జపామంత్ర రూపా. (మంత్రరూపము లేని జపము, మంత్రము లేనటువంటి జపము.)
న + జప = అజప - జపము చేయకుండగనే జపరూపము నొందిన మంత్రము.
(తనంతట తానే కలిగినది; జపము రీతిగా జరుగునది; ప్రయత్నము చేయకుండగనే జపము వలె రూపొందునది; అందుచేత అజపా.)
(ప్రయత్నము చేసి జపించునది కాదు; ప్రయత్నము చేయకనే జపము వలె ఉచ్చరించ బడుచున్నందున అజపా)
(జపించుట లేకపోయినను జపభావమును పొందును కనుక అజపా, అజపాయే అజసా గాయత్రి.)
అజపా గాయత్రీ-
దినే దినే షట్ శతాధికైక వింశతి సహస్ర సంఖ్య నిశ్వా సోచ్ఛ్వా సాః ‘సోహం’ ‘సోహం’ ఇతి జపంతి. స్వయం అ జపన్ తూష్ణీ తిష్టన్నపి ఏతదా ఖ్యాన్వితం మంత్రం జీవో జపతి సర్వదా.
(ఊపిరి లోపలికి పీల్చి పైకి వదలుట రోజుకు 6,21,000 పర్యాయములు జరుగును. గాలి లోపలికి పీల్చునపుడు ‘సో’ అనిన్నీ, పైకి వదలునపుడు ‘హం’ అనిన్నీ శబ్దము అగును. ఈ రెండు అక్షరములు – ఉచ్ఛ్వాస నిశ్వాసముల వలన కలిగినవి - కలిసి ‘హంస’ అను మంత్రముగా, తనంతట అదే అప్రయత్నముగా ఉచ్చరించ బడినట్లగును. “సోహం” లోని అక్షరములు ఊపిరి తీయు క్రమములో “సః హం” లేక “సో (అ) హం”అగును - అనగా, సః = అతను, ఆ భగవంతుడు, ‘తత్’ పదార్ధము అయిన పరబ్రహ్మ, అహం = నేను - ఆ పరబ్రహ్మ ‘నేను’ అని అర్ధమగును. ఇదియే ‘అహం బ్రహ్మాస్మి’ - నేనే ఆ పరబ్రహ్మ అయితిని – అను మహావాక్యము. ఈ మహావాక్యజపము అప్రయత్నముగా ప్రతి జీవి తనకు తెలియకుండగనే చేయుచుండును. యోగాభ్యాసము చేయక ఊరక యుండినను ప్రతి జీవి ఈ పైన చెప్పినన్ని పర్యాయములు ఊపిరి తీయుచు విడుచుచునే ఉండును.)
‘హంస హంసే’ త్యముం మంత్రం జీవో జవతి సర్వదా ||
షట్ శతాని దివా రాత్రౌసహస్రాణ్యేక వింశతిః |
ఏ తత్సం ఖ్యాన్వితం మంత్రం జీవో జపతి సర్వదా ||
అజపానామ గాయత్రి యోగినాం మోక్షదా సదా |” (యోగచూడామణ్యుపనిషత్)
(‘హ’ కారముచేత - ‘హ’ అనుటచేత - పైకి- శరీరములోనుండి పైకి వాయువు వచ్చుచున్నది. ‘స’ కారము చేత తిరిగి లోపలికి ప్రవేశించుచున్నది. ఈ రెండు అక్షరములు కలిసిన “హంస హంస” అను మంత్రమును జీవుడు ఎల్లపుడు జపించుచున్నాడు. 6,21,000 పర్యాయములు ఈ ప్రకారముగా ఈ మంత్రమును రాత్రింబవలు కలిసి జపించ బడుచున్నది. దీనిని ‘అజపా గాయత్రి’ అందురు. ఇది యోగులకు మొక్షము నిచ్చునది.)
