← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అజ్ఞః ajñaḥ

Original — తెలుగు
  1. అజ్ఞుడు; అజ్ఞాని.

  2. నజానాతీతి అజ్ఞః(తెలియనివాడు.)

  3. జ్ఞానరహితః (జ్ఞానము లేనివాడు.)

  4. అవివేకీ, మూడః - (వివేకములేనివాడు - మంచి చెడ్డ వివేకములేనివాడు;మూఢుడు)

  5. అకించిత్ జ్ఞః; మూడః ఇతియావత్. (కొంచెమైనను తెలివి లేనివాడు - మూఢుడన్నమాట.)

  6. అల్ప జ్ఞః (కొంచెము జ్ఞానము కలవాడు.)

  7. మంద ధీః (మంద బుద్ధి కలవాడు), (చురుకైనవాడు కాడు.)

  8. కర్తవ్యాకర్తవ్య జ్ఞానరహితః(చేయవలసినదేదో, చేయరానిది ఏదో తెలియని వాడు.)

  9. వ్యవహారా నభిజ్ఞః (వ్యవహరించుట తెలియనివాడు.)

  10. గురూపదిష్టార్ధా నభిజ్ఞః (గురువు చేసిన ఉపదేశము అర్ధము చెసుకోలేనివాడు.)

  11. “అనధీత శాస్త్రత్వేన ఆత్మజ్ఞాన శూన్యః”.

(శాస్త్రము చదువనందున ఆత్మ జ్ఞానము లేనివాడు.)

  1. అనాత్మజ్ఞః (ఆత్మ జ్ఞానము లేనివాడు.)

  2. “అజ్ఞో (అ) నాధీత శాస్త్రత్వా దాత్మజ్ఞాన వివర్జితః |” (గీతాభావప్రకాశము- 4- 242)

(శాస్త్రము నధ్యయనము చేయకపోవుటవలన ఆత్మజ్ఞానము కలుగదు - ఆత్మజ్ఞానము లేకుండుట వలన అజ్ఞుడు) - (జ్ఞానము లేనివాడు, ఆత్మజ్ఞానము లేనివాడు.)

  1. నవిద్యతే జ్ఞః యస్మాత్. (జ్ఞః అనగా పరబ్రహ్మ - పరబ్రహ్మను తెలియనివాడు.)

  2. నజ్ఞః = అజ్ఞుడు - బ్రహ్మను తెలియనివాడు - జీవుడు.)

  3. జీవవత్ కించిత్ జ్ఞః (జీవునివలె కొంచెము తెలిసినవాడు - పరమాత్మ సర్వజ్ఞుడు.)

  4. “యస్త్వ విజ్ఞానవాన్ భవత్య మనస్కః సదా (అ) శుచిః |

నన తత్పద మాప్నోతి సంసారం చిధి గచ్ఛాతి ||” (కఠోపనిషత్)

(ఆత్మ జ్ఞానము లేనివాడు, మనో నిగ్రహము లేనివాడు, శుచిగా ఉండనివాడు, విష్ణు పధమగు వైకుంఠమును - పరమపదమును - పొందలేడు; జననమరణ రూపమైన సంసారములో పడును.)

  1. “ఆ. మానసంబు గట్టి మహిత భోగంబులు

మాని యింద్రియముల మదము లణచి

తపము చేసి యింద్రతయు గోరుగాని నీ

యమృతపదము గోరడజ్ఞు డీశ !” (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 10 - 1659)

(మనస్సును జయించి, రాగభోగముల విడనాడి, ఇంద్రియములను జయించి, తపస్సు చేసి కూడ అజ్ఞాని యగు వాడు, జ్ఞానము లేకపోవుటచేత, స్వర్గమునే కోరును, ఇంద్రభోగములనే కోరును, కాని, మోక్షమును కోరడు.)

  1. “శా. అజ్ఞుల్ గొందఱు మేము దా మనుచు మాయం జెంది సర్వాత్మకుం

బ్రజ్ఞాలభ్యు వరాన్వయ క్రమములన్ భాషింపగా నేరరు ---” (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 7 -5 -148)

(అహంకారము, మమకారము కలిగియుండుటవలన మాయలో బడి జ్ఞానము లేనివారై - బ్రహ్మజ్ఞానము లేనివారై, ప్రజ్ఞచేతనే - బ్రహ్మజ్ఞానము చేతనే పొందగలిగినటువంటి పరమాత్మను తెలుకొనలేరు.)

