(అజ్ఞానమనగా జ్ఞానముయొక్క అభావమే, జ్ఞానము లేకపోవుటయే.)
అవివేకం - (వివేకము లేకపోవుట - మంచి, చెడ్డ అను వివేకము లేకపోవుట.)
జ్ఞానాదన్యం అజ్ఞానం - జ్ఞానం వస్తు యా ధాత్మ్యా వ బోధః, తస్మాత్ తదస్యత్ తద్విపర్యయ జ్ఞానం (శ్రీరామానుజః.)
(జ్ఞానము కన్నా వేఱైనది అజ్ఞానము - జ్ఞానమనగా యదార్ధముగా తెలుసుకొనుట. అందుచేత దాని కన్న వేఱైనది, విపరీతమైనది అజ్ఞానము.)
జ్ఞాన విరోధీ (జ్ఞానమునకు విరోధమైనది - విరోధియైనది - భగవత్ జ్ఞానము కలుగకుండ చేయునది.)
మోక్షోపాయ జ్ఞానా దన్యత్, తద్విరోధివా, యద్వా జ్ఞానభావః.
(మోక్షము కలుగుటకు ఉపాయమైన జ్ఞానము కంటె వేఱైనది, లేక దానికి విరోధి యైనది, అది కలుగ కుండ చేయునది, లేక, జ్ఞానము లేకపోవుట అజ్ఞానము.)
సంసారమూలం. (జనన మరణ రూపమైన సంసారమునకుకారణమైనది.)
కర్మ సంచయ రూప మజ్ఞానం.
(కర్మల సమూహమే రూపముగా గలది - చేసిన కర్మలే ఈ అజ్ఞానమను ఫలముగా కలుగ చేయును.)
(జ్ఞానము నావరించుకొని యున్నది, అనాదికాలమునుండి చేసిన అనంతకర్మల రూపమే అజ్ఞానము.)
(భగవత్స్వరూపమును - యదార్ధరూపమును ఆవరించియుండుటవలన అజ్ఞానమని,మాయ యని చెప్పబడుచున్నది.)
(ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది చేయ తగినది, ఇది చేయకూడనిది అను విచక్షణ లేనిజ్ఞానము.)
(పరమాత్మ తత్వమునకు సంబంధించి ఇది చేయతగినది, ఇదిచేయకూడనిది అను వివేకము లేకుండుట.)
(అపరమార్ధముల గిఱించియైన జ్ఞానము అజ్ఞానము - అనగా, పరమార్ధము, పరమాత్మ, మోక్షము అను వాటిని గుఱించికాకమిగిలిన వస్తువులగుఱించి అయిన జ్ఞానము, లౌకిక వస్తువుల జ్ఞానము.)
“శరీరేంద్రియ మనోబుద్ధి ష్వనాత్మ స్వాత్మేతి నిస్సంధి బంధనం మిధ్యా జ్ఞానం” (నైష్కర్మ్య సిధ్ధి - 3)
(శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి అను అనాత్మవస్తువులందు భేద జ్ఞాన రహితముగా “నేను” అని కలుగు మిధ్యాజ్ఞానము.)
(నాకు బ్రహ్మము ఏమిటో తెలియదు అని వ్యవహరించుటకు కారణము అజ్ఞానము - వస్తువు యొక్క నిజ రూపము తెలియకపోవుట - ఇదియే తమస్సు, మాయాశక్తి ; శాస్త్రజ్ఞానము కలుగక పూర్వము తానే పరబ్రహ్మము అని జీవుడు తన నిజస్వరూపమును తెలియకుండుటయే అజ్ఞానము.)
విచార ప్రాగ భావేన యుక్త మజ్ఞాన మీరితం ||”
(స్వరూప విచారమునకు ముందు - అనగా, జీవుడు తన నిజస్వరూపమును తెలుసు కొనకముందు - “నాకుతెలియదు” అని ఉదాసీనుడుగా నుండుటయే అజ్ఞానము.)
బుద్ధ్య ధ్యాసమువలన చిదాత్మకు భ్రాంతి సంభవించును. అట్టి చి చిదా భాసమగు బుద్ధియే యజ్ఞానమనబడును.
