← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అజః ajaḥ

Original — తెలుగు
  1. బ్రహ్మ; విష్ణువు; చతుర్ముఖ బ్రహ్మ.

  2. నజాయతీ ఇత్యజః ; నజాతః ఇత్యజః. (జననము లేనివాడు, పుట్టనివాడు.)

  3. కదాపి న జాయతే ఇత్యజః, అజరామృత శరీరత్వాత్ - “అజరో అమృతో అభయః” ఇతి శ్రుతేః.

(అజరుడు = ముసలితనము లేనివాడు; అమరుడు = మృత్యువు లేనివాడు; అభయం = భయములేనివాడు, అని శ్రుతి చెప్పుచున్నది. అందుచేత చావు, పుట్టుట లేనివాడు. ఎన్నడైనను పుట్టియుండని వాడు. పుట్టిన వానికి చావు తప్పదు. చచ్చినవాడు పుట్టక తప్పదు. అమరుడు అని శ్రుతి చెప్పుట వలన చావు లేని వాడు – చావులేని వాడు పుట్టడు.)

  1. “న జాయతే, మ్రియతేవా విపశ్చిత్” ఇతి శ్రుతేః-(ఆత్మ పుట్టదు, నశింపదు.)

  2. పై విషయము శ్రీమద్భగవద్గీతలో చెప్పబడినది : -

“నజాయతే, మ్రియతే వా కోదా చిన్నాయం భూత్వా భవితావా నభూయః |”

(ఆత్మ పుట్టినది కాదు, చనిపోవునది కాదు; ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండునది కాదు.)

పై శ్లోకమునకు వ్యాఖ్యానము :-

“నజాయతే న ఉత్పద్యతే - జనిలక్షణా వస్తువిక్రియా నవిద్యతే ఇత్యజః - యోహి అభూత్వా భవితా నజాయతే ఇత్యుచ్యతే, నైసమాత్మా అతః న జాయతే; యస్మాత్ యేవం తస్మాత్ అజః”. (శ్రీ శంకరః)

(ఆత్మ పుట్టినది కాదు - అనగా షడ్భావ వికారములలో మొదటిది యగు జన్మ లక్షణము లేనిది. అందుచేత అజుడు. ఎవడు ఇదివఱకు లేకుండి, ఇప్పుడు ఉన్నాడో వాడు పుట్టినవాడు. ఆత్మ అట్టివాడు కాడు. ఇదివఱకు లేకుండి ఇప్పుడు ఉన్నవాడు కాడు. నిత్యుడు, సర్వకాలములందు ఉండువాడు. అందుచేత అజుడు.)

  1. జన్మ రాహిత్యా దజః(జన్మ లేనందు వలన అజుడు.)

  2. జన్మాద్యభావత్ అజః.(జన్మ మొదలగునవి లేనందు వలన అజుడు.)

  3. జన్మ శూన్యః జననాదిదోషరహితః - (జన్మ లేనివాడు; జననము మొదలగు దోషములు లేనివాడు.)

  4. “నజాతో నజ నిష్యతే” ఇతి శ్రుతేః. (పుట్టినవాడు కాడు; ఇకముందు పుట్టువాడు కాడు.)

  5. “నహి జాతో నజాయేయం - - - క్షేత్రజ్ఞః సర్వ భూతానాం, తస్మాత్ అహం అజస్స్మతః” (మహాభారతము - శాంతిపర్వము)

(నేను ఒకరినుండి పుట్టినవాడను కాను, ఇటుపైని పుట్టబోను, నేను సమస్త భూతములకు అంతర్యామిగా క్షేత్రజ్ఞుడుగా ఉన్నాను - అందుచేత ‘అజుడు’ అనిపించుకొనుచున్నాను.)

    1. యో మామ జమనాదించ వేత్తి లోకమహేశ్వరం. (శ్రీమద్భగవద్గీత - 2 - 3)

(శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు తాను జన్మలేని వాడనని చెప్పియున్నాడు- “నేను జన్మ లేనివాడనని, ఆది - కారణము – లేని వాడనని - నేను కార్యవస్తువు కానని - లోకములన్నింటికి ఈశ్వరుడనని ఎవరు తెలియుదురో -” అని చెప్పి యున్నాడు. -.)

  1. “నమే విదుః సుర గణాః ప్రభవం న మహర్షయః |

అహమాదిర్హి దేవానాం మహర్షీణాంచ సర్వశః ||” (శ్రీమద్భగవద్గీత - 10 - 2)

పై శ్లోకమునకు వ్యాఖ్యానము : -

“నానా విభూతి భిర్ది వ్యయా విర్భావం విలక్షణం |

న శక్రాద్యాః సురగణాః నభృగ్వాద్యా మహర్ష యః |

సర్వజ్ఞా అపి మే విష్ణోః ప్రభావం తే విదుః పరం |

యతస్తేషాం హి దేవానాం మహర్షీ నాంచ సర్వ శః |

ఉత్పాదకతయా బుధ్ధి ప్రేరకత్వేన సర్వధా |

అహమాదిర్జగత్కర్తా నా తో జానంతి మత్కలాం ||. (గీతాభావ ప్రకాశము -10 - 8 to 11)

(దేవతలను మహర్షులను నేనే సృష్టించి వారిలో ఆత్మారాముడుగా నుండి వారి బుధ్ధిని ప్రేరేపించువాడను. నేనే ఈ జగత్తునంతటినీ సృష్టించితిని. అందుచేత వాఱందరికంటె నేను ముందువాడను. అందుచేత ఆ దేవతలు మహర్షులు సర్వజ్ఞులు అయినప్పటికీ నా జన్మ వారికి తెలియదు. నేనెట్లు ఉద్భవించితినో ఎవరికీ తెలియదు - వీరికే తెలియనప్పుడు ఎవరికినీ తెలియదన్నమాటే.)

(ఈ జగత్తులోని వస్తువులన్నియు భగవంతునిలో నుండి – ఒకదానిలో నుండి ఒకటిగా పుట్టినవే. కాని భగవంతుడు ఏలాగున పుట్టెనో, ఆవిర్భవించెనో అను విషయము ఎవరికిని తెలియదు. అందుచేత అతనిని అజుడు అని అనాదియని చెప్పుచున్నారు. అనాదిత్వమే - ఆది లేకపోవుటయే - అజత్వము.)

  1. “అజోసి సన్నవ్యయాత్మా భూతానామిశ్వరోపి సన్ |

ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మ మాయ యా ||” (శ్రీమద్భగవద్గీత - 4 - 6)

(“జననమరణములు లేని వాడనైనప్పటికీ, సమస్త భూతములకు ఈశ్వరుడ నైనప్పటికిన్నీ, నా ప్రకృతిని అధిష్ఠించి యుండి, నా మాయ చేత లోకములో పుట్టుచున్నాను.” అని శ్రీకృష్ణభగవానుడు చెప్పెను - సర్వజ్ఞుడు ఈశ్వరుడు అయిన పరబ్రహ్మకు పాప పుణ్యములు లేవు కదా, జన్మ ఎట్లు కలిగినది అని సంశయము కలుగునేమోయని ఈ విధముగా శ్రీకృష్ణుడు చెప్పెను.)

