← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అజగరన్యాయము ajagaranyāyamu

Original — తెలుగు
  1. అప్రయత్నముగా ప్రాప్తించిన దానినే అనుభవించుట.

  2. కొండచిలువ వలె కదలిక లేక పడి యుండునది.

  3. కొండచిలువ పెద్ద శరీరము గలది యగుటచేత కదలక మెదలక ఒకచోట పడి యుండును, కదలిక లేకుండ పడి యుండుట వలన అది కఱ్ఱ అనుకొని జంతువులు దాని దగ్గరగా రాగా అట్లు వచ్చిన వాటిని భక్షించుట. ఈ ప్రకారము ఉన్నచోటు కదలక అందిన దానిని భక్షించుట - అప్రయత్నముగా ప్రాప్తించిన దానిని అనుభవించుట అజగరన్యాయము.

Transliteration
  1. aprayatnamugā prāptiṃcina dāninē anubhaviṃcuṭa.

  2. koṃḍaciluva vale kadalika lēka paḍi yuṃḍunadi.

  3. koṃḍaciluva pedda śarīramu galadi yaguṭacēta kadalaka medalaka okacōṭa paḍi yuṃḍunu, kadalika lēkuṃḍa paḍi yuṃḍuṭa valana adi kaṟṟa anukoni jaṃtuvulu dāni daggaragā rāgā aṭlu vaccina vāṭini bhakṣiṃcuṭa. ī prakāramu unnacōṭu kadalaka aṃdina dānini bhakṣiṃcuṭa - aprayatnamugā prāptiṃcina dānini anubhaviṃcuṭa ajagaranyāyamu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.