శ్రీమద్భగవద్గీతలో 13వ అధ్యాయములో 7 మొదలు 11 శ్లోకములలో “అమానిత్వం అదంభిత్వ మహింసా క్షాంతిరార్జవం |” అని మొదలు “ఏ తత్ జ్ఞానమితి ప్రోక్తమజ్ఞానం యదతో (అ) న్యథా ||” - అను వఱకు చెప్పబడినది జ్ఞానము - దానికి అన్యమైనది - ఇతరమైనది, అది కానిది అజ్ఞానము. (చూడుము : - జ్ఞానము.)
“రజ్జౌ సర్ప భ్రాంతిరిన అద్వితీయే సర్వానుస్యూతే సర్వమయే బ్రహ్మణి దేవతిర్యఙ్మర స్థావర స్త్రీ పురుష వర్ణాశ్రమ బంధ మోక్షోపాధి నానాత్మ భేధ కల్పితం జ్ఞానం అజ్ఞానం” (నిరాలంబోపనిషత్)
(పరబ్రహ్మ అద్వితీయము - అనగా, పరమార్ధ దృష్టిలో పరబ్రహ్మముకన్న వేఱైనది మఱియొకటిలేదు. అంతా, అన్నీ పరబ్రహ్మమే. హారమందు ముత్యములలో దూర్చబడియుండు దారమువలె మాయా కల్పితములైన వస్తువులన్నింటిలోను సత్ చిత్ సుఖరూపమగు తన నిజ శక్తితో పరబ్రహ్మము వ్యాపించియున్నది, ఈ జగమంతయు - దానిలోనుండు వస్తువులన్నియు తన రూపములే అయి యున్నాడు పరమాత్మ. చీకటిలో త్రాడును చూచి పాము అని భ్రమించినట్లు, దేవతలు, పశువులు, మనుష్యులు, చెట్లు, కొండలు, స్త్రీలు, పురుషులు, వర్ణాశ్రమములు, మోక్షాపాదులు - భగవంతుని ఉపాదులైనవి - అనేకములు వేరు వేరుగా ఉన్నట్లు పరమాత్మ యందు కల్పించు జ్ఞానము అజ్ఞానము - అనగా, ఈ ప్రపంచమంతయు భగవంతుడే - భగవంతుని విశ్వరూపమే - అయి యుండగా అందులోని వస్తువులు వేఱువేఱుగా చూచుట, భగవంతుని కన్న వేఱువేఱుగా చూచుట,మాయ యను అజ్ఞానము.)
(కంఠములో నున్నప్పటికీ బంగారు వస్తువు అజ్ఞానమువలన పోయినదనుకొని, జ్ఞానము రాగానే - ఆ అజ్ఞానము పోగానే - అది మరల లభ్యమైనట్లు అనుపించును. ఆ ప్రకారముగానే అజ్ఞానము వలన తెలియబడనటువంటి ఆత్మ, ఆత్మజ్ఞానము కలుగ గానే, అజ్ఞానము తొలగిపోగానే - ఆత్మ స్వరూపము కనబడును.)
(సత్ అనిగాని, అసత్ అనిగాని చెప్పుటకు వీలులేనిదై ఇది ఇటువంటిది అని స్పష్టముగా చెప్పుటకు వీలులేనిదై, సత్వ రజస్తమోగుణాత్మకమై, జ్ఞానమునకు విరోధి అయినది అజ్ఞానము - “నేను ఏమీ తెలియని వాడను, నాకేమీ తెలియదు”అని భావించుటే అజ్ఞానము. “దివ్యమైన ఆత్మ శక్తి త్రిగుణములచేత కప్ప బడియుండుటచేత జ్ఞానమును కోలుపోయినది, అజ్ఞానములో పడినది.” అని శ్రుతి చెప్పుచున్నది.
అజ్ఞానము సద్రూపముకాదు. సద్రూపమే అయినయడల దీనికి బాధలేకుండును, - అనగా, ఇది కలకాలము ఉండిపోవును - కాని జ్ఞానము కలుగ గానే పోవుచున్నది, జీవునకు ముక్తి కలుగుచున్నది. అందుచేత సద్రూపము కాదు. అజ్ఞానము అసద్రూపమునూ కాదు - గొడ్రాలి కొడుకు,అకాశపుష్పము, అనత్తులు - వీటివలె లేకపోవునదికాదు. సదసద్రూపమనుట తగదు - ఈ రెండును విరుద్ధములు కనుక. అందుచేత ఇటువంటిది అని నిశ్చయించిచెప్పుటకు వీలు లేనిది, అందుచేత అనిర్వాచ్యము.