పై శ్లోకమునకు వ్యాఖ్యానము ఈ క్రింది విధముగా నున్నది :-

“పూర్వదేహసంబంధో జన్మ తద్వర్జితో ప్యహం |

పూర్వ దేహస్య విచ్ఛేదో (అ) వ్యయస్తద్రహితో (అ) పిసన్ |

విచిత్రానేక శక్త్యాఢ్యాం మాయాఖ్యాం ప్రకృతింస్వికాం |

స్వోపాధిభూతా మత్యంతా సంభావిత ప్రదర్శినీం |

చిచ్ఛాయాయా వశీకృత్య స్యామహం దేహ వానివ |

అజాతో జాత ఇ వచ స్వేచ్ఛాయా స్వాత్మ మాయయా ||” (గీతాభావప్రకాశము - 4 - 34 - 37)

(జన్మము అనగా ఇదివరలో లేని దేహముతో ఆత్మకు సంబంధము అగుట. అటువంటి జన్మ నాకు లేదు. పూర్వ దేహమును విడిచిపెట్టుట మరణము. ఇట్టి మరణము నాకులేదు. అందుచేత నేను జననమరణములు లేని వాడను. బ్రహ్మ మొదలుగా గల సమస్త భూతములకు నీశ్వరుడను, నియమించు వాడను. నా మాయయే ప్రకృతి, ప్రకృతియే నా మాయ. నేను దానిని అద్ధిష్టించి యుందును. ఈ మాయ నాకు ఉపాది. దానిలోనే నేను ఉందును – అసంభవమైన వాటిని – మానవ దృష్టిలో సంభవించుటకు వీలుకాని వాటిని, మానవ జ్ఞానమునకు మించిన వాటిని – ప్రదర్శించ గల శక్తి – కలుగచేయ గల శక్తి - కలది. అట్టి మాయకు నేను నా చిచ్ఛక్తితో నావశము చేసుకొని యున్నాను - దానిద్వారా నేను దేహ సంబంధమును పొంది దేహిగా - జన్మము కలవాడుగా - నుందును. జన్మలేని వాడనైనను నా ఇష్టానుసారముగా జన్మము నొందిన వాడు వలె నుందును.)

  1. ఈ విషయము మోక్షధర్మములోకూడ చెప్పబడినది.

“మాయాహ్యేషా మయాసృష్టా యన్మాం పశ్యసి నారద |

సర్వభూత గుణైర్యుక్తం న తు మాం ద, షు, మర్హసి ||” (గీతాభావప్రకాశము - 4 - 37)

(నారదా ! ఇప్పుడు నీవు నన్ను చూచుచున్నది నేను సృష్టించిన మాయ. సమస్త భూతగుణములతోను కూడిన నన్ను నీవు చూడలేవు - అనగా, - ఇప్పుడు నీవు చూచుచున్న నా ఆకారము నేను సృష్టించిన మాయయే. స్వస్వరూపములోనున్న నన్ను నీవు చూడలేవు.)

“మోక్ష ధర్మోక్తరీత్యాపి వస్తుతోహం నిరాకృతిః |

యస్యా విద్యాది సంబంధో జన్మ తస్యైవ యుజ్యతే |

నిరవద్యస్య శుద్ధస్య కథా భూతమయం వపుః ||“. (గీతాభావప్రకాశము - 4 - 38, 39)

(మోక్ష ధర్మములో చెప్పిన ప్రకారము - యదార్థముగా నేను ఆకారము లేనివాడను. ఎవనికి అవిద్యతో సంబంధము కలుగునో వానికే జన్మ కలుగును - నిరవద్యుడు, శుద్ధుడు, మాయాతీతుడు అయినవానికి - భగవంతుడనైన నాకు - భూతముల సంఘాతము వలన కలిగిన శరీరమెట్లు కలుగును - మాయ - ప్రకృతి - వలననే శరీరము కలుగును.)

  1. “తధైవోక్తం పురాణేపి బ్రహ్మాండాష్యే మహర్షిణా |

స్త్రీ పుం మలానుషంగా త్మా నాస్య విజాయతే |

కింతు నిర్దోష చైతన్యం సుఖనిత్యాం స్వికాం తనుం |

ప్రకాశయతి నైవేయం జనిర్విష్ణోర్న చాపరా ||” (గీతాభావప్రకాశము - 4 - 40, 41)

(బ్రహ్మాండపురాణములో వ్యాసమహర్షిచే ఈ విషయము ఇట్లు చెప్పబడినది :- (స్త్రీ పురుషుల మలానుసంగముతో కలిగిన దేహము పరమాత్మకు కలుగదు. మాయవలన కలిగిన త్రిగుణముల తాలుకు ఏ విధమైన దోషములు లేని శుధ్ధ చైతన్య ఘనమై, నిత్యానందమయమైన తన తనువును పరమాత్మ - అంతవఱకు ప్రకాశముగా కనబడని దానిని - ప్రకాశింపచేయును. అనగా, - అందఱికి తను ఉన్నట్లుగా గోచరింపచేయును. విష్ణుని జన్మ అనగా ఇదియే - విష్ణువు జన్మించెను అనగా దాని అర్ధమిదియే - ఇంకొక విధముగా అతను జన్మించుట కాదు.)

  1. “నిత్యో యః కారణో పాధిః మాయా భ్యోనైక శక్తి మాన్ |

స ఏవ భగవ ద్ధేహః ఇతి భాష్య కృతాం మతం ||” (గీతాభావ ప్రకాశము - 4 - 42)

(జ్ఞానబలాదులగు షడ్విధశక్తి గలవాడు భగవంతుడు. మాయయే ఉపాధిగా గల సర్వశక్తిమంతుడు. అతనితో కలిసి యుండునది - నిత్యానపాయిని - ఎల్లపుడు విడువకుండ నుండు వైష్ణవమను పేరుగల లక్ష్మీ రూపమైన దానితో కలిసి యుండునదే భగవంతుని దేహము - అని భ్యాష్యకారుల మతము - అభిప్రాయము - అనగా, - మఱి యొక విధమైన దేహము పరమాత్మకు లేదు - పరమాత్మకు దేహమున్నట్లుగా కనుపించుట అతని మాయయే. )

  1. “నవిద్యతే యస్య చ జన్మ కర్మవా” (ఇతని జన్మము కాని కర్మగాని ఎవరికిని తెలియని వాడు.)

