← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అజా ajā

Original — తెలుగు
  1. ప్రకృతి; మాయ; అవిద్యా; సంసారము -

  2. నజాయతే ఇత్యజా, మూలప్రకృతి రూపా మాయా; నహి అనాదేః తస్యాః జన్మసంభవతి; సాచమాయా ఏకా, ఇతరస్య సర్వస్య జగతః తత్కార్య త్వాత్.

(పుట్టుకలేదు కనుక అజా; మూలప్రకృతి రూపముగా గల మాయ. ఆది – కారణము లేదు కనుక అజా; జన్మలేనిది. మిగిలిన సమస్త జగత్తు దాని కార్యమగుట చేత మాయ యనునది ఒకటే, మఱొకటి ఏదియును లేదు)

  1. “యస్యా జననం నొపలభ్యతే తస్మాదుచ్యతే ‘అజా’”. (దేవ్యుపనిషత్)

(ఆమె యొక్క జననముతెలియదు కనుక ‘అజా’.)

  1. ప్రకృతి పరిణామాత్మికా, కార్య కారణ లక్షణా, త్రిగుణాత్మికా ప్రకృతిః; అవిద్యా; మాయా.

(ప్రకృతిగా మారినది; కార్య కారణములను చేయుట లక్షణముగా గలది; ప్రపంచములోని కార్య వస్తువులు గాను, కారణవస్తువులు గాను మారినది; సత్వము, రజస్సు, తమస్సు అను మూడు గుణములు గలది; ప్రకృతి; అవిద్య; మాయ.)

  1. పరమార్ధ దృష్ట్యా కాలత్రయే (అ)పి న జాయతే ఇతి. అజా; అలబ్ధాత్మ కత్వాత్; స్వాజ్ఞ సర్వానర్ధకరీ అజా.

(పరమాత్మ దృష్టిలో ఎన్నడూ పుట్టుట అనునది లేనిది కనుక ‘అజా’ - శరీరము లేనిది అగుటచేత స్వస్వ రూపజ్ఞానమును - తానే పరమాత్మ యను జ్ఞానమును - లేనట్లు చేసి, అన్నివిధములైన అనర్ధములను కలిగించునది)

  1. జీవస్య అవిద్యా (జీవుని అజ్ఞానము.)

  2. ‘అజా’ అనగా ప్రథానము అని సాంఖ్యమతస్తుల అభిప్రాయము. “ప్రథానము” అను మాట ఉపనిషత్తులలో లేదు. అందుచేత ‘ప్రథానము’ అశబ్దము - శబ్దమనగా వేదము. వేదములో లేని శబ్దము - మాట - అశబ్దము అని చెప్పబడినది. ‘అజా’ అనగా ప్రకృతి అనియే అర్ధము.

Transliteration
  1. prakṛti; māya; avidyā; saṃsāramu -

  2. najāyatē ityajā, mūlaprakṛti rūpā māyā; nahi anādēḥ tasyāḥ janmasaṃbhavati; sācamāyā ēkā, itarasya sarvasya jagataḥ tatkārya tvāt.

(puṭṭukalēdu kanuka ajā; mūlaprakṛti rūpamugā gala māya. ādi – kāraṇamu lēdu kanuka ajā; janmalēnidi. migilina samasta jagattu dāni kāryamaguṭa cēta māya yanunadi okaṭē, maṟokaṭi ēdiyunu lēdu)

  1. “yasyā jananaṃ nopalabhyatē tasmāducyatē ‘ajā’”. (dēvyupaniṣat)

(āme yokka jananamuteliyadu kanuka ‘ajā’.)

  1. prakṛti pariṇāmātmikā, kārya kāraṇa lakṣaṇā, triguṇātmikā prakṛtiḥ; avidyā; māyā.

(prakṛtigā mārinadi; kārya kāraṇamulanu cēyuṭa lakṣaṇamugā galadi; prapaṃcamulōni kārya vastuvulu gānu, kāraṇavastuvulu gānu mārinadi; satvamu, rajassu, tamassu anu mūḍu guṇamulu galadi; prakṛti; avidya; māya.)

  1. paramārdha dṛṣṭyā kālatrayē (a)pi na jāyatē iti. ajā; alabdhātma katvāt; svājña sarvānardhakarī ajā.

(paramātma dṛṣṭilō ennaḍū puṭṭuṭa anunadi lēnidi kanuka ‘ajā’ - śarīramu lēnidi aguṭacēta svasva rūpajñānamunu - tānē paramātma yanu jñānamunu - lēnaṭlu cēsi, annividhamulaina anardhamulanu kaligiṃcunadi)

  1. jīvasya avidyā (jīvuni ajñānamu.)

  2. ‘ajā’ anagā prathānamu ani sāṃkhyamatastula abhiprāyamu. “prathānamu” anu māṭa upaniṣattulalō lēdu. aṃducēta ‘prathānamu’ aśabdamu - śabdamanagā vēdamu. vēdamulō lēni śabdamu - māṭa - aśabdamu ani ceppabaḍinadi. ‘ajā’ anagā prakṛti aniyē ardhamu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.