అజ్ఞానమనునది సత్ అని కాని, అసత్ అని కాని, సదసత్ అని కాని చెప్పుటకు వీలులేనిది. అది సవిశేషమనిగాని, నిర్విశేషమనిగాని చెప్పుటకు వీలులేనిది. చిత్ అనికాని అచిత్ అనికాని చెప్పుటకు వీలులేనిది. అందుచేత అది అనిర్వాచ్యము - జ్ఞానము కలిగినంతనే పోవునది కనుక సత్ కాదు, కుందేటి కొమ్ము వలె గాని, ఆకాశపుష్పమువలె గాని కేవలము లేనిది కాదు కనుక,అసత్ కాదు. అందఱికి ’నాకు తెలియదు’అను అనుభవము కలదు కనుక అజ్ఞానము వలననే అవివేకము, అహంభావము` రాగము, ద్వేషము, కర్మ, జన్మము కలుగుచున్నవి. “అహం బ్రహ్మాస్మి” యను జ్ఞానము వలన అజ్ఞానము పోవును.)
“ప్రమాద మోహౌ తమసో భవతో (అ) జ్ఞానమేవచ” (శ్రీమద్భగవద్గీత- 14 - 17)
(తమోగుణమువలన అజ్ఞానము, ప్రమాదము, మోహము పుట్టుచున్నవి.)
“అజ్ఞానేన వృతే నైవా వృత్తి విక్షేవశాలినా |
మాయాఖ్యేనాంధ తమసా చ్చాదితం చిద్ఘనాత్మకం |
జీవేశ్వర జగద్బేధ భ్రమాదిష్ఠాన మద్వయం |
స్వప్రకాశం పరానందం జ్ఞానం తేనేహ జంతవః |
స్వరూపావరణేనైవ విక్షేపం యాంతి సర్వశః |
మాతృమాన ప్రమేయాది మోహం దుః ఖైక సంకటం |
ప్రాప్నువంతి ముధా జీవాఃభ్రాంతే జ్ఞాన వశీకృతాః ||-” (గీతాభావప్రకాశము- 5 - 125 to 128)
తేషామా దిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్సరం ||“- (శ్రీమద్భగవద్గీత - 5 - 16)
“తదావరణ విక్షేప శక్తి మద్బంధ కారణం |
అవిద్యాఖ్యమ నిర్వాచ్యం జ్ఞానేనా జ్ఞానమాత్మనః |
గురూపదిష్ట వేదాంత వాక్య జన్యేన భాస్వతా |
అఖండ సచ్చ్చిదానంద వస్త్వైక్య విషయే ణచ |
బాధితం సదధిష్ఠాన చిన్మాత్ర త్వేన భోధితం |
రజ్వా మహిస్రగా దీవ రజ్జు జ్ఞానేన బాధితం |
యేషాం యధోక్త వేదాంత శ్రవణాది మతాం సతాం |
కేశవాను గృహీతానాం ముముక్షూణాం విపశ్చితాం |
తత్ జ్ఞానం సూర్యవత్తేషాం పరమాద్వైత చిద్ఘనం |
ప్రకాశయతే చాత్మానం ప్రతిబింబ గ్రహేణ వై ||” (గీతాభావప్రకాశము 5 - 134 to 138)
(ఆవరణ విక్షేపశక్తులు గలిగినటువంటిన్నీ, బంధమునకు కారణమైనటువంటిన్నీ, ఇటువంటిది అని నిర్ణయించుటకు వీలు లేనటువంటిదిన్నీ, అవిద్య అను పేరు గలిగినటువంటి అజ్ఞానము, గురువు చేత ఉపదేశింపబడిన వేదాంత వాక్యములచేత - ఉపనిషద్వాక్యముల చేత పొందబడిన ‘పరమాత్మ ఒక్కడే, అంతయు పరబ్రహ్మమే’ అను బ్రహ్మజ్ఞానము కలుగుటచేత పోవును. చీకటిలో త్రాడును చూచి అది పాము అనుకొనుట అజ్ఞానము. అది పాము కాదు, త్రాడు అని తెలుసుకొనుట జ్ఞానము - ఈ జ్ఞానము కలుగగానే పాము అను అజ్ఞానము తొలగి పోవును. ముముక్షువులు, సత్పురుషులు, భగవద్భక్తులు అయిన వారికి, వేదాంతములోని అర్ధము తెలుసుకొనుటచే వారి అంతరాత్మలో పరమాత్మ, సూర్యుడు తన ప్రతిబింబము చేతను వలెనే, జ్ఞానోదయము కలుగును.)
