జరా వర్జితః (ముసలితనము లేనివాడు.)
జరాది షడూర్మ్య భావాత్ అజరః-
(బుబుక్ష, తృష్ణ, శోకము, మోహము, జరామరణములు అను ఆరు ఊర్ములు లేనివాడు కనుక అజరుడు.)
నిర్వికారత్వాత్ అక్షరః - (వికారములు - మార్పులు - లేకుండుటవలన అక్షరుడు, నాశము లేనివాడు.)
విపరిణామ ధర్మ (రహితః) వర్జితః- (మార్పు చెందుట అను స్వభావము లేనివాడు.)
అపక్షయ శూన్యత్వాత్ అజరః- (క్షయము - క్షీణించుట - ముసలితనము లేకపోవుట వలన అజరుడు.)
సర్వదా ఉన్నద్రః-(ఎల్లపుడు నిద్ర లేకుండ నుండువాడు ; హెచ్చరిక గలవాడు.)
వేలుపు, దేవత - దేవతలు ముసలితనము లేనివారు, త్రిదశులు.
భుక్తం అన్నం జరయతి నతు స్వయం జీర్యతే.
(తినిన అన్నమును జీర్ణము చేయువాడు, కాని తను జీర్ణమయిపోవువాడు కాడు.)
“సోగ్రభు గ్విభజన్ తిష్టన్నాహారమ జరః కవిః |
తిర్య గూర్థ్వ మధశ్శాయీ రస్మయ స్తస్య సంతతా |
సంతాపయతి స్వందేహ మాపాద తలమస్తకః ||” (మత్రపుష్పము)
(జీవియొక్క దేహములో జఠరాగ్ని రూపములోనున్న పరమాత్మ అన్నమును ముందుగా తానుతిని, ఆ అన్నరసమును శరీరములోని అన్ని భాగములకు - పాదములు మొదలు శిరస్సు వఱకు గల దేహమంతటను వ్యాపించి యున్నవాడై దేహమంతను తపింప చేయుచున్నాడు - ఉష్ణమును కలుగ చేసి తద్వారా చైతన్యమును కలుగ చేయుచున్నాడు. ఇట్లు ఆహారమును జీర్ణింపచేయుచు తాను జీర్ణముకాక - హరించిపోక,మార్పులేక, తన స్వస్వ రూపములోనే ఉండువాడు.)
jarā varjitaḥ (musalitanamu lēnivāḍu.)
jarādi ṣaḍūrmya bhāvāt ajaraḥ-
(bubukṣa, tṛṣṇa, śōkamu, mōhamu, jarāmaraṇamulu anu āru ūrmulu lēnivāḍu kanuka ajaruḍu.)
nirvikāratvāt akṣaraḥ - (vikāramulu - mārpulu - lēkuṃḍuṭavalana akṣaruḍu, nāśamu lēnivāḍu.)
vipariṇāma dharma (rahitaḥ) varjitaḥ- (mārpu ceṃduṭa anu svabhāvamu lēnivāḍu.)
apakṣaya śūnyatvāt ajaraḥ- (kṣayamu - kṣīṇiṃcuṭa - musalitanamu lēkapōvuṭa valana ajaruḍu.)
sarvadā unnadraḥ-(ellapuḍu nidra lēkuṃḍa nuṃḍuvāḍu ; heccarika galavāḍu.)
vēlupu, dēvata - dēvatalu musalitanamu lēnivāru, tridaśulu.
bhuktaṃ annaṃ jarayati natu svayaṃ jīryatē.
(tinina annamunu jīrṇamu cēyuvāḍu, kāni tanu jīrṇamayipōvuvāḍu kāḍu.)
“sōgrabhu gvibhajan tiṣṭannāhārama jaraḥ kaviḥ |
tirya gūrthva madhaśśāyī rasmaya stasya saṃtatā |
saṃtāpayati svaṃdēha māpāda talamastakaḥ ||” (matrapuṣpamu)
(jīviyokka dēhamulō jaṭharāgni rūpamulōnunna paramātma annamunu muṃdugā tānutini, ā annarasamunu śarīramulōni anni bhāgamulaku - pādamulu modalu śirassu vaṟaku gala dēhamaṃtaṭanu vyāpiṃci yunnavāḍai dēhamaṃtanu tapiṃpa cēyucunnāḍu - uṣṇamunu kaluga cēsi tadvārā caitanyamunu kaluga cēyucunnāḍu. iṭlu āhāramunu jīrṇiṃpacēyucu tānu jīrṇamukāka - hariṃcipōka,mārpulēka, tana svasva rūpamulōnē uṃḍuvāḍu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.