Transliteration
  1. ajñuḍu; ajñāni.

  2. najānātīti ajñaḥ(teliyanivāḍu.)

  3. jñānarahitaḥ (jñānamu lēnivāḍu.)

  4. avivēkī, mūḍaḥ - (vivēkamulēnivāḍu - maṃci ceḍḍa vivēkamulēnivāḍu;mūḍhuḍu)

  5. akiṃcit jñaḥ; mūḍaḥ itiyāvat. (koṃcemainanu telivi lēnivāḍu - mūḍhuḍannamāṭa.)

  6. alpa jñaḥ (koṃcemu jñānamu kalavāḍu.)

  7. maṃda dhīḥ (maṃda buddhi kalavāḍu), (curukainavāḍu kāḍu.)

  8. kartavyākartavya jñānarahitaḥ(cēyavalasinadēdō, cēyarānidi ēdō teliyani vāḍu.)

  9. vyavahārā nabhijñaḥ (vyavahariṃcuṭa teliyanivāḍu.)

  10. gurūpadiṣṭārdhā nabhijñaḥ (guruvu cēsina upadēśamu ardhamu cesukōlēnivāḍu.)

  11. “anadhīta śāstratvēna ātmajñāna śūnyaḥ”.

(śāstramu caduvanaṃduna ātma jñānamu lēnivāḍu.)

  1. anātmajñaḥ (ātma jñānamu lēnivāḍu.)

  2. “ajñō (a) nādhīta śāstratvā dātmajñāna vivarjitaḥ |” (gītābhāvaprakāśamu- 4- 242)

(śāstramu nadhyayanamu cēyakapōvuṭavalana ātmajñānamu kalugadu - ātmajñānamu lēkuṃḍuṭa valana ajñuḍu) - (jñānamu lēnivāḍu, ātmajñānamu lēnivāḍu.)

  1. navidyatē jñaḥ yasmāt. (jñaḥ anagā parabrahma - parabrahmanu teliyanivāḍu.)

  2. najñaḥ = ajñuḍu - brahmanu teliyanivāḍu - jīvuḍu.)

  3. jīvavat kiṃcit jñaḥ (jīvunivale koṃcemu telisinavāḍu - paramātma sarvajñuḍu.)

  4. “yastva vijñānavān bhavatya manaskaḥ sadā (a) śuciḥ |

nana tatpada māpnōti saṃsāraṃ cidhi gacchāti ||” (kaṭhōpaniṣat)

(ātma jñānamu lēnivāḍu, manō nigrahamu lēnivāḍu, śucigā uṃḍanivāḍu, viṣṇu padhamagu vaikuṃṭhamunu - paramapadamunu - poṃdalēḍu; jananamaraṇa rūpamaina saṃsāramulō paḍunu.)

  1. “ā. mānasaṃbu gaṭṭi mahita bhōgaṃbulu

māni yiṃdriyamula madamu laṇaci

tapamu cēsi yiṃdratayu gōrugāni nī

yamṛtapadamu gōraḍajñu ḍīśa !” (śrīmadāṃdhra mahābhāgavatamu - 10 - 1659)

(manassunu jayiṃci, rāgabhōgamula viḍanāḍi, iṃdriyamulanu jayiṃci, tapassu cēsi kūḍa ajñāni yagu vāḍu, jñānamu lēkapōvuṭacēta, svargamunē kōrunu, iṃdrabhōgamulanē kōrunu, kāni, mōkṣamunu kōraḍu.)

  1. “śā. ajñul goṃdaṟu mēmu dā manucu māyaṃ jeṃdi sarvātmakuṃ

brajñālabhyu varānvaya kramamulan bhāṣiṃpagā nēraru ---” (śrīmadāṃdhra mahābhāgavatamu - 7 -5 -148)

(ahaṃkāramu, mamakāramu kaligiyuṃḍuṭavalana māyalō baḍi jñānamu lēnivārai - brahmajñānamu lēnivārai, prajñacētanē - brahmajñānamu cētanē poṃdagaliginaṭuvaṃṭi paramātmanu telukonalēru.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.