాక్షౌహిణీ సంఖ్యాతంబులంజంపించితి. హతబంధులైన సతులకేను జేసిన ద్రోహంబు దప్పించుకిన నేర్పులేదు. గృహస్థాశ్రమ ధర్మంబులయిన తురంగమేధాది యాగంబులచేత బురుషుడు బ్రహ్మహత్యాదిపాపంబులవలన విడివడి నిర్మలుండగునని నిగమంబులు నిగమించు, బంకంబునబంకిలస్థలంబునకు, మధ్యంబున మధ్య భాండమునకు శుద్ధి సంభవింపని చందంబున బుద్ధి పూర్వక జీవహింసంబులయిన యాగంబులచేతం బురుషులకు బాప బాహుళ్యంబకాని బాపనిర్ముక్తికాదని శంకించెద”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 8 - 165, 166)
ఇతి శాస్త్రేణ హంతవ్యాః శత్రునశ్చేతి. (నిన్ను చంపుటకు నీ మీదకు వచ్చుచున్న ఆతతాయిని ఆలోచించక చంపవలసినదే. ఆతతాయిని చంపినందువల్ల చంపినవానికి దోషములేదు అని శాస్త్రము చెప్పుచున్నది; కనుక ఈ గురువులు, శత్రువులు, బంధువులు నిన్ను యుద్ధములో చంపుటకు సిద్ధముగా నున్నారు - అందుచేత వారిని నీవు చంపిన పాపము లేదు).
(రాజు యుద్ధముచేయు లక్షణములుగలవాడు - క్షత్రియ ధర్మమునుపాలించి యుద్ధము నుండి వెనుతిరిగి పోకూడదూని మను ధర్మశాస్త్రములో చెప్పబడినది. యుద్ధములో ప్రాణిహింస చేయవలసి వచ్చినను అది కులధర్మమగుటవలన హింసకాదు). బుద్ధ భగవానుడువంటి మహానుభావుడు ఏ సందర్భములో నైనను ప్రాణి హింస చేయకూడదని బోధించెను).
(శ్రీమదాంధ్ర,మహాభాగవతము - 1 - 13 - 288)
దీనిని బట్టి చూడ ప్రతిజీవి ఇంకొక జీవిని హింసించి తినును. తాను జీవించియుండవలెననిన ఇంకొక జీవికి హింస చేయవలసియే యుండును. శాకాహారమైనను, మాంసాహారమైనను ఏ మొక్కనో, ఏ జంతువునో హింసించనిదీ లభ్యముకాదు - ఆకు, అలము తినిగాని, కేవలము గాలినాహారముగా గొని జీవించువారుకాని, రాలిన పండును తిని జీవించువారుకానితప్పించి ఇతర జీవులకు హింసచేయనిది ఆహారము లభింపదు - రక్షకుడైన పరమాత్మయే భక్షకుడు - ఆత్మ అనగా అత్త = తినువాడు. అందుచేత “న హింస్యాత్ సర్వభూతాని”అను సాధారణ ధర్మము పాలించుట కష్టసాధ్యము - విశేష ధర్మములతో సమన్వయించిసాధారణ ధర్మమును వీలగునంతవఱకు అవలంభించుటకు అవకాశమున్నది. కోరి హింస చేయరాదు).
(అహింస వ్రతముగా ప్రతిష్టింపబడియున్నపుడు ఆ దగ్గరగా వైరమనునదే కలుగదు).
(itarulanu pīḍiṃpakuṃḍuṭa, bādhiṃcakuṃḍuṭa).
parapīḍanā bhāvaḥ. (itarulanu bādhiṃpakuṃḍuṭa).
aprāṇi pīḍā. (prāṇulanu pīḍiṃcakuṃḍuṭa). prāṇināṃ pīḍā varjanaṃ.
“ahiṃsā prāṇi pīḍāya nivṛttiḥ (gītābhāvaprakāśamu - 10 - 21)
(prāṇulaku kalugu pīḍa nivṛtti cēyuṭa).
paraduḥkhā hētutvaṃ - (itarulaku duḥkhamu kaluguṭaku kāraṇamu kākuṃḍuṭa).
bhūtēṣu adrōhaḥ. (bhūtamulaku drōhamu kalugacēyakuṃḍuṭa).
karaṇa trayēṇāpi parapīḍā nivṛttiḥ. (manō vākkarmalacēta itarulaku bādha kalugacēyaka uṃḍuṭa).
ahiṃsānāma manōvākkāyakarmabhiḥ sarvabhūtēṣu sarvadā aklēśajananaṃ.” (śāṃḍilyōpaniṣat).
(ahiṃsa anagā manasulō ālōcanavalanagāni, māṭalavalanagāni, panulacētavalanagāni, samasta bhūtamulaku eppuḍū bādhakalugakuṃḍa cēyuṭa).
(manasulō ālōciṃcuṭavalanakāni, śarīramutō cēyupanulavalanakāni, māṭalavalanakāni ē jīvikainanu, ē prakāramuganainanu, eppuḍainanu, ikamuṃdainanu duḥkhamu kalugakuṃḍanaṭlu cēyuṭa, iṃtēkāka ellapuḍu, aṃdaṟiki sukhamunē kalugacēyu panulanu cēyuṭalō nimagnamai yuṃḍuṭa).