నిత్యమేవ నివృత్త త్వాత్ జ్ఞానేనాపి నాశ్యతే |
యో జ్ఞానా భావం తార్కికా ప్రాహు రా గ్రహాత్ |
భగవన్మత బాహ్యత్వాదు పేక్షాస్తే నిరాగ్రహైః |
‘అతో (అ) జ్ఞోహం’ “నమామన్యం జానామీతి ప్రతీతి తః |
సాక్షిప్రత్యక్ష సిద్ధం తద్భావరూపం హరేర్మతం ||” (గీతాభావప్రకాశము- 5 - 140 to 143)
(అభావము అనగా లేనిది ఎక్కడా, ఏ కొంచెమైనను ఆవరించియుండును అనుట సిద్ధింపదు. ఆగ్రహముచేత తార్కికులు జ్ఞానాభావమే- అనగా, జ్ఞానము లేకుండుటయే - అజ్ఞానము అని చెప్పిరి. ఇది భగవన్మత బాహ్యము.కనుక నిరాగ్రహులైన వేదాంతులుగ్రహింపక ఉపేక్షింపవలసినదే. అందుచేత ‘నేను అజ్ఞానిని, నన్నువేఱుగా తెలియనివాడను’ అని అనుకొను వాడుకవలన ఇతి సాక్షి పత్యక్షసిద్ధము - కావున అజ్ఞానము భావరూపము, అభావరూపము కాదు - అని శ్రీకృష్ణభగవానుని మతము.)
(అజ్ఞానము సమష్టి, వ్యష్టి భేదములచేతఏకము అనేకము అని వ్యవహరింప బడుచున్నది.)
(ఈ అజ్ఞానమునకు ఆవరణశక్తి, విక్షేపశక్తి అను రెండు శక్తులు గలవు. నిజస్వరూపమును ఆవరించి తెలియకుండునట్లు చేయుటవలన ఆవరణశక్తి యనియు, ఇంకొక వస్తువు అని భ్రమింపచేయుటవలన విక్షేపశక్తి యనియు - ఈ రెండు శక్తులు గల మాయయే అజ్ఞానమని చెప్పబడుచున్నది.)
(ajñānamanagā jñānamuyokka abhāvamē, jñānamu lēkapōvuṭayē.)
avivēkaṃ - (vivēkamu lēkapōvuṭa - maṃci, ceḍḍa anu vivēkamu lēkapōvuṭa.)
jñānādanyaṃ ajñānaṃ - jñānaṃ vastu yā dhātmyā va bōdhaḥ, tasmāt tadasyat tadviparyaya jñānaṃ (śrīrāmānujaḥ.)
(jñānamu kannā vēṟainadi ajñānamu - jñānamanagā yadārdhamugā telusukonuṭa. aṃducēta dāni kanna vēṟainadi, viparītamainadi ajñānamu.)
jñāna virōdhī (jñānamunaku virōdhamainadi - virōdhiyainadi - bhagavat jñānamu kalugakuṃḍa cēyunadi.)
mōkṣōpāya jñānā danyat, tadvirōdhivā, yadvā jñānabhāvaḥ.
(mōkṣamu kaluguṭaku upāyamaina jñānamu kaṃṭe vēṟainadi, lēka dāniki virōdhi yainadi, adi kaluga kuṃḍa cēyunadi, lēka, jñānamu lēkapōvuṭa ajñānamu.)
saṃsāramūlaṃ. (janana maraṇa rūpamaina saṃsāramunakukāraṇamainadi.)
karma saṃcaya rūpa majñānaṃ.