జపతో నిత్యం పునర్జన్మ నవిద్యతే ||”
(అజపా అను పేరుగల గాయత్రీ మంత్రమును జీవుడు నిత్యము జపించుచున్నాడు. ఈ అజపా గాయత్రీ మంత్రమును ఎల్లపుడు జపించుచుండు వారలకు తిరిగి జన్మ ఉండదు - అనగా, సంసారము నుండి విముక్తులగుదురు.)
జపో భవతి - - |
అజపా సమాఖ్యాతా జ్ఞాన మోక్ష ప్రదాయినీ ||”
(ఈ అజపా గాయత్రి జపము చేయకుండగనే జపము చేయునట్లగుచున్నది. ఇది జ్ఞానమును, మోక్షమును ఇచ్చును.)
(ప్రాణవాయువును పైకి విడచుట, లోపలికి పీల్చుట ఈ రెండు అక్షరములుగా రూపము పొందిన జపము. ఈ అక్షర రూపములు ఏవి యన ‘హం’ ‘సః’ ‘సో’ ‘హం’. ఉచ్ఛ్వాస నిశ్వాసముల చేతనే ఈ అక్షరములు రెండును పలుకు చున్నవి. ఇందుచేతనే ప్రాణము ‘హంస’ అను పేరుతో ఆత్మ రూపముగా నున్నది.)
జపేయం మతా శక్తిః తధా దక్షిణ వామతః |
బిందుర్దక్షిణ భాగస్థో వామ భాగో విసర్గకః |
తేన దక్షిణవామాఖ్యా భాగౌ స్త్రీ పుంస సంజ్ఞికా |
బిందుః పురుష ఇత్యుక్తో విసర్గః ప్రకృతిర్మతా ||” (ప్రపంచసారే)
(హకారము పురుషుడని, సకారము ప్రకృతి అని తలచుదురు. ఇది - ఈ మంత్రము శక్తి. కుడివైపు ‘o’ బిందువు, ఎడమవైపు విసర్గ -ః - ఉన్నవి.అందుచేత కుడి ఎడమ భాగములు స్త్రీ పురుషులని - ప్రకృతి పురుషులని - బిందువు పురుషుడని, విసర్గ ప్రకృతి యని చెప్పబడు చున్నారు.) (చూడుము - “హంస మంత్రము” ; “ప్రణవము” ; “ఓంకారము”)
japāmaṃtra rūpā. (maṃtrarūpamu lēni japamu, maṃtramu lēnaṭuvaṃṭi japamu.)
na + japa = ajapa - japamu cēyakuṃḍaganē japarūpamu noṃdina maṃtramu.
(tanaṃtaṭa tānē kaliginadi; japamu rītigā jarugunadi; prayatnamu cēyakuṃḍaganē japamu vale rūpoṃdunadi; aṃducēta ajapā.)
(prayatnamu cēsi japiṃcunadi kādu; prayatnamu cēyakanē japamu vale uccariṃca baḍucunnaṃduna ajapā)
(japiṃcuṭa lēkapōyinanu japabhāvamunu poṃdunu kanuka ajapā, ajapāyē ajasā gāyatri.)
ajapā gāyatrī-
dinē dinē ṣaṭ śatādhikaika viṃśati sahasra saṃkhya niśvā sōcchvā sāḥ ‘sōhaṃ’ ‘sōhaṃ’ iti japaṃti. svayaṃ a japan tūṣṇī tiṣṭannapi ētadā khyānvitaṃ maṃtraṃ jīvō japati sarvadā.