  2. “యస్మాత్ అహం ఆదిః దేవానాం మహర్షీణాంచ న మమ అన్యః ఆదిః విద్యతే. అతః అహం అజః, అనాదిశ్చ, అనాదిత్వం అజత్వ హేతుః” (శ్రీ శంకరః)

(దేవతలకు మహర్షులకు కూడ నేనే ‘ఆది’ (మొదలు) అగుటవలనను, నాకు ఇంకొకరు ‘ఆది’ లేకపోవుట వలనను నేనే అజుడను, అనాదియు కూడ. ఆది లేకపోవడమే - అనాదిత్వమే, నాకంటె ఎవరూ ముందు ఉండువారు లేకపోవడమే - పుట్టుట లేకుండుటకు - అజత్వమునకు - కారణము.)

  1. “యోహి అభూత్వా భవతా నజాయతే ఇత్యుచ్యతే. నైవమాత్మా, అతః నజాయతే, యస్మాత్ ఏవం తస్మాత్ ‘అజః’” (శ్రీ శంకరః)

(ఎవడు ఇదివరకు లేకుండా ఇప్పుడు ఉన్నాడో వాడు పుట్టినవాడని చెప్పబడును - ఆత్మ అటువంటిది కాదు, ఇది వఱకు ఉన్నది, ఇప్పుడూ ఉన్నది. అందుచేత ఆత్మ పుట్టినది కాదు - గనుక ‘అజః’.)

    1. కర్మాయుత్త ఉత్పద్యాది రహితః, కర్మాయుత్త జన్మాది శూన్యః.

(కర్మ ఫలముగా గలుగు జన్మ మొదలగునవి లేని వాడు; కర్మ ఫలమనుభవించుటకు స్థూల శరీరము అవసరము. అటువంటి స్థూలశరీరముతో జన్మించని వాడు.)

  1. కర్మకృత జన్మాది రహితః, నిర్వికారత్వముచ్యతే.

(కర్మమూలముగా కలుగు జన్మ మొదలగునవి లేనివాడు. స్వస్వరూపముతో ఎల్లపుడు ఉండువాడు - వికారములు - మార్పులు - లేనివాడు - ఒకప్పుడు పరమాత్మగా ఉండి ఒకప్పుడు శరీరము మొదలగు వాటిగా ఉండని వాడు. మార్పు చెందనివాడు.)

  1. కర్మ నిమిత్త జననాది రహితః, ఇచ్ఛామాత్ర పరికల్పిత శరీరయోగీ.

(కర్మ కారణముగా గల జన్మ లేనివాడు; ఇష్టము వచ్చిన శరీరము కల్పించుకొను యోగి – యోగి వలె ఇష్టము వచ్చిన శరీరము కల్పించు కొనువాడు.)

  1. అయోనిజః – జీవః (పుట్టుటకు సాధారణ స్థానమైన యోనినుండి జన్మించని వాడు.)

  2. “అ పూర్వ దేహ సంబంధో జన్మ, తద్వర్జితో ప్యహం” (గీతాభావప్రకాశము - 4 - 34)

(జన్మ మనగా అపూర్వ దేహసంబంధము - ఇది వఱకు లేని దేహముతో సంబంధము - అట్టి సంబంధము లేనివాడు. అందుచేత ఆత్మ అజుడు.)

  1. “అజో నిత్య శ్శాశ్వతో (అ) యం, పురాణో, నహన్యతే హన్యమానే శరీరే”. (శ్రీమద్భగవద్గీత - 2 - 19)

(ఆత్మ నిత్యుడు, శాశ్వతుడు, మొదటి నుండియు నున్నవాడు. శరీరము నశించగా నశించు వాడు కాడు - అందుచేత అజుడు. ఎల్లకాలము లందు ఉండువాడు - కనుక జన్మ లేనివాడు, మృత్యువు లేనివాడు. కనుక అజుడు.)

  1. “యతో యం సత్య ఏ వాస్తి తతో నో త్పద్యతే హ్యజః |

కాలత్రయేపి సత్య త్వాజ్జ నిర్నైవాస్య విద్యతే ||” (గీతాభావప్రకాశము 2 - 260)

(మూడు కాలములందు ఉండునది కనుక పుట్టుట అనునది లేనివాడు – అందుచేత ‘అజుడు’.)

  1. “అసంభవస్తు సతో (అ) నుప పత్తేః” (బ్రహ్మ సూత్రములు- 2 - 3 - 9)

(ఉత్పత్తి లేనటువంటి సద్రూపునకు జన్మ అసంభవము. సంభవించునది కాదు.)

  1. “నచాస్య కశ్చిజ్జనితా” ఇతి శ్రుతిః.

(మట్టినుండి కుండ పుట్టుచున్నది - కుండకు మట్టివలె పరమాత్మకు పుట్టుకస్థానముకాని, పుట్టించు వస్తువు గాని లేదు.)

  1. “అజః శరీరగ్రహణాత్ సజాతః ఇతి కీర్త్యతే”.

(జన్మ లేని పరమాత్మ ఒక శరీరమును పొందుట చేత పుట్టిన వాడు అని చెప్పబడుచున్నాడు- కాని అట్లు కాదు.) ఎందుచేత ననగా -

  1. “ఏవం జన్మాని కర్మాణి హ్యకర్తు రజనః వర్ణయంతి స్మ కవయో వేద గుహ్యాని”.

(వేదములో రహస్య విషయములుగా చెప్పబడిన భగవంతుని యొక్క జన్మలు, కర్మలు అజుడు - జన్మలేని వాడు - అకర్త - ఏ కర్మలు చేయనివాడు - అగు భగవంతుని గుఱించి కవులు వర్ణించి యున్నారు. మొదటే జన్మ లేనివాడు కనుక తర్వాత (అవతారములలో) ఎప్పుడైనను జన్మ ఉండదు. ఇట్లు అయినపుడు అవతారముల లోని జన్మలు అనునవి అతని లీల. ఇంతే కాక భగవంతుడు అందఱిలోను అంతర్యామి రూపములో నుండి అవసరమైన దేహమందు తన సత్తాస్ఫూర్తిని విజృంభింపచేసి, మానవమాత్రుని వలె ఆ దేహములో నటించిననూ తన పరమాత్మ తత్వముతో మానవాతీత చర్యలు చేయుట చేత అవతరించినట్లు భావింప బడుచున్నాడు - పరమార్ధ దృష్టిలో దేహములన్నియు పరమాత్మవే, అవన్నియు అవతారములే - పరమాత్మ ఆయా దేహములుగా -విభూతులుగా మారుచున్నాడు.) (చూడుము : - ‘అవతారములు’.)