(karmala samūhamē rūpamugā galadi - cēsina karmalē ī ajñānamanu phalamugā kaluga cēyunu.)
(jñānamu nāvariṃcukoni yunnadi, anādikālamunuṃḍi cēsina anaṃtakarmala rūpamē ajñānamu.)
(bhagavatsvarūpamunu - yadārdharūpamunu āvariṃciyuṃḍuṭavalana ajñānamani,māya yani ceppabaḍucunnadi.)
(idi maṃcidi, idi ceḍḍadi, idi cēya taginadi, idi cēyakūḍanidi anu vicakṣaṇa lēnijñānamu.)
(paramātma tatvamunaku saṃbaṃdhiṃci idi cēyataginadi, idicēyakūḍanidi anu vivēkamu lēkuṃḍuṭa.)
(aparamārdhamula giṟiṃciyaina jñānamu ajñānamu - anagā, paramārdhamu, paramātma, mōkṣamu anu vāṭini guṟiṃcikākamigilina vastuvulaguṟiṃci ayina jñānamu, laukika vastuvula jñānamu.)
“śarīrēṃdriya manōbuddhi ṣvanātma svātmēti nissaṃdhi baṃdhanaṃ midhyā jñānaṃ” (naiṣkarmya sidhdhi - 3)
(śarīramu, iṃdriyamulu, manassu, buddhi anu anātmavastuvulaṃdu bhēda jñāna rahitamugā “nēnu” ani kalugu midhyājñānamu.)
(nāku brahmamu ēmiṭō teliyadu ani vyavahariṃcuṭaku kāraṇamu ajñānamu - vastuvu yokka nija rūpamu teliyakapōvuṭa - idiyē tamassu, māyāśakti ; śāstrajñānamu kalugaka pūrvamu tānē parabrahmamu ani jīvuḍu tana nijasvarūpamunu teliyakuṃḍuṭayē ajñānamu.)
vicāra prāga bhāvēna yukta majñāna mīritaṃ ||”
(svarūpa vicāramunaku muṃdu - anagā, jīvuḍu tana nijasvarūpamunu telusu konakamuṃdu - “nākuteliyadu” ani udāsīnuḍugā nuṃḍuṭayē ajñānamu.)
buddhya dhyāsamuvalana cidātmaku bhrāṃti saṃbhaviṃcunu. aṭṭi ci cidā bhāsamagu buddhiyē yajñānamanabaḍunu.
śrīmadbhagavadgītalō 13va adhyāyamulō 7 modalu 11 ślōkamulalō “amānitvaṃ adaṃbhitva mahiṃsā kṣāṃtirārjavaṃ |” ani modalu “ē tat jñānamiti prōktamajñānaṃ yadatō (a) nyathā ||” - anu vaṟaku ceppabaḍinadi jñānamu - dāniki anyamainadi - itaramainadi, adi kānidi ajñānamu. (cūḍumu : - jñānamu.)
“rajjau sarpa bhrāṃtirina advitīyē sarvānusyūtē sarvamayē brahmaṇi dēvatiryaṅmara sthāvara strī puruṣa varṇāśrama baṃdha mōkṣōpādhi nānātma bhēdha kalpitaṃ jñānaṃ ajñānaṃ” (nirālaṃbōpaniṣat)
(parabrahma advitīyamu - anagā, paramārdha dṛṣṭilō parabrahmamukanna vēṟainadi maṟiyokaṭilēdu. aṃtā, annī parabrahmamē. hāramaṃdu mutyamulalō dūrcabaḍiyuṃḍu dāramuvale māyā kalpitamulaina vastuvulanniṃṭilōnu sat cit sukharūpamagu tana nija śaktitō parabrahmamu vyāpiṃciyunnadi, ī jagamaṃtayu - dānilōnuṃḍu vastuvulanniyu tana rūpamulē ayi yunnāḍu paramātma. cīkaṭilō trāḍunu cūci pāmu ani bhramiṃcinaṭlu, dēvatalu, paśuvulu, manuṣyulu, ceṭlu, koṃḍalu, strīlu, puruṣulu, varṇāśramamulu, mōkṣāpādulu - bhagavaṃtuni upādulainavi - anēkamulu vēru vērugā unnaṭlu paramātma yaṃdu kalpiṃcu jñānamu ajñānamu - anagā, ī prapaṃcamaṃtayu bhagavaṃtuḍē - bhagavaṃtuni viśvarūpamē - ayi yuṃḍagā aṃdulōni vastuvulu vēṟuvēṟugā cūcuṭa, bhagavaṃtuni kanna vēṟuvēṟugā cūcuṭa,māya yanu ajñānamu.)
