← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అజగరవృత్తి ajagaravṛtti

Original — తెలుగు
  1. అజగరము అనగా కొండపాము - కొండచిలువ - దానివలె కదలక మెదలక పడి యుండుట అజగరవృత్తి: అజగరవృత్తి నవలంబించిన ఒకానొక ముని - అజగరముని. ఇతనివ్యాపారము ఈ క్రింది విధముగా నుండెను : - తేనెటీగలు సమకూర్చుకున్న తేనె ఇతరులకు ఎట్లు ప్రాప్తించునో, లోభులు ఖర్చు చేయక, తాము అనుభవించక యుంచిన ధనము ఇతరులకు ప్రాప్తమైనట్లు, శ్రమపడినను ఫలితము దక్కదు అని, కొండచిలువ ఎక్కడికి కదలక తన దగ్గఱకు వచ్చిన దానిని తినుచుండుటను చూచి, ఇది పాఠముగా గ్రహించి తాను కూడ కొండచిలువ వలె కొండొకచోట పడి యుండెను. ఈ విషయము శ్రీమదాంధ్ర మహాభాగవతములో ఈ క్రింద రీతిగా చెప్పబడినది: -

“మ. సరఘల్ గూర్చిన తేనె మానవులకున్ సంప్రాప్తమైనట్లు లో

భరతుల్ గూర్చిన విత్తముల్ పరులకుం బ్రాపించు బ్రాప్తాశి యై

తిరుగంబోని మహోరగంబు బ్రతుకున్ దీర్ఘాంగ మై యుండియున్

జిరకాలంబును వాని వర్తనములం జింతించి యేకాంతి నై.”

క. అజగరమును జుంటీగయు

నిజగురువులుగా దలంచి నిశ్చింతుడ వై

విజనస్థలి గర్మంబుల

గజబిజి లేకున్నవాడ గౌరవవృత్తిన్. (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 7 - 13 - 436, 437)

  1. అజగరముని ఈ అజగర వృత్తిని ఎట్లు నడిపెనో శ్రీ మదాంధ్ర మహాభాగవతములోనే వర్ణింపబడినది :-

“సీ. అజిన వల్కల దుకూలాంబరంబులు గట్టి యైన గట్టక యైన నలరుచుందు

నాందోళికా రధ హయ నాగముల నెక్కి యైన నెక్కక యైన నరుగుచుందు

గర్పూర చందన కస్తూరికా లేప మైన భూరజ మైన నలదికొందు

భర్మ శయ్యల నైన బర్ణ శిలా తృణ భస్మంబులం దైన బడుచునుందు

ఆ. మానయుక్త మైన మానహీనం బైన

దీయ నైన మిగుల దిక్త మైన

గుడుతు సగుణ మైన గుణవర్జితం బైన

నల్ప మైన జాల నధిక మైన

క. లేదని ఎవ్వరి నడుగను

రాదని చింతింప బరులు రప్పించినచో

గాదని యెద్దియు మానను

భేదము మోదమును లేక క్రీడింతు మదిన్

క. నిందింప బరుల నెన్నడు

వందింప ననేక పీడ వచ్చిన మది నా

క్రందింప విభవముల కా

నందింప బ్రకామ వర్తంబున నధిపా !

వ. ఇట్లు కోరికలు లేక యొక్క సమయంబున దిగంబరుడ నై పిశాచంబు చందంబున నుండుచు బెక్కు దినంబులంగోలె బెనుబాము వర్తనంబు గైకొని, నిమీలిత లోచనత్వంబున నేకాంతభావంబు విష్ణునియందు జేర్చి, - - - ”

(శ్రీమదాంధ్ర మహాభాగవతము - 7 - 13 - 438 to 441)

Transliteration
  1. ajagaramu anagā koṃḍapāmu - koṃḍaciluva - dānivale kadalaka medalaka paḍi yuṃḍuṭa ajagaravṛtti: ajagaravṛtti navalaṃbiṃcina okānoka muni - ajagaramuni. itanivyāpāramu ī kriṃdi vidhamugā nuṃḍenu : - tēneṭīgalu samakūrcukunna tēne itarulaku eṭlu prāptiṃcunō, lōbhulu kharcu cēyaka, tāmu anubhaviṃcaka yuṃcina dhanamu itarulaku prāptamainaṭlu, śramapaḍinanu phalitamu dakkadu ani, koṃḍaciluva ekkaḍiki kadalaka tana daggaṟaku vaccina dānini tinucuṃḍuṭanu cūci, idi pāṭhamugā grahiṃci tānu kūḍa koṃḍaciluva vale koṃḍokacōṭa paḍi yuṃḍenu. ī viṣayamu śrīmadāṃdhra mahābhāgavatamulō ī kriṃda rītigā ceppabaḍinadi: -

“ma. saraghal gūrcina tēne mānavulakun saṃprāptamainaṭlu lō

bharatul gūrcina vittamul parulakuṃ brāpiṃcu brāptāśi yai

tirugaṃbōni mahōragaṃbu bratukun dīrghāṃga mai yuṃḍiyun

jirakālaṃbunu vāni vartanamulaṃ jiṃtiṃci yēkāṃti nai.”

ka. ajagaramunu juṃṭīgayu

nijaguruvulugā dalaṃci niściṃtuḍa vai

vijanasthali garmaṃbula

gajabiji lēkunnavāḍa gauravavṛttin. (śrīmadāṃdhra mahābhāgavatamu - 7 - 13 - 436, 437)

  1. ajagaramuni ī ajagara vṛttini eṭlu naḍipenō śrī madāṃdhra mahābhāgavatamulōnē varṇiṃpabaḍinadi :-

“sī. ajina valkala dukūlāṃbaraṃbulu gaṭṭi yaina gaṭṭaka yaina nalarucuṃdu

nāṃdōḷikā radha haya nāgamula nekki yaina nekkaka yaina narugucuṃdu

garpūra caṃdana kastūrikā lēpa maina bhūraja maina naladikoṃdu

bharma śayyala naina barṇa śilā tṛṇa bhasmaṃbulaṃ daina baḍucunuṃdu

ā. mānayukta maina mānahīnaṃ baina

dīya naina migula dikta maina

guḍutu saguṇa maina guṇavarjitaṃ baina

nalpa maina jāla nadhika maina

ka. lēdani evvari naḍuganu

rādani ciṃtiṃpa barulu rappiṃcinacō

gādani yeddiyu mānanu

bhēdamu mōdamunu lēka krīḍiṃtu madin

ka. niṃdiṃpa barula nennaḍu

vaṃdiṃpa nanēka pīḍa vaccina madi nā

kraṃdiṃpa vibhavamula kā

naṃdiṃpa brakāma vartaṃbuna nadhipā !

va. iṭlu kōrikalu lēka yokka samayaṃbuna digaṃbaruḍa nai piśācaṃbu caṃdaṃbuna nuṃḍucu bekku dinaṃbulaṃgōle benubāmu vartanaṃbu gaikoni, nimīlita lōcanatvaṃbuna nēkāṃtabhāvaṃbu viṣṇuniyaṃdu jērci, - - - ”

(śrīmadāṃdhra mahābhāgavatamu - 7 - 13 - 438 to 441)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.