  1. ఈ విషయము శ్రీమదాంధ్ర మహాభాగవతములో ఈ క్రింది విధముగా చెప్పబడినది:-

    1. చ. “జననము లేక కర్మములజాడల బోక సమస్త చిత్త వ

ర్తనుడగు చక్రికిన్ గవు లుదారపదంబుల జన్మకర్మముల్

వినుతులు సేయుచుండుదురు వేదరహస్యములందునెందు జూ

చిన మఱిలేవు జీవునికి జెప్పిన కైవడి జన్మ కర్మముల్.” (శ్రీ మదాంధ్ర మహాభాగవతము - 1 - 3 - 66)

  1. మ. “జననం బందుట లేని యీశ్వరుడు దా జన్మించు టెల్లన్ విరో

ధి నిరాసార్ధము వీతకర్ము డగు న ద్దేవుండు గర్మ ప్రవ

ర్తను డౌ టెల్ల జరాచర ప్రకట భూత శ్రేణులన్ గర్మ వ

ర్తనులం జేయ దలంచి కాక కలవే దైత్యా రికిం గర్మముల్.” (శ్రీ మదాంధ్ర మహాభాగవతము - 3 - 1 - 72)

  1. “ఉ. పుట్టువులేని నీ కభవ !పుట్టుట క్రీడయె కాక పుట్టుటే

యె ట్టనుడున్ భవాది దశ లెల్లను జీవులయం దవిద్య తా

జుట్టుచు నుండు గాని నిను జుట్టినదిం బలె బొంత నుండియుం

జుట్టగలేమి దత్క్రియల జొక్కని యొక్కటి వౌదు వీశ్వరా“.

(శ్రీమదాంధ్ర మహాభాగవతము - 10 - పూర్వ భాగము - 99)

(జన్మము లేనట్టి నీవు అవతారములలో నీవు జన్మించితివి అనుట నీకు క్రీడ - ఆట. అంతేగాని అది నీకు నిజముగా జన్మము నొందుట కాదు. ఎందుచేతననగా - జన్మము మొదలగు దశలు షడ్భావ వికారములు. జీవునికి అవిద్య - నీమాయ - వలన కలుగుచుండును. నిన్ను ఆశ్రయించు కొనియుండి నిన్ను కూడా ఆప్రకారమే ఆవరించి యుండి మాయ నిన్ను తన వశములో నుంచుకొనినట్లు అగపడినను నిన్నేమీ చేయలేదు - నీవు నీమాయను నీ వశములో నుంచుకొని యున్నావు. అందుచేత మాయవలన కలుగు జన్మము మొదలగు వికారములు నీకు లేవు. అందుచేత నీకు ఎప్పుడూ జన్మ లేదు. అందుచేత నీవు అజుడవు.)

  1. “స్వతస్వచ్ఛే బోధే విగలిత మహా మోహ తిమిరే |

మయీశే ర్జన్మాదే ర్న భవతి కదా కాపి కలనా |

స్వభక్తోధ్ధారార్ధం స్వయమహమజోప్యాత్మ కలయా |

చిదానందాకారం పునరివ సృజా మీడ్య మమలం ||“. (గీతాభావప్రకాశము - 4 - 48, 49)

(మహా మోహమనెడి అంధకారమును పోగొట్టునట్టి స్వచ్ఛమైన జ్ఞానము గల నాయందు జన్మ మొదలగునవి ఎప్పుడును కలుగవు. జన్మ లేనప్పటికీ నా భక్తుల నుధ్ధరించుటకు నా కళా విశేషమున నా చిదానందాకారమును సృజించు చుందును.)

(పై శ్లోకమువలన తెలిసిన సారాంశమేమనగా భగవంతుడు యధార్ధముగా జన్మ లేనివాడు. అవతారములలో జన్మించినట్లు చెప్పబడిన సందర్భములలో కూడ ప్రకృతితో సంబంధించిన జన్మ అతనికి లేదు. జన్మించినట్లు - అవతరించినట్లు - కనబడుట అతని మాయయే.)

  1. భగవంతుని యవతారములలో పది ముఖ్యమైనవిగా చెప్పబడుచున్నవి. వాటిలో మత్స్య, కూర్మ, వరాహ, నారసింహావతారములు వాటంతట అవి కలిగినట్లే చెప్పబడినవి. ఆ అవతారమూర్తులకు కారణము - తలిదండ్రులు చెప్పబడి యుండలేదు -

“మ. హరి సర్వాకృతులం గలం డనుచు బ్రహ్లాదుండు భాషింప స

త్వరు డై యెందును లేడు లే డని సుతున్ దైత్యుండు తర్జింప శ్రీ

నరసింహాకృతి నుండె నచ్యుతుడు నానా జంగమ స్థావరో

త్కర గర్భంబుల నన్ని దేశముల నుద్దండ ప్రభావంబునన్” (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 7 - 8 - 277)

భగవంతుడు ఎక్కడ పడితే అక్కడ - అన్ని దేశములందు – చరాచర భూతము లందు సూక్ష్మనరసింహ రూపముతో నుండి హిరణ్యకశిపుడు స్తంభమును కొట్టగా దానిలోనుండి స్థూల నరసింహ రూపముతో ఆవిర్భవించెను. ఇట్లావిర్భించుట జన్మించుట కాదు. వామనావతారము నుండి తలిదండ్రులు కలిగియున్నట్లు చెప్పబడియున్నది. అట్లు చెప్పుటకు అతని మాయయే కారణము. ఈ పది యవతారములు గాక మహానుభావులైన వారు కొందఱు - వ్యాసమహర్షి మొదలగువారు కొందఱు - భగవంతుని అవతారములని చెప్పబడిరి. (చూడుము :- శ్రీమదాంధ్ర మహాభాగవతము - 1 - 3 - 26)

భగవంతునిలోనుండి పుట్టినవారందఱు, వారందఱిలోను భగవంతుని అంశ - చిచ్ఛక్తి - యున్నది. కనుక - భగవంతుని అవతారములు. (“సహర్ష శీర్షం దేవం” ; “సహస్ర శీర్షా పురుషః సహస్రాక్షః సహస్ర పాద్”) ఒకరికి ఇంకొకరికి తేడా ఉండుటకు కారణము వారిలో ఉన్న చిచ్ఛక్తిని ఆవరించియుండు మలిన ప్రకృతి వికారములే కావచ్చు.) (చూడుము :- ‘అవతారములు’)

  1. “పురుషం శాశ్వతం దివ్యమాది దేవమజం విభుం |

ఆహుస్త్వాం ఋష య స్సర్వే దేవర్షిర్నా రద సధా |

అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషిమే ||” (శ్రీ మద్భగవద్గీత - 10 - 12, 13)

(ఋషులందరూ, నారదుడు, వ్యాసుడు మొదలగు వారును, నువ్వు శాశ్వతుడవని - నిత్యుడవని - ఆది దేవుడవని, అన్నింటికి ప్రభువు అని, జన్మ లేనివాడవని చెప్పిరి. నీవు కూడ స్వయముగా నిట్లు చెప్పి యుంటివి.)