(kaṃṭhamulō nunnappaṭikī baṃgāru vastuvu ajñānamuvalana pōyinadanukoni, jñānamu rāgānē - ā ajñānamu pōgānē - adi marala labhyamainaṭlu anupiṃcunu. ā prakāramugānē ajñānamu valana teliyabaḍanaṭuvaṃṭi ātma, ātmajñānamu kaluga gānē, ajñānamu tolagipōgānē - ātma svarūpamu kanabaḍunu.)
(sat anigāni, asat anigāni ceppuṭaku vīlulēnidai idi iṭuvaṃṭidi ani spaṣṭamugā ceppuṭaku vīlulēnidai, satva rajastamōguṇātmakamai, jñānamunaku virōdhi ayinadi ajñānamu - “nēnu ēmī teliyani vāḍanu, nākēmī teliyadu”ani bhāviṃcuṭē ajñānamu. “divyamaina ātma śakti triguṇamulacēta kappa baḍiyuṃḍuṭacēta jñānamunu kōlupōyinadi, ajñānamulō paḍinadi.” ani śruti ceppucunnadi.
ajñānamu sadrūpamukādu. sadrūpamē ayinayaḍala dīniki bādhalēkuṃḍunu, - anagā, idi kalakālamu uṃḍipōvunu - kāni jñānamu kaluga gānē pōvucunnadi, jīvunaku mukti kalugucunnadi. aṃducēta sadrūpamu kādu. ajñānamu asadrūpamunū kādu - goḍrāli koḍuku,akāśapuṣpamu, anattulu - vīṭivale lēkapōvunadikādu. sadasadrūpamanuṭa tagadu - ī reṃḍunu viruddhamulu kanuka. aṃducēta iṭuvaṃṭidi ani niścayiṃciceppuṭaku vīlu lēnidi, aṃducēta anirvācyamu.
ajñānamanunadi sat ani kāni, asat ani kāni, sadasat ani kāni ceppuṭaku vīlulēnidi. adi saviśēṣamanigāni, nirviśēṣamanigāni ceppuṭaku vīlulēnidi. cit anikāni acit anikāni ceppuṭaku vīlulēnidi. aṃducēta adi anirvācyamu - jñānamu kaliginaṃtanē pōvunadi kanuka sat kādu, kuṃdēṭi kommu vale gāni, ākāśapuṣpamuvale gāni kēvalamu lēnidi kādu kanuka,asat kādu. aṃdaṟiki ’nāku teliyadu’anu anubhavamu kaladu kanuka ajñānamu valananē avivēkamu, ahaṃbhāvamu` rāgamu, dvēṣamu, karma, janmamu kalugucunnavi. “ahaṃ brahmāsmi” yanu jñānamu valana ajñānamu pōvunu.)
“pramāda mōhau tamasō bhavatō (a) jñānamēvaca” (śrīmadbhagavadgīta- 14 - 17)
(tamōguṇamuvalana ajñānamu, pramādamu, mōhamu puṭṭucunnavi.)