(ūpiri lōpaliki pīlci paiki vadaluṭa rōjuku 6,21,000 paryāyamulu jarugunu. gāli lōpaliki pīlcunapuḍu ‘sō’ aninnī, paiki vadalunapuḍu ‘haṃ’ aninnī śabdamu agunu. ī reṃḍu akṣaramulu – ucchvāsa niśvāsamula valana kaliginavi - kalisi ‘haṃsa’ anu maṃtramugā, tanaṃtaṭa adē aprayatnamugā uccariṃca baḍinaṭlagunu. “sōhaṃ” lōni akṣaramulu ūpiri tīyu kramamulō “saḥ haṃ” lēka “sō (a) haṃ”agunu - anagā, saḥ = atanu, ā bhagavaṃtuḍu, ‘tat’ padārdhamu ayina parabrahma, ahaṃ = nēnu - ā parabrahma ‘nēnu’ ani ardhamagunu. idiyē ‘ahaṃ brahmāsmi’ - nēnē ā parabrahma ayitini – anu mahāvākyamu. ī mahāvākyajapamu aprayatnamugā prati jīvi tanaku teliyakuṃḍaganē cēyucuṃḍunu. yōgābhyāsamu cēyaka ūraka yuṃḍinanu prati jīvi ī paina ceppinanni paryāyamulu ūpiri tīyucu viḍucucunē uṃḍunu.)
‘haṃsa haṃsē’ tyamuṃ maṃtraṃ jīvō javati sarvadā ||
ṣaṭ śatāni divā rātrausahasrāṇyēka viṃśatiḥ |
ē tatsaṃ khyānvitaṃ maṃtraṃ jīvō japati sarvadā ||
ajapānāma gāyatri yōgināṃ mōkṣadā sadā |” (yōgacūḍāmaṇyupaniṣat)
(‘ha’ kāramucēta - ‘ha’ anuṭacēta - paiki- śarīramulōnuṃḍi paiki vāyuvu vaccucunnadi. ‘sa’ kāramu cēta tirigi lōpaliki pravēśiṃcucunnadi. ī reṃḍu akṣaramulu kalisina “haṃsa haṃsa” anu maṃtramunu jīvuḍu ellapuḍu japiṃcucunnāḍu. 6,21,000 paryāyamulu ī prakāramugā ī maṃtramunu rātriṃbavalu kalisi japiṃca baḍucunnadi. dīnini ‘ajapā gāyatri’ aṃduru. idi yōgulaku mokṣamu niccunadi.)
japatō nityaṃ punarjanma navidyatē ||”
(ajapā anu pērugala gāyatrī maṃtramunu jīvuḍu nityamu japiṃcucunnāḍu. ī ajapā gāyatrī maṃtramunu ellapuḍu japiṃcucuṃḍu vāralaku tirigi janma uṃḍadu - anagā, saṃsāramu nuṃḍi vimuktulaguduru.)
japō bhavati - - |
ajapā samākhyātā jñāna mōkṣa pradāyinī ||”
(ī ajapā gāyatri japamu cēyakuṃḍaganē japamu cēyunaṭlagucunnadi. idi jñānamunu, mōkṣamunu iccunu.)
(prāṇavāyuvunu paiki viḍacuṭa, lōpaliki pīlcuṭa ī reṃḍu akṣaramulugā rūpamu poṃdina japamu. ī akṣara rūpamulu ēvi yana ‘haṃ’ ‘saḥ’ ‘sō’ ‘haṃ’. ucchvāsa niśvāsamula cētanē ī akṣaramulu reṃḍunu paluku cunnavi. iṃducētanē prāṇamu ‘haṃsa’ anu pērutō ātma rūpamugā nunnadi.)
japēyaṃ matā śaktiḥ tadhā dakṣiṇa vāmataḥ |
biṃdurdakṣiṇa bhāgasthō vāma bhāgō visargakaḥ |
tēna dakṣiṇavāmākhyā bhāgau strī puṃsa saṃjñikā |
biṃduḥ puruṣa ityuktō visargaḥ prakṛtirmatā ||” (prapaṃcasārē)
(hakāramu puruṣuḍani, sakāramu prakṛti ani talacuduru. idi - ī maṃtramu śakti. kuḍivaipu ‘o’ biṃduvu, eḍamavaipu visarga -ḥ - unnavi.aṃducēta kuḍi eḍama bhāgamulu strī puruṣulani - prakṛti puruṣulani - biṃduvu puruṣuḍani, visarga prakṛti yani ceppabaḍu cunnāru.) (cūḍumu - “haṃsa maṃtramu” ; “praṇavamu” ; “ōṃkāramu”)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.