  1. భగవంతుడు జన్మ లేనివాడు, మరణము లేని వాడు. మనము దేనిని భగవంతుడు - పరమాత్మ, పరబ్రహ్మ, పరతత్వము - అనుచున్నామో, దానినే ఆధునిక శాస్త్రజ్ఞులు - (Present day scientists) - “ENERGY” అనుచున్నారు, దానికి కూడ జనన మరణములు లేవనుచున్నారు - - “Energy is neither created nor destroyed” - ఈ విషయము శ్రీ త్యాగరాజస్వామి వారు - “ఆది అంతమేమి లేని అఖిల రూపుడైన వాని” అని శ్రీరాముని కీర్తించి యున్నారు.)
Transliteration
  1. brahma; viṣṇuvu; caturmukha brahma.

  2. najāyatī ityajaḥ ; najātaḥ ityajaḥ. (jananamu lēnivāḍu, puṭṭanivāḍu.)

  3. kadāpi na jāyatē ityajaḥ, ajarāmṛta śarīratvāt - “ajarō amṛtō abhayaḥ” iti śrutēḥ.

(ajaruḍu = musalitanamu lēnivāḍu; amaruḍu = mṛtyuvu lēnivāḍu; abhayaṃ = bhayamulēnivāḍu, ani śruti ceppucunnadi. aṃducēta cāvu, puṭṭuṭa lēnivāḍu. ennaḍainanu puṭṭiyuṃḍani vāḍu. puṭṭina vāniki cāvu tappadu. caccinavāḍu puṭṭaka tappadu. amaruḍu ani śruti ceppuṭa valana cāvu lēni vāḍu – cāvulēni vāḍu puṭṭaḍu.)

  1. “na jāyatē, mriyatēvā vipaścit” iti śrutēḥ-(ātma puṭṭadu, naśiṃpadu.)

  2. pai viṣayamu śrīmadbhagavadgītalō ceppabaḍinadi : -

“najāyatē, mriyatē vā kōdā cinnāyaṃ bhūtvā bhavitāvā nabhūyaḥ |”

(ātma puṭṭinadi kādu, canipōvunadi kādu; okappuḍu uṃḍi okappuḍu lēkuṃḍunadi kādu.)

pai ślōkamunaku vyākhyānamu :-

“najāyatē na utpadyatē - janilakṣaṇā vastuvikriyā navidyatē ityajaḥ - yōhi abhūtvā bhavitā najāyatē ityucyatē, naisamātmā ataḥ na jāyatē; yasmāt yēvaṃ tasmāt ajaḥ”. (śrī śaṃkaraḥ)

(ātma puṭṭinadi kādu - anagā ṣaḍbhāva vikāramulalō modaṭidi yagu janma lakṣaṇamu lēnidi. aṃducēta ajuḍu. evaḍu idivaṟaku lēkuṃḍi, ippuḍu unnāḍō vāḍu puṭṭinavāḍu. ātma aṭṭivāḍu kāḍu. idivaṟaku lēkuṃḍi ippuḍu unnavāḍu kāḍu. nityuḍu, sarvakālamulaṃdu uṃḍuvāḍu. aṃducēta ajuḍu.)

  1. janma rāhityā dajaḥ(janma lēnaṃdu valana ajuḍu.)

  2. janmādyabhāvat ajaḥ.(janma modalagunavi lēnaṃdu valana ajuḍu.)

  3. janma śūnyaḥ jananādidōṣarahitaḥ - (janma lēnivāḍu; jananamu modalagu dōṣamulu lēnivāḍu.)

  4. “najātō naja niṣyatē” iti śrutēḥ. (puṭṭinavāḍu kāḍu; ikamuṃdu puṭṭuvāḍu kāḍu.)

  5. “nahi jātō najāyēyaṃ - - - kṣētrajñaḥ sarva bhūtānāṃ, tasmāt ahaṃ ajassmataḥ” (mahābhāratamu - śāṃtiparvamu)

(nēnu okarinuṃḍi puṭṭinavāḍanu kānu, iṭupaini puṭṭabōnu, nēnu samasta bhūtamulaku aṃtaryāmigā kṣētrajñuḍugā unnānu - aṃducēta ‘ajuḍu’ anipiṃcukonucunnānu.)

    1. yō māma jamanādiṃca vētti lōkamahēśvaraṃ. (śrīmadbhagavadgīta - 2 - 3)

(śrīmadbhagavadgītalō śrīkṛṣṇa bhagavānuḍu tānu janmalēni vāḍanani ceppiyunnāḍu- “nēnu janma lēnivāḍanani, ādi - kāraṇamu – lēni vāḍanani - nēnu kāryavastuvu kānani - lōkamulanniṃṭiki īśvaruḍanani evaru teliyudurō -” ani ceppi yunnāḍu. -.)

  1. “namē viduḥ sura gaṇāḥ prabhavaṃ na maharṣayaḥ |

ahamādirhi dēvānāṃ maharṣīṇāṃca sarvaśaḥ ||” (śrīmadbhagavadgīta - 10 - 2)

pai ślōkamunaku vyākhyānamu : -

“nānā vibhūti bhirdi vyayā virbhāvaṃ vilakṣaṇaṃ |

na śakrādyāḥ suragaṇāḥ nabhṛgvādyā maharṣa yaḥ |

sarvajñā api mē viṣṇōḥ prabhāvaṃ tē viduḥ paraṃ |

yatastēṣāṃ hi dēvānāṃ maharṣī nāṃca sarva śaḥ |

utpādakatayā budhdhi prērakatvēna sarvadhā |

ahamādirjagatkartā nā tō jānaṃti matkalāṃ ||. (gītābhāva prakāśamu -10 - 8 to 11)

(dēvatalanu maharṣulanu nēnē sṛṣṭiṃci vārilō ātmārāmuḍugā nuṃḍi vāri budhdhini prērēpiṃcuvāḍanu. nēnē ī jagattunaṃtaṭinī sṛṣṭiṃcitini. aṃducēta vāṟaṃdarikaṃṭe nēnu muṃduvāḍanu. aṃducēta ā dēvatalu maharṣulu sarvajñulu ayinappaṭikī nā janma vāriki teliyadu. nēneṭlu udbhaviṃcitinō evarikī teliyadu - vīrikē teliyanappuḍu evarikinī teliyadannamāṭē.)

(ī jagattulōni vastuvulanniyu bhagavaṃtunilō nuṃḍi – okadānilō nuṃḍi okaṭigā puṭṭinavē. kāni bhagavaṃtuḍu ēlāguna puṭṭenō, āvirbhaviṃcenō anu viṣayamu evarikini teliyadu. aṃducēta atanini ajuḍu ani anādiyani ceppucunnāru. anāditvamē - ādi lēkapōvuṭayē - ajatvamu.)