“ajñānēna vṛtē naivā vṛtti vikṣēvaśālinā |
māyākhyēnāṃdha tamasā ccāditaṃ cidghanātmakaṃ |
jīvēśvara jagadbēdha bhramādiṣṭhāna madvayaṃ |
svaprakāśaṃ parānaṃdaṃ jñānaṃ tēnēha jaṃtavaḥ |
svarūpāvaraṇēnaiva vikṣēpaṃ yāṃti sarvaśaḥ |
mātṛmāna pramēyādi mōhaṃ duḥ khaika saṃkaṭaṃ |
prāpnuvaṃti mudhā jīvāḥbhrāṃtē jñāna vaśīkṛtāḥ ||-” (gītābhāvaprakāśamu- 5 - 125 to 128)
tēṣāmā dityavat jñānaṃ prakāśayati tatsaraṃ ||“- (śrīmadbhagavadgīta - 5 - 16)
“tadāvaraṇa vikṣēpa śakti madbaṃdha kāraṇaṃ |
avidyākhyama nirvācyaṃ jñānēnā jñānamātmanaḥ |
gurūpadiṣṭa vēdāṃta vākya janyēna bhāsvatā |
akhaṃḍa sacccidānaṃda vastvaikya viṣayē ṇaca |
bādhitaṃ sadadhiṣṭhāna cinmātra tvēna bhōdhitaṃ |
rajvā mahisragā dīva rajju jñānēna bādhitaṃ |
yēṣāṃ yadhōkta vēdāṃta śravaṇādi matāṃ satāṃ |
kēśavānu gṛhītānāṃ mumukṣūṇāṃ vipaścitāṃ |
tat jñānaṃ sūryavattēṣāṃ paramādvaita cidghanaṃ |
prakāśayatē cātmānaṃ pratibiṃba grahēṇa vai ||” (gītābhāvaprakāśamu 5 - 134 to 138)
(āvaraṇa vikṣēpaśaktulu galiginaṭuvaṃṭinnī, baṃdhamunaku kāraṇamainaṭuvaṃṭinnī, iṭuvaṃṭidi ani nirṇayiṃcuṭaku vīlu lēnaṭuvaṃṭidinnī, avidya anu pēru galiginaṭuvaṃṭi ajñānamu, guruvu cēta upadēśiṃpabaḍina vēdāṃta vākyamulacēta - upaniṣadvākyamula cēta poṃdabaḍina ‘paramātma okkaḍē, aṃtayu parabrahmamē’ anu brahmajñānamu kaluguṭacēta pōvunu. cīkaṭilō trāḍunu cūci adi pāmu anukonuṭa ajñānamu. adi pāmu kādu, trāḍu ani telusukonuṭa jñānamu - ī jñānamu kalugagānē pāmu anu ajñānamu tolagi pōvunu. mumukṣuvulu, satpuruṣulu, bhagavadbhaktulu ayina vāriki, vēdāṃtamulōni ardhamu telusukonuṭacē vāri aṃtarātmalō paramātma, sūryuḍu tana pratibiṃbamu cētanu valenē, jñānōdayamu kalugunu.)
nityamēva nivṛtta tvāt jñānēnāpi nāśyatē |
yō jñānā bhāvaṃ tārkikā prāhu rā grahāt |
bhagavanmata bāhyatvādu pēkṣāstē nirāgrahaiḥ |
‘atō (a) jñōhaṃ’ “namāmanyaṃ jānāmīti pratīti taḥ |
sākṣipratyakṣa siddhaṃ tadbhāvarūpaṃ harērmataṃ ||” (gītābhāvaprakāśamu- 5 - 140 to 143)
(abhāvamu anagā lēnidi ekkaḍā, ē koṃcemainanu āvariṃciyuṃḍunu anuṭa siddhiṃpadu. āgrahamucēta tārkikulu jñānābhāvamē- anagā, jñānamu lēkuṃḍuṭayē - ajñānamu ani ceppiri. idi bhagavanmata bāhyamu.kanuka nirāgrahulaina vēdāṃtulugrahiṃpaka upēkṣiṃpavalasinadē. aṃducēta ‘nēnu ajñānini, nannuvēṟugā teliyanivāḍanu’ ani anukonu vāḍukavalana iti sākṣi patyakṣasiddhamu - kāvuna ajñānamu bhāvarūpamu, abhāvarūpamu kādu - ani śrīkṛṣṇabhagavānuni matamu.)
(ajñānamu samaṣṭi, vyaṣṭi bhēdamulacētaēkamu anēkamu ani vyavahariṃpa baḍucunnadi.)
(ī ajñānamunaku āvaraṇaśakti, vikṣēpaśakti anu reṃḍu śaktulu galavu. nijasvarūpamunu āvariṃci teliyakuṃḍunaṭlu cēyuṭavalana āvaraṇaśakti yaniyu, iṃkoka vastuvu ani bhramiṃpacēyuṭavalana vikṣēpaśakti yaniyu - ī reṃḍu śaktulu gala māyayē ajñānamani ceppabaḍucunnadi.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.