(anurāgamu - āsakti - lēkagāni, ahaṃkāramulēkagāni, anagā, nēnē ī pani cēyucunnānu anu bhāvamu lēkagāni, cēsina karma cēyanaṭlē. idi telisi cēyuvāḍē paṃḍituḍu - vidvāṃsuḍu - ani buddhimaṃtulu ceppuduru - anagā hiṃsa cēsinappaṭikī dāniyaṃdāsaktilēkacēsinanu, ahaṃkārabuddhitōkāka cēsinanu adi hiṃsa cēsinaṭlukādu - adi ahiṃsayē).
(taḍisipōyinakaṟṟalavalananē agniki pogavaccunu. kaṟṟtalu taḍivikānicō poga uṃḍadu - paccikaṟṟalalō taḍi unnaṃduna pogavaccunu - anagā, agniki upādhi ayina kaṟṟalu taḍisinavaina yaḍala pogavaccunu, taḍisinavikāniyaḍala pogarādu - ā prakāramugānē rāgamu modalaguvāṭitō paśuvunu caṃpuṭa hiṃsayagunu - aṭṭirāgamu modalagunavi lēka paśuvadhacēsina adi hiṃsakādu, ahiṃsayē)
(hiṃsa, ahiṃsa anunavi vēdamulō ceppabaḍina prakāramu manōvākkāyamulacē cēyabaḍukarmalu -maṟoka vidhamugā hiṃsagāni, ahiṃsagāni kādu. ātma - bhagavaṃtuḍu anniṃṭilōnu unnavāḍu, hiṃsiṃpabaḍuvāḍukāḍu - hiṃsiṃpakūḍanivāḍu. aṃducēta atanini grahiṃcakūḍadu. aṃtā bhagavaṃtuḍē kanuka dēninainanu hiṃsiṃpakūḍadu anunadiyē ahiṃsa. iṭṭi ahiṃsa śrēṣṭamainadani vēdāṃtasāramu tudamuṭṭaneṟiṃginavāri abhiprāyamu -).
īru, pēnu, nalli, īga, cīma modalagu cinnacinna prāṇulanu krūra jaṃtuvulaina pāmulu, tēḷḷumodalagu viṣajaṃtuvulanu, siṃhamulu, pululu modalaguvāṭini caṃpakuṃḍuṭāhiṃsa yanabaḍunu - vēdamulō ceppabaḍina yajñamulaṃdu paśuvulanu caṃpuṭayū ahiṃsayē yani ceppabaḍunu -.
“śrōddhādulaṃdē, prakhyāta śrāddha divasaṃbulaṃdē, rājainavāḍē, mēdhyaṃbulayina paśuvulanē vanaṃbunadē, yadhōpa yuktaṃbugānē vadhiyiṃpajanu - anu niyamamātraṃbugaladu, gāvuna jñāniyaina vidvāṃsuṃḍu ācariṃpaṃḍu, gāka, yācariṃcinaṃ garmānuṣṭhāna janitaṃbayina jñānaṃbunaṃ jēsi yaṃdu corayaṃḍu. aṭlugāka niyamō llaṃghanaṃbunagarmācaraṇuṃḍaguvāḍu abhimānaṃbunoṃdi karmabaddhuṃḍai guṇapravāha patituṃḍunu, naṣṭaprajñuṃḍununai yadhōgatiṃ gūlu”. (śrīmadāṃdhra,mahābhāgavatamu - 4 - 26 -
(paina ceppina dāninibaṭṭi vēdamulō ceppina prakāramu cēsina paśuhiṃsa hiṃsakādu, adi ahiṃsayē).
(prāṇihiṃsa cēyuṭa yaṃdatyaṃta anurāgamu kaligiyuṃḍuṭavalana eppuḍū hiṃsacēyucuṃḍu ajñānulanu cūci “yajñamukoṟaku ayina paśuvunu poṃdavalenu - yajñamulō caṃpuṭaku yuktamaina paśuvunu cēkūrcukonavalenu” ani svargamu modalaguvāṭini poṃdiṃcē phalamugala vēdavākyamulanu puraskariṃcukoni vēdamārgamunu muṃdu avalaṃbhiṃpacēsi, tarvāta guḍajihvikānyāyamuna - muṃdu tīyani bellamu ruci cūpiṃci taruvāta maṃdu tinupiṃcunaṭlugā - naśiṃcu svabhāvamugalasvargādi phalamunnū, ē vidhamaina aparādhamucēyani ennō prāṇula vadhiṃcuṭacēta sādhyamagu yāgamulu munnagunavi muktiki virōdhamulaguṭacēta vāriki aṭlu cēyuṭa maṃcidikādani talaci, paramapuruṣārthamaina mōkṣamunu sādhiṃcuṭaku nivṛttimārgamaṃdu vārini pravartiṃpacēyuṭaku “hiṃsiṃparādu”anu vēdavākyamu dvārā “yajñamulu cēyavalayunu, vāṭikoṟaku paśuvulanu caṃpavaccunu” anu vēdavākyamunu niṃdiṃcucunnāvēgāni, annividhamula vēdavākyamulanu niṃdacēyuṭakē nī avatārakāraṇamu kādu). (buddhāvatāramu)
(samasta bhūtamulanu - samastabhūtamulalōnu ē bhūtamunu hiṃsiṃparādu).