  1. “ajōsi sannavyayātmā bhūtānāmiśvarōpi san |

prakṛtiṃ svāmadhiṣṭhāya saṃbhavāmyātma māya yā ||” (śrīmadbhagavadgīta - 4 - 6)

(“jananamaraṇamulu lēni vāḍanainappaṭikī, samasta bhūtamulaku īśvaruḍa nainappaṭikinnī, nā prakṛtini adhiṣṭhiṃci yuṃḍi, nā māya cēta lōkamulō puṭṭucunnānu.” ani śrīkṛṣṇabhagavānuḍu ceppenu - sarvajñuḍu īśvaruḍu ayina parabrahmaku pāpa puṇyamulu lēvu kadā, janma eṭlu kaliginadi ani saṃśayamu kalugunēmōyani ī vidhamugā śrīkṛṣṇuḍu ceppenu.)

pai ślōkamunaku vyākhyānamu ī kriṃdi vidhamugā nunnadi :-

“pūrvadēhasaṃbaṃdhō janma tadvarjitō pyahaṃ |

pūrva dēhasya vicchēdō (a) vyayastadrahitō (a) pisan |

vicitrānēka śaktyāḍhyāṃ māyākhyāṃ prakṛtiṃsvikāṃ |

svōpādhibhūtā matyaṃtā saṃbhāvita pradarśinīṃ |

cicchāyāyā vaśīkṛtya syāmahaṃ dēha vāniva |

ajātō jāta i vaca svēcchāyā svātma māyayā ||” (gītābhāvaprakāśamu - 4 - 34 - 37)

(janmamu anagā idivaralō lēni dēhamutō ātmaku saṃbaṃdhamu aguṭa. aṭuvaṃṭi janma nāku lēdu. pūrva dēhamunu viḍicipeṭṭuṭa maraṇamu. iṭṭi maraṇamu nākulēdu. aṃducēta nēnu jananamaraṇamulu lēni vāḍanu. brahma modalugā gala samasta bhūtamulaku nīśvaruḍanu, niyamiṃcu vāḍanu. nā māyayē prakṛti, prakṛtiyē nā māya. nēnu dānini addhiṣṭiṃci yuṃdunu. ī māya nāku upādi. dānilōnē nēnu uṃdunu – asaṃbhavamaina vāṭini – mānava dṛṣṭilō saṃbhaviṃcuṭaku vīlukāni vāṭini, mānava jñānamunaku miṃcina vāṭini – pradarśiṃca gala śakti – kalugacēya gala śakti - kaladi. aṭṭi māyaku nēnu nā cicchaktitō nāvaśamu cēsukoni yunnānu - dānidvārā nēnu dēha saṃbaṃdhamunu poṃdi dēhigā - janmamu kalavāḍugā - nuṃdunu. janmalēni vāḍanainanu nā iṣṭānusāramugā janmamu noṃdina vāḍu vale nuṃdunu.)

  1. ī viṣayamu mōkṣadharmamulōkūḍa ceppabaḍinadi.

“māyāhyēṣā mayāsṛṣṭā yanmāṃ paśyasi nārada |

sarvabhūta guṇairyuktaṃ na tu māṃ da, ṣu, marhasi ||” (gītābhāvaprakāśamu - 4 - 37)

(nāradā ! ippuḍu nīvu nannu cūcucunnadi nēnu sṛṣṭiṃcina māya. samasta bhūtaguṇamulatōnu kūḍina nannu nīvu cūḍalēvu - anagā, - ippuḍu nīvu cūcucunna nā ākāramu nēnu sṛṣṭiṃcina māyayē. svasvarūpamulōnunna nannu nīvu cūḍalēvu.)

“mōkṣa dharmōktarītyāpi vastutōhaṃ nirākṛtiḥ |

yasyā vidyādi saṃbaṃdhō janma tasyaiva yujyatē |

niravadyasya śuddhasya kathā bhūtamayaṃ vapuḥ ||“. (gītābhāvaprakāśamu - 4 - 38, 39)

(mōkṣa dharmamulō ceppina prakāramu - yadārthamugā nēnu ākāramu lēnivāḍanu. evaniki avidyatō saṃbaṃdhamu kalugunō vānikē janma kalugunu - niravadyuḍu, śuddhuḍu, māyātītuḍu ayinavāniki - bhagavaṃtuḍanaina nāku - bhūtamula saṃghātamu valana kaligina śarīrameṭlu kalugunu - māya - prakṛti - valananē śarīramu kalugunu.)

  1. “tadhaivōktaṃ purāṇēpi brahmāṃḍāṣyē maharṣiṇā |

strī puṃ malānuṣaṃgā tmā nāsya vijāyatē |

kiṃtu nirdōṣa caitanyaṃ sukhanityāṃ svikāṃ tanuṃ |

prakāśayati naivēyaṃ janirviṣṇōrna cāparā ||” (gītābhāvaprakāśamu - 4 - 40, 41)

(brahmāṃḍapurāṇamulō vyāsamaharṣicē ī viṣayamu iṭlu ceppabaḍinadi :- (strī puruṣula malānusaṃgamutō kaligina dēhamu paramātmaku kalugadu. māyavalana kaligina triguṇamula tāluku ē vidhamaina dōṣamulu lēni śudhdha caitanya ghanamai, nityānaṃdamayamaina tana tanuvunu paramātma - aṃtavaṟaku prakāśamugā kanabaḍani dānini - prakāśiṃpacēyunu. anagā, - aṃdaṟiki tanu unnaṭlugā gōcariṃpacēyunu. viṣṇuni janma anagā idiyē - viṣṇuvu janmiṃcenu anagā dāni ardhamidiyē - iṃkoka vidhamugā atanu janmiṃcuṭa kādu.)

  1. “nityō yaḥ kāraṇō pādhiḥ māyā bhyōnaika śakti mān |

sa ēva bhagava ddhēhaḥ iti bhāṣya kṛtāṃ mataṃ ||” (gītābhāva prakāśamu - 4 - 42)

(jñānabalādulagu ṣaḍvidhaśakti galavāḍu bhagavaṃtuḍu. māyayē upādhigā gala sarvaśaktimaṃtuḍu. atanitō kalisi yuṃḍunadi - nityānapāyini - ellapuḍu viḍuvakuṃḍa nuṃḍu vaiṣṇavamanu pērugala lakṣmī rūpamaina dānitō kalisi yuṃḍunadē bhagavaṃtuni dēhamu - ani bhyāṣyakārula matamu - abhiprāyamu - anagā, - maṟi yoka vidhamaina dēhamu paramātmaku lēdu - paramātmaku dēhamunnaṭlugā kanupiṃcuṭa atani māyayē. )

  1. “navidyatē yasya ca janma karmavā” (itani janmamu kāni karmagāni evarikini teliyani vāḍu.)

  2. “yasmāt ahaṃ ādiḥ dēvānāṃ maharṣīṇāṃca na mama anyaḥ ādiḥ vidyatē. ataḥ ahaṃ ajaḥ, anādiśca, anāditvaṃ ajatva hētuḥ” (śrī śaṃkaraḥ)

(dēvatalaku maharṣulaku kūḍa nēnē ‘ādi’ (modalu) aguṭavalananu, nāku iṃkokaru ‘ādi’ lēkapōvuṭa valananu nēnē ajuḍanu, anādiyu kūḍa. ādi lēkapōvaḍamē - anāditvamē, nākaṃṭe evarū muṃdu uṃḍuvāru lēkapōvaḍamē - puṭṭuṭa lēkuṃḍuṭaku - ajatvamunaku - kāraṇamu.)

  1. “yōhi abhūtvā bhavatā najāyatē ityucyatē. naivamātmā, ataḥ najāyatē, yasmāt ēvaṃ tasmāt ‘ajaḥ’” (śrī śaṃkaraḥ)

(evaḍu idivaraku lēkuṃḍā ippuḍu unnāḍō vāḍu puṭṭinavāḍani ceppabaḍunu - ātma aṭuvaṃṭidi kādu, idi vaṟaku unnadi, ippuḍū unnadi. aṃducēta ātma puṭṭinadi kādu - ganuka ‘ajaḥ’.)

    1. karmāyutta utpadyādi rahitaḥ, karmāyutta janmādi śūnyaḥ.

(karma phalamugā galugu janma modalagunavi lēni vāḍu; karma phalamanubhaviṃcuṭaku sthūla śarīramu avasaramu. aṭuvaṃṭi sthūlaśarīramutō janmiṃcani vāḍu.)

  1. karmakṛta janmādi rahitaḥ, nirvikāratvamucyatē.

(karmamūlamugā kalugu janma modalagunavi lēnivāḍu. svasvarūpamutō ellapuḍu uṃḍuvāḍu - vikāramulu - mārpulu - lēnivāḍu - okappuḍu paramātmagā uṃḍi okappuḍu śarīramu modalagu vāṭigā uṃḍani vāḍu. mārpu ceṃdanivāḍu.)

  1. karma nimitta jananādi rahitaḥ, icchāmātra parikalpita śarīrayōgī.

(karma kāraṇamugā gala janma lēnivāḍu; iṣṭamu vaccina śarīramu kalpiṃcukonu yōgi – yōgi vale iṣṭamu vaccina śarīramu kalpiṃcu konuvāḍu.)

  1. ayōnijaḥ – jīvaḥ (puṭṭuṭaku sādhāraṇa sthānamaina yōninuṃḍi janmiṃcani vāḍu.)

  2. “a pūrva dēha saṃbaṃdhō janma, tadvarjitō pyahaṃ” (gītābhāvaprakāśamu - 4 - 34)

(janma managā apūrva dēhasaṃbaṃdhamu - idi vaṟaku lēni dēhamutō saṃbaṃdhamu - aṭṭi saṃbaṃdhamu lēnivāḍu. aṃducēta ātma ajuḍu.)

  1. “ajō nitya śśāśvatō (a) yaṃ, purāṇō, nahanyatē hanyamānē śarīrē”. (śrīmadbhagavadgīta - 2 - 19)

(ātma nityuḍu, śāśvatuḍu, modaṭi nuṃḍiyu nunnavāḍu. śarīramu naśiṃcagā naśiṃcu vāḍu kāḍu - aṃducēta ajuḍu. ellakālamu laṃdu uṃḍuvāḍu - kanuka janma lēnivāḍu, mṛtyuvu lēnivāḍu. kanuka ajuḍu.)

  1. “yatō yaṃ satya ē vāsti tatō nō tpadyatē hyajaḥ |

kālatrayēpi satya tvājja nirnaivāsya vidyatē ||” (gītābhāvaprakāśamu 2 - 260)

(mūḍu kālamulaṃdu uṃḍunadi kanuka puṭṭuṭa anunadi lēnivāḍu – aṃducēta ‘ajuḍu’.)

  1. “asaṃbhavastu satō (a) nupa pattēḥ” (brahma sūtramulu- 2 - 3 - 9)

(utpatti lēnaṭuvaṃṭi sadrūpunaku janma asaṃbhavamu. saṃbhaviṃcunadi kādu.)

  1. “nacāsya kaścijjanitā” iti śrutiḥ.

(maṭṭinuṃḍi kuṃḍa puṭṭucunnadi - kuṃḍaku maṭṭivale paramātmaku puṭṭukasthānamukāni, puṭṭiṃcu vastuvu gāni lēdu.)

  1. “ajaḥ śarīragrahaṇāt sajātaḥ iti kīrtyatē”.

(janma lēni paramātma oka śarīramunu poṃduṭa cēta puṭṭina vāḍu ani ceppabaḍucunnāḍu- kāni aṭlu kādu.) eṃducēta nanagā -

  1. “ēvaṃ janmāni karmāṇi hyakartu rajanaḥ varṇayaṃti sma kavayō vēda guhyāni”.

(vēdamulō rahasya viṣayamulugā ceppabaḍina bhagavaṃtuni yokka janmalu, karmalu ajuḍu - janmalēni vāḍu - akarta - ē karmalu cēyanivāḍu - agu bhagavaṃtuni guṟiṃci kavulu varṇiṃci yunnāru. modaṭē janma lēnivāḍu kanuka tarvāta (avatāramulalō) eppuḍainanu janma uṃḍadu. iṭlu ayinapuḍu avatāramula lōni janmalu anunavi atani līla. iṃtē kāka bhagavaṃtuḍu aṃdaṟilōnu aṃtaryāmi rūpamulō nuṃḍi avasaramaina dēhamaṃdu tana sattāsphūrtini vijṛṃbhiṃpacēsi, mānavamātruni vale ā dēhamulō naṭiṃcinanū tana paramātma tatvamutō mānavātīta caryalu cēyuṭa cēta avatariṃcinaṭlu bhāviṃpa baḍucunnāḍu - paramārdha dṛṣṭilō dēhamulanniyu paramātmavē, avanniyu avatāramulē - paramātma āyā dēhamulugā -vibhūtulugā mārucunnāḍu.) (cūḍumu : - ‘avatāramulu’.)

  1. ī viṣayamu śrīmadāṃdhra mahābhāgavatamulō ī kriṃdi vidhamugā ceppabaḍinadi:-

    1. ca. “jananamu lēka karmamulajāḍala bōka samasta citta va

rtanuḍagu cakrikin gavu ludārapadaṃbula janmakarmamul

vinutulu sēyucuṃḍuduru vēdarahasyamulaṃduneṃdu jū

cina maṟilēvu jīvuniki jeppina kaivaḍi janma karmamul.” (śrī madāṃdhra mahābhāgavatamu - 1 - 3 - 66)

  1. ma. “jananaṃ baṃduṭa lēni yīśvaruḍu dā janmiṃcu ṭellan virō

dhi nirāsārdhamu vītakarmu ḍagu na ddēvuṃḍu garma prava

rtanu ḍau ṭella jarācara prakaṭa bhūta śrēṇulan garma va

rtanulaṃ jēya dalaṃci kāka kalavē daityā rikiṃ garmamul.” (śrī madāṃdhra mahābhāgavatamu - 3 - 1 - 72)

  1. “u. puṭṭuvulēni nī kabhava !puṭṭuṭa krīḍaye kāka puṭṭuṭē

ye ṭṭanuḍun bhavādi daśa lellanu jīvulayaṃ davidya tā

juṭṭucu nuṃḍu gāni ninu juṭṭinadiṃ bale boṃta nuṃḍiyuṃ

juṭṭagalēmi datkriyala jokkani yokkaṭi vaudu vīśvarā”.