(hiṃsa cēyakuṃḍuṭayē parama dharmamu, utkṛṣṭamaina dharmamu).
(okka prāṇi prāṇamunu rakṣiṃcuṭakaṃṭe oka prāṇini hiṃsa cēyakuṃḍuṭa parama dharmamu, utkṛṣṭamaina dharmamu).
“ā. vārijākṣulaṃdu vaivāhikamulaṃdu
prāṇa vitta māna bhaṃgamaṃdu
--- ---
boṃkavaccu naghamu poṃda ḍadhipa”. (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 19 - 585)
kāni ī dharmamunaku balicakravarti aṃgīkariṃcalēdu - iṭlē yajñamulō prāṇahiṃsa cēyuṭa, dharmayuddhamulōnainanu prālanu - śatruvulanu - caṃpuṭa ahiṃsayani dharmarāju aṃgīkariṃcalēdu -
va. maṟiyu brajāparipāla paruṃḍayina rāju dharmayuddhaṃbuna śatruvula vadhiyiṃcina bāpaṃbu lēdani śāstravacanaṃbu galadu. ayina nadi vijñānaṃbukoṟaku samarthaṃbugādu - caturaṃgaṃbula nanē kākṣauhiṇī saṃkhyātaṃbulaṃjaṃpiṃciti. hatabaṃdhulaina satulakēnu jēsina drōhaṃbu dappiṃcukina nērpulēdu. gṛhasthāśrama dharmaṃbulayina turaṃgamēdhādi yāgaṃbulacēta buruṣuḍu brahmahatyādipāpaṃbulavalana viḍivaḍi nirmaluṃḍagunani nigamaṃbulu nigamiṃcu, baṃkaṃbunabaṃkilasthalaṃbunaku, madhyaṃbuna madhya bhāṃḍamunaku śuddhi saṃbhaviṃpani caṃdaṃbuna buddhi pūrvaka jīvahiṃsaṃbulayina yāgaṃbulacētaṃ buruṣulaku bāpa bāhuḷyaṃbakāni bāpanirmuktikādani śaṃkiṃceda”. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 8 - 165, 166)
iti śāstrēṇa haṃtavyāḥ śatrunaścēti. (ninnu caṃpuṭaku nī mīdaku vaccucunna ātatāyini ālōciṃcaka caṃpavalasinadē. ātatāyini caṃpinaṃduvalla caṃpinavāniki dōṣamulēdu ani śāstramu ceppucunnadi; kanuka ī guruvulu, śatruvulu, baṃdhuvulu ninnu yuddhamulō caṃpuṭaku siddhamugā nunnāru - aṃducēta vārini nīvu caṃpina pāpamu lēdu).
(rāju yuddhamucēyu lakṣaṇamulugalavāḍu - kṣatriya dharmamunupāliṃci yuddhamu nuṃḍi venutirigi pōkūḍadūni manu dharmaśāstramulō ceppabaḍinadi. yuddhamulō prāṇihiṃsa cēyavalasi vaccinanu adi kuladharmamaguṭavalana hiṃsakādu). buddha bhagavānuḍuvaṃṭi mahānubhāvuḍu ē saṃdarbhamulō nainanu prāṇi hiṃsa cēyakūḍadani bōdhiṃcenu).
(śrīmadāṃdhra,mahābhāgavatamu - 1 - 13 - 288)
dīnini baṭṭi cūḍa pratijīvi iṃkoka jīvini hiṃsiṃci tinunu. tānu jīviṃciyuṃḍavalenanina iṃkoka jīviki hiṃsa cēyavalasiyē yuṃḍunu. śākāhāramainanu, māṃsāhāramainanu ē mokkanō, ē jaṃtuvunō hiṃsiṃcanidī labhyamukādu - āku, alamu tinigāni, kēvalamu gālināhāramugā goni jīviṃcuvārukāni, rālina paṃḍunu tini jīviṃcuvārukānitappiṃci itara jīvulaku hiṃsacēyanidi āhāramu labhiṃpadu - rakṣakuḍaina paramātmayē bhakṣakuḍu - ātma anagā atta = tinuvāḍu. aṃducēta “na hiṃsyāt sarvabhūtāni”anu sādhāraṇa dharmamu pāliṃcuṭa kaṣṭasādhyamu - viśēṣa dharmamulatō samanvayiṃcisādhāraṇa dharmamunu vīlagunaṃtavaṟaku avalaṃbhiṃcuṭaku avakāśamunnadi. kōri hiṃsa cēyarādu).
(ahiṃsa vratamugā pratiṣṭiṃpabaḍiyunnapuḍu ā daggaragā vairamanunadē kalugadu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.