(śrīmadāṃdhra mahābhāgavatamu - 10 - pūrva bhāgamu - 99)

(janmamu lēnaṭṭi nīvu avatāramulalō nīvu janmiṃcitivi anuṭa nīku krīḍa - āṭa. aṃtēgāni adi nīku nijamugā janmamu noṃduṭa kādu. eṃducētananagā - janmamu modalagu daśalu ṣaḍbhāva vikāramulu. jīvuniki avidya - nīmāya - valana kalugucuṃḍunu. ninnu āśrayiṃcu koniyuṃḍi ninnu kūḍā āprakāramē āvariṃci yuṃḍi māya ninnu tana vaśamulō nuṃcukoninaṭlu agapaḍinanu ninnēmī cēyalēdu - nīvu nīmāyanu nī vaśamulō nuṃcukoni yunnāvu. aṃducēta māyavalana kalugu janmamu modalagu vikāramulu nīku lēvu. aṃducēta nīku eppuḍū janma lēdu. aṃducēta nīvu ajuḍavu.)

  1. “svatasvacchē bōdhē vigalita mahā mōha timirē |

mayīśē rjanmādē rna bhavati kadā kāpi kalanā |

svabhaktōdhdhārārdhaṃ svayamahamajōpyātma kalayā |

cidānaṃdākāraṃ punariva sṛjā mīḍya mamalaṃ ||“. (gītābhāvaprakāśamu - 4 - 48, 49)

(mahā mōhamaneḍi aṃdhakāramunu pōgoṭṭunaṭṭi svacchamaina jñānamu gala nāyaṃdu janma modalagunavi eppuḍunu kalugavu. janma lēnappaṭikī nā bhaktula nudhdhariṃcuṭaku nā kaḷā viśēṣamuna nā cidānaṃdākāramunu sṛjiṃcu cuṃdunu.)

(pai ślōkamuvalana telisina sārāṃśamēmanagā bhagavaṃtuḍu yadhārdhamugā janma lēnivāḍu. avatāramulalō janmiṃcinaṭlu ceppabaḍina saṃdarbhamulalō kūḍa prakṛtitō saṃbaṃdhiṃcina janma ataniki lēdu. janmiṃcinaṭlu - avatariṃcinaṭlu - kanabaḍuṭa atani māyayē.)

  1. bhagavaṃtuni yavatāramulalō padi mukhyamainavigā ceppabaḍucunnavi. vāṭilō matsya, kūrma, varāha, nārasiṃhāvatāramulu vāṭaṃtaṭa avi kaliginaṭlē ceppabaḍinavi. ā avatāramūrtulaku kāraṇamu - talidaṃḍrulu ceppabaḍi yuṃḍalēdu -

“ma. hari sarvākṛtulaṃ galaṃ ḍanucu brahlāduṃḍu bhāṣiṃpa sa

tvaru ḍai yeṃdunu lēḍu lē ḍani sutun daityuṃḍu tarjiṃpa śrī

narasiṃhākṛti nuṃḍe nacyutuḍu nānā jaṃgama sthāvarō

tkara garbhaṃbula nanni dēśamula nuddaṃḍa prabhāvaṃbunan” (śrīmadāṃdhra mahābhāgavatamu - 7 - 8 - 277)

bhagavaṃtuḍu ekkaḍa paḍitē akkaḍa - anni dēśamulaṃdu – carācara bhūtamu laṃdu sūkṣmanarasiṃha rūpamutō nuṃḍi hiraṇyakaśipuḍu staṃbhamunu koṭṭagā dānilōnuṃḍi sthūla narasiṃha rūpamutō āvirbhaviṃcenu. iṭlāvirbhiṃcuṭa janmiṃcuṭa kādu. vāmanāvatāramu nuṃḍi talidaṃḍrulu kaligiyunnaṭlu ceppabaḍiyunnadi. aṭlu ceppuṭaku atani māyayē kāraṇamu. ī padi yavatāramulu gāka mahānubhāvulaina vāru koṃdaṟu - vyāsamaharṣi modalaguvāru koṃdaṟu - bhagavaṃtuni avatāramulani ceppabaḍiri. (cūḍumu :- śrīmadāṃdhra mahābhāgavatamu - 1 - 3 - 26)

bhagavaṃtunilōnuṃḍi puṭṭinavāraṃdaṟu, vāraṃdaṟilōnu bhagavaṃtuni aṃśa - cicchakti - yunnadi. kanuka - bhagavaṃtuni avatāramulu. (“saharṣa śīrṣaṃ dēvaṃ” ; “sahasra śīrṣā puruṣaḥ sahasrākṣaḥ sahasra pād”) okariki iṃkokariki tēḍā uṃḍuṭaku kāraṇamu vārilō unna cicchaktini āvariṃciyuṃḍu malina prakṛti vikāramulē kāvaccu.) (cūḍumu :- ‘avatāramulu’)

  1. “puruṣaṃ śāśvataṃ divyamādi dēvamajaṃ vibhuṃ |

āhustvāṃ ṛṣa ya ssarvē dēvarṣirnā rada sadhā |

asitō dēvalō vyāsaḥ svayaṃ caiva bravīṣimē ||” (śrī madbhagavadgīta - 10 - 12, 13)

(ṛṣulaṃdarū, nāraduḍu, vyāsuḍu modalagu vārunu, nuvvu śāśvatuḍavani - nityuḍavani - ādi dēvuḍavani, anniṃṭiki prabhuvu ani, janma lēnivāḍavani ceppiri. nīvu kūḍa svayamugā niṭlu ceppi yuṃṭivi.)

  1. bhagavaṃtuḍu janma lēnivāḍu, maraṇamu lēni vāḍu. manamu dēnini bhagavaṃtuḍu - paramātma, parabrahma, paratatvamu - anucunnāmō, dāninē ādhunika śāstrajñulu - (Present day scientists) - “ENERGY” anucunnāru, dāniki kūḍa janana maraṇamulu lēvanucunnāru - - “Energy is neither created nor destroyed” - ī viṣayamu śrī tyāgarājasvāmi vāru - “ādi aṃtamēmi lēni akhila rūpuḍaina vāni” ani śrīrāmuni kīrtiṃci yunnāru.)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.